మాతృమూర్తి (పద్య శతకం)
మరువలేను నిన్ను మాతృమూర్తి
(పద్య శతకం)
రచన గొట్టాపు శ్రీనివాసరావు సెల్ : 9542019064
ముద్రణ 2019, డిశంబర్
ప్రతులు 1000
వెల రూ || 40-00
ప్రతులకు 1. గొట్టాపు హారిక W/o. గొట్టాపు శ్రీనివాసరావు బంగారమ్మపేట, బ్రాంచి ఫోస్టు ఆఫీసు ఎదురుగా, సాలూరు విజయనగరం జిల్లా
డి.టి.పి. & ప్రింటింగ్ శ్రీ శ్యామలా ప్రింటింగ్ వర్క్స్ మెయిన్ రోడ్ - సాలూరు
సాలూరు సాహితీ మిత్ర బృంద ప్రచురణ: 03 అంకితం శ్రీ గొట్టాపు శివున్నాయుడుగారు ఈ పద్య కృతి స్వర్గీయ గొట్టాపు నాగమ్మగారు అమ్మలగన్న అమ్మలకు... 3 గొట్టాపు శ్రీనివాసరావు
Scanned with OKEN Scanner మాతృమూర్తి శతకం గురించి నాల్గు మాటలు
“నవరస కవి చక్రవర్తి” “ప్రసంగ ప్రవీణ”
ఉ॥వే॥ శ్రీమాన్ ఎన్.సి.హెచ్. శ్రీరామ చక్రవర్తి
భద్రాచలం, చేపలుకు సంఖ్య : 9399958069
గొట్టాపు శ్రీనివాసరావు గారు నాకు దాలినాయుడు గారి ద్వారా పరిచయం. విజయనగరానికి చెందిన వర్ధిష్ణు కవి. విజయనగరం అనగానే మన తెలుగువారి చరిత్రను సజీవధారలా ప్రవహింపచేసిన విజయనగరం రాజుల కథలు, బొబ్బిలి రాజుల కథలు గుర్తుకువచ్చి ఒళ్లు జలదరిస్తుంది. తెలుగు సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన పూజ్యులు ద్వారం వేంకటస్వామి నాయుడుగారు, విజయనగరం కళాశాల ద్వారా తెలుగు సినీపాటలను రసమయం చేసిన ఘంటసాల, సుశీల, ఒక ప్రక్క హరికథను అందలాలెక్కించి ఊరేగించిన పుంభావ సరస్వతి ఆదిభట్ట వారు మన మనస్సులను ద్రవింపచేసి రసగంగలను ప్రవహింప చేస్తారు. ఆ గడ్డలో ఉన్న మహత్తును అణుమాత్రమైనా సంతరించుకొనని వారుండరేమో అక్కడ! అక్కడ ఏం జరిగినా ఆయా వ్యక్తుల ప్రతిభా పాటవాలతో బాటు ఆ నేల జీవశక్తి ఏదో ఆయా వ్యక్తులను మహనీయులుగా చేయడంలో పాత్ర వహిస్తుంది.
ప్రస్తుతానికి వస్తే-
తెలుగు సాహిత్యంలో ఆధునికంగా వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. చాలా చాలా మంది కవితలు వ్రాస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. స్పందించే మనసు వ్రాయకుండా ఉండనీయక పోవడం ఒకటి. తన తలపులను ప్రపంచంలో పంచు కోవాలనే తపన ఒకటి. కవికి సాధారణంగా లభించే గుర్తింపూ, గౌరవ మర్యాదల పట్ల ఆసక్తి ఉండడం ఒకటి. ఇలా వివిధ కారణాలు. కారణం ఏదైనా వర్ధిష్ణువులచేత వ్రాయిస్తున్నది. పద్యాలు ప్రారంభించిన వారు ఎక్కువగా శతకాలు తోచడమూ ఏ పద్యానికి ఆ పద్యం వ్యస్తభావంతో నడపడంలో ఎంచుకుంటున్నారు. ఆటవెలది నడక వారికి సుఖంగా వెసులుబాటు ఉండడం దానికి కారణాలు.
