మనుచరిత్రము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
మనుచరిత్రము
సటీకము
————
పీఠిక
| 1 |
"కావ్యం యశసే౽ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే, సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే." అను నాలంకారికప్రామాణ్యం బున నాంధ్రకవితాపితామహుడు శ్రేయస్సాధనం బగు కావ్యము రచింపఁబూని “ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశో వాపి తన్ముఖమ్" అను మూడువిధములలో నాశీర్వాదరూప మగుమంగళమును గావ్యారంభమున నిటు లొనరించెను.
టీక. శ్రీవక్షోజకురంగనాభము - శ్రీ = లక్ష్మియొక్క, వక్షోజ = కుచములయందలి, కురంగనాభము = కస్తూరి, ఎదపైన్ = ఱొమ్ముమీఁద, చెన్నొందన్, విశ్వంభరాదేవిన్ = భూదేవిని, తత్కమలాసమీపమునన్ = ఆలక్ష్మిచెంతను, ప్రీతిన్, నిల్పినాఁడో, అనంగాన్. వందారు ... శ్రేణికిన్ - వందారు = నమస్కరించు, సనందనాది = సనందనుఁడు మొదలగు, నిజ = తన, భక్తశ్రేణికిన్ = భక్తసంఘమునకు, తోఁచు, రాజీవాక్షుండు = కమలములఁ బోలుకన్నులు గలవిష్ణుఁడు, శుభదృష్టిన్ = శుభకరమైన చూపున, కృష్ణరాయాధిపున్, కృతార్థున్ = నెఱవేర్పఁబడిన ప్రయోజనము గలవానినిఁగా చేయున్.
తాత్పర్యము. లక్ష్మీదేవిని గౌఁగిలించుకొన్నప్పు డామెపాలిండ్లమీఁది కస్తూరి తనఱొమ్మున నంటుకొనఁగాఁ, దత్కాలమున సేవింప నరుదెంచిన సనందనాదులకు, లక్ష్మితో పాటు భూదేవినిసయికతము ఱొమ్మపై నిల్పుకొనెనా యనుతలంపుఁ గలుగఁజేయువిష్ణుమూర్తి కృష్ణరాయప్రభునిఁ గృతార్థునిఁ జేయఁగాత.
లక్ష్మీదేవికుచములయొత్తిడివలనఁ గలిగినకస్తూరిమచ్చను నిత్యబ్రహ్మచర్యపరు లగుసనందనాదులు గ్రహింపకపోవుట సముచితముగా నున్నది. మఱియు కృష్ణరాయలకు రాజ్యలక్ష్మీసమృద్ధి నాశాసించుచు విష్ణుని లక్ష్మీభూముల ఱొమ్మున నిల్పుకొనువానిఁగా వర్ణించుట యుక్తరూపము.
కావ్యాదియందు మగణము శుభదాయక మనుటకు —
తే. "భువనములకెల్ల నాధారభూతమైన
జగతి యధిదైవతంబుగాఁ జను మగణము
తనకుఁ గారణ మగుటచే దానిఁ గూడి
ధన మొసఁగు నేఁడునని పల్కెఁ దాతనొజ్జ.”
కావ్యాదిని శ్రీకారము శుభదాయక మనుటకు —
క. “పదపడి శ్రీకారము కృతి, మొదల నిలిచి దోషపుంజము నడంచి శుభం
బొదవించుఁ బరుస మినుమును, గదిసి సువర్ణంబు సేయుకరణిన్ ధరణిన్.”
(అప్పకవి)
లక్ష్మీస్తనకస్తూరి భూదేవి యని మునులకుఁ దోఁచుట గంధర్వుఁడు వరూథినికిఁ బ్రవరునివలెఁ దోఁచుటకు సూచనముగాన నిది కావ్యార్థసూచనము.
అలం. ఈపద్యమున భ్రాంతిమదలంకారో జ్జీవిత మగునుత్ప్రేక్షాలంకారము.
| ఉ. | ఉల్లమునందు నక్కటిక మూనుట మీకులమందుఁ గంటిమం | 2 |
టీ. ఉల్లమునందు = మనస్సున, అక్కటికము = జాలి, ఊనుటన్, మీకులమందు = మీజాతియందు, కంటిమి, అంచున్, అల్లనన్ = మెల్లఁగా, మేలము = పరియాచకము, ఆడు ఆఅచలాత్మజమాటకున్ = పల్కు పార్వతిపల్కునకు, లేఁతనవ్వు, సంధిల్లన్, కిరీటి = అర్జునుని, పాశు...ఢ్యునిన్ - పాశుపత = పాశుపత (శివునిసంబంధమైనది) మనెడు, దివ్యశర = దివ్యాస్త్రముతో, ఆఢ్యునిన్ = సంపన్నుని, చేయు, శాంబరీభిల్లుఁడు = మాయాకిరాతుఁడు, కృష్ణరాయలకు, అభి... తిపాది- అభీష్టశుభ = ఇష్టము లైనశుభములను, ప్రతిపాది = గూర్చువాఁడు, కావుతన్.
తా. అరణ్యవాసకాలమున నర్జునుఁడు పాశుపతాస్త్రమునకై కావించినతపస్సునకు మెచ్చి కిరాతవేషమున నరుదెంచి హేలగాఁ బోరి యాతని కోడుట నభినయింవఁగాఁ బార్వతి చూచి "మీ కులమున నెన్నఁడును లేనిజాలి కాన్పించెనే” యని కావించు పరియాచకమునకుఁ జిఱునవ్వు నవ్వుచుఁ బాశుపతాస్త్రము నాతనికి దయసేయుశివుఁడు కృష్ణరాయల కభీష్టశుభముల సమకూర్చుఁగాత.
పార్వతి యచలాత్మజగాన యోగ్యురాలు. కాననే యుత్తముఁడగు తనప్రాణేశ్వరుని నల్లన మేలమాడినది. భావవేదిగాన శంకరుఁడు చిఱునగవు దాల్చెను. కిరీటికి పాశుపతము నొసంగుతఱిగానఁ బార్వతి సువ్యక్తముగఁ బరిహాసమాడుటకుఁగాని శివుఁడు హాసరూపమున సంతసము వెలిబుచ్చుటకుఁ గాని వీలుగాకపోయినది. చిఱునవ్వు ఉత్తములక్షణ మనుటకు —
శ్లో. "శ్రేష్ఠానాం స్మితహసితే మధ్యానాం విహసితావహసితే చ,
నీచానామపహసితం తథాతిహసితం చ షడ్భేదాః.
ఈషద్వికాసి నయనం స్మితం స్యాత్స్పందితాధరమ్."
(సాహిత్యదర్పణము)
అర్జునునకు శత్రుజయార్థము దివ్యాస్త్రము నొసఁగిన శివుఁడు కృష్ణరాయలకుఁ దత్తత్సాధనములఁ జేకూర్చున ట్లాశాసించుట యొప్పిదము.
కిరాతవేషము ధరించియు దయాశాలియయ్యుఁ గిరీటిని బరీక్షింప నెంచి వచ్చియు నస్త్రదానధురంధరుఁ డయ్యు దయౌదార్యముల కునికిపట్టైన పరమేశ్వరుఁడు రాయలను దయతోఁ జూచుటయు నభీష్టసిద్ధిఁ జేకూర్చుటయు సహజవిశేషములే.
కిరాతునియందు దయారసోత్పన్న మను విషమకార్యోత్పత్తి చెప్పబడుటచే నలంకారము విషమము.
| ఉ. | నాలుగుమోములన్ నిగమనాదము లుప్పతిలన్ బ్రచండవా | 3 |
టీ. నాలుగు మోములన్, నిగమనాదములు = వేదధ్వనులు, ఉప్పతిలన్ = ఉద్భవిల్లఁగా, ప్రచండవాతూలహతిన్ = తీవ్రములైనగాడ్పులతాఁకుడుచే, జనించు, రొదతోడిగుహావళిన్ = ధ్వనితోఁ గూడిన గుహలతో, ఒప్పు మేరువున్ బోలి, పయోజపీఠిన్ = పద్మాసనపీఠమున, మునిముఖ్యులు, కొల్వఁగన్, వాణిన్, కూడి, పేరోలగము = పెద్దకొల్వు, ఉన్న, ధాత = బ్రహ్మదేవుఁడు, కృష్ణరాయని, విభవోజ్జ్వలున్ = సంపదతో నొప్పారువానిఁగా, చేయుతన్.
తా. నాల్గుముఖములందును వేదపాఠధ్వనులు వెలువడుచుండఁగాఁ బెద్దగాడ్పులు తాఁకి రొదనీనుగుహలు గల మేరువువోలెఁ బొల్చుచు మునిశ్రేష్ఠులు సేవింప సరస్వతితోఁ దమ్మిగద్దియపైఁ గొలువుండు బ్రహ్మ కృష్ణరాయల కైశ్వర్యాభివృద్ధి గలిగించుఁగాత.
బ్రహ్మ మేరువుగను వాతూలధ్వని గలగుహలు వేదధ్వని గలముఖములుగను జెప్పఁబడుటచే నలంకారము పూర్ణోపమము. నిగమపఠనమున నాదిపురుషత్వము. మేరు వనుటచే సర్వాతిశాయికాంత్యతిశయము, వాణిఁ గూడి యనుటచే భాషాధిపత్యము సూచితము. మునిముఖ్యులచే సేవలఁ గొనుటయుఁ బేరోలగ మొనరించుటయు బ్రహ్మకుఁ గల నిగ్రహానుగ్రహశక్తికి బ్రాభవాధిక్యమునకుఁ దార్కాణములు. ఇట్టి యుత్తమగుణవిశిష్టుఁడు మునిసేవ్యుఁడు నగు బ్రహ్మ సుధీజనసేవ్యుఁ డగు రాయల విభవశాలిని జేయుట మిగులసులభ మని భావము.
| ఉ. | అంకముఁ జేరి శైలతనయాస్తనదుగ్ధము లానువేళ బా | 4 |
టీ. అంకము = ఒడియందు, చేరి, శైలతనయాస్తనదుగ్ధములు = పార్వతీచనుఁబాలను, ఆనువేళ = త్రాగునప్పుడు, బాల్యంకవిచేష్టన్ = పిల్లతనపుఁజెయ్దముచే, తొండమునన్, అవ్వలిచన్ = ఆవలికుచమును, కబళింపఁబోయి = కుడువఁబోయి (పట్టుకోఁబోయి), ఆవంకన్ = ఆప్రక్కను, కుచంబున్, కానక, అహివల్లభహారమున్ = సర్పహారమును, కాంచి, వే = శీఘ్రముగా, మృణాళాంకురశంక = లేఁతతామరకాఁడ యనుసంశయమున, అండుగజాస్యునిన్ = తాఁకెడుగజాననుని, అభీష్టసిద్ధికిన్ = కోరిక నెఱవేఱుటకొఱకు, కొల్తున్.
తా. అర్ధనారీశ్వరమూర్తిభేదమున నున్నప్పుడు తల్లియొడిఁ జేరి చనుఁ ద్రావుచు బిడ్డలయలవాటు చొప్పున రెండవకుచమును దొండమునఁ గైకొనఁబోఁగా నాప్రక్క శివదేహ మగుటచేఁ గుచము కానక సర్పహారముఁ గాంచి తాను గజవదనుఁడు గావున దానిని దామరతూఁ డనుకొని పట్టుకొనఁబోవువిఘ్నేశ్వరుని నభీష్టసిద్ధికై సేవింతును.
అలం. భ్రాంతిమదలంకారము.
తొడపైఁ జేరి గౌరిస్తన్యము గ్రోలుచుండె ననుటవలనఁ బార్వతికి మిగులఁ బ్రేమపాత్రుఁడగు పుత్రుఁడని భావము. ఆవలిచన్ను గానరాకపోయినపుడు వెదకి కనుఁగొనయత్నింపక హారముగనున్న పాము నందుకొని తామరతూఁడని గ్రహింపఁబోవుట గతాస్యమువలనఁ గలిగిన సహజబాల్యాంకవిచేష్ట.
తామరతూండ్లకుఁ బాములకుఁ బోల్కి గలదు.
సీ. “శేషపుచ్ఛచ్చాయఁ జెలువొందుబిసములు"
(శృంగారనైషధము)
| సీ. | చేర్చుక్కగా నిడ్డచిన్నిజాబిల్లిచే | |
.
| | దరుణాంగుళీచ్ఛాయ దంతపుసరకట్టు | |
| తే. | నుపనిషత్తులు బోటులై యోలగింపఁ | 5 |
టీ. చేర్చుక్కగాన్ = పాపటబొట్టుగా, ఇడ్డచిన్నిజాబిల్లిచేన్ = తాల్చుకొన్న లేఁతచందురునిచే, సిందూరతిలకంబు = చెందిరపుబొట్టు, చెమ్మగిల్ల = ద్రవింపఁగా, చేర్చుక్క యన స్త్రీ లలంకారార్థముగాఁ బాపటకుముందు ధరించు నొకభూషావిశేషము. సరస్వతి చంద్రునిఁ బాపటబొట్టుగా ధరించెను. చఁద్రుఁడు శిశిరకరుఁడు గానఁ గరస్పర్శచేఁ దిలకము చెమ్మగిల్లెను. అవతంసకుసుమంబునందున్ = కర్ణాభరణముగాఁ దాల్చినపూవునందు, ఉన్న, యెలదేఁటిరుతి = కొదమతుమ్మెదఝంకారము, కించిదంచితశ్రుతులన్ = ఇంచుక యొప్పిదములగు (స్థాయిని దెలుపు) ధ్వనులను, ఈనన్ = కలిగింపఁగా, ఎలదేటి యనుటచే ఝంకారాతిశయము సూచితము. సరస్వతికంఠధ్వని కంచితమగు శ్రుతి వీణె. కించిదంచితశ్రుతి ఎలఁదేటియులివు. ఘనము, ఐన, రారాపుచనుదోయిరాయిడిన్ = ఒత్తిడి గలచనుఁగవయొక్క యొరపిడిచే, తుంబీఫలంబు = వీణసొఱకాయ, తుందుడుకున్ = ఎక్కువయదరుఁబాటును, చెందన్, చనుదోయిరారాపు యౌవనాతిశయము సూచించును. ఉత్తుంగస్తనఘట్టనమున వీణెసొరకాయ గదలుటచే వీణయుఁ గదలుచుండె నని తెలియనగును. కదలువీణపై శ్రుతి గూర్చుటచే సరస్వతీసంగీతమహిమాతిశయ మిట సూచింపఁబడినది. కరుణాంగుళిచ్ఛాయ = నునువ్రేళ్లకాంతిచే, దంతపుసరకట్టులు = దంతముతోఁ గట్టిన వీణెమెట్లు, ఇంగిలీకపువింతరంగులు, ఈనన్, దంతపుసరకట్టులపై నెఱ్ఱనివ్రేళ్లు సోఁకునపుడును నఖములకాంతి ప్రసరించినపుడును నెఱ్ఱని తెల్లనిప్రకాశము గలసి సరకట్టు లింగిలీకపువింతరంగు లీనె నని భావము. ఉపనిషత్తులు, బోటులై = చెలికత్తెలై, ఓలగింపన్ = సభ దీరఁగా, పుండరీకాసనమునకు = తెల్లతామరగద్దియపై, కూర్చుండి, మదికిన్, ఇంచువేడుకన్ వీణన్, వాయించుచెలువ, నలువరాణి = సరస్వతి, మదాత్మలోన్ = నామనస్సున, వెలయఁగాతన్.
దేవకాంతలను శిరమాదిగ వర్ణించుట కవినియమము గానఁ దొలుత భూషణసంబంధముచే ముఖము, అవతంసవశమునఁ గర్ణములు, దుంబీఫలవశమున స్తనములు, సరకట్టులకతన వ్రేళ్లు, పీఠసంగతిచేఁ బాదము లిం దభివర్ణితములు.
తా. చేరుచుక్కగాఁ దాల్చుకొన్న బాలచంద్రునివలనఁ జెందిరపుబొట్టు చెమరు క్రమ్మఁగా, కర్ణాభరణమునం దున్న కొదమతుమ్మెదధ్వని శ్రుతిఁ గూర్పఁగా, బింకపుగుబ్బలయొరపున వీణసొఱకాయ యదరఁగా, ఎఱ్ఱనివ్రేళ్లకాంతిచేఁ దెల్లనివీణమెట్లు ఇంగిలీకపుఁగాంతులను వెలయింపఁగా నుపనిషత్కాంతలు సభ దీరఁగాఁ దెల్లదమ్మిగద్దెయఁ గూర్చుండి వీణ వాయించు సరస్వతి నాడెందమున నిల్చుఁగాత.
అలం. అతిశయోక్తి తద్గుణాలంకారములు.
| క. | కొలుతున్ మద్గురు విద్యా | 6 |
టీ. విద్యానిలయున్, కరుణా...సమితిన్ - కరుణాకటాక్ష = దయ గలకడకంటిచూపు లనెడు, నిబిడజ్యోత్స్నా = దట్టపువెన్నెలచే, దళిత = పోఁగొట్టఁబడిన, ఆశ్రితజన = ఆశ్రయించిన జనులయొక్క, దురిత = పాప మనెడి, ఛల = మిషచేత, గాఢధ్వాంతసమితిన్ = గాఢాంధకారపుంజముగల, శఠకోపయతిన్, మద్గురున్, కొలుతు.
తా. చదువుల కునికిపట్టగువాఁడును, గడకంటిచూపులచేతనే శిష్యుల యజ్ఞానమును బోఁగొట్టు ప్రభావము గలవాఁడును, గురుఁడు నగుశఠకోపయతికి నమస్కరించెదను.అలం. కటాక్షములందుఁ జంద్రికాత్వము ఆరోపించుటచే నలంకారము రూపకము. దురితమునకు అసత్యముగా ధ్వాంతారోపణము చేయుటచే నలంకార మవహ్నుతి.
| మ. | వనజాక్షోపము వామలూరుతనయున్ ద్వైపాయనున్ భట్టబా | 7 |
టీ. వనజాక్షోపమున్ = విష్ణుతుల్యుఁడయిన, వామలూరుతనయున్ = వాల్మీకిని, ద్వైపాయనున్ = వ్యాసుని, భట్టబాణునిన్, భాసున్, భవభూతిని, భారవిన్, సుబంధున్, బిల్హణున్, కాళిదాసునిన్, మాఘున్, శివభద్రున్, మల్హణకవిన్, చోరున్, మురారిన్, మయూరునిన్, సౌమిల్లిన్, దండిన్, వచశ్శుద్ధికిన్ = మాటలపారిశుద్ధ్యమునకు, ప్రస్తుతులన్ = స్తుతులచేత, పేర్కొందున్ = సంస్మరించెదను.
పైని బేర్కొనఁబడిన కవులందఱు సంస్కృతకవులు. పుట్టలో జనించుటచే వాల్మీకిని వామలూరుతనయుఁ డని కృష్ణద్వీప మునికిగాఁ గలవాఁడగుటచే వ్యాసుని ద్వైపాయనుఁ డని యందురు.
| ఆ. | వ్యాసరచితభారతామ్నాయ మాంధ్రభా | 8 |
టీ. వ్యాసరచితభారతామ్నాయము = వ్యాసునిచే రచింపఁబడిన భారతవేదమును, 'భారతః పంచమో వేదః' అనుటవలన భారతమునకు వేదత్వము. ఆంధ్రభాషగన్, ఒనర్చి, జగతిన్, పొగడు = పొగడ్త, కనిన, నన్నపార్యున్, కృతక్రతున్ = చేయఁబడిన యజ్ఞము గలవాడగు. (యజ్ఞ మొనరించిన) తిక్కనన్ = తిక్కన సోమయాజిని, శంభుదాసున్ = శంభుదాసుఁ డనుమాఱుపేరు గల, ఎఱ్ఱసుకవిన్, భక్తిన్, తలఁతున్.
| మ. | భరమై తోఁచు కుటుంబరక్షణకుఁగాఁ బ్రాల్మాలి చింతన్ నిరం | 9 |
శ్లేషచేఁ గుకవియందుఁ జోరుని లక్షణముల నారోపించి కవి యుభయులయం దభేదారోప మీ క్రిందివిధముగాఁ జేసియున్నాఁడు.
టీ. భరమై = బరువై, తోఁచుకుటుంబరక్షణకుఁగాన్, ప్రాల్మాలి = శక్తిలేక, చింతన్, నిరం...కాంతారంబునందున్ - నిరంతర = దట్టమయిన, తాళీదళసంపుటప్రకర = తాటియాకుపుస్తకపుఁగట్టలగుం పనెడి, కాంతారంబునందున్ = అడవిలో, అర్థపుందెరువాటుల్ = (ఇతరుల) పదార్థము లనెడుధనములత్రోవలను, తెగి కొట్టి = తెగబాఱి దోఁచికొని, కుకవి కేవలకుటుంబభరణమునకే కవితఁ జెప్పఁబూనినవాఁ డగుటచే నసంఖ్యాకములుగా నున్న తాళపత్రగ్రంథములనుండి పదార్థాదికము గ్రహింపసాహసించును. తజ్‌జ్ఞ...నుండై - తత్‌జ్ఞ = దాని (పద్యార్థములను - సొమ్మును) నెఱిఁగిన,పరిషత్ = సభ్యులచే, విజ్ఞాత = ఎఱుఁగబడిన, చౌర్యక్రియా = దొంగతనముచే, విరసుండై = మర్యాదలేనివాఁడై, పృథ్వీభృత్సమీపక్షితిన్ = రాజసన్నిధానమున, (కొండదగ్గఱ) కుకవి = దుష్కవి, కొఱఁతన్ = హైన్యమను, (కొఱ్ఱున) పడున్. చౌర్యముఁనకు శిక్ష విధించువారు తజ్జ్ఞపరిషత్సభ్యులు. శివస్థానము పృథ్వీభృత్సమీప భూమి. కుకవి తాను మహాకవి నని చెప్పుకొని, సంపాదించుకొన్న గౌరవము కోలుపోవును. చోరుఁడు శిక్షార్థము కొఱ్ఱున దిగఁబడును.
