బసవరాజు అప్పారావు గీతములు/ఆశాభంగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భావిశాశ్వతము
     జీవించుకన్న
జీవితఫల మిం
    కెదిరా?


ఆశాభంగము


     పానకమ్ములో
        పుడక నేటి కిటు
        పడవేసితివో దేవా !

        ముద్దు గులాబిని
        ముట్టబోవగా
        ముల్లు విరిగెనో దేవా !

        తీయని పూవుం
        దేనె లానబో
        తేటి గుట్టె నోదేవా !

        గగనమున పతం
        గముపై బోవగ
        తెగియెను దారము దేవా !

        ప్రణయసౌఖ్యమును
        పాడుజేయు నీ
        పంపక మేటికి దేవా ? ||పానక||


కాలగతి

     ద్రత్నము హారమ్మున వ్రేలకె
        సంద్రమ్మడుగున నణగునె యకటా ?

        మేలిపూవు చెలిజడలో నలరక
        గాలిని విచ్చుచు తావి వీడునే ?

        అడవిం గాసిన వెన్నెల యట్టుల
        పడతీ ! నీ యందమ్ము వృథయౌనే ?

        బూదింబోసిన పన్నీరట్టుల
        పొలతీ ! నీ సరసత వమ్మౌనే ?