భ్రహ్మకడిగిన పాదము ో

వికీసోర్స్ నుండి

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల పరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము