బసవరాజు అప్పారావు గీతములు/... ...?

వికీసోర్స్ నుండి

[1]... ...?


నిష్ఠలేని జన్మ కొసగె నిష్ఠసిద్ధి కనకదుర్గ
పాపినైన నాకు పరమపదము జూపె శ్రీరాముడు
లోకము నను మోసగించె నాకము న న్నీసడించె
ఏకర్మము జేసినాను ఇంత బాధ యేల కలిగె!
ఆంధ్రమాత నన్ను కాస్త ఆదరించి యున్న యెడల
ఇంత దూరదేశానికి యేల వలస రావలయును?
ఢిల్లీనగరమ్ము కన్నతల్లిలాగ కౌగిలించి
ఉల్లములో చింత దీర్చి ఊపిరి పోసింది నోట
కానివేళ చేరదీసి కడుపునిండ తిండిపెట్టి
కనికరించె నీ ఢిల్లీ కన్న ఆప్తు లెవరు నాకు?

  1. 19-11-32