మనసుదీరెనా

వికీసోర్స్ నుండి

దర్బారు రాగం - మిశ్ర చాపు తాళం[మార్చు]


పల్లవి:

దీరెనా సామి మనసు దీరెనా సామి
వనజాక్ష దాని పొందు వైకుంఠ మాయెనా ||

చరణం 1:

మరుగు పరచ నేటికిరా మంచిది లేరా ఆ
మెరుగు బోణి వగలు తిరు మంత్రములాయెనా ||

చరణం 2:

సొక్కియున్న జాడలు చూచిన చాలురా దాని
పక్క బండి యుండుటే బ్రహ్మానందమాయెనా ||

చరణం 3:

వినుము తోట్ల వల్లురి వేణుగోపాల శౌరి
ఘనుడా దాసు శ్రీరామ కవి సన్నుతి జేసెనా ||