తా. కుకవి (దొంగ) ఆలుబిడ్డలను బోషించుకొనువెరవుఁ గానక కడుపుకక్కుర్తిచేఁ దాటియాకుపుస్తకపుఁగట్టలోని యితరకవులపద్యార్థములను (సొమ్ములను) దొంగిలి తనవిగాఁ బెట్టుకొని వానితత్త్వ మెఱిఁగినవా రవి వెల్లడించినంత మర్యాదఁ గోల్పోయి రాజసాన్నిధ్యమున (పర్వతసన్నిధిని) హైన్యమున (కొఱ్ఱున) జడును. కొఱ్ఱు అనునర్థమున 'కొఱఁతన్' అనుట విచారణీయము. కొఱ్ఱుశబ్దమున కౌపవిభక్తికము 'కొఱఁత' యన నగును. కుకవి యర్థమున నమర్యాదార్థమున కొఱఁత యనవలసివచ్చును గాన నిట సాధుత్వమునకు మార్గము గానరాదు.
అలం. కుకవి చోరుఁడు కుటుంబరక్షణమునకుఁ బ్రాలుమాలి చేయుచేఁతల భేదారోపముగాఁ జెప్పఁబడుటచే నలంకారము సావయవరూపకము. కుకవికిఁ జోరత్వము గమ్యమగుటచే ఏకదేశవివర్తిశ్లేషచే శ్లేషానుప్రాణితమును.
| క. | అని యిష్టదేవతావం | 10 |
టీ. అని, ఇష్టదేవతా...సుకవిస్తుతులు = అభీష్టదాయకులగు వేలుపులయొక్కయు నక్కవులయొక్కయు స్తోత్రము, కుకవితతి నికృతియున్ = దుష్కవిసమూహముయొక్క నిరాకృతియు, చేసి, నవీనకావ్యరచనకున్ = నూతనకావ్యనిర్మాణమునకు, అనుకూలకథల్ = యోగ్యములగు గాథలు, తలంచు నా సమయమునన్ = ఆలోచించుకాలమందు - పైపద్యముతో నన్వయము.
| సీ. | ఉదయాచలేంద్రము మొదల నెవ్వనికుమా | |
| | నావాడపతిశకంధరసింధురాధ్యక్షు | |
| తే. | ప్రబలరాజాధిరాజవీరప్రతాప | 11 |
టీ. ఎవ్వని, కుమారతకున్ = బాల్యమునకు (కుమారస్వామిభావమునకు), మొదలన్, ఉదయాచలేంద్రము = ఉదయగిరిదుర్గము, క్రౌంచాచలరాజము = క్రౌంచమనుపర్వతశ్రేష్ఠము, అయ్యెన్. (కుమారస్వామి క్రౌంచపర్వతమును భేదించెను.) కృష్ణదేవరాయలు కుమారస్వామి క్రౌంచాచలము భేదించినటుల నుదయగిరిదుర్గమును దొలుదొలుత భేదించె నని భావము. ఎవ్వాని, ఖరతరాసికిన్ = మిగులవాఁడి యైనకత్తికి, నావాడపతిశకంధరసింధురాధ్యక్షులు = నావాడదేశపురాజులును, శకంధరదేశపురాజులును; (కళింగపు) గజపతిరాజును, అరిగాఁపులు = పన్ను చెల్లించువారో? శకంధరుఁడనువాఁడు గుజరాతుదేశమును బరిపాలించు శికిందర్ అనునవాబని చరిత్రకారులయూహ. రాయలకాలమున గుజరాతు నీపేరినవాబు పాలించుటచే నీయూహ తగియున్నది. ఆపంచగౌడధాత్రీపదంబు = పంచగౌడదేశముల పర్యంతము గల భూభాగము (గౌడులు, కాన్యకుబ్జులు, సారస్వతులు, ఉత్కలులు, మైథిలులు అని గౌడు లైదు తెగలవారు). ఆసివాఱుగాన్ = స్వారిగా, ఏఁగునట్టిబయలు, అనఁగా: గౌడదేశము తుదదనుకఁ గలదేశ మంతయుఁ గృష్ణరాయనికి వాహ్యాళి వెడలు దేశముగా నయ్యె ననుట. ఆపంచగౌడధాత్రీపదములోని ఆఙ్ కు “ఆఙ్ మర్యాదాభివిధ్యోః" అను పాణినిసూత్రానుసారముగా గౌడదేశమువఱకు నని చెప్ప నగును. గుజరాతుదేశము గౌడదేశమునకుఁ దగిలియున్నదిగాన ఆపంచగౌడ యనుచో గుజరాతుదేశమంతయు ననుట సమంజసము. ఇది రాయల యుత్తరదిగ్విజయయాత్రాసూచనము. ఎవ్వాని, ఘనభుజాదండంబు = దండము వంటిభుజము, సకలయాచకజనాశాపూర్తికిన్ = సమస్తయాచకులయొక్కయుఁ గోరికలను నించుటకు, కల్పశాఖి = కల్పవృక్షయో, ఎవ్వఁడు, ప్రబల...విభ్రాజి - ప్రబల = అధికమైన, రాజాధిరాజ; వీరప్రతాప; రాజపరమేశ (అను) బిరుద(ములచే), విభ్రాజి = ప్రకాశించువాఁడో, అట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుఁడు, ఒక్కనాఁడు, కుతూహలంబు = వేడుక, ఉప్పతిల్లన్.
ఈపద్యమునందు రాయలదుర్గభేదననైపుణ్యము పరరాజ్యాకర్షణప్రతిభాతిశయము విజయయాత్రాసంరంభాదికము దాతృతాతిశయము క్రమముగా వర్ణింపఁబడినవి.
శకంధరపదము శికందర్ అను పారశీకపదమునకు సంస్కృతరూపమై యుండును గాన గుజరాతునవాబగుశికందరు అని కొంద ఱర్థము చెప్పుచున్నారు.
తా. కృష్ణదేవరాయలు మొట్టమొదటఁ గుమారస్వామి క్రౌంచపర్వతమును భేదించినట్టు లుదయగిరిదుర్గమును సాధించి పిమ్మట నావాడపతి మొదలయిన రాజులను దనకుఁ గప్పము కట్టునట్టుగా నొప్పించి హిందూస్థానపర్యంతమైన పంచగౌడదేశముల స్వారి తిరుగుభూములపులె నిష్కంటకముగా నేలి కల్పవృక్షమునువలె యాచకులు కోరినవానినెల్లఁ దనివి తీరనిచ్చి రాజాధిరాజాదిబిరుదములు చెలఁగఁగా రాజ్యము నేలుచుండి యొకనాఁడు వేడుక పుట్టఁగా
అలం. రూపకము, అతిశయోక్తి.
| సీ. | ఇందీవరంబుల నీనుక్రాల్గన్నుల | |
| | బణినసూనుకణాదబాదరాయణసూత్ర | |
| తే. | మూరురాయరగండపెండారమణిమ | 12 |
టీ. ఇందీవరంబులన్ = నల్లగలువలను, ఈనుక్రాల్గన్నుల = కురియుచుఁ బ్రకాశించుకన్నులు గల, శరదిందుముఖులు = శరచ్చంద్రునిఁ బోలు ముఖములుగల స్త్రీలు, పణి...ఫక్కిన్ = పాణినియొక్కయుఁ, గణాదునియొక్కయు, బాదరాయణునియొక్కయు సూత్రములపద్ధతిని (వ్యాకరణతర్కవేదాంతముల త్రోవలను), అభీరు...చాయ - అభీరు = భయములేని, భటకదంబముయొక్క, కరాళ = భయంకరమయిన, హేతి = కత్తులయొక్క, ఛటా = సమూహముయొక్క, ఛాయన్ = కాంతిచే, ఇరులు కొనఁగన్ = చీకట్లు క్రమ్మఁగా, సామంత...మండలంబు - సామంత = స్వతంత్రులగు ప్రక్కరాజులయొక్క, మండన = భూషలయందలి, ఉద్దామ = ఎక్కువయిన (మాణిక్యములయొక్క), అంశుమండలంబు = కాంతిపుంజము, ఒలసి = చుట్టుకొని, ఈరెండ = లేఁతయెండ, కాయన్, మూరు...రింఛోళిన్ - మూరురాయర = ముగ్గురు (అశ్వపతి-గజపతి-నరపతులను) రాజులకు, గండపెండార = నాయకుఁడని తెలుపుపాదాభరణమునందలి, మణిమరీచి = రత్నకాంతులయొక్క, రింఛోళిన్ = సమూహముచే, కలయన్ = అంతటను, అంకపాళి = ఒడియందు, నటద్దుకూలాంచలములు = చలించు తెలిపట్టువలువలచెఱఁగులు, చిత్ర... శ్రీన్ - చిత్ర = చిత్రవర్ణము గలిగిన, మాంజిష్ణ = ఎఱుపు మీఱినపసుపురంగుయొక్క, విభ్రమశ్రీన్ = విలాసమును.
తా. కలువకంటులు చామరములు వీవఁగా విద్వాంసులు వ్యాకరణాదిశాస్త్రమర్యాదల నుపన్యసింపఁగా సామంతరాజులు కొలిచియుండఁగాఁ గాలినున్న మూరురాయరగండపండారమునందలి రత్నకాంతులు ప్రసరించుటచేఁ దాల్చిన తెలిపట్టువలువ చిత్రవర్ణములకు జెందగా. (పైపద్యముతో నన్వయము.)
ఈ పద్యమునందు 'పణినసూనుఁ' డనుపదమునకు సాధుత్వము విచారణీయము. పాణినునపత్యము పాణినియనువ్యుత్పత్తి కలదు గాని పణినుని యసత్యమని చూపట్టదు. శ్రీనాథకవియుు 'పణినాపత్యోక్తశాస్త్రంబులో' అని ప్రయోగించెను. 'ప్రోక్తాల్లుక్, గాథివిదథికేశిగణిపణినశ్చ' ఈసూత్రవృత్తులచే “పణనం పణః...సో౽స్యాస్తీతి పణీ-తస్య గోత్రాపత్యం పాణినః తతో యూర్యపత్యే ఇఞ్ పాణినిః' అని పాణినిశబ్దనిరూపణము కౌముదియందుఁ గలదు. రామభద్రయజ్వయు నిటులె పణికొడుకు పణినుఁడనియు నతనిమనుమఁడు పాణినుఁడనియుఁ బాణినునికొడుకు పాణినియని పతంజలిచరిత్రమునందుఁ జెప్పెను. గాని పణినసూనుపదము సాధుత్వము పణినః + నప్తా అనునెడ నప్తాయనుపదమునుండి “నామైకదేశగ్రహణే రామమాత్రగ్రహణం" అను న్యాయముచే నప్తాపదాదినకారము గ్రహించి పణినసూను అని యాంధ్రకవితాపితామహు:డు ప్రయోగించియుండును. ఇటులె భారవియందు “తవాభిధానాత్” ఆనుచో త. యన తార్‌క్ష్యుఁ డని. వ. యన వాసుకియని మల్లినాథుఁడు వ్యాఖ్యఁ జెప్పెగాన “స్థితశ్చ గతిశ్చింతనీయా” యనుధర్మముచేఁ బైవిధముగాఁ బణినసూనుశబ్దమును సాధువుగా భావింప నగును. ఇట్టిసమర్థనమె శ్రీనాథుని పణినావత్య అనుచో నైషధవ్యాఖ్యాతలు వ్యాఖ్యలో వ్రాసియున్నారు. (శృంగారనైషధము)
అలం. తద్గుణము.
| క. | భువనవిజయాఖ్యసంస | 13 |
టీ. భువన... పీఠిన్ - భువనవిజయాఖ్య = భువనవిజయ మను పేరుగల, సంనద్భవన = సభాగృహమున, స్థిర = ఉన్న, భద్రపీఠిన్ = సింహాసనమందు (సువర్ణపీఠమునందు), ప్రాజ్ఞులగోష్ఠిన్ = పండితులప్రసంగమువలన, కవితామధురిమ = కవితయొక్క మాధుర్యము, డెందము = మనస్సు, తవులన్ = ఆకర్షింపఁగా, కొలువుండి = కొలువుతీఱి కూర్చుండి, సదయతన్ = దయాసహితభావముతో, ననున్ = నన్నుఁ గూర్చి, పల్కెన్ = (ముందుఁ జెప్పఁబోవువిధముగా) పలికెను.
| తే. | సప్తసంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి | 14 |
సప్తసంతానములు కాలవశమున నన్నియు నశించునవె. ప్రపంచమునందు వ్యాప్తి గలది గాన కృతి కట్టినాశనము లేదు. అందుచేఁ గృతి మిగులఁ బ్రశస్తమైనది. సప్తసంతానములలోఁ గృతి ప్రశస్త మనుటకు —
క. "ఇల సప్తసంతతులలో, పలఁ గావ్యము దక్క దేవభవనవనాదుల్
ఖిలములగు కొన్నివర్ణం, బుల కని చంపువు రచించె భోజుం డెఱుకన్.”
సప్తసంతానములు —
క.“తనయుఁడు చెఱువును గావ్యం, బు నిధానము గుడి వనంబు భూదేవస్థా
వనమును ననునియ్యేడుకు, జను శాస్త్రములందు సప్తసంతతు లనఁగన్.”
(అప్పకవీయము)
అలం. ఉపమాలంకారము.
| క. | హితుఁడవు చతురవచోనిధి | 15 |
టీ. చతురవచోనిధివి = నేర్పుగలపలుకులకు గనివంటివాఁడవు. అతుల...యుతుఁడవు - అతుల = అసమానము లయిన, పురాణ (బ్రహ్మపురాణాది కము) ఆగమ (పాంచరాత్రాదికము) ఇతిహాస (భారతాదికము) ములయందలి, కథార్థ = కథాసందర్భములయొక్క, స్మృతియుతుఁడవు = జ్ఞప్తి కలవాఁడవు, ఆంధ్రకవితాపితామహుఁడవు = తెల్గుకవనమునకు బ్రహ్మవు, ఈడు = సాటి, నీకున్ పేర్కొనన్ = ఎన్నుటకు, ఎవరు = ఎవరు కలరు?
| క. | మనువులలో స్వారోచిష | 16 |
టీ. అనఘా = పాపరహితుఁడవగు పెద్దనార్యా! మనువులలోన్ = స్వాయంభువుఁడు మొదలుగాఁ గల పదునలుగురు మనువులలో, స్వారోచిసమనుసంభవము = స్వరోచికుమారుఁ డయిన రెండవమనువుపుట్టువు, రససమంచితకథల = శృంగారాదిరసములతో నొప్పిదము లగుకథలతో, వినన్, ఇంపు = ఇష్టమైనది, కలిధ్వంసకము = పాపమును నశింపఁజేయునది, భవచ్చతురరచనకు = ఇంపైన నీకూర్పునకు, అనుకూలము = తగినది.
| వ. | కావున మార్కండేయపురాణోక్తప్రకారంబునం జెప్పు | 17 |
టీ. కావునన్, మార్కండేయపురాణోక్తప్రకారంబునన్ = మార్కండేయపురాణమునందుఁ జెప్పఁబడినరీతిగ, చెప్పమని = ప్రబంధము రచింపు మని, కర్పూరతాంబూలంబు = పచ్చకప్పురము లోనగు సుగంధవస్తుమిశ్రతాంబూలంబును, పెట్టినన్ = ఈయఁగా, మోదంబునన్ = సంతసముతో, మహాప్రసాదం బని = గొప్పయనుగ్రహ మని, పట్టి = పరిగ్రహించి, అమ్మహాప్రబంధనిబంధనంబునకు = ఆమహాకావ్యరచనమునకు, ప్రారంభించితిన్ = పూనుకొంటిని, ఏతత్కథానాయకరత్నం బగు = ఈకృతికిఁ బతి యగు, అమ్మహీనాథు వంశావతారము = ఆకృష్ణదేవరాయల వంగడపుఁ బుట్టుక, ఎట్టి దనినన్.
మహాకావ్యలక్షణము ఇరువదిరెండు వర్ణనములు —
సీ. “పురమును ఋతుషట్కమును బ్రయాణంబును
శైలంబు వేఁటయు సాగరంబు
మౌనీంద్రపుణ్యాశ్రమంబును మంత్రంబు
ద్యూతంబు పిదప నద్భుతరణంబు
విజయంబు మద్యపానజవికారంబును
వనవిహారంబును వారికేళి
కన్యాంగసౌందర్యకథనంబు హిమకరా
భ్యుదయంబు విప్రలంభోదితంబు
తే. పద్మమిత్రోదయంబును బరిణయంబు
సురతమును దౌహృదంబును సుతజననము
ననఁగ నిరువదిరెండువర్ణనలు గూర్చి
చెప్పవలయుఁ బ్రబంధము శ్రీనివాస.”
(అప్పకవీయము)
| సీ. | కలశపాథోరాశిగర్భవీచిమతల్లి | |
| తే. | నతఁడు వొగడొందు మధుకైటభారిమఱఁది | 18 |
టీ. కలశ...మతల్లి - కలశపాథోరాశి = పాలసముద్రముయొక్క, గర్భవీచిమతల్లి = నడిమి దగుమేల్మికరఁగ (పాలసముద్రమునఁ బుట్టినవాఁ డనుట), అనలా...టికిన్ - అనలాక్షు = శివునియొక్క, ఘనజటా = పెంజడలను, వనవాటికిన్ = తోఁటపట్టునకు, వన్నె వెట్టు = అలంకారము నొసఁగు, అనార్తవంపుఁబువ్వు = ఋతుసంబంధము లేని పుష్పమో (ఆయాఋతువులందుఁ గలుగునదిగాక సర్వకాలము నుండునది యనుట). సకల...ర్తికిన్ - సకలదైవత = ఎల్లదేవతలయొక్క, బుభుక్షా = ఆఁకలియొక్క, పూర్తికిన్ = తీఱుటకు, పుట్టు = మొలక, కానని, మేనిమెట్టపంట = దేహరూపమగు మెరకపంటయో (మెట్టపంట వర్షాద్యావశ్యకము లేమిచే నెప్పుడును పండునది) చంద్రుఁడు దేవతల కాహారము, కటికి..గిలిగింత - కటికిచీకటి = గాఢాంధకారము, తిండి = భోజనముగాఁ గల (చీకటిని మ్రింగివేసెడు), కరముల = కిరణముల (చేతుల), గిలిగింతన్ = చక్కిలిగిలిచే, తొగకన్నెన్ = కలువయను జవ్వనిని, మధుకైటభారిమఱఁది = విష్ణునకుఁ బెండ్లముతోఁ బుట్టువు, కళలనెలవు = పదునాఱుకళలకుఁదావు, మిసిమిపరసీమ = కాంతికిఁ బరమావధి, వలరాజు = మన్మథునకు, మేనమామ, వేవెలుంగులదొరజోడు = సూర్యునకు జతకాఁడు, రేవెలుంగు = రాతిరిఁ బ్రకాశించువాఁడు, చంద్రుఁడు.
విశ్వకర్మ యబ్ధియందు జనించిన యమృతమును బోసియుంచుట కొకకలశమును సృజించెను. ఆకలశమునకు సంబంధించినదిగాన పాలకడలిని గలశపాథోరాశి యందురు.
శ్లో. “సాగరే మధ్యమానే తు పీయూషార్థం సురాసురైః
పీయూషధారణార్థాయ నిర్మితా విశ్వకర్మణా
కలాకలాస్తు దేవానా మసితాస్తాః పృథక్ పృథక్
యతః కృతాస్తు కలశా స్తతస్తే సంప్రకీర్తితాః."
(కాళికాపురాణము)
చీకటిపదమును సార్ధబిందుకముగా నిప్పటివారు వ్యవహరించుచున్నారు. గాని ప్రయోగములందు అరసున్న జూపట్టదు. చూడుఁడు.
క. "...ఏక తమయజినరత్నము, చీకటి నొకనాఁడు దెచ్చి."
(ఆ-6, ప-99)
ఉ. "మీకృపఁ గోరి భూరుహసమీపముఁ జేరితి...
చీకటిరాత్రి నాగ హరిసింధుర....”
(దశకుమారచరిత్రము. ఆ-7, ప-4)
అలం. పర్యాయోక్తి రూపకాతిశయోక్తులు.
| తే. | ఆసుధాధామువిభవమహాంబురాశి | 19 |
టీ. ఆసుధాధాము = ఆచంద్రునియొక్క, విభవ = సంపద యనెడు, మహాంబురాశికి = గొప్ప సంద్రమునకు, ఉబ్బు = అతిశయము, వేద...ధరుండు - వేద = నాల్గు (ఋగ్యజుస్సామాథర్వములను) వేదములయొక్కను, వేదాంగ = ఆఱు (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము నను) వేదాంగములయొక్కయు, శాస్త్ర = మీమాంసాదిశాస్త్రములయొక్కయు, అర్థ = అభిప్రాయమునందలి, (అర్థములయొక్క), విశద = విస్పష్టమయిన, వాసనా = ఎఱుకచే, ఆత్త = పొందఁబడిన, ధిషణా = బుద్ధియందు, ధురంధరుండు = బరువు మోసిన వాఁడు, ప్రవీణుఁ డనుట. ఐన బుధుఁడు = అయి యొప్పునట్టి బుధుఁ డనువాఁడు, ఉదయమయ్యెన్ = జనించెను. (బుధనామ మిట నన్వర్థనామధేయముగా గ్రహింపనగును.)
