భక్తిరస శతకసంపుటము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ ర స్తు

                         భ క్తి ర స 
                      శతకసంపుటము               


Bhaktirasashatak018555mbp.pdf
                   చెన్నపురి:

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్సు వారిచే ప్రకటితము

1926 All Rights Reserved ప్రకాశకుల విజ్ఞప్తి. సహృదయులారా!

 ఆంధ్రవాజ్మయమున బేరెన్నికగన్న శతకములను విషయములనుబట్టి విభాగములు గావించి సంపుటకులుగ బ్రచురింప దలంచి యనేకశతకములను ముద్రితాముద్రితముల నార్జించి శుద్ధప్రతులు పీఠికలువ్రాయించి సిద్ధపఱచితిమి. శ్రీయుత గురుజాడ అప్పారావుగారిద్వారా మాయుద్యమమును విని శ్రీవిజయనగర సంస్థానధీశ్వరులగు మీర్జా శ్రీరాజా శ్రీపూసపాటి విజయరామగజపతి మహారాజా మన్నెసుల్తాన్ బహదూర్ వారు కాగితముల వ్యయము భరించి శతకసంపుటముల ప్రచురణమునకు దోడుపడుదుమని వాగ్ధాన మొనరించి మమ్ము సర్వవిధముల బ్రోత్సహించి మాయుద్యమముపై సానుభూతి జూపిరి.
  కాని, శతకకవులచరిత్రము వ్రాయుచు శ్రీ నండూరు సుబ్బారావుగారు మాయొద్దనుండి శ్తతకప్రతులు దీసికొని తిరుగ నొసంగక యెన్నిపర్యాయములడి గినను ఇదిగొ అదిగొ యని మాకీయకపోవుటచే సంకల్పించిన శతకసంపుటప్రచు రణమునకు శ్రీవిజయనగర మహారాజావారి తోడ్పాటుపోందుటకు అంతరాయము కలిగినది. వ్యయప్రయాసములకు లోనై వ్రాయించినప్రతులు గైకొని పని పుట:Bhaktirasashatak018555mbp.pdf/4 

విషయసూచిక.

1. సూర్యనారాయణశతకము

2. రేపాలరాజలింగశతకము

3. రఘుతిలకశతకము

4. మహిషాసురమర్దనిశతకము

5. ఉద్దండరాయశతకము

6. గొట్టుముక్కలరాజగోపాలశతకము

7. రుక్మిణీపతిశతకము

8. జ్ఞానప్రసూనాంబికశతకము

9. ముకుందశతకము

10. శివశతకము

11. రమాధీశ్వరశతకము

12. భక్తచింతామణిశతకము

13. సీతాపతిశతకము

14. మహిజామనోహరశతకము

15. పార్థసారథిశతకము

16. శ్రీరాజశేఖరశతకము

17. శ్రీరంగేశశతకము

18. మాధవశతకము

19. కామేశ్వరీశతకము

20. శ్రీవిశ్వనాథశతకము


భక్తిరసశతకములు

రెండవ సంపుటము. పీఠిక
ఈ సూర్యనారాయణశతకమును వరాహవేంకటనృసింహకవి రచించెను. ఇతఁడు భారద్వాజగోత్రుఁడు, బ్రాహ్మణుఁడు. జగన్నాయకశతకము రచించి వరాహగిరి కొండరాజు నీతఁడు నేకగోత్రులే గాని యిరువురును తమ పూర్వులను జెప్పికొనకపోవుటచే నిందెవరు పూర్వలో యిరువురకుఁ గల సంబంధ మెట్టిదో యెఱుఁగ వీలుకాలేదు.
“శ్రితసంపత్సుమవల్లియౌ నరసవెల్లిన్” అను పద్యమువలనఁ గవి నరసవెల్లిలోని సూర్యనారాయణస్వామినిగూర్చి యీశతకము రచించెనని యూహింపనగును గాని *నరసవెల్లి యెచట నున్నదో కవి సంబంధు లెవరేని యటఁ గలరేమో తెలియవచ్చుట లేదు. తత్రత్యు లీవిషయమునఁ బ్రయత్నించి కవిజీవితము ప్రచురించుట యవసరము.