గొట్టాపు శ్రీనివాసరావుగారు ఆంగ్ల ఉపాధ్యాయులు. మాతృమూర్తిని సంస్మరించుకుంటూ “మరువలేను నిన్ను మాతృమూర్తి” అనే మకుటంతో శతకం వ్రాసారు. అమ్మతో తమకు ఉన్న అనుబంధాన్ని, ప్రేమనూ, ఆత్మీయతనూ, భక్తినీ అత్యున్నత భావాలతో సంస్మరించుకున్నారు. శతకాలు వ్రాసినా అమ్మ ఋణం తీరదు కానీ కవి ఇంతకంటే ఏమి చేయగలడు? అక్షరనీరాజనం-నిజ జీవితాసేవతో పాటు, సమర్పించగలడు అంతే.! కవికి ఇది ఒక్కటే కాస్తోకూస్తో ఋణ విముక్త మార్గం. దానిలో చాలా మటుకు శ్రీనివాసరావు కృతకృత్యులయ్యారు. తేలిక బాసలో ఉండడం వల్ల మరల పద్యాలు ప్రత్యేకంగా ఉట్టంకించే పనికి పూనుకోవడంలేదు. ఈ భావాలూ క్రొత్తవి కావు - కానీ కవి ఆత్మీయతనూ స్పందనలతో తాదాత్మ్యాన్ని మనం గుర్తిస్తాము.
గొట్టాపు శ్రీనివాసరావు గారు ఆంగ్ల ఒజ్జగా ఉంటూ అమ్మబాసపై అభిమానంతో శతకం వ్రాయడం ఆహ్వానించదగినది. కవిత్వపు మెలకువలను వీరు ఇంకా ఆకళింపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే ఛందస్సులో మర్మాలనూ వశపరచుకోవలసి ఉంది. మరింత అధ్యయనమూ, అనుశీలనా చేసి మంచి కవిత్వం వ్రాయాలని గొట్టాపు వారిని కోరుతున్నాను. తద్వారా తెలుగు తల్లికి నిజమైన బాసా ఊడిగం చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీనివాసరావు గారికి శతమానం భవతి
- భద్రాచలం
- 27-11-2019
బాసకు కాలి తువ్వ
ఎన్.సి.హెచ్. చక్రవర్తి
M.L.A. 13-Saluru (ST) Assembly Constituency Vizianagaram District, A.P.; and Dy. Floor Leader A.P. Legislative Assembly Velagapudi 522238 AMARAVATHI.
Beside Judge Court, Official Colony (Street) Rama Colony, Saluru-535 591 Vizianagaram District. Andhra Pradesh Mobile : 9440830397, 7893504567 Whatsapp: 9491884567 E-mail : prajannadora@gmail.com/
అమ్మకు అమరత్వమిచ్చిన
శ్రీనివాసరావు మాస్టారు గారు అభినందనీయులు
నైతిక విద్య నేడు పాఠశాలలో ఒక భాగం. ఉపాధ్యాయుల భాద్యత కూడా. తల్లి దండ్రుల పట్ల గౌరవమూ, సభ్యుల పట్ల ప్రేమానురాగాలు విద్యార్థులతో వర్ధిల్లాలి. ఈ గురుతర భాద్యత పిల్లల లో పెంపొందింప జేయుటలో అమ్మా, నాన్నల తరువాత గురువులదే అని నా విశ్వాసం.
శ్రీ గొట్టొపు శ్రీనివాసరావు మాస్టారు గారు, మాతృదేవతకి మనసున ఆలయం నిర్మించి, అమ్మకు అక్షర నీరాజనంగా, 100 పద్యములకుపైగా సమర్పణం చేసి, “అమృతం త్రాగేవాళ్ళు, దేవతలూ, దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా-నాన్నలు" అని ఒక కవి చెబితే - అమ్మతనానికి, అమ్మ ప్రేమకు, అమ్మ త్యాగానికి, అక్షర సత్యంగా - నేడు అమరత్వమిచ్చారు.
శ్రీ గొట్టాపు శ్రీనివాసరావు మాస్టారు గారు, సాలూరు సాహితీ మిత్ర బృందం ద్వారా సుపరిచితులు. ఆంగ్లోపాధ్యాయులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాంచాలితో పనిచేస్తూ ఉన్నారు. గతంలోనే విద్యార్థులకు ఉపయోగపడే "క్రియాపదనిఘంటువును" రచించారు. ఇప్పుడు “మరువలేను నిన్ను "మాతృమూర్తి" అనే మకుటంతో చక్కని శతాధిక పద్య పుష్పాలను వారి వారి వారి వారి మాతృమూర్తిని, ఆమె సేవలనూ గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్ద్రతతో తల్లికి సమర్పించుకున్నారు. ఈ పద్యాలు చదువుతున్నంత సేపు ఎవరికి వారు, కళ్ళు తడుపుకుంటారు. ఉదాహరణకు మాస్టారుగారి మాటలలోనే చూస్తే
ఆ॥వె॥ మాట నేర్పినావు మమతను పంచియు
చదువు నేర్పినావు చక్కదిద్ది
ఆదిగురువు నీవే యాదర్శమూర్తివి
మరువలేను నిన్ను మాతృమూర్తి
నిజమే. అమ్మ ఆదిగురువు. ఆ మాతృదేవతకు అంకితమిచ్చిన శ్రీ శ్రీనివాసరావు మాస్టారు గారిని అభినందిస్తున్నాను. మరిన్ని మంచి రచనలను చేసి జాతికి అందివ్వాలని కోరుతున్నాను. శతాధిక పద్య పుష్పాలతో అమ్మను ఆరాధించిన శ్రీ శ్రీనివాసరావు మాస్టారిని మనసారా అభినందిస్తూ....
