బసవరాజు అప్పారావు గీతములు/దేవదత్తము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దేవదత్తము

     చిలుకలు కొఱికిన పం డొక్కటి నా
          చేతుల బడె నో దేవా,

     తెలియు నెట్లు తీయనిదో విషమో
          తినకుండగ నో దేవా?

     త్రోవ బోవుచుండ దండవీడిన
          పూ వొకటి దొరికె నో దేవా

     తావి కమ్మనిదొ తలనొప్పిడునో
          యేవిధి తెలియును దేవా?

     ఱెక్కలు తెగినట్టి పిట్ట యొక్కటి
          అక్కున [1]గొంటిని దేవా

     ఎక్కరణిని [2]పెంచి బాగు జేసెదొ
         [3]నీకే వదలితి దేవా!

  1. బడెనో
  2. పెరిగి పెద్దదౌనో
  3. ఎవ్వరి కెఱుకో దేవా!