భామిని రాగదే

వికీసోర్స్ నుండి

కాపీ రాగం - ఆది తాళం[మార్చు]

పల్లవి:
భామిని రాగదే సామిని తేగదే
కాముని బారికి తాళుదునే
తాళుదునే తాళుదునే ఆ
కాముని బారికి నేనెటు తాళుదునే ||

చరణం 1:
నిన్న మొన్న గూడిన చెలిపై మోహము
నిండారగను
నన్ను మరచెను గదవే మదవతీ
తాళుదునే నెటు తాళుదునే ||

చరణం 2:
చెల్లంబోనా సాటి చెలులలో చిన్నతనంబాయెనే
మొల్ల విరుల మీద మెల్లని ఈ
చల్ల గాలికి తాళుదునే
తాళుదునే నెటు తాళుదునే ఈ
చల్లని గాలికి తాళుదునే ||

చరణం 3:
ప్రేమ మీర దాసు కులజుడౌ
రామ కవీంద్రుని బ్రోచును
సామజ వరదుడలిగెనే
ఆమని ఢాకకు తాళుదునే ||