(పీడిక రాజన్నదొర)
కవితా పుష్పాలతో మాతృమూర్తిని అర్చించిన "గొట్టాపు"
'అమ్మ' అన్నపదం అనురాగానికి, ఆప్యాయతకు, ప్రేమకు, వాత్యల్యానికి, కరుణకు, దయకు ఆలవాలం. “దేవతలంతా ఒక వైపు అమ్మ ఒక వైపు-నీవు ఎటువైపంటే - ఒరిగేను అమ్మవైపు" అంటారు. “సి.నారే" గారు. ఈ నేలమీద మాతృదేవతను గూర్చి తడవని కవులుండరు. వారివారి అక్షర పుష్పాలతో 'అమ్మ'ను అర్చించారు. ఇలా ప్రతికాలంలోను కవులు అమ్మ యొక్క అమృత తత్వాన్ని కవిత్వ రూపంలో ప్రవహింపజేస్తునే ఉన్నారు. ఇదిగో ఈ వరుసలోని వాడే మా గొట్టాపు శ్రీనివాసరావు. ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేస్తూ అమ్మభాషలో అమ్మను పూజిద్దామని తలంపుతో “మరువ లేను నిన్ను మాతృమూర్తి” అన్న మకుటంతో ఒక శతకాన్ని రచించాడు. అతనిని కవిగా తయారు చేసిన “సాలూరు సాహితీ మిత్ర బృందం" దానిని వెలువరించే పనిలో పడింది.
హృదయాన్ని 'కలం' గా చేసుకొని ఈ యువకవి రాసిన కొన్ని పద్యపాదాలను తిలకిస్తే... పాఠకులకు అతని ప్రగాఢ భక్తి అర్ధమౌతుంది.
"జోలపాట పాడి - జోకొట్టి జోకొట్టి హృదిని పాన్పుచేసి - నిదుర పుచ్చి పెంచి నట్టి నిన్ను - ప్రేమగా సేవింతు మరువలేను నిన్ను - మాతృమూర్తి”
ఇలా ఆటవెలదుల్లో ఆర్థతగా వ్రాసిన ఈ కవి అభినందనీయుడు.
“అలక పాన్పునెక్కి - ఆకలైనేనుంటె బువ్వ పెడితివీవు బుజ్జగించి"
ఇలా ప్రతీ పద్యంలోను అమ్మ అనురాగ బంధాన్ని కవిత్వగంధంతో అలది పూజించడానికి ప్రయత్నం చేసారు. శ్రీనివాసరావుగారు. ఈ పద్యాలను మేము చాలావరకు సరిచేసి, మరో కవిపండితులు శ్రీమాన్ ఎన్.సి.హెచ్. శ్రీరామ చక్రవర్తి గారి సూచనలు సవరణలను కూడా జోడించి, పాఠకలోకానికి ఈ కృతిని అందిస్తున్నాం. మీరిచ్చిన అభినందనలే-ఈ యువకవికి ఆశీర్వచనాలు కాగలవు. మరిన్ని మంచి రచనలు చేయాలని శుభాకాంక్షలు తెలుపుతూ....