తా. ఆచంద్రునకు వేదవేదాంగాదివిద్యల నేర్చిన బుధుఁడు కుమారుఁ డయ్యె.
| క. | వానికిఁ బురూరవుఁడు ప్ర | |
| | జానికి నాయువు తనయుం | 20 |
టీ. వానికిన్ = ఆబుధునకు, ప్రజ్ఞానిధి = బుద్ధికి గనివంటివాఁడును, సింహసదృశుఁడు= (పరాక్రమమునందు) సింహముతో సమానుఁ డగు, పురూరవుఁడు, ఉదయించెన్ = జనించెను. తద్భూజానికిన్ = ఆరాజునకు, ఆయువనువాఁడు, తనయుండై = కొమారుఁడై, నెగడెన్ = అతిశయించెను. అతఁడు = ఆయువు, యయాతినరేంద్రున్ = యయాతిమహారాజును, కనెన్ = కనియెను.
వ్యాకరణము. భూజాని యన్నపుడు భూమియే జాయగాఁ (భార్యగాఁ) గలవాఁడని యర్థము. బహువ్రీహిని జాయాశబ్దంబు జానియగు (బాలవ్యా.)
తా. బుధునకుఁ బురూరవుఁడు నాతనికి నాయువు నాతనికి యయాతి యనియు జనించిరి.
| క. | అతనికి యదుతుర్వసు లను | 21 |
టీ. అతనికిన్, అహితసూదనులు = వైరులను బరిమార్చువారు, కళాన్వితమతులు = విద్యలతోఁ గూడినచిత్తము కలవారు, అయిన, యదుతుర్వసులు = యదుఁడు తుర్వసుఁడు, అను సుతులు = అనుకొమారులు, ఉద్భవమొందిరి = పుట్టిరి. వారిలోన్, తుర్వసుఁడు, గుణనిధియై = మంచిగొనముల కునికిపట్టయి, విశ్రుతకీర్తిన్ = ప్రఖ్యాతయశమును, వహించెన్ = పొందెను.
| తే. | వానివంశంబు తుళువాన్వవాయ మయ్యె | 22 |
టీ. వానివంశము= ఆతుర్వసునివంశము, తుళువాన్వవాయము = తుళువవంశము, అయ్యెన్ = ఆయెను, అందున్, పెక్కండ్రునృపులు = పెక్కుమంది రాజులు, ఉదయ మొంది = జన్మించి, నిఖి...కీర్తిన్ - నిఖిలభువన = ఎల్లలోకములందును, ప్రపూర్ణ = నిండిన, నిర్ణిద్ర = విజృంభించు, కీర్తిన్ = కీర్తిచే, తదీయాన్వయమునన్ = ఆతుళువరాజులవంశమున, అధికులైరి = గొప్పవా రైరి. తదీయాన్వయమునన్ = ఆతుళువరాజసంబంధ మగువంశమునందు, పుట్టి = జన్మించి, ఈ పద్యమునకుఁ గర్త ముందుపద్యమునందలి తిమ్మక్షితీశాగ్రణి.
తా. తుర్వసునివంశమునే తుళువవంశ మని వ్యవహరింపసాగిరి. ఆవంశమునందు జనియించి యసంఖ్యాకులగు రాజులు నిరుపమానయశముచే సుప్రసిద్ధిఁ గాంచిరి. ఆవంశమునందు,
వ్యా. కీర్తిన్ అనుచో ద్వితీయకుఁ దృతీయార్థము. జడంబు తృతీయాసప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు. (బాలవ్యాకరణము.)
| మహాస్రగ్ధర. | ఘనుఁ డై తిమ్మక్షితీశాగ్రణి శఠకమఠగ్రావసంఘాతవాతా | 23 |
టీ. తిమ్మక్షితీశాగ్రణి తిమ్మరాజశ్రేష్ఠుఁడు, శఠ...జాటముల్ - శఠ = కపట మగు, కమఠ = తాఁబేటియొక్కయు (కూర్మావతారపు విష్ణునియొక్క), గ్రావసంఘాత = కొండలగుంపులయొక్కయు, వాతాశన, రాట్ = ఆదిశేషునియొక్కయు, ఆశాంతదంతి = దిగ్గజములయొక్కయు, స్థవిరకిరుల = ఆదివరాహముయొక్కయు, జంజాటముల్ = తగులములు, దోర్దండైకపీఠిన్ = భుజదండ మను ప్రధానపీఠమున, తిరముపఱచి = స్థిర పఱిచి, కీర్తిద్యుతుల్ = యశఃకాంతులు, రోదసిన్ = పృథివ్యాకాశలందు, ఆరాతుల్ = శత్రులు, నమ్రులై = వంగినవారై, పార్శ్వముల = ప్రక్కలను, తీవ్రప్రతాపంబు = వాఁడియైన పరాక్రమములు, చూపెన్ = కనఁబఱచెను.
కూర్మము, గ్రావసంఘము, ఆదిశేషువు, కిరులు మోయఁజాలని భూభారము మోయుటయు నందు దోర్దండపీఠిని భరించుటయుఁ దదతిశయప్రజ్ఞాశాలి యనుట. కీర్తిద్యుతులు లోకమంతయు వ్యాపించినమాత్రన విరోధులు లొంగరు. వారిని లొంగఁదీయుటకుఁ బ్రతావంబుఁ జూపెను. నిగ్రహానుగ్రహసమర్థుఁ డని భావము.
తా. తిమ్మరాజు కూర్మాదులయెడ తెగని తగులపుబాఁదఱను మాన్పి భూమిని దనబాహుపీఠమునందే నిల్పుకొని భరించుచుఁ దనకీర్తి లోక మెల్ల నిండారఁగా, విరోధిరాజులు ప్రక్కల నడఁగి యుండఁగా మిక్కిలి పరాక్రమమున నెగడెను.
అలం. అతిశయోక్తి.
| క. | వితరణఖని యాతిమ్మ | 24 |
టీ. వితరణఖని దానమునకు గని యయిన, ఆతిమ్మక్షితిపగ్రామణికి = ఆతిమ్మరాజశ్రేష్ఠునకు, దేవకీదేవికిన్ = దేవకి యనుపేరు గలరాణికి, అంచితమూర్తి = ఒప్పిదమగునాకారము గలవాఁడు, సజ్జనావనపరుఁడై = సత్పురుషుల రక్షించుటయం దాసక్తి గలవాఁడై, ఈశ్వరప్రభుఁడు = ఈశ్వరరాజు, పుట్టెన్ = జనించెను.
అలం. ఉపమాలంకారము.
| చ. | బలమదమత్తదుష్టపురభంజనుఁడై పరిపాలితార్యుఁడై | |
| | జలరుహనేత్రలన్ దొఱఁగి శైలవనంబుల భీతచిత్తు లై | 25 |
టీ. బల...భంజనుఁ డై - బల = చతురంగబలముయొక్క (మదముచే), మత్త = మదము గొన్న, దుష్ట = చెడ్డరాజులయొక్క (చెడ్డరక్కసులయొక్క), పుర = పట్టణములను (త్రిపురములను), భంజనుఁ డై = నాశము చేసినవాఁడై, పరిపాలితార్యుఁడై = పాలింపఁబడిన పెద్దలు గలవాఁడై (పాలింపఁబడిన పార్వతి గలవాఁడై), తొంటియీశ్వరుఁడె = మునుపటి శివుఁడె, ఇలపయిన్, ఈశ్వరుఁడై = ఈశ్వరరాజయి, జనియింపన్ = పుట్టఁగా, పరిపాలితార్యుఁ డనునపుడు పరిపాలింపఁబడిన యార్యులు గలవాఁడు గాన నార్యులను బాలించువాఁ డని యీశ్వరరాజు పరముగాను, బాలింపఁబడిన యార్య = పార్వతి గలవాఁడు గానఁ బార్వతీపతియగు శంకరుఁ డని యీశ్వరునిపరముగను నర్థము సాధించునది. జలరుహనేత్ర = తామరలవంటికన్నులు గలస్త్రీలను, తొఱఁగి = త్యజించి, శైలవనంబులన్ = పర్వతములందును, అడవులందును, భీతచిత్తులై = భయంపడినహృదయము గలవారై, మన్మథాంకముల్ = మన్మథచిహ్నములు - కామవికారములు, రూపఱెన్ = నశించెను.
ఈశ్వరుఁడు తనకంటిమంటచే మన్మథునిఁ గాల్చి భస్మము చేసినవాఁడు గావున నీశ్వరజననముచే మన్మథాంకములు నశించుట సాజమె యని భావము.
తా. దుష్టులగు రక్కసులయొక్క పురములు మూటిని బరిమార్చి యార్యను బరిపాలించిన వెనుకటి యా యీశ్వరుఁడే, మరల నిప్పు డీశ్వరరాజై జనియించి శత్రురాజుల పట్టణములను ధ్వంసపఱిచి యార్యులను బరిపాలించుచుండఁగా నాలుబిడ్డలను వదలి కొండలను నడవులను బీతుగొని తిరుగాడుచుండు శత్రురాజుల దేహములందు మన్మథవికారములు నశించెను.
అలం. రూపకము.
| సీ. | నిజభుజాశ్రితధారుణీవజ్రకవచంబు | |
| తే. | డని జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె | 26 |
టీ. ధరణి...శ్వరుండు - ధరణిధవ = రాజులచే, దత్త = ఈయఁబడిన, వివిధ(ములగు) ఉపదా = కానికలయొక్క, విధా = రీతిచే, సమార్జిత = సంపాదింపఁబడిన, శ్రీ = సంపదచే, వినిర్జిత = జయింపఁబడిన, నిర్జరాలయేశ్వరుఁడు = ఇంద్రుఁడు గలవాఁడు (నానారాజులచేఁ గానికలుగా సమర్పించఁబడు సంపదలభోగముచే నింద్రుని మించినవాఁ డనుట. తిమ్మభూపాలుఁడు సమస్తదిక్కులను జయించి రాజుల నందఱ సామంతులను జేసికొనుటచే వారివలన నమస్తసత్కృతు లొందఁగలిగెను. ఇందుచేఁ దిమ్మభూపాలుని భాగ్యాతిశయము పరాక్రమము సువ్యక్తమగును.) నిజ...చంబు - నిజ = తనయొక్క, భుజ = భుజమును, ఆశ్రిత = ఆశ్రయించిన ధారుణీ = భూమికి, వజ్రకవచంబు = వజ్రమణిరచిత మైనయంగరక్ష యగువాఁడును, (వజ్రకవచము భేదింపరానిది) తాను రాజుగా నున్నంతకాలము పరరాజు లెవరును రాజ్యాపేక్షచేఁ దల యెత్తఁజాలరై రని భావము. దుష్ట...కుండు - దుష్ట = దుర్మార్గు లనెడు, భుజంగ = పాములకు, అహితుండికుండు = పాములవాఁ డగువాఁడును, వన...హరుండు - వనజేక్షణా = తమ్మికంటులయొక్క, మనోధన = చిత్త మను సొమ్మునకు, పశ్యతోహరుండు = చూచుచుండఁగనే దొంగిలించుగడిదొంగ, అరి...మంబు అరి = శత్రువు లనెడు, హంస = అంచలయొక్క, సంపత్ = సముదాయమునకు, అభ్రాగమంబు = వానకాలమును, (వర్షకాలమున నంచలు క్రౌంచనగగుహామార్గమును నాధారముఁఁ జేసికొని మానససరోవరమున కేఁగునని చెప్పుదురు. అందుచే వర్షర్తు వంచలకు వినాశనకరము.) మార్గణ...దివసంబు - మార్గణగణ = యాచకసమూహ మనెడు, పిక = కోకిలలకు, మధుమాసదివసంబు = వసంతకాలపుదిన మైనవాఁడును, గుణ...రము - గుణ = సద్గుణము లనెడు, (రత్నములకు), రోహణక్షోణిధరము = రోహణపర్వత మగువాఁడును, (రోహణాచలమున రత్నములు మెండుగా జనించును.) బాంధవసందోహ = చుట్టములప్రో వనెడు, పద్మవనీ = తామరతోఁపునకు, హేళి = సూర్యుఁ డగువాఁడును, కారు...త్రుఁడు - కారుణ్యరస = దయారసమునకు, నిమ్నగాకళత్రుఁడు = సముద్ర మగువాఁడును, అనన్ = అనునట్లు, జగంబున్ = లోకములందు, మిగుల = అధికముగా, ప్రఖ్యాతిన్ = ప్రసిద్ధిని, కాంచెన్ = పొందెను.
అలం. రూపకోల్లేఖములు.
| క. | ఆయీశ్వరనృపతికిఁ బు | 27 |
టీ. ఆయీశ్వరనృపతికి, పుణ్యాయతమతి = పుణ్యములచే నతిశయించిన బుద్ధి గలది, ఐన బుక్కమాంబకున్, తేజః+తోయజహితులు = ప్రతాపమునందు సూర్యులును, ధీయుతులు = బుద్ధిశాలురును నగు, నారసింహ తిమ్మనరేంద్రుల్ = నరసింహభూపాలుఁడు, తిమ్మభూపాలుఁడును, ఉదయించిరి = జనించిరి.
| క. | అందు నరసప్రభుఁడు హరి | 28 |
టీ. అందున్ = వారిలో, నరసప్రభుఁడు, హరిచందన...కందరుఁడై - హరిచందన = శ్రీగంధముతోడను, మందార = కల్పవృక్షముతోడను, కుంద = మల్లెపూవులతోడను, చంద్రాంశు = వెన్నెలతోడను, నిభ = సమాన మగు, అస్పంద = కదలిక లేని, యశః = కీర్తిచే, తుందిల = నిండారిన, దిక్కందరుఁడై = దిక్కు లనెడుగుహలు గలవాఁడై, కలుషములు = పాపములు, అడఁగన్ = నశించునట్టు, ధాత్రి యేలెన్ = భూమిని పాలించెను.
అలం. ఉపమాతిశయోక్తు లలంకారములు.
| ఉ. | శ్రీరుచిరత్వభూతిమతిజిత్వరతాకృతిశక్తికాంతులన్ | 29 |
టీ. ధీనిధి = బుద్ధికి గని యగు, ఈశ్వరనారసింహుడు = ఈశ్వరరాజు కుమారుఁ డైననరసింహరాయలు, శ్రీరుచిరత్వ...తుల - శ్రీరుచిరత్వ = లక్ష్మీచే భాసిల్లుటచేతను, భూతి = ఐశ్వర్యముచేతను, మతిజిత్వరతా = బుద్ధిచే జయించు స్వభావముచేతను, ఆకృతి = ఆకారముచేతను, శక్తి = సామర్థ్యముచేతను, కాంతులన్ = చక్కఁదనముచేతను, ధీరత = ధైర్యముచేతను, సారభోగములన్ = బలముచేతను, అనుభవముచేతను, వారిజనాభశంకరులన్ = విష్ణువును, శివుని, వారికుమారులన్ బ్రహ్మను, కుమారస్వామిని, వారి తమ్ములన్ = మన్మథుని, వీరభద్రుని, వారియనుంగుమామలను = చంద్రుని, మైనాకుని, వారివిరోధులన్ = రాహువును నింద్రుని, పోలున్.
ఈశ్వరనారసింహుఁడు గాన నతఁడు సర్వవిధముల శివలక్షణములు విష్ణులక్షణములు గలవాఁడై యుండెను. కాననే శివవిష్ణువుల మహాశక్తులె గాక వారిసంబంధులయు విరోధులయు శక్తిసామర్థ్యములు గూడఁ గలిగియుండెను. ఇం దీశ్వరనారసింహుని లక్ష్మీసమృద్ధ్యాదు లభివర్ణితములు.
తా. నరసరాజు లక్ష్మీసంపన్నతచే విష్ణుమూర్తిని, ఐశ్వర్యముచే శివుని, బుద్ధిచే బ్రహ్మదేవుని, జయించుస్వభావమునఁ గుమారస్వామిని, ఆకారమున మన్మథుని, శక్తిచే వీరభద్రుని, గాంతిచేఁ జంద్రుని, ధైర్యమున మైనాకపర్వతమును, చేవచేత రాహువును, భోగములచే దేవేంద్రునిఁ బోలును.
అలం. ఉపమ. యథాసంఖ్యము.
| సీ. | అంభోధివసనవిశ్వంభరావలయంబుఁ | |
| తే. | నతిశితకృపాణకృత్తమత్తారివీర | 30 |
టీ. అతిశిత...శ్వరుండు — అతిశిత = మిగుల వాఁడి యగు, కృపాణ = కత్తిచే, కృత్త = తెగనఱకఁబడిన, మత్త = మదించిన, అరివీర = శత్రువీరు లైన, మండలేశ = రాజులయొక్క, సకుండల = కుండలములతోఁ గూడిన, మకుట = కిరీటములు గల, నూత్న = క్రొత్త నయిన, మస్తమాల్య = శిరోమాలికలయొక్క, పరంపరా = సమూహ మను, మండన = అలంకారములచే, అర్చిత = పూజింపఁబడిన, ఈశ్వరుండు = శివుఁడు గలవాఁడు, శంకరుఁడు తలపుఱ్ఱెలు దండగాఁ గలవాఁడు. అవియు మిగులఁ బాఁతవిగాన ఈశ్వరనారసింహుఁడు విరోధిరాజులఁ జంపి వారికుండలాలంకృతశిరస్సులు గ్రొత్తమాలికలుగా శివునికంఠమున నలంకరించి పూజించెననుట. అంభోధి...యంబు - అంభోధి = సముద్రమే, వసన = వస్త్రముగా గల, విశ్వంభరావలయంబున్ = భూమండలమును, తనబాహుపురిమరతకము = తనభుజకీర్తులకు మరకతమణినిగా, చేసెన్ = ఒనరించెను. భుజకీర్తులందు మణిని భరించుట యెంతచులకనయో నరసరాజునకు భూభారము అంత తేలికగ నుండెను. అశ్రాంత...క్ష్మికిన్ - అశ్రాంత = ఎడతెగని, విశ్రాణన = దానమనెడు, ఆసార = ఎడతెగక కురియుధారావర్షముయొక్క, లక్ష్మికిన్ = కల్మికి, కవికదంబమున్ = కవిసముదాయమును, చాతకములన్ = చాతకపక్షులను, (చాతకములు మేఘదత్తనుగు నుదకమునకై కాచికొని యుండును. దానిఁ దక్క నితరజలము నవి కైకొనవు. అటులె కవులు గూడ నరసరా జొసంగు దానములచేఁ దృప్తి నొంది యాచ్నావృత్తిని మొదలంట మాని రని భావము. కకుబం...రంబు - కకుబంత = దిగంతములందలి, నిఖిలరాట్ = ఎల్లరాజులయొక్క, నికరంబు = సమూహమును, చరణ...లను - చరణమంజీరంబు= కాలియందెను (జెక్కఁబడిన) సాలభంజికలను = బొమ్మలను, (తనకు నోడిన నానాదేశపురాజులను దన కాలిగండపెండేరమునఁ జెక్కించెననుట) రాజులు బలవద్విరోధుల వధించినపుడు క్రోధము చల్లారక వారిబొమ్మలు చెక్కించి కాలికడియములందుఁ దాల్చుట కలదు. ఇందులకుఁ బ్రమాణములు —
సీ. “డాకాలిగండపెండారంబునందున బొమ్మలై వైరిభూభుజులు వ్రేల”
సీ. జేజేలయెకిమీలఁ జెక్కినగండపెండారంబు పదమున న్గండుమీఱ"
(దశావతారచరిత్రము)
తా. నరసరాజు విలాసముగా భూమిని భరించి పాలించె ననియుఁ గవుల నెడతెగక మనిచె ననియుఁ దనకోడినరాజులను గాలియందెయందు బొమ్మలఁగాఁ జెక్కించె ననియు, ఎల్లలోకములను దనయశము నించె ననియుఁ దెగ నఱకిన విరోధిరాజుల తలలచేఁ గపాలమాలాధారి యగు పరమేశ్వరు నర్చించె ననియుఁ దాత్పర్యము.
అలం. రూపకము. అతిశయోక్తి.
| తే. | ఆనృసింహప్రభుండు తిప్పాంబవలన | 31 |
టీ. ఆనృసింహప్రభుండు = ఆనరసరాజు, తిప్పాంబవలన్, వీరనరసింహరాయ భూవిభునిన్, నాగమాంబిక వలనన్, అచ్యుతాంశసంభవున్ = విష్ణుఅంశవలన జనించిన, కృష్ణరాయక్షితీంద్రు = శ్రీకృష్ణదేవరాయలు, అను, నందనులన్ = కుమారులను, కాంచెన్ = కనియెను.
తా. అనరసరాజు తిప్పాంబ నాగమాంబ యనునిర్వురు భార్యలయందు వీరనరసింహరాయఁడు కృష్ణరాయఁడు ననునిర్వురు కొమరులఁ బడసెను. అందుఁ గృష్ణరాయలు విష్ణ్వంశసంభూతుండు.
| క. | వీరనృసింహుఁడు నిజభుజ | 32 |
టీ. నిజ...రారి - నిజ = తనయొక్క, భుజ = బాహువునందున్న, దారుణ = తీక్ష్ణమైన, కరవాల = కత్తియొక్క, పరుష, తీవ్రమైన, ధారా = వాయిచే, హత = చంపఁబడిన, వీరారి = శూరు లగుశత్రువులు గలవాఁడు, అవారణమహిమన్ = ఆటంకము లేని ప్రతాపముచే, ఏకాతపవారణముగన్ = ఏకఛ్ఛత్రాధిపత్యముగా, వీరనృసింహుఁడు = వీరనరసింహరాయలు, ధరన్ = భూభాగమును, ఏలెన్ = పరిపాలించెను.
