బసవరాజు అప్పారావు గీతములు/ప్రేమతత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రేమతత్త్వము


ఎద మెత్త నౌటకై
    సొదగుందరా అంత
    మది గల యహమ్మంత
    వదలిపోవునురా! ||ఎద||

వల పెఱుంగక బ్రతికి
కులికి మురిసేకన్న
వలసి విఫలమ్మొంది
విలపింప మేలురా! ||ఎద||

    చెలివలపు లేని నీ
    కలిమి కాల్పనె వినుము
    వలపు దీగెను జీవ
    ఫలము కాయునురా! ||ఎద||

ప్రేమకన్నను యెక్కు
వేముందిరా యెల్ల
కామ్య పదవులకన్న
ప్రేమ యెక్కువరా! ||ఎద||

ప్రేమించు సుఖముకై
    ప్రేమించు ముక్తికై
    ప్రేమించు ప్రేమకై
    యేమింక వలయురా! ||ఎద||


కోకిల

ఈ మావిపై నుండి
ఈవు కూ కూ యంచు
నామావిపై నుండి
ఆపె కూ కూ యంచు
    నేమి బాసల జేతురే!
        కోకిలా!
    యేమి బాసల జేతురే?
ప్రకృతి జన్యంబులై
పరమ రమ్యంబులౌ
భావముల నొండొరుల