జె.బి. తిరుమలాచార్యులు, అధ్యక్షులు : కిలపర్తి దాలినాయుడు కార్యదర్శి :
సాలూరు సాహితీ మిత్రబృందం, సాలూరు
మెయిన్ రోడ్, గొల్లవీధి జంక్షన్, సాలూరు. సెల్ : 9989838303 కంప్యూటరైజ్డ్ కంటి తనిఖీ కేంద్రం Opthalmic Consultanat : Mr. G. KARUN, DOA, MIMS Regd.No. 938/Opthal/Appmb/2009
శ్రీ గురవే నమ:
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులను నేర్పి నాకు, నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చిన నా పూజ్య గురుదేవులకు ముందుగా కృతజ్ఞతాంజలిని సమర్పిస్తున్నాను. మన మాతృభాషను ఒక విషయంగా మాత్రమే పరిగణించడం, నిజానికిది తెలుగు భాషామతల్లికి గొడ్డలి పెట్టే. భవిష్యత్తరాలకు మార్గదర్శియై, తెలుగు భాష వెలుగు లీనాలని, ప్రతి ఒక్కరు వారివారి మాతృభాషా మాధ్యమాలలో చదువుకొని ప్రగతి దారుల ప్రయనించాలని, మా గురువుల ఈ మాతృభాషా యజ్ఞంలో నేనొక సమిధను కావాలని, మా గురువుగారు శ్రీ గొట్టాపు శ్రీనివాసరావు మాస్టారు రచించిన ఈ పుస్తకాన్ని ముద్రించే మహత్తర భాగ్యాన్ని నా శిరస్సున నెత్తుకున్నాను. ఇటువంటి మహత్కార్యంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సాలూరు సాహితీ మిత్ర బృంద అధ్యక్షులు శ్రీ జె.బి. తిరుమలాచార్యులు మాస్టారు గారికి ఋణపడుతున్నాను. మా సాలూరు సాహితీ మిత్ర బృందానికి ధన్యవాదములు తెలుపుతూ.... నేటి విద్యార్థులకు, యువకులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, రచనలను చేపట్టాలని సవినమ్రంగా విన్నవించుకుంటున్నాను.
కృతజ్ఞతాభివందనాలతో... జి. కరుణ్ వినయాంజలి
అమ్మ అనే పదం ఓ అమృత భాండం. అమ్మ ఇలపై గల తొలిదేవత ఆ దేవతా మూర్తే, నను గన్న మాయమ్మ కీ॥శే॥ గొట్టపు నాగమ్మ గారు.
ఆ దయావారాశి యొక్క వాత్సాల్యామృతవర్షమే నా ఈ పద్యకృతి. ఆ అమ్మతత్త్వం మరువలేనిది. మరుపురానిది. ఎన్ని పూలతో పూజించినా, ఆమె ఋణం తీరనిది. ఆమెను సార్వజనీనకంగా స్మరిస్తూ “మరువలేను నిన్ను మాతృమూర్తి” పేరుతో మీ ముందు శతాధిక పద్య పుష్పాలనుంచుతున్నాను.
సాహిత్య అభిలాష తప్ప ఎలా వ్రాయలో తెలియని నాకు కవిత్వం వ్రాయడం నేర్పించి, వారి సాలూరు సాహితీ మిత్ర బృందంలో సభ్యునిగా చేర్చుకుని, పద్యం వ్రాయడానికి కావలసిన గణ, ప్రాస, యతి నియమాలను తెలియజేసి, ప్రోత్సహించడమే గాక ఈ కృతిని ముద్రించుటకు కూడా ప్రేరణగా నిల్చిన శ్రీ జె.బి. తిరుమలాచార్యులు, శ్రీ కిలపర్తి దాలినాయుడు మాస్టార్లకు వినయపూర్వక కృతజ్ఞతాంజలి.
నా ఈ పద్యకృతికి గుణదోష పరిష్కారం గావించిన పండిత వరేణ్యులు, ఉభయవేదాంతులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి, భద్రాచలం గారికి శతాధిక పాదాభివందనాలు.
నాపై గల అభిమానంతో ముందుమాటలను అందించిన మా ప్రాంత అభివృద్ధి ఏలిక, గౌరవ శాసన సభ్యులు, శ్రీ పీడిక రాజన్నదొరగారికి కృతజ్ఞతాంజలి. 10 పద్యకృతిని గూర్చివిని సంతోషంగా గురుపాదార్చనగా భావించి ఆర్ధిక సహకారాన్ని అందించిన నా ప్రియ శిష్యులు చి॥ గుడిశ కరుణ్‌కు నా శుభాశీస్సులు. వారి తల్లిదండ్రులయిన శ్రీమతి & శ్రీ గుడిశ రామలక్ష్మీ, జగదీష్ గార్లకు నా హృదయపూర్వక నమోవాకములు. నిత్యం నా ఎదుగుదల నా కోరుకునే నా తండ్రి శ్రీ గొట్టాపు శివున్నాయుడు గారికి, మా మామయ్యలు శ్రీ మడక రామక్రిష్ణగారికి, శ్రీ మడక రామమోహన్ గారికి అనేక నమస్కారాలు.