తా. వీరనరసింహరాయలు కరవాలముచే విరోధులనందఱను ఖండించి ఏకచ్ఛత్రాధిపత్యముగ నిఖిలభూమండలము నిరాటంకముగాఁ బాలించెను.
| క. | ఆవిభుననంతరంబ ధ | 33 |
టీ. ఆవిభుననంతరంబ = ఆవీరనరసింహరాయల పిమ్మట, కృష్ణరాయఁడు, చిన్నాదేవియున్, శుభమతి = యోగ్యమగు బుద్ధిగలది యగు, తిరుమలదేవియున్, తనకున్, కూర్చుదేవేరులుగాన్ = ప్రియమైన పట్టపురాణు లైయుండ, ధరావలయమున్ = భూచక్రమును, తాల్చెన్ = భరించెను.
తా. వీరనరసింహరాయల యనంతరము కృష్ణదేవరాయలు చిన్నాదేవియు తిరుమలదేవియుఁ బట్టపురాణులై యుండ రాజ్యభారము వహించెను.
| సీ. | తొలగెను ధూమకేతుక్షోభ జనులకు | |
| | నాబాలగోపాల మఖిలసద్వ్రజమును | |
| తే. | బ్రజల కెల్లను గడు రామరాజ్య మయ్యెఁ | 34 |
టీ. చారుసత్త్వాఢ్యుఁడు = ఒప్పిద మగుబలముగల, ఈశ్వరనారసింహభూవిభునికృష్ణరాయఁడు - ఈశ్వరరాజుకొడు కగునారసింహరాయని పుత్రుఁడు కృష్ణరాయఁడు, అభ్యుదయము = ఉచ్చస్థితిని, పెంపు = అభివృద్ధి, మీఱంగన్ = అతిశయింపఁగా, ధూమకేతుక్షోభ = తోఁకచుక్కలవలనియాపద, (తోఁకచుక్కలరాక యవద్రవకర మని కలదు). అతివృష్టిదోషభయంబు = అధికవర్షములవలని దిగులు, కంటకాగమభీతి = క్షుద్రవిరోధులరాకవలని భయము, (దోఁపిడిగాండ్రవలనిభయము), ఉద్ధత...కటకంబు - ఉద్ధత = అతిశయించిన, భూమిభృత్ = రాజులయొక్క, కటకంబు = రాజధాని, ఎత్తు వడియెన్ = బీదపడెను. ఆఅఘస్ఫూర్తి = పాపపుహెచ్చు, మరుభూములందును = నిర్జలప్రదేశములందును, (నెలకు మూఁడేసివానలు కురియుటచే దేశమున క్షేమమును సుభిక్షమును గల్గు నని కలదు.) ఆబాలగోపాలము = పిల్లలు గొల్లలు మొదలుకొని, అఖిలసద్వ్రజమును = సమస్తసత్పురుషులసమూహమును, ఆనందమునన్ = సంతోషముతో, మన్కిన్ = బ్రదుకుటచే, రామరాజ్యము = రామునిరాజ్యమును బోలురాజ్యము (రామరాజ్యమున దేశమున కెట్టియసౌఖ్యములు కలుగకుండెను. కృష్ణరాయనికాలమునను రాజ్య మట్టి దయ్యె ననుట.) అయ్యెన్ = ఆయెను.
ధూమకేతువు లనిష్టసూచకము లనుటకు —
"ఉక్తవిపరీతరూపో న శుభకరో ధూమకేతురుత్పన్నః,
ఇంద్రాయుధానుకారీ విశేషతో ద్విత్రిచూళో వా."
ఈమొదలగు ప్రమాణములచేఁ దోఁకచుక్కలు అనిష్టసూచకము లనుట స్పష్టము.
తా. కృష్ణదేవరాయలు భూమండలము పాలించునపుడు ప్రజ లందు సుఖించిరి. సకాలమునందు వానలు గుఱియుటచే భూమి సస్యసమృద్ధిచే రాణించెను. ప్రజలజీవితము సౌఖ్యవంత మయ్యెను. ఇంతయేల రాయలరాజ్యకాలమునందుఁ బ్రజలు రామరాజ్యమునందువలె సుఖించిరి.
| మ. | అలపోత్రిప్రభుదంష్ట్ర భోగివరభోగాగ్రాళిఱా లుద్భటా | 35 |
టీ. భూకాంతకున్ = భూదేవికి, అల...దంష్ట్ర = ఆయాదివరాహమూర్తియొక్క కోఱయు, భోగి...ఱాలు - భోగివర = ఆదిశేషుని, భోగాగ్ర = పడగమీఁద నున్న, ఱాలు = ఱాళ్లును (మణులును), ఉద్భ...కోటి - ఉద్భట = అతిశయించిన, అచల = పర్వతములయొక్క, కూట = శిఖరములందలి, ఉపల = ఱాళ్లయొక్క, కోటి = సమూహమును, రూపుచెడన్ = అందము చెడునట్లు, నిచ్చల్ = ఎప్పుడును, రాయఁగాన్ = ఒరయంగా, ఐనమొక్కలు = ఏర్పడిన గంట్లు, నరస...బునన్ = సరసక్ష్మాపాలునికొమరుఁడైన శ్రీకృష్ణరాయలయొక్క, బాహా = భుజమందలి, మృగనాభి = కస్తూరిచేతను, సంకుమద = జవాజిచేతను, సాంద్ర = చిక్కనయిన, ఆలేప = పూఁతయొక్క, పంకంబునన్ = బురదచే, నున్ననయ్యెన్ = నునుపయ్యెను.
పందికోఱ పదనైనది. ఱాలు కఠినమైనవి. శిలాకోటిగూడఁ గఠినములె. వీనియొఱయిక యసామాన్యమైనది గాన భూకాంత కందము చెడి గంట్లు పడెను. సంకుమదము కస్తూరి కలిపిన బురదవలె నగును. భూమిపైఁ గల గండ్లు మట్టితోఁ బూడ్చుచున్నటుల భూకాంతగంట్లు కస్తూరికాద్యాలేపములతో రాయలు నివారించెనని భావము. రాయల మైపూఁత సాంద్రము, పంకమువంటిదిగాననే భూకాంతమేను నున్న నయ్యెను.
తా. అంతవఱకును ఎడతెగక భరించుచున్న యాదివరాహమూర్తియొక్క కోఱ, ఆదిశేషునిపడగలమీఁదిఱాళ్లు, కులపర్వతశిఖరములమీఁదిశిలలు, ఒరసి గం ట్లేర్పడి రూపు చెడియున్న భూదేవి, నాకృష్ణరాయఁడు తనభుజముననే తాల్చుటచే నచటఁ బూయఁబడిన సుగంధిచందనము చిక్కగ నంటి గంట్లు పూడి యాభూదేవి సవర నయ్యెను. భూమి నాతఁడు నిర్బాధముగాఁ బరిపాలించె ననుట.
అలం. అతిశయోక్తి.
| ఉ. | క్రూరవనేభదంతహతకుడ్యపరిచ్యుతవజ్రపంక్తిఁ బొ | 36 |
టీ. కృష్ణ... ణంబులన్ - కృష్ణరాయఁ (డనెడు), మహికాంతుని = రాజుయొక్క, శాత్రవపట్టణంబులతోన్ = శత్రుపురములందు, క్రూర...పంక్తిన్ - క్రూర = కఠినములయిన, వనేభదంత = అడవియేనుఁగులకొమ్ములచే, హత = కొట్టఁబడిన, కుడ్య = గోడలనుండి, పరిచ్యుత = రాలిన, వజ్రపంక్తి = వజ్రములప్రోవును, పొల్పారు = ఒప్పునట్టి, మిడుంగుఱుంబురువులు = మిణుఁగుఱుఁబురుగులు, వెసన్ = శీఘ్రముగా, శృంగారవనద్రుమాళిన్ = ఉద్యానవనములందలి చెట్లయందు, గిజిగాఁడులు = బంగారుపిచ్చుకలు, దీపికల్ గాన్ = దీపములుగా, రహిన్ = ఆసక్తితో, చేర్చున్ = పెట్టును. (గిజిగాండ్లు గూండ్లలో వెలుతురుంటకు మెఱుఁగుడుపుర్వులఁ గొనిపోయి పెట్టుకొను ననుట ప్రసిద్ధము.)
రాజులు భోగపురుషులుగాన గోడలకు రత్నములు చెక్కిరి. మిగులదృఢమైన వైనను దుష్టములగు వనగజములకోఱపోటున కవి రాలినవి. శాత్రవ పట్టణములు పాడుపడుటచే నేనుఁగులు గోడల గోరాడుటకు రత్నములఁ బక్షు లేరుటకు నవకాశము చిక్కెను. (రత్నములు దీపికలు. ఇవి రక్తవర్ణవస్తుగణము లోనివి.)
తా. కృష్ణరాయనివిరోధిరాజులపట్టణములు పాడ్వడి కాఱడవులు కాఁగా నందు వసించు నడవియేనుఁగు లచ్చటఁ జెడియున్న మేడలగోడలను దంతములతోఁ జడఁగొట్టుటచే వానినుండి రాలినవజ్రములను బంగారు పిచ్చుకలు మిణుఁగుఱుఁబురుగు లనుకొని కొనిపోయి రాత్రులందు వెలుతురుకై తమగూండ్లలో నునిచికొనును.
అలం. అతిశయోక్తి, భ్రాంతిమంతము.
| సీ. | తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి తీండ్రించు | |
| తే. | మాడెములు వ్రేల్చె నొడ్డాది మసి యొనర్చెఁ | 37 |
టీ. కృష్ణరాయ...హాగ్ని - కృష్ణరాయ(లయొక్క), బాహుప్రతాప = భుజపరాక్రమ మను, జాగ్రత్ = ప్రజ్వలించు, మహాగ్ని, ఉద్ధురతన్ = ఎగరేఁగుటచే, తోఁకచి చ్చనన్ = ఒకటివెంట నొకటిగాఁ గ్రుచ్చిన పిడుకల కంటించినని ప్పనునట్లు, అలం. ఉత్ప్రేక్ష. తొలదొల్తన్ = మునుముందు, ఉదయాద్రి ఉదయగిరియను (చెకుముకి) ఱాతిని, తాఁకి = తగిలి, తీండ్రించునసిలోహమునన్ = వేఁడికొన్నఖడ్గ మనునుక్కువలన, వెచ్చనయి = వేఁడియై, జనించెన్ = పుట్టెను. చెకుముకివలనఁ బూర్వము అగ్నిని జనింపఁజేయువారు. ఇటఁ జెకుముకిఱాయి యుదయగిరి. దానిపైఁ గొట్టు నుక్కుతునుక రాయలఖడ్గము. పరాక్రమ మనువహ్ని తొలుత నుదయగిరియందు జనించెను. మొదట నుదయగిరి ముట్టడించి గెలిచెనని భావము. (రూపకము) కొండవీడు (అనుపురమును) (కొండప్రదేశమును) ఎక్కి, మార్కొని = ఎదుర్కొని, నలియైన = నలఁగియున్న, (పిడుక మొదలగువాని సలియైన), అల, కసవాపాత్రున్ = కసవాపాత్రుఁ డనురాజును, (చెకుముకిఱాతఁ బొడమిననిప్పు పిడుకనలిమీఁదఁ బడి రాఁజును) అంటి, రాఁజెన్ = రగులుకొనెను. రవ్వ నలియందుఁగాని రాఁజదు. ఇట నలి కసవాపాత్రుఁడు. రవ్వ ఉదయగిరి విజయమునందుఁ గడించిన బలసాహసాతిశయము. అలం- రూపకము. అట = అవ్వల, సాఁగి = వెడలి, జమ్మిలోయన్ = జమ్మిలోయ యనుమన్నెమున (జమ్మున), వేగన్ = శీఘ్రముగా, (పాఠాంతరము. వేఁగిన్ = వేఁగిదేశమును) కోనన్ = కోన యనుమన్నెమును (మోటప్రదేశమును), బిట్టేర్చిన్ =అంటఁ గాల్చెను. కొట్టానన్ = కొట్ట మనుదేశమున (గోష్ఠమున), తగిలెన్ = అంటుకొనెను. రాఁజినయగ్నిహోత్రము, జమ్మిలోయ, కోన, కొట్టము. ఇవి సులభముగా సాధ్యమయ్యెను. రాయల ప్రతాపాగ్ని యిట మండెను, పరాక్రమవిజృంభణము సూచితము. (రూపకము) కనకగిరిస్ఫూర్తిన్ = కనకగిరి (బంగారుకొండ) యనుదుర్గముయొక్క యతిశయమును, కరచెన్ = కరఁగించెను. గౌతమున్ = గోదావరిని, క్రాఁచెన్ = క్రాఁగఁజేసెను. అవులన్ = పిదప, ఆపొట్నూరన్ = పొట్నూరను పట్టణమునందు, రవులుకొనియెన్ = ప్రజ్వలించెను. మాడెములు (అను మన్నెములను) ప్రేల్చెన్ = ప్రేలఁజేసెను. ఒడ్డాదిన్ = ఒడ్డాదియనుపట్టణమును, మసి యొనర్చెన్ = భస్మముగఁ జేసెను. గజరాజు = గజపతిరాజు = (ఏనుఁగు), కలంగి = కలఁతనొంది; పఱవన్ = పరువిడునట్లు, కటకపురిన్ = కటక మనుపట్టణమును, కాల్చెన్ = మసి యొనర్చెను. ఇటఁ బరాక్రమవహ్ని కాల్చుట, రవుల్కొనుట చెప్పఁబడెను. ఇంతతో నీదిగ్జైత్రయాత్ర సమాప్తమయ్యెను.
తా. ఈపద్యమునఁ గృష్ణరాయనిప్రతాప మగ్నిగా రూపింపఁబడినది. మఱియు సయ్యది యొకటనుండి మఱియొకటికిఁ బ్రాఁకుటచేఁ దోఁకచిచ్చుగా నుత్ప్రేక్షింపఁబడెను. ఆయగ్నికిఁ జెకుముకిఱాతికిని నుక్కునకును నొరయికచే జనించుట (పిడుక) నలిలో రాఁజుట జమ్ము వహించుట మొదలగుధర్మములలోఁ గొన్నిశ్లేషమర్యాదచే సమర్థింపఁబడినవి.
అలం. రూపకోత్ప్రేక్షలకు సంకరము.
| మ. | ధరకెంధూళులు కృష్ణరాయలచమూధాటీగతిన్ వింధ్యగ | 38 |
టీ. వీరరు... గనల్ - వీరరుద్రగజరాట్ = వీరరుద్రగజపతిరాజులయొక్క, శుద్ధాంత = అంతఃపురమందలి, ముగ్ధాంగనల్ = లోక మెఱుఁగని స్త్రీలు, కృష్ణ...గతిన్ - కృష్ణరాయల(యొక్క), చమూ = సేనయొక్క, ధాటీగతిన్ = దాడి నడచుటచే, ధరకెంధూళులు = భూమిమీఁది యెఱ్ఱనిదుమారములు, వింధ్యగహ్వరముల్ = వింధ్యపర్వతపుగుహలందు, తూఱఁగన్ = చొరఁగా, తారు = తాము, కాఁపై = కాఁపురమయి, అచ్చెరువై = ఆశ్చర్యము కలిగి, ఎఱ్ఱనివింతచీకటులు = ఎఱ్ఱరంగు గల చిత్రపుఁజీకట్లు, చూడరే = చూడుఁడు, వే = వేగముగా, సొరిదిన్ = సరిగా, చూతురు = వీక్షింతురు.
కెంధూళి యనుచో విభాగము కెంపు+ధూళి యని. కెంపు ప్రాఁతాదులలోనిది గాన సమాసమునందు విూఁదిహల్లునకు లోపము ద్రుతాదేశముచే బిందుసిద్ధియు నొప్పి కెంధూళి యైనది.
ఒకరు చీకటు లెఱ్ఱగా నుంటఁ బ్రకృతివిరుద్ధ మనిరి. ఇది ముగ్ధాజనభ్రాంతి. కాన వింతచీకటు లనుకొనిరి. ఇంతియగాక సమీపమునందున్న భూవర్ణమునుబట్టి రేణుప్రసరణ ముండును. వింధ్యప్రాంతభూములు రక్తధూళీవృతము లని కవి యెఱ్ఱనిదుమ్మును వర్ణించెను. దమ్ము నెఱ్ఱగాఁ జెప్పుటయుఁ గలదు.
“తురగఖురహతస్తథా హి రేణుః ... పతతి పరిణతారుణప్రకాశః.”
(అభిజ్ఞానశాకుంతలము)
తా. కృష్ణరాయలవలని భయముచే స్వరాష్ట్రమును వీడి వింధ్యపర్వతపుగుహలలో వసించు వీరరుద్రగజపతియొక్క లోక మెఱుఁగని యంతఃపురస్త్రీ లాకృష్ణరాయలసేనలు దండు వెడలుటచే రేఁగినయెఱ్ఱధూళి తమవసించుగుహలను దట్టముగాఁ జుట్టుకొనఁగా నిది యేమో యెఱ్ఱచీకటి క్రమ్ముకొనె నని యొక రొకరు చెప్పికొనుచుఁ జూచుచుందురు.
అలం. సంబంధాతిశయోక్తి. పరికరము. భ్రాంతిమంతము. చపలాతిశయోక్తి. వీనిలోఁ బరికరభ్రాంతిమంతములకు నంగాంగిభావసంకరము.
| చ. | అభిరతిఁ గృష్ణరాయఁడు జయాంకములన్ లిఖియించి తాళస | 39 |
టీ. అభిరతిన్ = ఆసక్తితో, జయాంకములన్ = విజయచిహ్నములను, లిఖియించి = వ్రాసి, తాళసన్నిభముగన్ = తాటిచెట్టుతో సమానముగా, పొట్టునూరికడన్ = పొట్టునూ రనుగ్రామముచెంత, నిల్చిన = ప్రతిష్ఠించిన, కంబమున్ = శాసనస్తంభమును, సింహభూధరప్రభుతిరుణాళ్లకు = సింహాచలస్వామియైన నరసింహస్వామియొక్క యుత్సవములకు, దిగుసురప్రకరంబు = చనుదెంచు దేవతలగుంపు, కళింగమేదినీవిభునపకీర్తికజ్జలము = కళింగరాజుయొక్క యపయశ మనుమసిని, నిచ్చలున్ = ఎప్పుడును.
తా. కృష్ణరాయలు తనవిజయవార్తలను జెక్కించి పొట్నూరియొద్ద నిల్పిన పొడవయిన జయధ్వజరూపమగు శాసనశిలను, సింహాచలనరసింహ స్వామియుత్సవములను గాంచుటకు స్వర్గమునుండి వచ్చు దేవత లెప్పుడును జేరువఁ గాంచి కళింగరాజునపకీర్తి యనుమసి రాసి చదువుచుందురు.
అపకీర్తిని నలుపుగను గీర్తిని దెలుపుగను గవులు వర్ణించుట ప్రసిద్ధము. శాసనశిలలకు మసి రాసి చదువుదురు. గజపతియపకీర్తియే శాసనపఠనమున కనువగుమసి. శాసనశిలాస్తంభము తాళసన్నిభ మగుటచేఁ బఠనము భూమికి దిగుదేవతలకె సుసాధ్య మగుచున్నది.
| మహాస్రగ్ధర. | ఎకరాలన్ మండువాసాహిణములఁ గలభద్రేభసందోహవాహ | 40 |
టీ. తత్తత్ప్రభువులు = ఆయారాజులు, పనుపన్ = పంపఁగా, ఎకరాలన్ = మొగసాలలయందును, మండువాసాహిణములన్ = ఎత్తుగాఁ గట్టఁబడిన గుఱ్ఱపుశాలలందును, కల, భద్రే...ప్రకరంబున్ - భద్రేభ = భద్రజాతియేన్గులయొక్కయు, వాహ = గుఱ్ఱములయొక్కయు, ప్రకరంబు = సమూహమును, కొంచున్ = తోకొని, నిత్యంబు = ఎప్పుడును, రాయబారుల్ = రాయబారము నడపువారు, కొల్వందక = దర్శనము దొరకక, ఆప్రత్యూషము = తెల్లవాఱినదిమొదలు, ఆసంధ్యము = ప్రొద్దు క్రుంకువఱకును, పనివడి = ప్రయత్నపడి, తన్మందిరాళిందభూమిన్ = ఆకృష్ణరాయలమందిరపుముంగిట, విలోకోత్సుకులై = చూడ నాస కలవారై, అందంద = ఎడనెడ, శ్రీకృష్ణుని యవసరముల్ = శ్రీకృష్ణరాయల (శ్రీకృష్ణమూర్తియొక్క) సమయములను, చూతురు = ప్రతీక్షింతురు.
గజజాతులు మూడు భద్రము, మందము, మృగము అని. ఉత్తమమైనది భద్రశాతగజము. మండువా యన దూలములసరియెత్తున స్తంభములమీఁదికి వచ్చిన గుఱ్ఱపుతబేలాలని బ్రౌనుగారి ప్రతియం దర్థము గలదు. తా. ఆయారాజులు పంపినరాయబారులు కానికగాఁ గొనివచ్చిన భద్రగజములను, ఉన్నతాశ్వములను దోడ నుంచుకొని శ్రీకృష్ణరాయలదర్శనము దొరకమిచే నగరివాఁకిట ప్రొద్దుననుండి సాయంకాలమువఱకు ననుదినమును దర్శనమునకు సమయము వేచికొనియుందురు.
