బసవరాజు అప్పారావు గీతములు/కోకిల

వికీసోర్స్ నుండి

ప్రేమించు సుఖముకై
    ప్రేమించు ముక్తికై
    ప్రేమించు ప్రేమకై
    యేమింక వలయురా! ||ఎద||


కోకిల

ఈ మావిపై నుండి
ఈవు కూ కూ యంచు
నామావిపై నుండి
ఆపె కూ కూ యంచు
    నేమి బాసల జేతురే!
        కోకిలా!
    యేమి బాసల జేతురే?
ప్రకృతి జన్యంబులై
పరమ రమ్యంబులౌ
భావముల నొండొరుల

ప్రణయ మొల్కెడునట్లు
    పల్కరించుచు నుంటిరే,
        కోకిలా!
    పల్కరించుచు నుంటిరే?
మనుజుల కగమ్యమై
మహితశక్తిం గల్గి
పరమామృతము లొల్క
ప్రణయ వాక్కుల మీరు
    బాస లాడుచు నుంటిరే,
        కోకిలా!
    బాస లాడుచు నుంటిరే?
పరులు విన్నను మీదు
పరువు పోవు నటంచు
పాడు లోకము జూచి
భయమె లేకను వలపు
    పలుకు లాడగ జెల్లునే
        కీకిలా!
    పలుకు లాడగ జెల్లునే?
పరమ ప్రేమస్వరూ
పంబులై లోకాల

పావనంబుల జేయు
ప్రణయకవులౌ మీకు
    పరు లనేవా రుందురే
        కోకిలా!
    పరు లనేవా రుందురే?
చెలియయును నీవలెనె
చివురుటాకుల మెక్కి
చెవులపండువు గాగ
చిలుకంగ గానమ్ము
    చింత నీ కేమున్నదే,
        కోకిలా!
    చింత నీ కేమున్నదే?
చెంత గూర్చుని మోము
చెలువు గుల్కగ వలపు
దెలుపుచుం బలుకంగ
చెలిచెంత లేని నా
    చింత లెన్నడు తీరునే,
        కోకిలా!
    చింత లెన్నడు తీరునే?

పాడవే కోకిలా
పాడవే యింపుగా
ప్రాణముల్‌ హాయిచే
పరవశ మ్మొందగా
    పాట పాడవె తీయగా,
        కోకిలా!
    పాట పాడవె తీయగా?

చందమామ

తెల్లమబ్బు గుఱ్ఱము నెక్కి తేజరిల్లి
స్వారిజేయుచు బోవు నో చందమామ!
యేల నీ కంతగర్వము? ఎల్లకాల
మొక్కతీరుగ సంపద లుండునోయి?
    పండువెన్నెల జగమెల్ల బర్వజేసి
    అందరిమనంబుల\న్‌ గొని హాయి ముంచి,
    ఎల్లలోకాలకును రాజు నేనె యంచు
    కుల్కుచుందువుగా వెఱ్ఱిగొల్లవోలె