అను నిత్యం నావెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న సాలూరు సాహితీ మిత్ర బృంద గౌరవాధ్యక్షులయిన శ్రీ జరజాపు ఈశ్వరరావు గారికి, నా సాలూరు సాహితీ మిత్రబృంద సభ్యులకు, స్నేహశీలి, మంచిని ప్రోత్సహించే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గౌ|| శ్రీ టి. నాగేశ్వరరావు మాస్టారు గారికి, నా పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందానికి, సాహిత్య విషయాలను నాతో ముచ్చటించే శ్రీ శివలెంక ప్రసాదరావు మాస్టారు గారికి, ఎల్లప్పుడు ఈ శిష్యపరమాణువు యొక్క అభివృద్ధిని కోరుకొని మా గురువుగారు శ్రీ మహంతి రాంబాబు మాస్టారు గారికి నా కృతజ్ఞతా పూర్వక అభివాదాలు.
ఇచ్చిన అతి కొద్ది సమయంలోనే అందమైన పుస్తకంగా తీర్చిదిద్దిన శ్యామలా ప్రింటర్స్ అధినేత శ్రీ బుడ్డెపు ఆనందరావు గారికి, చక్కగా డి.టి.పి. చేసిన చి|| ఇమంది చిన్నమ్మలుకు వారి బృందానికి కృతజ్ఞతలు. పాఠక దేవుళ్ళారా!
మీ ప్రోత్సాహమే నాకు ఇంధనం. నా ఈ పుస్తకాన్ని ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తారని సప్రశ్రయంగా మిమ్ము ప్రార్ధిస్తూ.... మీ గొట్టాపు శ్రీనివాసరావు 11 Scanned with OKEN Scanner
| ఆ.వె. | అమ్మ గొప్పదనము నాటవెలది యందు | 1 |
| ఆ.వె. | అజుడునన్ని చోట్ల నవతరించనులేక | 2 |
| ఆ.వె. | తెలుగు భాష యందు తీయనైన పదము | 3 |
| ఆ.వె. | పుడమి భాషలన్ని వడకట్టి వెదకినా | 4 |
| ఆ.వె. | పిండ దశను నేను పిడుగుద్దులనిడిన | 5 |
| ఆ.వె. | కష్టమైనను తినె పౌష్టికాహారము | 6 |
| ఆ.వె. | గర్భమందు నేను గడబిడ చేసితి | 7 |
| ఆ.వె. | ప్రసవ వేదనంత పంటి యందుననుంచి | 8 |
| ఆ.వె. | నన్ను గర్భమందు నవమాసములు మోసి | 9 |
| ఆ.వె. | పురిటినొప్పులన్ని పూర్తిగా భరియించి | 10 |
| ఆ.వె. | తనువు పులకరించె తల్లి నీవు పిలువ | 11 |
| ఆ.వె. | జన్మనిడితివీవు జవసత్వములు పోసి | 12 |
| ఆ.వె. | ఆకలిగొని నేను వెక్కి వెక్కేడ్వగ | 13 |
| ఆ.వె. | అమ్మ మాట వినిన కమ్మగానుండును | 14 |
| ఆ.వె. | పండు వెన్నెలేల పట్టు పరుపులేల | 15 |
| ఆ.వె. | జోలపాట పాడి జోకొట్టి జోకొట్టి | 16 |
| ఆ.వె. | ముద్దుగ నను గాంచి ముద్దు మాటలు విని | 17 |
| ఆ.వె. | రాత్రి యందె కాచు రజనీశుడిలలోన | 18 |
| ఆ.వె. | అమ్మ నీదు మనసు కమ్మనైన మనసు | 19 |
| ఆ.వె. | అమ్మ కన్న గొప్ప యనుబంధమేలేదు | 20 |
| ఆ.వె. | మాట నేర్పినావు మమతను పంచియు | 21 |
| ఆ.వె. | విసనకర్ర తోటి వేసవిని విసరి | 22 |
| ఆ.వె. | అలక పాన్సునెక్కి ఆకలై నేనుంటె | 23 |
| ఆ.వె. | బిక్కు బిక్కుమనుచు భీతిచెందినపుడు | 24 |
| ఆ.వె. | హద్దు లేని ప్రేమ హాయిగా పంచియు | 25 |