అలం. స్వభావోక్త్యలంకారము.
| చ. | మదకలకుంభికుంభనవమౌక్తికముల్ గనుపట్టు దట్టమై | 41 |
టీ. పోరుల = యుద్ధములందు, కృష్ణరాయ(లయొక్క,) కరవాలమునన్ = కత్తియందు, తగుధారనీటన్ = ఒప్పునట్టివాయి యనెడు నీటియందు, శాత్రవులపుట్టి మునుంగఁగన్ = శత్రురాజులపుట్టి, (పుట్టియన సంగడి యనుట ప్రమాదము. ప్రవాహమునందు మనుష్కులు దాఁటుటకు బద్దలతోఁ బెద్దబుట్ట యల్లి యందు నీరు దిగకుండుటకై చుట్టును జర్మముతో మూయుదురు. ఇందు మనుష్యుల నుంచి యేఱు దాటింతురు. చుట్టు బరువు సమానముగ లేనిచో నిది మున్గును) మునిఁగిపోఁగా, (దశకూలిపోఁగా) కార్యములు చెడి యాపదలు క్రమ్ముపట్టున నీలోకోక్తి యుపయోగింపఁబడును. అభ్యుదయమున్ ఒంది = అభివృద్ధి చెంది, ఫేనపం_క్తితో = నురువుతెట్టలతో, పొదిగొని = కలిసి, పైపయిన్ = మీఁదమీఁద, వెడలుబుద్భుదపంక్తులువోలెన్ = ఉప్పతిల్లు నీటిబుగ్గలప్రోవువలె, మదకలకుంభికుంభనవమాక్తికముల్ = మదముగొన్న యేనుఁగుల కుంభస్థలములందలి క్రొమ్ముత్తెమ్ములు, కనుపట్టున్.
ముత్యములు ఏనుఁగులకుంభస్థలములందుఁ గూడ జనించును.
"కరీంద్ర జీమూత వరాహ శంఖ మత్స్యాహి శుక్త్యుద్భవవేణుజాని,
ముక్తాఫలాని ప్రథితాని లోకే తేషాంతు శుక్త్యుద్భవమేవ భూరి.”
(బృహత్సంహిత)
అలం. ఉత్ప్రేక్ష, రూపకము, అతిశయోక్తి వీని కంగాంగి భావసంకరము.
| సీ. | వేదండభయదశుండాదండనిర్వాంత | |
| తే. | జెనఁటిపగఱప్రతాపంబుచిచ్చు లార్చు | 42 |
టీ. మూరు...ధాటి - మూరురాయరగండ = గజపతి, అశ్వపతి, నరపతు లనుమువ్వురురాజులను బరిమార్చినవాఁ డను, అంక = బిరుదనామముగల, వీర = వీరుఁడగు, కృష్ణరాయభూభృత్ = కృష్ణరాయప్రభువుయొక్క, భయంకర = వెఱపుఁ గూర్చు, ప్రబల = ఉత్కట మయిన, ధాటి = దాడి, వేదండ...మధువుల్ - వేదండ = ఏన్గులయొక్క, భయద = భయము నిచ్చు, శుండాదండ = దండములవంటి తుండములనుండి, నిర్వాంత = వెలికిఁ జిమ్మఁబడిన, వమధువుల్ = తుంపులు, పైన్ = మీఁద, చిల్కువారి = చల్లునట్టినీరు. తత్కర్ణ... ధూళి - తత్ = వానియొక్క, కర్ణ = చెవులనెడి, విస్తీర్ణ = పెద్దవియగు, తాలళవృంత = విసనకఱ్ఱలచేత, ఉద్ధూత = ఎగురఁగొట్టఁబడిన, ధూళి = పరాగము, శ్రమ...పంకంబు - శ్రమ = అలసటచే, బుర్పురత్ = బురబురమను, తురంగమ = గుఱ్ఱములయొక్క, నాసికా =ముక్కులనుండి, గళత్ = తొఱఁగు, పంకంబు = మలము, కర్దమము = బురుద, కుపిత...లనములు - కుపిత = కోపించిన, యోధ = వీరులచే, ఆక్షిప్త = చిమ్మఁబడిన, కుంతకాంతార = వెదురుపొదలవంటి యీఁటెలయొక్క, ఖేలనములు = విహారములు, దండఘట్టనలు = కఱ్ఱలదెబ్బలు, చెనఁటి...చిచ్చులు - చెనఁటి = దుర్గార్గులైన, పగఱ = శత్రులయొక్క, ప్రతాపంబు చిచ్చులు = పరాక్రమ మనునిప్పులను, ఆర్చుకరణిన్ = చల్లార్చునట్లు, గడిదేశములన్ = సరిహద్దుదేశములను, అలఁచున్ = కలఁతపెట్టును.
గడి యన సరిహ ద్దనుటకు —
క. "పరగును సీమావాహిని, విరజ యనఁగ నచట నొకటి విమలామృతని
ర్భరపూర యగుచు నది గడి, పరమపదమునకు భవప్రపంచంబునకున్.”
(పరమయోగివిలాసము. ఆ 1)
కృష్ణదేవరాయలధాటి ప్రబలము భయంకరము గానఁ జెనఁటిపగతురప్రతాపవహ్ని నార్చుటయు భయంకరక్రియగాఁ జెప్పఁబడెను. రాయలు విజయయాత్ర లందు గజసైన్యము ఆశ్వికసైన్యము కాల్బంట్లు విజయార్థమై పాటుపడుచుండిరని భావము.
తా. శ్రీకృష్ణరాయలు దాడి వెడలినప్పు డేన్గులు తుండములతోఁ జిమ్ము తుంపురులును, నవి చెవులు వీచుకొనుటచే రేఁగెడు దుమ్మను, గుఱ్ఱములముక్కులనుండి జాఱుమలమును, భటులు ప్రయోగించు నీఁటెలదెబ్బలును, నాతనిశత్రురాజులప్రతాపాగ్నిని జల్లార్చుటకుఁ బైఁజల్లునీరుగను, జేటలతో గుప్పుమన్నుగను, పైఁగప్పు బురుదగను, నవ్వల ధట్టించుకఱ్ఱదెబ్బలుగను నయ్యెను.
అలం. ఉత్ప్రేక్ష, రూపకము. షష్ఠ్యంతములు
| క. | ఏవంవిధగుణవంతున, కావల్గత్తురగబహువిధారోహకళా | 43 |
టీ. ఏవం విధగుణవంతునకున్ = ఇట్టిగుణములు కలవానికిని, ఆవల్గ...వంతునకున్ - ఆవల్గత్ = అంతటను దుముకాఁడు, తురగ = గుఱ్ఱములయొక్క, బహువిధ = పెక్కుతెఱఁగులైన, ఆరోహకళా = ఎక్కెడు మెలకువలందు, రేవంతునకున్ = అశ్వశిక్షకుఁ డగువానికిని, ఆవిష్కృ...తునకున్ - ఆవిష్కృత = వ్యాపింపఁజేయఁబడిన, కీర్తి(చే), ధవళిత= తెల్లగాఁ జేయఁబడిన, ఆశాంతునకున్ = దిగంతములు గలవానికిని, పైనాల్గవపద్యము వఱకును నేకాన్వయము. నాల్గుకంటె నెక్కువపద్యముల కేకాన్వయ మున్నఁ గుళక మందురు.
కృష్ణదేవరాయ లశ్వవిద్యయందు మిగులఁ గుశలుఁ డనియు మిక్కిలి కీర్తిశాలి యనియు భావము.
| క. | పుంఖానుపుంఖసైంధవ, రింఖాసంఘాతజాతరేణూగ్రతమో | 44 |
టీ. పుంఖా...ఫణికిన్ - పుంఖానుపుంఖ = ఎడతెగని, సైంధవ = గుఱ్ఱములయొక్క, రింఖా = గిట్టలయొక్క, సంఘాత = గట్టితాఁకుడులవలన, జాత = పుట్టిన, రేణు = దు మ్మనెడు, ఉగ్ర = భయంకరమైన, తమః = చీకటియందు, రింఖత్ = తబ్బిబ్బగుచున్న, రిపునృప = శత్రురాజులయొక్క, దహర = హృదయములందు, ప్రేఖత్ = చలించుచున్న, అసు = ప్రాణములయొక్క, గ్రసన = మ్రింగుటచే, జఠర = పొట్టయొక్క, భృతి = నిండించుకొనుటగల, అసి = కత్తి యనెడు, ఫణికిన్ = పాము గలవానికిని.
పుంఖానుపుంఖ మన బాణముపిడివెంట బాణముపడి పోవునటుల సంగరమున బాణములు వేయుట - ఎడ తెగక యనునర్థమున దీనిని ధారాళముగ వాడుచున్నారు. తా. ఎడతెగక గుంపులుగుంపులుగాఁ దోతెంచు గుఱ్ఱములగిట్టలత్రొక్కుడులచే రేఁగినధూళి యనుచీకటిలోఁ దబ్బిబ్బులు పడుశత్రురాజులప్రాణముల నాతనిఖడ్గ మనుపాము మ్రింగి పొట్ట నించుకొనును. గుఱ్ఱపుసేనలతో దండెత్తి శత్రురాజులఁ జంపినాఁ డనుట.
అలం. రూపకము.
| క. | అవిరళవితరణవిద్యా | 45 |
టీ. అవిర...యునకు - అవిరళ = ఎడతెగని, వితరణవిద్యా = దానవిద్యయందు, నవరాధేయునకున్ = అభినవకర్ణునకును, సజ్జనవిధేయునకున్ = పండితులయెడ నడఁకువ గలవానికిని, కవితాస్త్రీలోలునకున్ = కవిత యనెడునెలఁతయం దాసక్తి గలవానికి, ఖవి...లునకున్ - ఖవిటంక = ఆకాశాగ్రభాగములందు, నటత్ = చరించు, యశోబ్ధి = కీర్తిసముద్రముయొక్క, కల్లోలునకున్ = తరంగములు గలవానికి, ఆకాశమెల్లను వ్యాపించిన కీర్తిగలవాఁ డనుట.
ఆకాలమునఁ గర్ణుఁ డౌదార్యమునం దెంతపేరెన్నికఁ గాంచెనో యీకాలమున రాయ లంతపేరెన్నికఁ గాంచెను. కాన కృష్ణరాయలు నవరాధేయుఁడు “సన్నక్షత్రే విద్యమానే పండితే” అను నిఘంటూక్తిచే “సజ్జన” అనుచో పండితులని చెప్పుటయే సమంజసము.
| క. | దిగధీశాసహ్యధగ, ద్ధగితేద్ధరుచిప్రతాపతపనస్ఫురణ | 46 |
టీ. దిగధీ...మణికి - దిగధీశ - దిక్పాలురకు, అసహ్య = సహింపరాని, ధగద్ధగిత = ధగధగాయమానమైన, ఇద్ధ - ఒప్పిదమగు, రుచి = కాంతి గల, ప్రతాపతప = పరాక్రమ మనుసూర్యునియొక్క, స్ఫురణ = ప్రకాశముచే, స్థగిత = మాటుచేయఁబడిన, ద్యుమణికిన్ = సూర్యుఁడు గలవానికి, నిమి... గ్రణికిన్ - నిమిషార్ధ = అరనిముసములో, గృహీత = పట్టుకోఁబడిన, కళింగ(రాజుయొక్క)తనయాగ్రణికిన్ = శ్రేష్ఠుఁ డగుకుమారుఁడు కలవానికిని, ప్రతాపము తీవ్రతయందు సూర్యునిమించినది కాన సూర్యబింబమును మాటుపఱుపఁగలిగెను. అరనిముసములోఁ గళింగరాజును బట్టుకొనుట రాయలవిక్రమసాహసబలవీర్యాదులను వెల్లడించును.
| క. | కరుణాకరవేంకటవిభు, చరణస్మరణప్రసంగసంగతమతి కీ | 47 |
టీ. కరుణాకర - కరుణా = దయకు, ఆకర = గనియయిన, వేంకటవిభు = వేంకటేశ్వరస్వామియొక్క, చరణ = పాదములయొక్క, స్మరణప్రసంగ = స్మరించుట గల సంభాషణమందు, సంగత = అంటిన, మతిన్ = బుద్ధి గలవానికి, ఈశ్వరనరసింహమహీధృత్ = ఈశ్వరరాజుకుమారుఁ డైన నరసింహరాయనికి, వరనందన = పుత్రశ్రేష్ఠుఁడైన, కృష్ణరాయధరణీపతికిన్.
కృష్ణదేవరాయలు తిరుపతివేంకటేశ్వరుల సేవకుఁ డనియు భక్తుఁ డనియు నాతనితిరుపతిశాసనములవలనఁ దెలియుచున్నది. రాయలకుఁ తిరుపతివేంకటేశ్వరుఁ డిష్టదైవ మని భావము.
—————
ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
| వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పన్ బూనిన స్వారో | 48 |
టీ. అభ్యుదయపరంపరాభివృద్ధిగాన్ = శ్రేయఃపరంపర కభివృద్ధియగునట్లు, నాయొనర్పన్ బూనిన = నేను రచింపఁదొడఁగిన, మహాప్రబంధమునకున్ = సమస్తవర్ణనావృతమగు మహాకావ్యమునకు, కథాక్రమము = కథయొక్క వరుస, ఎట్టిదనినన్ = ఏవిధముగా నుండునన, జైమినిముని = జైమినియను ఋషీశ్వరుఁడు, స్వాయంభువ...రంబు - స్వాయంభువమను(వుయొక్క), కథా = కథయొక్క, శ్రవణానంకరంబునన్ = వినుట యైనపిదప, ఎవ్వండు మను = ఏమహామహుఁడు మను వయ్యెనో, ఎఱిఁగింపుము. అనవుడు = అని యడుగఁగా, పక్షులు = ధర్మపక్షులు, మార్కండేయమహాముని, చెప్పినప్రకారంబునన్, ఇట్లని, చెప్పందొడంగెన్ = చెప్పుటకు మొదలుపెట్టెను.
| మ. | వరణాద్వీపవతీతటాంచలమునన్ వప్రస్థలీచుంబితాం | 49 |
టీ. ఆర్యావర్తదేశంబునన్ = ఆర్యావర్త (వింధ్యపర్వత హిమవత్పర్వతములనడిమిదేశము) మనుదేశమునందు, వరణాద్వీపవతీతటాంచల మునన్ = వరణానదియొడ్డుదగ్గఱ, వప్ర...జరమై - వప్రస్థలీ = ప్రాకారప్రదేశముచే, చుంబిత = తాఁకఁబడిన, అంబరమై = ఆకాశము గలదై, సౌధ...ణంబై - సౌధ = మేడలమీఁది, సుధా = సున్నముచే, ధవళిత = తెల్లఁగాఁ జేయఁబడిన, ప్రాలేయరుక్ = చంద్రునియొక్క, మండలీ = మండలమందలి, హరిణంబై = జింక గలదై, మహికంఠహారతరళస్ఫూర్తిన్ - మహి = భూమియొక్క, కంఠ = మెడయందలి, హార(మునందలి), తరళ = నడిమి పెద్దమణియొక్క, స్ఫూర్తిన్ = ప్రకాశమును, విడంబింపుచున్ = సరిపోలుచు, అరుణాస్పదం బనఁగన్ = అరుణాస్పద మనుపేరుతో, పురము = పట్టణము, ఒప్పున్ = ఒప్పిదముగా నుండును.
నదీతటమున నుంటచే నివాసయోగ్య మనియు వప్రస్థలీచుంబితాంబర మనుటచే వైరిదుర్భేద మనియు గ్రాహ్యము. ప్రాలేయరుఙ్మండల మనుటచే సంపూర్ణచంద్రుఁ డనుట. కాననే యందు హరిణలాంఛనము బాగుగాఁ గనిపించును. హరిణాంకమును దెల్లఁగాఁ జేయుటచే మేడలధావళ్యము ఔన్నత్యము సూచితము. తరళస్ఫూర్తి యనుటచే భూమండలమునందలి సమస్తనగరములను మించియుండె ననుట.
తా. ఆర్యావర్తదేశమున వరణానదియొడ్డున నాకాశము నంటుకోటగోడయును, జంద్రమండలమును రాయునంత యెత్తును, నందలి జింకనుసయితము తెల్లఁగాఁ జేయఁజాలు తెల్లనిపాలగచ్చునిగనిగయును గల మేడలును గలిగి భూదేవి తాల్చిన హారమునడిమి పతకమో యనున ట్లరుణాస్పద మనుపురమొకటి కలదు.
అలం. అతిశయోక్తి, ఉత్ప్రేక్ష, ఉపమ.
| సీ. | అచటివిప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి | |
| | నచటిరాజులు బంటు నంపి భార్గవు నైన | |
| తే. | నచటివెలయాండ్రు రంభాదులైన నొరయఁ | 50 |
టీ. అఖిలవిద్యాప్రౌఢిన్ = ఎల్లవిద్యలయందలి నేర్పుచే, ముదిమది తప్పిన మొదటివేల్పున్ = ముసలితనముచే మతిమళ్లిన బ్రహ్మదేవుని, అచటివిప్రులు = ఆనగరమునందలి బ్రాహ్మణులు, మెచ్చరు = మెచ్చుకొనరు, (ఆనగరమునందలి బ్రాహ్మణులు సమస్తవిద్యలు నేర్చినవా రగుటచే బ్రహ్మను గూడఁ జిత్తవిభ్రమముగల ముదుసలివాఁ డని సరకు చేయరు) అచటిరాజులు = ఆనగరమందలి క్షత్రియులు, బంటు నంపి = భటుని బంపి, భార్గవునైనన్ = పరశురాము నైనను, బింకానన్ = గర్వముతో, అంశమునకు = చేరువకు (సర్వక్షత్రియవినాశకుఁడైన పరశురాముని సయితము బంటును బంపి దగ్గఱకుఁ బిలిపించుకొనఁగల సామర్థ్యము గలవా రనుట) కిరాటులు = కోమటులు, అలకాధిపతినైనన్ = కుబేరునైనను, మును = ముందుగా, సంచిమొదలు = మూలధనము, ఇచ్చి, మనుపన్ = రక్షించుటకు, దక్షులు = నేర్పరులు (ధనవంతులలోఁ గుబేరుఁడే యగ్రగణ్యుఁడు. అతనిని సంచిమొద లొసంగి బ్రదికింపఁగల్గుట పురవైశ్యులసంపదాతిశయమును దెలియఁజేయును, నాలవజాతి = శూద్రజాతి, హలముఖాత్తవిభూతిన్ = నాఁగేటిమొనచే నార్జింపఁబడిన సంపదచే, ఆదిభిక్షువు భైక్షమైనన్ = మొదటిబిచ్చమెత్తువాఁ డగు శివునియొక్క బిచ్చ మెత్తుట నైనను, మాన్చున్ = నివారింపఁజేయును, (శూద్రులు పంటఁ బండించి భాగ్యముల గడించి సత్పాత్రదానము గావించుటలో సుప్రసిద్ధులని భావము,) వెలయాండ్రు = వేశ్యలు, నాట్యరేఖా...నిరూఢిన్ - నాట్యరేఖా = నృత్యచాతురియను, కళా = విద్యయందు, ధురంధర = బరువు మోసిన (సంపూర్ణముగా నలవడిన) నిరూఢిన్ = నేర్పుచే, రంభాదులైన = రంభ మొదలగు నప్సరస్త్రీలయినను, ఒరయన్ = ఎదుర్కొనునెడ, కాసెకొంగునన్ = వెన్కకు దోఁపుకొను చీరచెంగుచేత, కడపఁగలరు = తిరుగఁగొట్టఁగలరు. చిగురుఁగొమ్మైనన్ = లేఁతకొమ్మ యయినను, చేవ = గట్టితనము గలది.
అలం. అతిశయోక్తి.
దత్తమండలమునందుఁ జివురుచెట్టను నొకజాతిచెట్టు గలదు. ఎంత ముదిరినను దానఁ జేవ యుండదు. గాన నచటఁ బుట్టినఁజివురుకొమ్మైన చేవ యనుచో నాపురమునఁ బుట్టిన చీపురుచెట్టున బుట్టినకొమ్మయుఁ జేవతో నుండు ననుభావము సమంజసము.
రామాభ్యుదయములోని చిగురుకొమ్మయు చేవల్, వసుచరిత్రములోని చిగురుగొమ్మ చేవయు నిట్టిద.
| ఉ. | ఆపురిఁ బాయకుండు మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి భా | 51 |
టీ. మకరాంకశశాంకమరోజ్ఞమూర్తి = మన్మథునివలెను చంద్రునివలెను మనోహరమైన యాకారము గలవాఁడు, భాషావరశేషభోగి = వాక్కునందు రెండవయాదిశేషుఁ డగువాఁడు, వివి...తంత్రుఁడు - వివిధతెఱఁగులైన, ఆధ్వర = యజ్ఞములయొక్కయు, నిర్మలకర్మ= పుణ్యకర్మములయొక్కయు, దీక్షా = నియమములకు, పరతంత్రుడు = అధీనుఁ డగువాఁడును, అంబురుహగర్భకులాభరణంబు = బ్రాహ్మణకులమున కలంకారమగువాఁడును, అనా...రుండు - అనారత = ఎప్పుడును, అధ్యాపన = వేదాధ్యయనము చేయించుటయందు, తత్పరుండు = ఆసక్తిగలవాఁడు, ప్రవరాఖ్యుఁడు = ప్రవరుఁ డనుపేరు గలవాఁడు, అలేఖ్యతనూవిలాసుఁడై = (చిత్తరువులందు) వ్రాయ నలవి గాని శరీరసౌందర్యము గలవాఁడై, పాయక = విడువక, ఆపురిన్, ఉండును.
అలం. ఉపమ. రూపకము.
ఆకారవిద్యానిష్ఠాభివాక్యములయు దసమానుఁడు. అంబురుహగర్భకులాభరణ మనుటవలనఁ బూర్వోక్తసుగుణాతిశయముచే నెట్టిలోపము లేక నుండెననుట.
| ఆ. | వానిచక్కఁదనము వైరాగ్యమునఁ జేసి | 52 |
టీ. వైరాగ్యమునఁ జేసి = విరక్తభావమువలన, కాంక్ష సేయం = కోరునట్టి, జారకామినులకు = ఱంకుటాండ్రకు, పూచినసంపెంగపొలుపు = వికసించిన సంపెంగపూవుయొక్క బాగు, మధుకరాంగనలకుఁ బోలెన్ = తుమ్మెదలకువలె, భోగబాహ్యము = అనుభవమునకుఁ దక్కనిది, అయ్యెన్.
