భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/భద్రగిరిశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పీఠిక


ఈశతకము రచించినకవి భల్లా పేరయ. ఇతఁడు కౌండిన్యసగోత్రుఁడు లింగనకుఁ బౌత్రుఁడు పెద్దనకుఁ గుమారుఁడు. శతకకవులచరిత్ర మీశతకము నెఱుంగదు. కవి వైదికబ్రాహణుఁడై యుండును.

భద్రగిరిశతకము సింహాద్రి నారసింహశతకము వెంకటాచలవిహారశతకము మట్టపల్లి నృసింహశత కము తెగలోఁ జేరినది. యవనులు సైన్యసహితులై వచ్చి హైందవదేవాలయములను భగ్నముగావించు తఱి దేశమునందు బయలువెడలిన క్షోభ కీతెగశతకములు దృష్టాంతప్రాయములుగ నున్నవి. పరస్పరవైషమ్యములతో నిండియున్న ఆంధ్రులను లోబఱచికొని వారిమతమునకు దేశమునకు సంఘమునకు రాజ్యతృష్ణాపరవశులు మతోద్రేకులు నగుయవనులు గావించినదురంతములు తెలుపుచరిత్రకాలమునాటి యీ తెగశతకములు భావిచరిత్రమునకుఁ బరమప్రమాణములు కాఁగలవు.

నైజాము ప్రభువులవద్దనుండి సామాన్యసైనికోద్యోగిగా నియమింపఁబడిన ధంసాయను యవనుఁడు వేల్పుకొండ (ఇది ఒరంగల్లుసకు ౨౪ మైళ్ల దూరమునఁ గలదు) పై దుర్గములుగట్టి దేశము నాక్రమించుకొనుటకు బయలువెడలి యెన్నియో దురంతములు గావించెను. ఈతనిదురంతములు శ్రీనాథుని వేంకటరామకవికృత అశ్వారాయచరిత్ర మునందుఁ గలవు. దేశద్రోహులగు కొందఱను తనలోకి గలిపి కొని గౌరవపాత్రము లగుసంస్థానములను బెక్కింటిని రూపుమాపి కడ కీతఁడు భద్రాచలమును ముట్టడించెను. పురవాసుల నందఱ నానావస్థలపాలు గావించెను. దేవళములోఁ జొరఁబడి విగ్రహముల నెక్కడఁ బాడుచేయునో యని యర్చకులు శ్రీరామాదివిగ్రహములను బోలవరమునకు రహస్యముగాఁ బడవలపై నెట్లో చేర్చిరి. భక్తులంచఱు దిక్కు చెడి ధంసాచే నవస్థలఁబడుచుండ నీవు సుఖముగాఁ బోలవరములోఁ దలదాఁచుకొంటివా రామా! నిన్నింతతో నీతురకలు విడువరని నిష్టురములాడుచు నీ పేరయకవి శతకమును రచించెను. ధంసా పరిపాలనము శ్రీ రామచంద్రుఁడు వలస కేఁగినట్లు భద్రాద్రిలోని శాసనమునందుఁ గలదు. దాని నిట నుదాహరించెదము.

"స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శా॥ శ॥ ౧౫౭౪ ఆగు నేటి వర్తమానవ్యవహారికచాంద్రమాన నందననామసం॥ వైశాఖ శు ౮ లు భానువారము శ్రీభద్రాచలసీతారామచంద్రమహాప్రభువువారిసన్నిధిని శ్రీ రామదాసుగారు తానీషాగారి యనుమతివెంబడిని జరిగించిన దేవబ్రాహణవృత్తులు శ్రీవారిసన్నిధిని జరుగు ఉత్సవప్రకరణములు వ్రాసియున్న శాస నము. ధంసా ప్రపంచములో శ్రీవారు పోలవరము వలస వేంచేసినపుడు వకదుర్మార్గుడు శాసనం చెక్కి వేసినందున సర్వజనులు తెలిసి సంతోషించేటందుకు లేకపోగా ఆదుర్మార్గుడు పుత్రమిత్రకళత్రాదులతో నశించిపోయినాడు” (ఆలయములోని శాసనము).