ఈసూర్యనారాయణశతకము భాష జటిలముగ సాంస్కృతికసమాసబంధురముగ నున్నది. కొన్నిచోటుల పద్యమునంతటి నాక్రమించుకొనిన సమాసములు గలవు. భావముల స్వతంత్రములై రమణీయములై యున్నవి. సూర్యభగవానుని తేజోవిభ

 • అరసవెల్లి శ్రీకాకుళం నగరానికి 11 కిమీ దూరంలో ఉంది. (proofreader's comment) వములు, ప్రభావములు, శక్తిసామర్థ్యములు పురాణకథలు ఒక్కొక్కపద్యమున నొక్కొక్కరీతిగాఁ గవి వర్ణించి తనకవితానైపుణ్యము సాటియున్నాఁడు. ఇందలిపద్యములు స్వతంత్రము లనియుఁ బ్రాతస్స్మరణీయములనియుఁ దలంచుచున్నారము.

శ్రీరస్తు.

సూర్యనారాయణశతకము.


శా. శ్రీమత్సర్వసుపర్వసేవితములై క్షేమాంకలక్ష్యంబులై
ధామధ్వస్తసమస్తలోకనిబిడధ్వాంతంబులై మించు నీ
రామాంఘ్రుల్ గొనియాడి వృత్తశతకగ్రంథంబు నీకింపుగాఁ
బ్రేమన్ గూర్చెదఁ జిత్తగింపు మెలమిన్ శ్రీసూర్యనారాయణా. 1

శా. భారద్వాజపవిత్రగోత్రజుఁడ విప్రశ్రేష్ఠవంశ్యుండ వి
ద్యారక్తుండ వరాహవేంకటనృసింహాఖ్యుండ సద్భక్తి నిం
పారం గొల్చుచు నీకు వృత్తశతకం బర్పింతు వాగ్దోషముల్
చేరం జూచి కృపన్ సహింపు మదిలో శ్రీసూర్యనారాయణా. 2

మ. అరయన్ బావనమైన యీశతకపద్యవ్రాత మాలించినన్
బరమప్రీతిఁ బఠించినన్ బుధులు నీపాదాంబుజధ్యాతలై
దురితధ్వాంతవిముక్తిఁ గాంచి శుభముల్ తోడ్తోఁ బ్రవర్తింప నీ
చిరకారుణ్యమతిన్ సుఖింతు రెపుడున్ శ్రీసూర్యనారాయణా. 3

మ. శ్రితసంపత్సుమవల్లియౌ నరసవెల్లిన్ మల్లికాద్యుల్లస
ల్లతికావేల్లితసాలమూలకుసుమారా మస్ఫురద్ధేమని
ర్మితగేహంబునఁ బద్మినీముఖసతుల్ సేవింప ధాత్రీసురా
ర్చితలీలాకృతి నొప్పు నిన్నుఁ దలఁతున్ శ్రీసూర్యనారాయణా! 4

శా. శ్రీమత్పద్మసముద్భవాదితనువుల్ చేకొంచు నెవ్వాఁడు నా
మాయల్ గనుపట్ట ముజ్జగములన్ గావించి రక్షాలయ
వ్యామోహంబున నొప్పునట్టి నిగమవ్యాలీఢపాదాబ్జు నిన్
బ్రేమన్ గన్గొని సంస్మరింతు మదిలో శ్రీసూర్యనారాయణా! 5

శా. ఛాయాదిప్రియకాంతలన్ మధురభాషాలీలచేఁ దన్పుచున్
గాయం బుజ్జ్వలమై పరిష్కృతపరిష్కారంబునై మించ లో
కాయాసంబు లణంచి దుర్మదబలవ్యాసంగిదైత్యోత్కరా
జేయస్ఫూర్తి నెసంగు నిన్నుఁ దలఁతున్ శ్రీసూర్యనారాయణా! 6

శా. వేదప్రోక్తనమస్కృతు ల్సలుపుచున్ బృథ్వీసురు ల్మెచ్చి నీ
పాదాబ్జస్మరణైకనిత్యభజనాపారీణులై నిల్వఁగా
ఖేదంబు ల్తొలఁగించి వారలకు నుత్కృష్టాపవర్గం బవి
చ్ఛేదాసక్తి నొసంగు నిన్నుఁ దలఁతున్ శ్రీసూర్యనారాయణా! 7

మ. అకలంకస్ఫటికంబు నూతనజపోద్యద్దీప్తి నాగంతుక
ప్రకటచ్ఛాయ ధరించినట్లు జలగోళం బౌటఁ జంద్రుండు నీ
సకలోస్రంబులు దాల్చి

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.