సంపెగఁదావిని తుమ్మెద లొల్లకపోవుట ప్రసిద్ధము. ఇటఁ బ్రవరుఁడు సంపెంగపూవు. పరపురుషునియం దాసమై తిరుగుజారకామినులు తుమ్మెదజవరాండ్రు. సంపెఁగను దుమ్మెద లొల్లమికి —
శా. “నానాసూనవితానవాసనల నానందించు సారంగమే
లా నన్నొల్ల దటంచుగంధఫలి..."
(వసు.)
శ్లో. “చరన్వనాంతే నవమంజరీషు, స షట్పదో గంధఫలీం న జిఘ్రతి
సా కిం న రమ్యా స చ కిం న రంతా, బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా."
జారకామిను లెంత యపేక్షించినను ననుభవింప నలవిగాని దయ్యెను.
అలం. ఉపమ.
| ఉ. | యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడు నై కమనీయకౌతుక | 53 |
టీ. యజ్వయున్ = యజ్ఞము చేసినవాఁడును, ధనాఢ్యుఁడును = ధనవంతుఁడును, కమనీ...విధిన్ - కమనీయ = కోరఁదగిన, కౌతుకశ్రీ = కుతూహలపుసంపదయొక్క, విధిన్ = రీతితో, కూఁకటుల్ = పిల్లజుట్లను, కొలిచి = కొల్తపెట్టి (ఇరువురివయస్సు ఇంచుమించుగా సమాన మని నిశ్చయించికొని) చేసిన = (పెండ్లి) చేసిన, కూరిమిసోమిదమ్మ = ప్రేమపుసోమిదేవి, సోమిదమ్మ. ఇది సోమిదేవియొక్క వికృతిరూపము, సౌఖ్యాపహయై = సుఖమును గూర్చునదియై, భజింపన్ = సేవ చేయుచుండఁగా, సుఖులై = సుఖవంతులై, కూడి = కలసి, దేవియున్ దేవరవోలెన్ = పార్వతీపరమేశ్వరులవలె, ఇలు దీర్పఁగన్ = ఇంటిపనులను జక్కఁబెట్టుచుండఁగా, కాఁపురము = సంసారము, వానికిన్ = ఆప్రవరునకు, ఒప్పున్.
పార్వతీపరమేశ్వరు లనాదిదంపతులు మిగులవృద్ధులగు ప్రవరాఖ్యుని జననీజనకులు పార్వతీపరమేశ్వరులవలె నీడుజోడుగ మహామహిమతో నుండి రనుట.
తా. ఆప్రవరుఁడు పిన్ననాఁటనే యజ్ఞము చేసి ధనవంతుఁడై యీడుజోడుగా నున్న తనప్రియభార్య సుఖపెట్టుచు సేవించుచుండఁగాఁ బార్వతీపరమేశ్వరులవలెఁ దల్లిదండ్రులు క్షేమమున నుండి గృహకృత్యము చక్కఁబెట్టుచుండఁగా సౌఖ్యమునఁ గాఁపురము చేయుచుండెను.
| సీ. | వరణాతరంగిణీదరవికస్వరనూత్న | |
| తే. | ఫలసమిత్కుశకుసుమాదిబహుపదార్థ | 54 |
టీ. వర...ధము - వరణాతరంగిణీ = వరణానదియందలి, దరవికస్వర = ఇంచుక విడఁబాఱిన, నూత్న = క్రొత్తవగు, కమల = తామరపూలయొక్క, కషాయ = ఒగరైన, గంధము = వాసనను, వహించి = ధరించి, నదులయందుఁ దామరపూవు లున్నటులఁ జెప్పుట కవిసమయము. నూత్నకమలము లన నానాఁడె విచ్చ నారంభించిన తామరపూలు. అవి కొంచెము విచ్చినవి గాన తావి ముమ్మరముగ నుంటచే మంచితావితోఁగూడ నొప్పుచున్నవనుట. కషాయమన సుగంధ మనుటకు — “కషాయో రసభేదే౽కి నిర్యాసేచ విలేపనే, అంగరాగేచ నస్త్రీ స్యౌత్ సురభౌ లోహితే త్రిషు. మేదిని.” ప్రత్యూషపవనాంకురములు = వేకువవేళయందలి లేగాలులు, పైకొనువేళన్ = మేను తాఁకుసమయమున, వామనస్తుతిపరత్వమునన్ = వామనమూర్తియొక్క ధ్యానమునందలి యాసక్తిచేత, లేచి = శయ్యను విడిచి లేచి, ప్రాతఃకాలమున నిదుర సెజ్జనుండి లేచునపుడు విష్ణుమూర్తిని స్మరించుచుండునని భావము. సచ్చాత్రుడు = శిష్యులతోఁ గూడుకొన్న వాఁడు, నిచ్చలున్ = ఎప్పుడును, ఏఁగి = పోయి, అయ్యేటన్ = ఆవరణానదియందు, ఆఘమర్షణస్నానము = పాపమును బోఁగొట్టు (అఘమర్షణమంత్రముల జపించుచుఁ జేయు) స్నానమును, సాంధ్యకృత్యము = సంధ్యావందనమును, సావిత్రిన్ = గాయత్త్రిని, సైకతస్థలిన్ = ఇసుకతిన్నెపై, కర్మసాక్షికిన్ = సూర్యునకు, ఫల...తతియున్ - ఫల = పండ్లు, సమిత్ = సమిధలు, కుశ = దర్భలు, కుసుమ = పూవులు, ఆది = మొదలగు, బహుపదార్థతతియున్ = పెక్కువస్తువులమూహమును, మడుఁగుదోవతులం = మడివస్త్రములు, గొంచున్ = తీసికొని, బ్రహ్మచారులు = వడగు లగు విద్యార్థులు, వెంటరాన్ = వెంబడివచ్చుచుండ, బ్రాహ్మణుండు = ప్రవరాఖ్యుఁడు, ప్రజ = జనులు, తన్నున్, మెచ్చిచూడన్ = మెచ్చుకొని సందర్శించుచుండ, ఇంటికిన్ వచ్చును = ఇంటి కరుదెంచును.
| శా. | శీలంబున్ గులమున్ శమంబు దమమున్ జెల్వంబు లేఁబ్రాయమున్ | 55 |
టీ. శీలంబున్ = సద్వర్తనమును, కులమున్ = సద్వంశమును, శమంబున్ = బాహ్యేంద్రియనిగ్రహమును, దమమున్ = అంతరింద్రియనిగ్రహమును, చెల్వంబున్ = సొగసుఁదనము, లేఁబ్రాయము = చిఱుతవయస్సును, పోలన్ = కూడియుండఁగా, చూచి = పరికించి, (దానపరిగ్రహణమునకుఁ దగిన సమస్తయోగ్యత లీతనియెడఁ గలవు గాన నితని కొసంగుట యుభయతారక మని) అతండె = ఆప్రవరాఖ్యుఁడె, పాత్రుఁడు = అర్హుఁడు, అని = అని భావించి, ఏభూపాలుఁడు = ఏరాజైనను, ఈవచ్చినన్ = ఇచ్చుటకు వచ్చినయెడల (తమకై తాము రాజులు దాన మొసంగ నింటికి వచ్చిన) సాలగ్రామము మున్నుగాన్ = సాలగ్రామము మొదల్కొనియు, కొనఁడు = పరిగ్రహింపఁడు. మాన్యక్షేత్రముల్ = మాన్యపుభూములు, (రాజులు మొదలగువారు గౌరవించి పన్ను లేకుండ నిచ్చినభూమిని మాన్య మందురు.) పెక్కుచందాలన్ = పలుతెఱఁగులుగా, పండున్ = ఫలించును. పాఁడియున్, పంటయున్, ఇంటన్ = గృహమునందు, ఒకప్పుడున్, తఱుఁగదు = కొఱఁతపడదు.
చందములు (రూ) చందాలు. బా. సూ. లులనలు పరంబగునపుడు మువర్ణలోపంబును పూర్వస్వరదీర్ఘంబును విభాష నగు.
తా. ప్రవరుని యోగ్యతను జూచి రాజులు నానావిధములయిన దానముల నీయవత్తురు. అతఁడు ప్రతిగ్రహము పాపము గలిగించు నని నిర్దోషమైన సాలగ్రామదానము సయితము తీసికొనకుండును. ఆయినను మాన్యపుభూములు తప్పక పండుచుండును గావున నతనియింటఁ బాఁడిపంటలు కొఱఁతలేక యుండును.
| తే. | వండ నలయదు వేవురు వచ్చిరేని | 56 |
టీ. అన్నపూర్ణకున్ = అన్నపూర్ణాదేవికి, ఉద్ది = సాటి, ఔ నతనిగృహిణి = అగునట్టి యాతనిభార్య, వేవురు = వేయిమంది, వండన్ = వండి పెట్టుటకు, అలయదు = విసువదు. అతిథులు = మార్గస్థులు, ఏతేరన్ = రాగా, నడికి రేయిన్ = అర్ధరాత్రమున, భోజ్యంబులు = భోజనపదార్థములు, అవ్వారి గాఁగన్ = కొదవ లేకుండ, పెట్టున్ = వడ్డించును.
తా. ప్రవరునిభార్య అతిథులకుఁ బెట్టిపోయుటలో నన్నపూర్ణాదేవికి సమానురాలు. అర్ధరాత్రమునం దతిథులు వచ్చినను వారివారి కిచ్చ యగుపదార్థముల నలయక పక్వ మొనరించి పెట్టును.
| సీ. | తీర్థసంవాసు లేతెంచినా రని విన్న | |
| తే. | నడిగి యోజనపరిమాణ మరియు నరసి | 57 |
టీ. అత్తరుణాగ్నిహోత్రి = ఆలేఁబ్రాయపుయజ్వ, అగ్నిహోత్రి యన యజ్ఞానంతరము విధి ననుసరించి నియతితో నగ్నిహోత్రమున వేల్చుచుండువాఁడు, తీర్థసంవాసులు = పుణ్యతీర్థనివాసులు, ఏతెంచినారు = వచ్చినారు, అని, విన్నన్ = ఆలకించినయెడల, దవ్వు = దూరము, ఎంతయైనన్, ఎదురుగా నేఁగున్, తీర్థవాసము పుణ్యప్రదము గాన నటనుండి వచ్చువారు, యోగ్యు లని ప్రవరుని భావన. ఏఁగి = ఆవిధముగా నెదురేఁగి, తత్పదములకున్ = వారియడుగులకు, ఎఱఁగి = నమస్కరించి, సద్భక్తిన్ = తిన్ననిభక్తితో, ఆతిథ్యము = అతిథిసత్కారమును, ఇచ్చున్ = ఒసంగును ఇచ్చి = ఇటు లాతిథ్య మొనంగి, ఇష్టాన్నసంతృప్తులన్ = హితమైనభోజనముచేఁ దృప్తి చెందినవారినిగా, చేయున్ = ఒనరించును, చేసి, కూర్చున్నచో = విశ్రాంతిగాఁ గూర్చున్నపుడు, చేరవచ్చున్ = దగ్గఱ కరుగును. ఇద్దరన్ = ఈభూమిని, వన...త్మ్యముల్ - వనధి = సముద్రములయొక్కయు, పర్వత = కొండలయొక్కయు, సరిత్ = నదులయొక్కయు మాహాత్మ్యముల్ = ప్రభావములను, తెలియన్ = తెలిసికొనుటకు, అడుగున్ = ప్రశ్నించును. అడిగి = ప్రశ్నించి, యోజనపరిమాణము = ఆమడలపరిమితిని; ఆతీర్థక్షేత్రములకుఁ దానున్నచోటునకుఁగల దూరమును, అరయున్ = విచారించును. అరగి = ఆవిధమునంతయు విచారించి, చూడన్ = తాను దెలిసికొన్న పుణ్యప్రదేశములు సందర్శించుటకు, పోవలయున్, అంచున్, ఊర్పులు = నిట్టూర్పులు, నిగుడ్చున్ = విడుచును. నిట్టూర్పులు నిగిడించుట యసాధ్య మగు క్షేత్రసందర్శనము నెటులేని గావించి కృతార్థుఁడఁ గావలయు నని.
| క. | ఈవిధమున నభ్యాగత | 58 |
టీ. ఈవిధమునన్ = పైని జెప్పఁబడినటులు, అధ్యా...వనుఁడు - అభ్యాగత = ఆగంతుకులయొక్క, సేవా = శుశ్రూషకు, పరతంత్ర = అధీనమైన, సకలజీవనుఁడై = ఎల్లఁబ్రదుకుఁదెరువు గలవాఁడై, భూదేవకుమారకుఁడు = విప్రపుత్రుఁడు, ఉండంగాన్, వినుము. ఒకనాఁడు = ఒకానొకదినమునందు, కుతపకాలమునందున్ = మధ్యాహ్నానంతరమున (పదునాఱుపదునేడుగడియల కాలమున)
| సీ. | ముడిచినయొంటికెంజడ మూయ మువ్వన్నె | |
| | యారకూటచ్చాయ నవఘళింపఁగఁ జాలు | |
| తే. | మిట్టయురమున నిడుయోగపట్టె మెఱయఁ | 59 |
టీ. ముడిచి...జడ - ముడిచిన = చుట్టచుట్టిన, ఒంటికెంజడ = ఒక్కటి యగునెఱ్ఱనిజట, మూయన్ = ఆవరించునట్లు, మువ్వన్నెమొగముతోలు = పులితోలు, కిరీటముగన్ = కుల్లాయిగ, ధరించి = తాల్చి, జడ గానరాకుండఁ బులితోలుతోఁ జేసిన కుళ్లాయి పెట్టుకొనె నని భావము. కకపాల = కక్షపాలను, సన్యాసులు చంకను దగిలించుకొను భూతి మొదలగు వస్తువులను దాఁచియుంచుకొను సంచి, కేదార...పాణిన్ - కేదారకటక = పంచలోహములతోఁ జేసిన కడియముచే, ముద్రిత = చిహ్నితమైన. పాణిన్ = హస్తమున, కుఱుచలాతాముతోన్ = పొట్టిదగు యోగదండముతో, కూర్చి = జతపఱచుకొని, పట్టి = పట్టుకొని (కక్షపాలను తనచేతికఱ్ఱకుఁ దగిలించుకొనెను) ఐణీయము = లేడిచర్మముతోఁ జేయఁబడినది, ఒడ్డాణంబులవణిచేన్ = నడుముకట్టుయొక్క బిగిచే, అక్కళించిన పొట్టన్ = లోని కణఁచుకొన్నకడుపును, మక్కళించి = ఉబికించి, అరకూటచ్ఛాయన్ = ఇత్తడిరంగును, అవఘళింపఁగన్ = మించుటకు, చాలు = తగిన, బడుగుదేహమున = బక్కచిక్కినశరీరమున, భస్మము, భూతి, అలఁది = పూసికొని, మిట్టయురమునన్ = ఎత్తైనఱొమ్మునందు, నిడుయోగపట్టె = పొడుగైన (పట్టుతోఁ జేయఁబడి జందెమువాఱగా మెడ నుంచుకొనఁబడు) యోగాభ్యాసవ్యంజక మగుపట్టము, మెఱయన్ = ప్రకాశింపుచుండ, చెవులన్ = కర్ణములందు, రుద్రాక్షపోఁగులు = రుద్రాక్షలు గ్రుచ్చిన చెవిపోఁగులు, చవుకళింపన్ = కదలుచుఁ జెలువొందఁగా, కావికుబుసంబున్ = కావిరంగుగల చొక్కాయ యును, జలకుండికయఁను = నీళ్లుగలకమండలువును, పూని, ఔషధసిద్ధుఁడు = ఓషధులసిద్ధిఁ బొందినవాఁడు (యోగి), తద్గేహము = ఆప్రవరునిగృహము, చేరెన్ = ప్రవేశించెను.
తా. పులితోలుతోఁ జేయఁబడిన కుళ్లాయియుఁ, బంచలోహములు చేర్చి చేసిన కడియమును, గక్షపాలయును, యోగదండమును, ఆఁడుజింకతోలుతోఁ జేసిన నడికట్టుపట్టెయు, యోగపట్టమును ధరించి, పసుపువన్నెగల విభూతి పూసికొని, దేహమునందు విభూతి పూసికొని, రుద్రాక్షపోఁగులు పెట్టుకొని, కావిచొక్కాయ తొడిగి నీళ్లతోడికమండులువును జేతఁబట్టినవాఁ డయి యొకసిద్ధపురుషుఁడు ప్రవరునియింటికి వచ్చెను.
అలం. స్వభావోక్తి.
| తే. | ఇట్లు చనుదెంచుపరమయోగీంద్రుఁ గాంచి | 60 |
టీ. ఇట్లు = ఈ విధముగా, చనుదెంచు = వచ్చుచున్న, పరమయోగీంద్రున్ = ఉత్తముఁడగు యోగీశ్వరుని, కాంచి = ప్రవరుఁడు చూచి, భక్తిసంయుక్తిన్ = భక్తి యుప్పతిల్లుటచే, ఎదురేఁగి, ప్రణతుఁడు = నమస్కరించినవాఁడు, అగుచున్, చూచినంతన యెదురేఁగి ప్రణతుఁ డగుటచే నాగంతుకునియెడలఁ గల భక్త్యతిశయము తేటపడును. అర్ఘ్యపాద్యాదిపూజనంబు = అర్ఘ్యము పాద్యము మొదలైనవానితోఁ జేయఁబడుపూజను, కాళ్లు చేతులు కడుగుకొనుటకు నీ రిచ్చి పూవులతోఁ బూజ చేసి, (అర్ఘ్య మన హస్తోదకము, పాద్య మనఁ బాదోదకము.) ఇష్టమృష్టాన్నకలనన్ = ఇష్టమగునట్టియుఁ బరిశుద్ధమైనట్టియు నన్నము నొసఁగుటచే, సంతుష్టున్ = సంతోషించినవానిఁగా, చేసి = ఒనరించి, యోగి కెట్టియాహారము అభిమతమొ యట్టిసాత్త్వికాహారము నొసంగె ననుట.
| క. | ఎందుండి యెందుఁ బోవుచు | 61 |
టీ. విద్వద్వందిత = పండితులచే నమస్కరింపఁబడినవాఁడా! (తాము) ఎందుండి = ఏప్రదేశమునుండి, ఎందున్ పోవుచున్ = ఎక్కడి కరుగుచు, ఇప్పుడు = ఈసమయమునందు, ఇందులకు = ఈప్రదేశమునకు, ఏతెంచినారలు = వచ్చినారు. నేఁడుగదా = ఈదినమునందె, మత్ + మందిరము = నాయిల్లు, పవిత్రము = పరిశుద్ధము, అయ్యెన్ = ఆయెను. మాన్యుఁడను = పూజనీయుఁడను (యోగ్యుల కాతిథ్య మీఁగలుగుట సుకృతాతిశయము) ఐతిన్.
మహాపురుషుల యాగమనముచే గృహము పవిత్రమగు ననుట ప్రసిద్ధము, “శ్లో. యన్మనీషిపదాంభోజరజఃకణపవిత్రితం, తదేవ భవనం.”
తా. ఓయోగీంద్రుఁడా! మీ రెచటనుండి యెచటికిఁ బోవుచు నిచటికి వచ్చినారు? పెద్దలైన మీరాకచేత మాయిల్లు పరిశుద్ధ మయినది. మీదర్శనముచేత నేను బూజ్యతను వహించితిని.
| క. | మీమాటలు మంత్రంబులు | 62 |
టీ. ఉర్విన్ = భూమియందు, మీమాటలు = మీరు పలుకువచనములు, మంత్రములు = మంత్రములవలెఁ బావనములైనవి. మీమెట్టినయెడ = మీరు త్రొక్కినచోటు, ప్రయాగ = సుప్రసిద్ధమగు ప్రయాగక్షేత్రమువంటిది. మీపాదపవిత్రామలతోయములు = మీయడుగులు తగిలి పవిత్రమగునిర్మలజలములు, అలఘు...రుక్త్యములు - అలఘు = ఎక్కువగు, ద్యోమార్గఝర = ఆకాశగంగ యొక్క, అంబు = ఉదకములకు, పౌనరుక్త్యములు = అవియే ఇవి (కావుటచే వీనిని వేఱుగాఁ జెప్పుట పునరుక్తి.) అవియే యని మఱలఁ జెప్పుట. ఒకమాఱు చెప్పినదానిని మఱలఁ జెప్పుట పునరుక్తి. నీపాదోదకము ఆకాశగంగవలె మిగులఁ బవిత్రమైన దని భావము.
| ఉ. | వానిది భాగ్యవైభవము వానికి పుణ్యవిశేష మెమ్మెయిన్ | 63 |
టీ. భవాదృశయోగిజనంబు = మీవంటియోగులు, ఎవ్వానిగృహాంతరంబునన్ = ఎవనియింటిలో, వేఱు సేయక = భేదము నెంచక, పావనస్నానవిధాన్నపానములన్ = పవిత్రమైన స్నానవిధిచేతను, అన్నపానముల (గైకొనుట)చేతను, నిచ్చలున్ = ఎప్పుడును, సంతసము = సంతోషమును, అందుచున్ = పొందుచు, పోవున్ = వెళ్లునో, వానిది = అవ్వానిదె, భాగ్యవైభవము = అదృష్టదశ, వానిది = అవ్వానిదె, ఎమ్మెయిన్ = ఎన్నివిధములను, అవంధ్యజీవనము = సార్థకమైన బ్రదుకు, వానిది = ఆగృహస్థునిదె, జన్మము = పుట్టుక, ఉత్తమ లగుయోగులకుఁ బరిచర్య చేయఁగలవాఁడె సార్థకజన్ముఁ డనుట.