| ఆ.వె. | అంతులేని ప్రేమ నమ్మయే చూపును | 26 |
| ఆ.వె. | అమ్మ గోరు ముద్దలమృతము వలెనుండు | 27 |
| ఆ.వె. | స్వచ్ఛమైన ప్రేమ మచ్చ లేకుండగ | 28 |
| ఆ.వె. | కస్సుబుస్సుమనక కరుణ చూపితినీవు | 29 |
| ఆ.వె. | చెడును విడువమనుచు చిన్ని శిక్షలు వేసి | 30 |
| ఆ.వె. | అందనట్టి మామ ఆకాశమందున | 31 |
| ఆ.వె. | గోల గోల చేసి గొడవ చేయునపుడు | 32 |
| ఆ.వె. | నీతి కథలు చెప్పి నీతిపై నడిపించి | 33 |
| ఆ.వె. | అర్ధమేది లేదు వ్యర్ధమౌ నీమాట | 34 |
| ఆ.వె. | అమ్మ చేతి వంట అమృతము వలె నుండు | 35 |
| ఆ.వె. | సంతు చూచినపుడు సంతోషమొందుచున్ | 36 |
| ఆ.వె. | కరువు కాటకాలు కలిసి వచ్చిననేమి | 37 |
| ఆ.వె. | తప్పు చేసినపుడు దండన గావించి | 38 |
| ఆ.వె. | అమ్మ చెంత నుండి నాశీస్సులిచ్చియు | 39 |
| ఆ.వె. | అమ్మ నాకు నీవెయాత్మ నిదర్శనం | 40 |
| ఆ.వె. | గతుకులబతుకులకు గట్టి గమ్యమునిడి | 41 |
| ఆ.వె. | ఆపదలగు వేళనండగా నీవుండి | 42 |
| ఆ.వె. | నీవు తినక దాచి నీదు సంతుకుబెట్టి | 43 |
| ఆ.వె. | అవని రక్షణకును నాభానుడుండెను | 44 |
| ఆ.వె. | పండుగలగు పూట పిండివంటల జేసి | 45 |
| ఆ.వె. | కోరినపుడు నాకు కొండంత యండగా | 46 |
| ఆ.వె. | మట్టిలోన దొర్లి బట్టలన్నియు మాపి | 47 |
| ఆ.వె. | పరిసరాలనెపుడు పరిశుభ్రముగనుంచి | 48 |
| ఆ.వె. | పెద్ద బాలశిక్ష శ్రద్ధగా చదివించి | 49 |
| ఆ.వె. | తల్లి ప్రేమ చూడ తరగని నిధియగు | 50 |
| ఆ.వె. | అమ్మ మాకు నీవెయాదర్శ మూర్తివి | 51 |
| ఆ.వె. | కలలు నిజము చేయు కల్పతరువు నీవు | 52 |
| ఆ.వె. | సులభ సూత్రములను సూటిగా సూచించి | 53 |
| ఆ.వె. | అమ్మ నీవె చూతువన్ని మంచి చెడులు | 54 |
| ఆ.వె. | అమ్మ పంచినట్టి యాత్మీయ ప్రేమది | 55 |
| ఆ.వె. | తండ్రి నేర్పు విద్య ధనము నందించును | 56 |
| ఆ.వె. | చదువులేని నాడు చదువు విలువ తెల్పి | 57 |
| ఆ.వె. | వీనులకును విందు వినగ నీదు పలుకు | 58 |
| ఆ.వె. | తెల్లవారువేళ తల్లికాళ్లకు మొక్కి | 59 |
| ఆ.వె. | శిలనునైన నన్ను శిల్పంబు గావింప | 60 |
| ఆ.వె. | తనకు పాతచీరె తృప్తినిచ్చుననుచు | 61 |
| ఆ.వె. | కన్నతండ్రి నిన్ను కన్నీటి పాలేయ | 62 |
| ఆ.వె. | నన్ను కన్నతల్లి నాయింటనుండగ | 63 |
| ఆ.వె. | అదను బట్టి మారునన్నదమ్ముల ప్రేమ | 64 |
| ఆ.వె. | అమ్మ నీదు ప్రేమ యాకాశమంతది | 65 |
| ఆ.వె. | ముదిమి మీద పడిన మోము ముడతలైన | 66 |
| ఆ.వె. | రాజు రాజ్యమైన రాజభోగాలైన | 67 |
| ఆ.వె. | కోట్ల యాస్తి కన్న నోట్ల కట్టల కన్న | 68 |
| ఆ.వె. | అంతరంగమందునాత్మీయ ప్రేమను | 69 |
| ఆ.వె. | ఉర్వి కలిగి యున్న ఓర్పు నంత కలిపి | 70 |
| ఆ.వె. | కోటి దేవతలను కూడియాబ్రహ్మయే | 71 |
