మనిషి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


మనిషి

మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల
కన్న కనిష్టం

గాను చూస్తా వేల, బేలా?
దేవుఁ డెకడో దాగెనంటూ
కొండ కోనల వెతుకులాడే
వేలా?

కన్ను తెరిచిన కానబడడో?
మనిషి మాత్రుడి యందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో
ముక్తి ?

('కృష్ణాపత్రిక' 1912 డిసెంబరు 14)

"https://te.wikisource.org/w/index.php?title=మనిషి&oldid=262196" నుండి వెలికితీశారు