ఈవిధముగా ధంసాదుర్నయము గ్రంథములందు శాసనములందు శాశ్వత మొనర్పఁబడెను. 105 వ పద్యమువలన ధంసా కధికార మిచ్చినవాడు విభరాహిముఖా నని తెలియును. క్రీ. శ 1687 లో ఔరంగజేబు తనపుత్రుఁ డగుమహమదు ఆజాముతో గోలకొండ ముట్టడింపవచ్చినపుడు తానీషాయెడ ద్రోహముతలఁచి గుట్టుతెలిపినవాఁడును స్వామిద్రోహియు నగు ఇబ్రహీమె యిందుఁ బేర్కొనబడిన యిభరాహిముఖాను. ఇతఁడు ఔరంగజేబు పాలనకాలమునఁ బ్రముఖుఁడై ధంసాచేత నింతలేసి పనులు చేయించెను.

తానీషా రాజ్యాంతమున ఇబ్రహీముకాలము నుండి ధంసా ప్రముఖుఁడయ్యెను. ఔరంగజేబు అంత్యకాలము ధంసా విజృంభణకాలము నొకటియె. శ్రీరాముఁడు పోలవరమునకు వలస యేగినది సర్వధారిసంవత్సరమున. అక్కడ నున్నది ఐదేండ్లు. తరువాత పూసపాటి విజయరామరాజు సీతారామరాజుల కాలమున విజయసంవత్సరమున దిరిగి భద్రగిరికి వేంచేసెను. వీని నన్నింటిని సమన్వయించితి మేని ధంసా భద్రగిరిమీదికి దండెత్తి రెండువందలసంవత్సరములై యుండునని చెప్పవచ్చును. ఇది ఔరంగజేబు అంత్యకాలమునకు పూసపాటి విజయరామరాజు రాజ్యారంభకాలమునకు సర్వధారివిజయసంవత్సరములకు జేరువగా నున్నది. కాలనిర్ణయమును గూర్చి మఱియొకమాటు విపులముగా వ్రాయనున్నారము.

ఇందలి కవిత సరళముగ సుబోధముగ నున్నది. భగవంతునిహృదయము వచ్చి పోవునటుల యీకవి వ్రాసిన నిష్ఠురవాక్యములు కవి పరితాపాతిశయమును వెల్లడించుచున్నవి. శ్రీరాముఁడు పోలవరము వలస యేగుటతో కవి శతక మారంభించి తిరుగ వచ్చిన పిదప నైదేండ్లకుఁ బూర్తిచేసియుండును. పఠనీయశతకరాజములలో నిది యొకటి.

శ్రీ పిఠాపురము మహారాజావారు తాళపత్రప్రత్యనుసారముగా వ్రాయించిన వ్రాతప్రతి నాధారపఱచికొని యీభద్రగిరిశతకమునకు శుద్దప్రతి వ్రాసితిమి. యవనవిప్లవకాలమునాటి పరిస్థితుల దెలుపు శతకము గాన యాదరమునకుఁ బాత్రమగునని తలంచుచున్నారము.

నందిగామ, 1.6.26

శేషాద్రి రమణకవులు.
శతావధానులు.

పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/318 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/319 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/320 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/321 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/322 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/323 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/324 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/325 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/326 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/327 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/328 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/329 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/330 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/331 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/332 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/333 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/334 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/335 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/336 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/337 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/338 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/339 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/340 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/341 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/342 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/343 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/344 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/345 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/346 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/347 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/348 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/349 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/350 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/351 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/352 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/353 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/354 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/355 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/356 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/357 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/358 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/359 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/360 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/361 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/362 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/363 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/364 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/365 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/366 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/367