| ఆ.వె. | తల్లి నిన్ను మించు తత్త్వంబు లేదమ్మ | 72 |
| ఆ.వె. | ఆకులెండి పిదప నవనిపై రాలును | 73 |
| ఆ.వె. | తల్లి కన్నదైన తల్లి పెంచినదైన | 74 |
| ఆ.వె. | కన్నతల్లి మనసు వెన్నవంటిదగును | 75 |
| ఆ.వె. | మాతృమూర్తి యన్న మమకార నిధియగు | 76 |
| ఆ.వె. | వింటి నీదు మాట చంటిబిడ్డయపుడు | 77 |
| ఆ.వె. | వయసు మీద పడిన వణికిపోవుచునున్న | 21++78 |
| ఆ.వె. | కాసులెన్నో పోసి కనకమ్ము కొన్నను | 79 |
| ఆ.వె. | తల్లి సేవ చేయు తనయుడే తనయుడు | 80 |
| ఆ.వె. | అవని సంపదైననధికారమైనను | 81 |
| ఆ.వె. | అమ్మ మనసు విరిచి యమ్మనే మరిచిన | 82 |
| ఆ.వె. | ఆపదెంతయైననవసరమేదైన | 83 |
| ఆ.వె. | పుడమి భాషలన్ని వడకట్టి వెదకిన | 84 |
| ఆ.వె. | అవనియందునీవె యనురాగదేవత | 85 |
| ఆ.వె. | వెతికి వెతికి కంటి ప్రేమ జాడ కొరకు | 86 |
| ఆ.వె. | భక్తి ధార వోసి భగవంతుని కొలిచి | 86 |
| ఆ.వె. | పూజలెన్నొ చేసి పుణ్యమున్ బొందినా | 88 |
| ఆ.వె. | ఆదిశక్తి పోయెనాత్రిమూర్తులు పుట్ట | 89 |
| ఆ.వె. | అమ్మలేదు కనుక హరుడు భిక్షమడిగె | 90 |
| ఆ.వె. | హరునిబోలి యమ్మ యాహారమిచ్చును | 91 |
| ఆ.వె. | దైవసేవ చేయ దైవమిలను లేడు | 92 |
| ఆ.వె. | మాతృమూర్తి చాలు మాణిక్యమెందుకు | 93 |
| ఆ.వె. | అమ్మసేవ చేయు హస్తము హస్తము | 94 |
| ఆ.వె. | మ్రొక్కి లాభమేమి ముక్కోటి సురులకు | 95 |
| ఆ.వె. | ఆపదైన చోట యమ్మా, తనయులున్న | 96 |
| ఆ.వె. | వేయి మార్లు కాశి వెళ్లి వచ్చిన నేమి | 97 |
| ఆ.వె. | మాతృసేవ జేసి మాతౄణముందీర్చి | 98 |
| ఆ.వె. | తాటిచెట్టు వోలె తనువెంతయెదిగినన్ | 99 |
| ఆ.వె. | పంచదార కన్న పట్టుతేనెయకన్న | 100 |
| ఆ.వె. | సురుల గణము కన్న సురరాజు కన్నను | 101 |
| ఆ.వె. | తల్లి నన్ను పెంచె దయతోడ ప్రేమగా | 102 |
| ఆ.వె. | ఇంటిలోని చాకిరెంత యున్ననుగాని | 103 |
| ఆ.వె. | సురులు పొందలేరు సుకవియందుకొనడు | 104 |
| ఆ.వె. | ఈశ్వరుండు తపమునెవ్వరి కోసము | 105 |
| ఆ.వె. | అమ్మఘనతనెరిగి యాలకాపరి కూడ | 106 |
| ఆ.వె. | ఎవరు నచ్చకున్న నెవరు నొచ్చుకొనిన | 107 |
| ఆ.వె. | ఆకలయిన వేళ యాహారమడిగిన | 108 |
<poem>గౌరవ అధ్యక్షులు మా గౌరవ సభ్య బృంద ఆశీస్సులతో గౌరవ సలహాదారులు : గౌరవ సభ్యులు:
శ్రీ జరజాపు ఈశ్వరరావు గారు డా॥ వి. గణేశ్వరరావు గారు శ్రీ వంగపండు రాజేంద్రప్రసాద్ మాస్టారు గారు శ్రీ మండవిల్లి వేంకటేశ్వరరావు గారు M శ్రీ ఆలవెల్లి వెంకట మాధవి గోకుల క్రిష్ణ గారు డా॥ ఆరిశెట్టి మోహనరావు గారు శ్రీ గంటా వెంకటరాజు గారు శ్రీ పట్నాల ఈశ్వరరావు గారు శ్రీ గుల్లిపల్లి రాజ్ పాల్ గారు శ్రీ సారిపాక రాంప్రసాద్ గారు, శ్రీ పోతుబరి లక్ష్మణరావ్ గారు శ్రీ యిండుపూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ వెత్సా మల్లికార్జున్ గారు గౌరవ న్యాయసలహాదారు : శ్రీ వడ్డాది షణ్ముఖముత్యాలు గారు అధ్యక్షులు : కార్యదర్శి : శ్రీ జె.