తా. ఓయోగీశ్వరా! మీవంటిపెద్ద లెవనియింట భేదములేక స్వబంధువులవలెనే స్నానభోజనపానములు చేసి తృప్తి నొంది పోవుచుందురో యాగృహస్థుఁడు భాగ్యవంతుఁడును బుణ్యవంతుఁడు నగును. అటువంటి గృహస్థునిదే సార్థకజీవనమును సార్థకజనము నగును.
| తే. | మౌనినాథ కుటుఁబజంబాలపటల | 64 |
టీ. మౌనినాధ = మునిశ్రేష్ఠుఁడా? కుటుం...లంబున్ - కుటుంబ = సంసారమను, జంబాలపటల = రొంపిప్రోవులో, మగ్న = మునిఁగి యున్న, మాదృశ = నావంటి, గృహమేధిమండలంబున్ = సంసారులసమూహమును, ఉద్ధరింపంగన్ = లేవనెత్తుటకు, యుష్మదంఘ్రిరజోలేశము = మీపాదముమీఁది ధూళిరేణువు, ఒండు = ఒకటి, తక్కన్ = కాక, ఔషధము = మందు, కలదే = ఉన్నదా? లే దని భావము. కుటుంబము ఆధ్యాత్మికచింత గలవారలకుఁ బురదయె కాదు. బురదప్రోవు. కాననే గృహమేధిమండల ముందు మగ్నులు కాఁగలిగిరి. పాదధూళియె యుద్ధరించఁ గలిగినపుడు స్వయముగ మౌనినాథుఁ డెంతేని తోడు సూపఁగలఁడు.
ఔషధము పదరజము అనుదానిచే ప్రవరుని కౌషధప్రాప్తి దూరక్షేత్రసందర్శనసిద్ధి ద్యోతక మగుచున్నది.
అలం. రూపకాలంకారము.
తా. ఓమునీంద్రా! బురదయందువలెనే పెట్టినకా లూఁడదీసికొనశక్యముకాని సంసారమునందు మునిఁగియున్న మావంటివారి నుద్ధరింపఁజాలినది మీపాదధూళి యొకటే కాని మఱి యేదియుఁ గాదు. (మీపాదధూళి సోఁకినమాత్రమున సంసారబంధము వీడిపోవు నని భావము.)
| క. | నా విని ముని యిట్లను వ | 64 |
టీ. నాన్ = అనఁగా, విని = ఆలకించి, ముని = మునీశ్వరుఁడు, ఇట్లను = ఈవిధముగాఁ బ్రత్యుత్తరమిచ్చెను. వత్సా = కుఱ్ఱా! విను = ఆలకించుము, మావంటి = (సన్యాసులై దేశాటనముఁ జేయుచు) మమ్ముఁ బోలిన, తైర్థికావళికిన్ = తీర్థయాత్రాపరులసమూహమునకు, ఎల్లన్ = అందఱకు, సుఖజీవనమునన్ = సుఖముగా జీవించుటచేత, తీర్థసేవయున్ = పుణ్యప్రదములగు తీర్థములకు క్షేత్రములను సేవించుటయుఁగూడ, తలఁపన్ = విచారింపఁగా, మీవంటి గృహస్థుల సుఖజీవనమునఁ గాదె = మీబోఁటియతిథిసేవాపరాయణులగు గేస్తులు సుఖముగా జీవింపఁగలుగుటచేతనే గదా!
తా. ముని యిట్లు చెప్పుచున్నాఁడు — వత్సా! మీవంటి గృహస్థులు సుఖజీవనులై యుండిననే కదా, మాబోఁటి తైర్థికులు తీర్థయాత్రలు చేయుచుండఁ గలుగుట.
| సీ. | కెలఁకుల నున్నతంగెటిజున్ను గృహమేధి | |
| తే. | బధిరపంగ్వంధభిక్షుక బ్రహ్మచారి | 66 |
టీ. బధిర...థులకున్ - బధిర = చెవిటివాండ్రు, పంగు - కుంటివాండ్రు, అంధ = గ్రుడ్డివాండ్రు, భిక్షుక = బిచ్చగాండ్రు, బ్రహ్మచారి = వటువులు, జటి = వానప్రస్థులు, పరివ్రాజక = సన్న్యాసులు, అతిథి = ఆగంతుకులు, క్షపణక = బౌద్ధభిక్షుకులు, అవధూత = దిగంబరులు, కాపాలిక = కాపాలికమతస్థులు, ఆది = మొదలగు, అనాధులకున్ = దిక్కు లేనివారలకు, గృహమేధి = గృహస్థుఁడు, కెలఁకులన్ = ప్రక్కలను, ఉన్న, తంగెట్టిజున్ను తంగెటి చెట్టునకుఁ బెట్టఁబడిన తేనెతుట్టె (వంటివాఁడు), యజమానుఁడు = గృహస్థుఁడు (వాస్తవ్యుఁడు, కాఁపు, సంసారి, భవనభర్త, కులపతి, కుటుంబి, ఈ పదము లన్నియు గృహస్థుఁ డనునర్థము కలవియే) యజమానుఁడు = గృహస్థుఁడు, అంకస్థితార్థపేటి = తొడపైనున్న ధనపుఁబెట్టె (వంటివాఁడు) వాస్తవ్యుఁడు = గృహస్థుఁడు, పెరటికల్పకము = దొడ్డిలోనికల్పవృక్షము (వంటివాఁడు) కాఁపు = గృహస్థుఁడు, దొడ్డిన్ = పెరటియందు, పెట్టిన = ఉంచిన, వేల్పుగిడ్డి = కామధేనువు (వంటివాఁడు) సంసారి = గృహస్థుఁడు, కడ = పారము, లేని = లేకుండు, నడబావి = దిగుబావి (వంటివాఁడు), భవనభర్త = గృహస్థుఁడు, సవిధమేరునగంబు = సమీపమున నున్న మేరుపర్వతము (వంటివాఁడు) కులపతి = గృహస్థుఁడు, మరుదేశ...ప్రవ - మరుదేశ = నీరు లేని ప్రదేశమందలి, పథి = త్రోవయొక్క, మధ్యమ = నడుమనుండు, ప్రప = చలిపందిరి (వంటివాఁడు), కుటుంబి = గృహస్థుఁడు, ఆఁకటికిన్ = ఆఁకలివేళకు, ఒదవు సస్యము = ఉపయోగపడు పైరు, కానన్ = కాఁబట్టి, భూసురోత్తమ = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా! గార్హస్థ్యమునకున్ = గృహస్థత్వమునకు, సరియె = ఇతరాశ్రమములు సమానములా? కా వనుట. సమీపమున నున్న తంగెటిజున్ను, తొడపైనున్న ధనపుఁబెట్టె మొదలగునవి సర్వదా యెటుల సుసాధ్యములో యటులె గృహస్థాశ్రమము తదితరులకు సహాయకర మని భావము. రూపకోల్లేఖములు అలంకారములు.
తా. చెవిటి, కుంటి, గ్రుడ్డి మొదలయిన దిక్కుమాలినవారి కెల్లను గృహస్థుఁడే రక్షకుఁడు. కాబట్టి గృహస్థాశ్రమమువంటియాశ్రమము లేదు.
| క. | నావుడుఁ బ్రవరుం డిట్లను | 67 |
టీ. నావుడున్ = అనఁగా, (మునివరుఁడు వాకొనినంతన) ప్రవరుఁడు = ప్రవరాఖ్యుఁడు, ఇట్లు అనున్ = ఈవిధముగా బ్రత్యుత్తరము నొసంగెను. దేవా = మహానుభావా! మీరు, ఇలపై = భూమియందు, సమస్తతీర్థాటనమున్ = ఎల్లతీర్థములందు సంచారమును, కావింతురు = చేయుదురు, విభజించి యడుగన్ = ఒక్కొక్కయంశమును వేఱుపఱచియడుగుటకు, కౌతుకము = కుతూహలము, అయ్యెన్.
తా. సిద్ధుఁడు గృహస్థాశ్రమమును బ్రశంసింపఁగాఁ బ్రవరుఁడు విని మునీంద్రా! తాము సమస్తపుణ్యతీర్థములను సందర్శించుచుందురుగదా! కావున నాయాతావులఁ గల విశేషములు నెఱుంగ మనసయ్యెను.
| శా. | ఏయేదేశములన్ | 68 |
టీ. మహాత్మా = మహానుభావా, మీరు, ఏయేదేశములయందు, వసించితిరి = ఉంటిరి. పా. చరించితిరి = తిరిగితిరి, ఏయేగిరుల్ = ఏయే పర్వతములు, చూచినారు = సందర్శించితిరి, ఏయేతీర్థములందున్ = ఏయేపుణ్యజలములయందు, క్రుంకిడితిరి = స్నానము కావించితిరి. ఏయేద్వీపముల్ = ఏయేదీవులను, మెట్టినారు = త్రొక్కితిరి, పుణ్యవనాళిన్ = పవిత్రములైన అరణ్యములందు, త్రిమ్మరితిరి = తిరిగితిరి, తోయధుల్ = సముద్రములను, డాసినారు = చేర నరిగినారు.
తా. ఓమహానుభావా! మీ రున్నదేశములను, మీ రాడినతీర్థములను, జూచినకొండలను, జొచ్చినదీవులను, విహరించినపుణ్యారణ్యములను, స్నానార్ధము పోయిన సముద్రములను, వానివానియందుఁగల వింతలను నాకు విశదముగా నానతీయవలయును.
| తే. | పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ | |
| | కాన వేఁడెద ననిన నమ్మౌనివర్యుఁ | 69 |
టీ. పోయి = ఆయాదివ్యక్షేత్రముల కేఁగి, సేవింపలేకున్నన్ = ఆపుణ్యతీర్థములసేవ చేయఁజాలకున్నను, పుణ్యతీర్థమహిమ = పుణ్యప్రదములగు తీర్థముల ప్రభావము, వినుట = ఆలకించుట, అఖిలకల్మషహరంబ = సమస్తపాపములను పోఁగొట్టఁజాలినదే, కానన్ = కావున, వేఁడెదన్ = ప్రార్థించెదను, అనినన్ = అని వేఁడఁగా, అమ్మౌనివర్యుండు = ఆసిద్ధుఁడు, ఆదరాయత్తచిత్తుడు ఐ = ఆదరమునకు స్వాధీనమయిన మనస్సు గలవాఁడై, అతనికిన్ = ఆప్రవరునకు, అనియెన్.
| ఉ. | ఓచతురాస్యవంశకలశోదధిపూర్ణశశాంక తీర్థయా | 70 |
టీ. చతు...శాంక - చతురాస్య = బ్రహ్మయొక్క, వంశ = కుల మనెడు, కలశోదధి = పాలసముద్రమునకు, పూర్ణశశాంక = పూర్ణచంద్రుఁడా! తీర్థయాత్రాచణశీలినై = తీర్థయాత్రలు చేయుటయందుఁ బ్రఖ్యాత మగుస్వభావము గలవాఁడనై, జనపదంబులు = దేశములును, పుణ్యనదీనదంబులున్ = పవిత్రము లైన నదులను నదములను (తూర్పునకుఁ బ్రవహించునవి నదులు, పడమరకుఁ బ్రవహించునవి నదములు), ఆపటీరాచ...చలంబుగన్ - ఆపటీరాచల = మలయపర్వతము మొదలుకొని, పశ్చిమాచల = అస్తాచలము, హిమాచల = హిమవత్పర్వతము, పూర్వదిశాచలంబుగన్ = ఉదయపర్వతము వఱకు గలుగునట్లు (ఈనాల్గు పర్వతములు చుట్టివచ్చునట్టి దేశము ననుట.) (దిశాచలంబులన్ అని పా.) చూచితిన్ = కాంచితిని, అందునందుఁగల చోద్యములన్ = ఆయాతావులయందుఁ గలవింతలను, కనుఁగొంటిన్ = కాంచితిని. చతు...శశాంక అనుటచేఁ బ్రవరుని యాభిజాత్యసౌశీల్యపాండిత్యాదులు సిద్ధుండు గ్రహించె ననుట నాలుగు దిక్కులు చుట్టి వచ్చితి ననుటచేఁ బ్రపంచమునందలి వింత లన్నింటిని దర్శించెనని భావము.
| శా. | కేదారేశు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా | 71 |
టీ. కేదారేశున్ = కేదారేశ్వరుని, భజించితిన్ = సేవించితిని, హింగుళాపాదాంభోరుహముల్ = హింగుళాదేవియొక్క పాదపద్మములను, శిరమున = తలయందు, కీలించితిన్ = తాల్చితిని, సాష్టాంగనమస్కారము గావించెననుట, ప్రయాగనిలయు = ప్రయాగయందు వసించు, పద్మాక్షున్ = మాధవుని, సేవించితిన్ = భజించితిని, యాదోనాథసుతాకళత్రు = లక్ష్మీప్రియుఁ డగు, (సముద్రునిపుత్రి యగు లక్ష్మి భార్యగాఁ గలవాఁ డగు) బదరీనారాయణున్ = బదరికాశ్రమమున నెలకొను నారాయణుని, కంటిన్ = చూచితిని, ఈయాదేశం బన నేల = ఈప్రదేశము ఆప్రదేశ మని పేరు పెట్టి వాకొన నేల, సమస్త+ఆశా+అవకాశంబులన్ = సర్వదిక్కులయొక్క మధ్యప్రదేశములను (ప్రపంచమునంతయు) చూచితిన్ = నేను కాంచితిని.
| వ. | అది యట్లుండె వినుము గృహస్థరత్నంబ! లంబమానరవిరథ | |
| | వికటకూటకోటివిటంకశృంగాటకాఢౌకమానజరదిందు | 72 |
టీ. అట్లుండె = అటుండనిమ్ము, గృహస్థరత్నంబ = గృహస్థులలో శ్రేష్ఠుఁడ! లంబమాన...సముదయంబు - లంబమాన = వ్రేలాడుచున్న, రవిరథ = సూర్యునిరథముయొక్క, తురంగ = అశ్వములకు, శృంగార = అలంకార మయిన, చారు = సుందరమగు, చామరచ్చటా = చామరపుగుడులయొక్క, ప్రేక్షణ = చూచుటయందలి, క్షణ = ఉత్సవముచే, ఉద్గ్రీవ = మెడలు పైకెత్తుకొనియున్న, చమరసముదయంబు = చమరమృగముల సమూహము కలది (సూర్యా శ్వముల కలంకారముగా నుంపఁబడిన చామరములఁ గాంచి యీపర్వతముమీఁది చమరీమృగము లాయశ్వములను మోరలు పై కెత్తుకొని చూచుననుట.) ఉదయంబునన్ = ఉదయపర్వతమునందు, కలవిశేషంబులు = కలిగిన యతిశయములు, శేషఫణికినైన = ఆదిశేషున కైనను, లెక్కింపన్ = కొన్ని యని లెక్కపెట్టుటకు, శక్యంబె = తరమా ? శేషుఁడేని గణింపఁజాలఁ డనుట (చామరము లలంకారముగ నుంటచే సజాతీయచమరీమృగము లని యితరచమరీమృగములు తలయెత్తి చూచుచుండెనని భావము) గుఱ్ఱములకుఁ జామరము లలంకరింతు రనుటకు శ్లో. “ముక్తేషు రశ్మిషు నిరాయతపూర్వకాయా, నిష్కంపచామరశిఖా నిభృతోర్ధ్వకర్ణాః ఆత్మోత్థితైరపి రజోభి రలంఘనీయా, ధావంత్యమీ మృగజవాక్షమయేవరథ్యాః." (అభిజ్ఞానశాకుంతలము). అలం. భ్రాంతిమంతము. అంధక ...లతావలయంబు - అంధకరిపు = శివునియొక్క, కంధరా = కంఠము, ఆవాస = నివాసముగాఁగల వాసుకి(యొక్క), వియోగ = ఎడబాటుచే, భవ = పుట్టిన, దుర్వ్యథా = చెడ్డవెతయొక్క, ఆభోగ = పరిపూర్ణత గల, భోగినీ = సర్పాంగనలయొక్క, భోగభాగ = శరీరభాగములచే, పరివేష్టిత = చుట్టుకోఁబడిన, పటీరవిటపి = గంధపుఁజెట్టుయొక్క, వాటికా = వీథులయందు, వేల్లత్ = అల్లుకొనుచున్న, ఏకాలతావలయంబు = ఏలకితీవలప్రోవులు గలది, భర్త యగు వాసుకి శివునికంఠమున వసించుటచే వియోగమును సైఁపఁజాలక పరితాపపడు సర్పాంగనలు చుట్టుకొన్న గందపుఁజెట్లయందు నేలకి తీగ లల్లుకొన్నవనుట, మలయంబునన్ = మలయపర్వతమునందు, కలచలువకున్ = ఉన్న చలువఁదనమునకు, విలువ = వెల, ఎయ్యది = ఏది, లేదనుట. విరహతాపమునకుఁ జందన ముపశమనౌషధము. సర్పాంగనలు భర్తవలని యెడబాటు సైపనోపక తాప మాపుకొనుటకు గందపుమ్రాఁకులఁ గౌఁగిలించికొనిరి. అలం. ఉత్ప్రేక్ష. అకటకట = ఆహాహా, ఇది ప్రశంసార్థకము. వికట...హస్తంబు - వికట = హెచ్చుత గ్గయిన, కూటకోటి = శిఖరసమూహములయొక్క, విటంక = గూండ్లవంటి ముంజూరునెఱియలయొక్క, శృంగాటక = కూడలిపట్టులందు, ఆఢౌకమాన = దుముకుచున్న, జరదిందుబింబ = అస్తమించుచంద్రబింబమునుండి, గళత్ = తొరఁగు, అమృతబిందు = అమృతబిందువులచేఁ గలిగిన, దుర్దిన = జడివాన దినమున, ఆర్ద్రీకృత = తడిసినవిగాఁ జేయఁబడిన, సల్లకీ = అందుగుఁజెట్లయందలి, పల్లవ = చివుళ్లయొక్క, ప్రభంజన = నాశము చేయుటయందు, పర = ఆసక్తమయిన, అంజనహస్తి = అంజన మను పడమటిదిక్కునఁగల యేన్గుయొక్క, హస్తంబు = తుండము గలది, అగు అస్తంబునన్ = అస్తాచలమునందు, కల మణిప్రస్తరంబుల విశ్రాంతిన్ = ఉన్న మణిమయములగు చఱియలపై విశ్రమించుటను, చింతించినన్ = తలంచుకొన్నను, మేనన్ = దేహమునందు, పులకలు = గగుర్పాటులు, ఇప్పుడున్ = ఇపుడు గూడ, పొడమెడున్ = పొటమరించుచున్నవి. అందుగుఁజివుళ్లు ఏనుఁగులకు మిగుల యిష్టమనుట కిందే సీ. “తుండముల్ సాచి యందుగుచివుళ్లుకు నిక్కు కరులదంతచ్ఛాయ గడలు కొనఁగ” యని గలదు. స్వస్వ...మరాళంబు - స్వస్వ = తమతమచే, ప్రవర్థి = వృద్ధి పొందింపఁబడిన, వర్ధిష్ణు = వృద్ధిపొందఁదగు, ధరణీరుహసందోహ = చెట్లసమూహముయొక్క, దోహద = ఆసమయమునఁ బుష్పాదులు కలుగునట్లు చేయుకర్మమే, ప్రధాన = ముఖ్యముగా, అసమాన = సాటి లేనట్టుగా, ఖేలత్ = విహరించుచున్న, ఐలబిలవిలాసినీ = కుబేరునిస్త్రీలయొక్క, విలాస = విలాసమును గల్గించునట్టి, వాచాల = ధ్వనించుచున్న, తులాకోటి = అందెలయొక్క, కలకల(ధ్వనిచే), ఆహూయమాన = పిల్వఁబడుచున్న, మానస = మానస మను సరస్సునందలి, మదాలస = మదముచేఁ జొక్కిన, మరాళంబు = అంచలు గలది. (కుబేరుని జవరాండ్రు తమచేఁ బెంపఁబడిన వృక్షములకు దోహదక్రియలు చేయుటకై సంచరించు నప్పుడు కలకలమని మ్రోఁగు తమయందెలమ్రోఁతకు తమజాతిపక్షులకూఁత లనుకొని యంచలు చేరవచ్చు ననుట.) అగు రజతశైలంబు నోలంబులన్ = ఐన వెండికొండమాటుచోటులను, కాలగళు విహారప్రదేశంబుల = శివుని విహరించుతావులను, కన్న = చూచినయెడల, సంసృతిక్లేశంబులు = సాంసారికష్టములు, పాయవే = పోవా? అంచలయఱపులు అందెలమ్రోఁతలు సమముగా నుండు ననుటకు శ్లో. “ఏతాశ్చలద్వలయసంహతి మేఖలోత్థ, ఝంకారనూపుర పరాజిత రాజహంస్యః." (భర్తృహరి) సతత...ధురంధరంబు - సతత = ఎడతెగక, మదజల = మదోదకముయొక్క, స్రవణ = స్రవించుటయందు, పరాయణ = సంసక్తమయిన, ఐరావణ = ఐరావతముయొక్క, విషాణకోటి = దంతాగ్రములచే, సముట్టంకిత = పొడువఁబడిన, కటక = కొండనడిమిప్రదేశమందు, పరిస్ఫురత్ = ప్రశాశించు, కురువింద = కెంపులయొక్క, కందళవ్రాత = మొలకలగుంపువలన, జాత = కలిగిన, అలాతశంకా = కొఱవు లనెడి సంశయముచే, అపసర్పత్ = తప్పించుకొనిపోవు, అభవ = ఆఁడయేనుఁగుయొక్క, భ్రమీ = చుట్టుదిరుగుటయొక్క, విభ్రమధురంధరంబు = విలాసము ఎక్కువగాఁ గలది అగు, మేరు...సోయగంబు - మేరుధరాధరంబు = మేరుపర్వతముయొక్క, శిఖరంబుల(యొక్క), సోయగంబు = సొగసు, కలయన్ = అంతటను, కనుంగొనుట = చూచుట, (బాగుగాఁ దృప్తిదీర సందర్శించుట) బహు...పాకంబునన్ - బహుజన్మ = అనేకజన్మములందు, కృత = చేయఁబడిన, సుకృత = పుణ్యముయొక్క, పరిపాకంబునన్ = పండుటచే, కాక = కాని, ఏల = ఎందులకు, చేకూఱనేర్చున్ = కలుగనేర్చును, ఇట అలంకారము భ్రాంతిమంతము. కురువిందములు మదకోకిలముల కంటికాంతివలె నెఱ్ఱగా నుండునని రత్నశాస్త్రమునందుఁ జెప్పఁబడెను. అగ్ని రక్తకణములోని దనుటకు "నవకిసలయతల్పం పుంజితాంగారకల్పం" అని పుష్పబాణవిలాసము. కురువింద మెఱ్ఱగా నుండుటకు దృష్టాంతము సీ. “సలలితమత్తకోకిలలోచనద్యుతి నలరారు కురువెంద మనెడుకెంపు" (రత్నపరీక్ష) మహాద్భుతంబులు = మిక్కిలి నాశ్చర్యము కలిగించునవి, ఈశ్వరానుగ్రహంబునన్ = దేవునియనుగ్రహముచే, అల్పకాలంబునన్ = త్వరగనే, కనుం గొంటిన్ = చూచితిని, అనుటయున్ = అని సిద్ధుఁడు చెప్పఁగా, ఈషదం...ళుండు - ఈషత్ = కొంచెముగా, అంకురిత = పొడమిన, హసన = నగవును, గ్రసిష్ణు = మ్రింగు, గండయుగళుండు = రెండుచెక్కిళ్లు గలవాఁడు. (ఇంచుక మొలకెత్తు నవ్వును జెక్కిళ్లతో మాటినవాఁడై) ప్రవరుండు, అతనికిన్ = మునికి, ఇట్లు అనియెన్.
