బసవరాజు అప్పారావు గీతములు/కవి జీవితము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

        ఇది వైడూర్యం
        బిది మేలి కెంపు
        ఎది కావలెనే !
             చెలియా ?

        ఇది కృష్ణుప్రేమ
        మిది మిత్రుప్రణయ
        మెది కావలెనే !
             చెలియా ?


కవి జీవితము


        కవి యని కీర్తిని
        గాంచుట కన్నను
        ఘన మే మున్నది
               జగతిన్‌ ?

        కష్ట సుఖమ్ముల
        చవి జూచుటకన్న
        మృష్టాన్నం బెటు
               రుచిరా ?

వలపుమంట మ్రిం
గు కన్న హాలా
హలము మ్రింగు టెటు
    గొప్పరా?
ప్రణయవేదనల
పాడుట కన్నను
పరమామోదం
    బెదిరా?
మృత్యు వైభవము
కీర్తించుటకన్న
నిత్యానందము
    కలదే?
ఆనందలోక
మరయుట కన్నను
కానని సౌఖ్యము
    కలదా?
సౌందర్యోపా
సనమున కన్నను
సద్వ్రత మెయ్యది
    చెపుమా?

భావిశాశ్వతము
     జీవించుకన్న
జీవితఫల మిం
    కెదిరా?


ఆశాభంగము


     పానకమ్ములో
        పుడక నేటి కిటు
        పడవేసితివో దేవా !

        ముద్దు గులాబిని
        ముట్టబోవగా
        ముల్లు విరిగెనో దేవా !

        తీయని పూవుం
        దేనె లానబో
        తేటి గుట్టె నోదేవా !

        గగనమున పతం
        గముపై బోవగ
        తెగియెను దారము దేవా !