బి. తిరుమలాచార్యులు శ్రీ కిలపర్తి దాలినాయుడు సాలూరు సాహితీ మిత్ర బృందం సభ్యులు : శ్రీ చావలి శేషాద్రిసోమయాజులు గారు, శ్రీ ఆకుల గణపతి గారు, శ్రీ అయిక భాస్కరరావు గారు, శ్రీ సాహుకారి చంద్రశేఖర్ గారు, శ్రీ గొట్టాపు శ్రీనివాసరావు గారు, శ్రీ బొత్స హరి ప్రసాద్ గారు, శ్రీ జె.బి.డి. రాజు గారు, శ్రీ ఎమ్.వి. గౌరీశంకరరావుగారు, శ్రీ కరిబుగత సత్యనారాయణ గారు, శ్రీ సి.హెచ్. అప్పయ్యబాబు గారు, శ్రీమతి రావాడ కృష్ణకుమారి గారు, శ్రీమతి సాబెరా బేగం గారు అభినందనలతో...... శ్రీ డోకల రాములు మాస్టారు గారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, బొబ్బిలి శ్రీ కేతిరెడ్డి క్రిష్ణమూర్తినాయుడు గారు, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి, బొబ్బిలి శ్రీ బండారు త్రినాధ మాస్టారు గారు, ప్రధానోపాధ్యాయులు, సాలూరు శ్రీ కేతిరెడ్డి చంద్రశేఖర్రావు గారు, సాలూరు శ్రీ చుక్క సూర్యనారాయణ గారు, మిలట్రీ ఇంజినీరింగ్ సర్వీస్, రాముడువలస శ్రీ వైకుంఠపు వాసు గారు, అధినేత : శ్రీ సాయిరాం డయాగ్నోస్టిక్ సెంటర్, సాలూరు ఈ క్రింది వైద్య నిపుణులు ప్రతీ 2వ, 4వ శనివారములు మధ్యాహ్నం గం|| 2-00 ల నుండి సా|| 7-00 వరకు వైద్యసేవలందించుదురు. డా॥ వంగపండు నిర్మల M.D. (General Physician) D.M. (Neurology) Jipmer జనరల్ ఫిజీషయన్, మెదడు, వెన్నుముక, నరముల వ్యాధుల నిపుణులు ఈ క్రింది వైద్య నిపుణులు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వైద్య సేవలందించెదరు. డా॥ బూరి అనీల్కుమార్, M.S. (Ortho) ఎముకలు, కీళ్లు మరియు వెన్నుముక వైద్య నిపుణులు ఈ క్రింది వైద్య నిపుణులు ప్రతీ ఆదివారములు ఉ॥ 10 గం॥ నుండి మ॥ 2 గంట వరకు వైద్య సేవలందించెదరు. డా॥ జాగారపు రమేష్ M.B.B.S., M.D. (Neuro Psychiatry) NIMHANS Senior Resident in GHMC (KGH) | మా వద్ద పరీక్షలు నిర్వహించు ఆధునిక పరికరాలు సెల్ కౌంటర్, సెమీ ఆటో ఎనలైజర్, Q.B.C. (క్యౌ.బి.సి.) TE.C.G., 100 ఎక్స్ -రే మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ రిపోర్టులు కష్టమర్లకు సకాలంలో అందించగలము. | 24 గంటలు సర్వీసులు అందించబడును. ఇంటివద్దకు వచ్చి శాంపిల్ తీసి రిపోర్టులు అందించబడును. శ్రీ సాయిరాం డయాగ్నోస్టిక్ సెంటర్ K.S.M. బట్టలషాపు ఎదురుగా, మెయిన్ రోడ్, సాలూరు, Cell: 9866321374, 8096267992, do 08964 242020 36
Scanned with OKEN Scanner పుట:Matrumurthi padya sathakam.pdf/38