| చ. | వెఱవక మీ కొనర్తు నొకవిన్నప మిట్టివి యెల్లఁ జూచి రా | 73 |
టీ. వెఱవక = జంకు చెందక, ఒకవిన్నపము = ఒకమనవి, మీకున్ = తమకు, ఒనర్తున్ = చేయుదును, మి మ్మొకవిషయము ప్రశ్నించెదను. ఇట్టివి యెల్లన్ = ఇట్టివిచిత్రములన్నియును, చూచిరాన్ = చూచివచ్చుటకు, ఎఱకలు = ఱెక్కలు, కట్టుకొన్నన్ = కట్టికొనినను (ఱెక్కలతోఁ బోయి వ్రాలినను), మఱి = ఇంకను, ఏండ్లును బూండ్లును = పెక్కుసంవత్సరములకాలము, పట్టున్ = సరిపోవు, మీమొగము = మీముఖము, ప్రాయపుంజిఱుతతనంబు = వయస్సునఁ జిన్నతనమును, చెప్పక చెప్పెడున్ = నోటితోఁ జెప్పనక్కఱలేకయే చెప్పుచున్నది, అద్దిరయ్య = ఆహా! ఈర = మీరే, మీమహిమలు = మీప్రభావములు, మాకున్ = మాబోంట్లకు, ఎఱుఁగన్ = తెలిసికొనుటకు, తరంబె = శక్యమా! ఈర = మీరలే, ఎఱుంగుదురు = గుర్తెఱుంగుదురు. అనన్యసాధ్యమగు మీమహిమ మాబోం ట్లెఱుంగఁజాలరు, ఏమి చెప్పుదున్ = ఇఁక నేమి చెప్పఁగలను?
తా. జంకు గొనక మీతో నొకటి మనవిచేసికొనుచున్నాను. మీరు చూచితి మన్న విచిత్రముల నెల్లఁ జూచివచ్చుటకు ఱెక్కలు గట్టుకొని పోయినను నెన్నిసంవత్సరము లైనఁ బట్టును. మీరు మిక్కిలి చిన్నవయసు గలవారని మీముఖము చెప్పకయే చెప్పుచున్నది. ఇంత చిన్నవయస్సున నవియెల్ల నెట్లు చూడఁగల్గితిరో, ఆహా! మీమహత్త్వములు మీకుఁ దెలియవలయుఁగాని మాకుఁ దెలియఁ దరమా!
| క. | అనినఁ బరదేశి గృహపతి | 74 |
టీ. అనినన్ = ప్రవరుఁడనఁగా, పరదేశి = ఇతరదేశపువాఁడు (సిద్ధుఁడు), గృహపతికిన్ = ఆ ఇంటియజమానునకుఁ (ప్రవరునకు) అనియెన్ = ఇటులఁ బ్రత్యుత్తర మొసంగెను. సందియము = సందేహమును, తెలియన్ = తెలిసికొనుటకు, అడుగుట = ప్రశ్నించుట, తప్పా = దోసమా? వినవయ్య = ఆలకింపుము. సిద్ధులము = ఔషధసిద్ధి గలవారము, అగుటన్ = అవుటచేత, మమ్మున్, జరయున్ = ముదుసలితనమును, రుజయును = రోగమును, చెనకంగాన్ = అంటుటకు, వెఱచున్ = భయపడును.
తా. ప్రవరునితో సిద్ధుఁ డనియెను. వెఱవ నేల? సంశయము వారించుకొనుట కడుగుట తప్పుకాదు. మేము సిద్ధులము గావున ముదిమియు రోగమును మమ్ము ముట్టనేరవు.
| మ. | పరమంబైన రహస్యమౌ నయిన డాఁపన్ జెప్పెదన్ భూమిని | 75 |
టీ. భూమినిర్జరవంశోత్తమ = బ్రాహ్మణవంశమునకు శ్రేష్ఠుఁ డగువాఁడా! (ప్రవరుఁడా) పరమంబు = గొప్పది, రహస్యము = దాఁచిపుచ్చవలసినది, డాఁపన్ = దాఁచియుంచను, పాదలేప మనుపేరన్ = పాదలేప (అడుగుపూఁత) మనుపేరితో, దివ్యౌషధంపురసంబు = ఉత్తమమగు నోషధిసంబంధ మగు రసము, ఈశ్వరసత్కృపన్ = దైవానుగ్రహముచే, కల్గెన్ = నాకు లభించెను. తద్భూరిప్రభావంబునన్ = దానియొక్క గొప్పమహత్త్వముచేత, పవమా...హంకృతిన్ - పవమాన = వాయువును, మానస = మనస్సును, తిరస్కారి = వంచించునట్టి, త్వరా = వేగముయొక్క, అహంకృతిన్ = అహంకారముచే, చరియింతున్ = తిరుగుదును.
పరమరహస్యముగానఁ జెప్పరాదు. నీవు భూదేవులం దుత్తముఁడవు. కాన నెఱింగించుచున్నాఁడ ననుటచే రహస్యప్రకటనమువలనఁ గలుగు దొసఁగుకంటెఁ దెలుపుటయే ఫలప్రదమని భావము. దివ్యౌషధముగాననే యది భూరిప్రభావము గలది. ఈశ్వరసత్కృపాలబ్ధముగావున నది సామాన్యులకు లభించునది కాదనుట.
తా. విప్రోత్తమా! మిక్కిలి గోప్య మగువిషయమైనను నీకు దాఁపక చెప్పుచున్నాను. దైవానుగ్రహమువలన నాకుఁ బాదలేప మనునొకయోషధీరసము సంభవించినది. దానిసామర్థ్యమున వాయువేగమును మనోవేగమును మించిన వేగముతోఁ దిరుగుదును.
| క. | దివి బిసరుహబాంధవసైం | 76 |
టీ. దివిన్ = ఆకసమున, బిస...సంఘంబు - బిసరుహ = పద్మములకు, బాంధవ = చుట్ట మగుసూర్యునియొక్క, సైంధవసంఘంబు = గుఱ్ఱముల సమూహము, ఎంతదవ్వు = ఎంతదూరము, దగ లేక = దప్పి లేకఁ (శ్రమలేక) అరుగున్ = పోవునో, భువిన్ = భూమిని, అంతదవ్వున్ = అంతదూరమును, దగయన దప్పి యనుటకంటె అలసట యనుటయే యొప్పిదము. ప్రయాణముచేఁ గలుగునది యలనట. దగపదమును అలసట యనునర్థమునఁ బెద్దనార్యుఁడు నాలుగవ యాశ్వాసమున నిందె సీ. “పెనుదవ్వు దగదొట్టఁ జని రెట్టవడఁ గొట్టె నుడువీథి బెళగువ్వ నొక్కయణఁజు." అని కలదు. నేమును = మేమును, ఠవఠవ లేక = ఆయాసము లేక, హుటాహుటినడలన్ = చకచకగల నడకలతో, అరుగుదుము = పోవుదుము.
తా. ఆకాశమున సూర్యాశ్వము లెంతదూర మనాయాసముగా నరుగునో భూమిపై మేమును నంతదూరము చకచక నడకలతో శ్రమలేక తిరుగుదుము.
| మ. | అనినన్ విప్రవరుండు కౌతుకభరవ్యగ్రాంతరంగుండు భ | 77 |
టీ. విప్రవరుండు = బ్రాహ్మణశ్రేష్ఠుఁడు (ప్రవరుఁడు), కౌతుక ..రంగుండు - కౌతుకభర = కుతూహలాతిశయముచే, వ్యగ్ర = తొందరపడు, అంతరంగుండు = మనస్సుగలవాఁడు, భక్తి...బంధుగుండు - భక్తి(చేత), నిబద్ధ = కూర్చఁబడిన, అంజలిబంధురుండు = దోసిలిచేత నొప్పువాఁడునుఁ అయి, మీదివ్యప్రభావంబు = మీ గొప్పసామర్థ్యమును, ఎఱుంగని = గ్రహింపజాలని, నాప్రల్లదముల్ = వదరు పల్కులను, సహించి = ఓర్చి, మునిలోకగ్రామణీ = మునిజనులలో శ్రేష్ఠుఁడా, సత్కృపన్ = మంచికరుణతో, మీశిష్యునిన్ = మీశిష్యుఁడనయిన, ననున్ = నన్ను, సామాన్యమానవునిగాఁ దలంచి యెటులఁ బోయి ప్రపంచమంతయు దర్శింపఁగలిగితి రనుట ప్రల్లదము. తనప్రమాదము సిద్ధునిప్రశస్తి గ్రహించినంతన ప్రవరుఁడు కౌతుకముతోడ అంకని బంధము దాల్చెను, తీర్థయాత్రవలనన్ = తీర్థములకు యాత్రలు చేయుటచే, ధన్యాత్ముఁగాన్ = కృతార్థమయినయాత్మ గలవానిఁగా, చేయరే = చేయుఁడీ.
తా. అనునప్పటికిఁ బ్రవరుఁడు అతికుతూహలముచే మనస్సు తొట్రుపడఁగా దోసిలి యొగ్గి, మునివర్యా! మీ మాహాత్మ్యమును తెలిసికొనలేక నేను బల్కిన ప్రల్లదపుఁబల్కులను మన్నించి కరుణతో శిష్యుఁడ నగునన్ను తీర్థయాత్రలఁ జేయించి కృతార్థునిఁ జేయ వేఁడెద ననెను.
| క. | అనుటయు రసలింగము నిడు | 78 |
టీ. అనుటయున్ = అనఁగా, రసలింగమున్ = రసముతోఁ గావించిన కణికెను, తన = తనయొక్క, వట్రువప్రేఁపసజ్జన్ = గుండ్రనిప్రేఁపబుట్టలోన, నిలిచిన = నిండించిన, ఒకపసరు = ఒకానొకపచ్చనిద్రవము, ఇది యది యని చెప్పక = ఎట్టిదనియుఁ దెలుపక, తత్పదాంబుజయుగళిన్ = ఆతనితామరలవంటి రెండడుగులందును, పూసెన్ = రాచెను.
తా. పరమరహస్యము గానఁ బ్రవరుఁ డాపసరుపే రడుగ లేదు. ఈశ్వరలబ్ధము పరమగోప్యము గాన మునియుఁ బేరు చెప్పక పసరు రాచెను.
| క. | ఆమం దిడి యతఁ డరిగిన | 79 |
టీ. ఆమందున్ = ఆపాదలేపనమును, ఇడి = పూసి, అరిగినన్ = పోవఁగా, భూమీసురుఁడు = బ్రాహ్మణుఁడు (ప్రవరుఁడు), తుహిన...పేక్షన్ - తుహినభూధర = మంచుఁగొండయొక్క, శృంగ = శిఖరములందలి, శ్యామల = పసరుమీఱిననలుపుగల, కోమల = నవనవలాడు, కానన = అడవులయొక్కయు, హేమ = బంగారుతో, ఆఢ్య = ఒప్పిన, దరీ = గుహలయొక్కయు, ఝరీ = సెలయేళ్లయొక్కయు, నిరీక్షా = చూచుటయందలి, అపేక్షన్ = కోరికచే, అరిగెన్ = పోయెను.
దరీశబ్దమునకుఁ గొందఱు లోయ యని యర్థము చెప్పిరి.
పచ్చగా నున్నచెట్లను నలుపుగాఁ జెప్పుట కవిసమయము.
| వ. | అనిన విని యమ్మహీసురవరుఁ డ ట్లరిగి యెట్లు ప్రవర్తించె | 80 |
టీ. అనినన్ = (ఇట్లు పక్షులు) పలుకఁగా, (జైమిని) విని, మహీసురవరుండు = బ్రాహ్మణశ్రేష్ఠుఁడు (ప్రవరుఁడు), ఎట్లు = ఏవిధముగా, ప్రవర్తించెన్ = నడచుకొనెను. అతని = ఆప్రవరాఖ్యుని, పుణ్యవర్తనశ్రవణంబు = పవిత్ర మయిన నడువడియొక్క వినుట, హర్షోత్కర్షంబున్ = సంతోషాతిశయమును, కల్పించెన్ = కలుగఁజేసెను. తర్వాతివృత్తాంతంబు = మంచుకొండ కేఁగినది మొదలు జరిగినకథ, కృపాయత్తచిత్తంబునక్ = దయకు నధీనమయిన మనస్సుతో, ఆనతీయవలయున్ = సెలవీయవలెను. అని యడుగుటయున్ = అని జైమినిమహాముని యడుగఁగా, దీనికి రెండవయాశ్వాసమునందలి యవధరింపు మనుక్రియతో నన్వయము.
| శా. | గంగాస్వచ్ఛతరంగభంగికయశోగాఢచ్ఛవిచ్ఛన్నపా | 81 |
టీ. గంగా...కాంక - గంగా(నదియొక్క), స్వచ్ఛ = నిర్మలమయిన, తరంగ = తరఁగలయొక్క, భంగిక = రీతిగల, యశః = కీర్తియొక్క, గాఢ = అధికమయిన, ఛవి = కాంతిచే, ఛన్న = కప్పఁబడిన, సారంగాంక = చంద్రునియొక్క, అంక = కళంకముగలవాఁడా! (గంగాతరంగములవలె స్వచ్ఛమయిన కీర్తియొక్క కాంతిచేఁ జంద్రునిలోని కళంకమును గప్పిపుచ్చినవాఁ డనుట.) నిరంకుశ...భావుకా - నిరంకుశ = నిరాఘాటకమయిన, ప్రతికళా = ప్రతివిద్యయందలి, ప్రౌఢీ = సామర్థ్యమువలన, ప్రియంభావుకా = ఇష్టుఁడగువాఁడా! గాంగే...స్పదా - గాంగేయాచల = మేరుపర్వతము, చాప = విల్లు గాఁగల = శివునియొక్క, నూపుర = అందియయగు నాదిశేషునియొక్క, వచః = వాక్కులవంటి వాక్కులయొక్క, గాంభీర్య = ప్రౌఢిమయొక్క, లీలా = విలాసమునకు, అస్పదా = స్థానమగువాఁడా! బంగా...నిలా - బంగా, ళాంగ, కళింగ(ములను దేశములయొక్క) భూప = రాజులయొక్క, సుభట = మంచిబంటులను, అభ్రశ్రేణి = మేఘపంక్తికి, ఝఝానిలా = పెద్దగాలి యగువాఁడా! (ఈ విశేషణము లన్నియుఁ గృతిపతి యగు కృష్ణరాయనికిఁ జెందుచున్నవి.) రూపకము.
గంగాజలము స్వచ్ఛతాసాంద్రముగాన కీర్తితో నుపమింపఁబడెను. ఇటులె శ్రీనాథుఁడును గొండొకచో “సాటి చదలేటినీటికి హాటకగర్భునివధూటికి... విశదయశంబుల్" అని చెప్పెను. శేషుఁడు సహస్రముఖుడుగాన నాతనివచోగాంభీర్య మసమాన మైనది. రాయ లంతటివచోగాంభీర్యము గలవాఁడనుటకు నిరంకుశప్రతికళాప్రౌఢిప్రియంభావుకత్వము సాధనము.
తా. చంద్రమండలమువఱకు వ్యాపించిన గంగయందలి యలలవలెఁ దెల్లనైనకీర్తి గలవాఁడవును, ఎల్లవిద్యలందును గల మిక్కుటమయిన పాండిత్యముచే మేలొందినవాఁడవును, ఆదిశేషుని వాగ్వైఖరివంటి వాగ్వైఖరి గలవాఁడవును, అంగకళింగబంగాళదేశముల రాజుల సేనలను గెలిచినవాఁడవునైన కృష్ణదేవరాయా!
అలం. ఉపమాతిశయోక్తినిదర్శనారూపకములు.
| క. | మండలికతపనశోభిత, కుండలిపతిశయనకర్ణకుండలితరసా | |
| | ఖండకవి కావ్య దిగ్వే, దండశ్రుతిదళనకలహతాడితపటహా. | 92 |
టీ. మండ...భిత - మండలికతపన = (సామంతరాజులకు సూర్యుఁడు) అను బిరుదముచే, శోభిత = ప్రకాశించువాఁడా! కుండలి...కావ్య - కుండలిపతి = ఆదిశేషుఁడు, శయన = నెజ్జగాఁగల విష్ణుని, కర్ణ = వీనులకు, కుండలిత = కుండలములుగాఁ జేయఁబడిన, రసాఖండ = శృంగారాదిరసములతో నెడతెగని, కవి = కవులయొక్క, కావ్య = కావ్యములుగలవాఁడా! దిగ్వేదండ...పటహా - దిగ్వేదుడ = దిగ్గజములయొక్క, శ్రుతి = చెవులను, దళన = పగులగొట్టునట్టి, కలహతాడిత = యుద్ధములందు మ్రోయింపఁబడిన, పటహా = తప్పెటలు గలవాఁడా!
మండలీకుఁ డనఁగా వింశతియోజనముల (ఇరువదియామడల) విశాలమైనభూమిని బరిపాలించువాఁడు, తనకంకితముగాఁ గాక వేంకటేశ్వరాంకితముగాఁ బెక్కుకావ్యములు కవులఁ బ్రోత్సహించి రచింపఁజేసినవాఁడను భావమును “కుండలిపతి...కవికావ్య" సమాసమునుండి గ్రహింప నగును.
తా. మండలికతపనుఁ డనుబిరుదము గలవాఁడా! విష్ణునకు శ్రవణానంద మగునట్లు కవులచే రసమతము లగు కావ్యములఁ జెప్పించినవాఁడా! యుద్ధములందు దిగ్గజములచెవు లదరునట్లు పటహముల మ్రోయించువాఁడా!
| ఉత్సాహ. | కుకురుకాశకురుకరూశకోసలాంధ్రసింధుబా | 93 |
తా. కుకురు, కాశ, కురు, కరూశ, కోసల, ఆంధ్ర, సింధు, బాహ్లిక, శక, అంగ, వంగ, సింహళ (దేశములను), ఈశ = ప్రభువులయొక్క, కన్యకామణి = కన్యారత్నములయొక్క, ప్రకర = సమూహముయొక్క, పాణి = హస్తములందు, ఘటిత = తాల్పఁబడిన, రత్నపాదుకా = మణులు పొదిగిన పావకోళ్లు, కలాచికా = తమ్మపడిగము, ముకుర = అద్దము, వీటికాకరండ = తాంబూలపుఁబెట్టె, ముఖ్య = మొదలగు, రాజలాంఛనా = రాజచిహ్నములు గలవాఁడా!
తా. కుకురుకాశాదిదేశములరాజుల నోడించి, కొనివచ్చినవారి కన్నెలు తమ్మపడిగము పావకోళ్లు మొదలగువానిని దాల్పఁగా రాజలాంఛనములతో నొప్పారువాఁడా!
| గద్యము. | ఇది శ్రీమదాంధ్రకవితాపితామహసర్వతోముఖాంక | 84 |
ఇది శ్రీదక్షిణామూర్తిమంత్రోపాసనాసమాసాదితాఖండసాహితీధురీణుండు నాత్రేయగోత్రపవిత్రుండును వావిళ్లవంశపయోరాశిరాకాసుధాకరుండు నగురామస్వామిశాస్త్రిచేత ననేకపూర్వవ్యాఖ్యానాభిప్రాయంబులఁ బర్యాలోచించి రచింపఁబడిన రుచిసమాఖ్యానం బగువ్యాఖ్యానంబునఁ బ్రథమాశ్వాసము.
- ↑ నడురేయియైన - బ్రౌనుదొరవారి పాఠము