Jump to content

బసవపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

శ్రీ రుద్రభక్తాంఘ్రి శేఖర! శుద్ధ - వీరమాహేశ్వరాచార! సంగాఖ్య!
దండియై మఱియొక్క మిండజంగమము - వెండియు బసవనదండనాయకుఁడు
మంత్రులుఁ దానును మహిపతి వనుపఁ - దంత్రంబునకు జీవితము వెట్టునెడను
“వచ్చి యీ యర్థంబు వలయు నింతయు - నిచ్చినఁగాని యొం డేనొల్ల” ననుచు
ధట్టించి యడుగుడుఁ బెట్టెలమాడ - లట్టున్నభంగి నాయయ్యకు నొసఁగఁ
దంత్రసమేతులై ధరణీశుకడకు - మంత్రివర్గం బేఁగి మఱి యిట్టు లనిరి
చెప్పినఁ గొండెమౌఁ జెప్పకయున్నఁ - దప్పగు నటుగాన చెప్పఁగవలసెఁ
బనిసేయ వెఱతుము బసవయ్యతోడ - ధనమెల్ల నొక్కమిండని కిచ్చె” ననుచుఁ
గొండెంబు సెప్పినఁ గోపించి రాజు - బండారి బసవనదండనాయకుని
రప్పించి “మాయర్థ మొప్పించి పొమ్ము - దప్పేమి? సాలుఁబ్రధానితనంబు
'దండింపరా' దనుతలఁపున నిట్లు - బండార [1]మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపనిబాస యండ్రు - పరధనం [2]బెట్లోకో బసవ! కైకొంటి
వేయుమాటలు నేల వెఱతుము నీకు - మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁ డగుచు - జననాథునకు బసవనమంత్రి యనియె
“పరమేశుభక్తి యన్ సురతరు వుండ - హరుభక్తి యన్ కనకాచలం బుండఁ
గామారిభక్తి చింతామణి యుండ - సోమార్ధధరుభక్తి సురధేను వుండ
బగుతుఁ డాసించునే పరధనంబునకు - మృగపతి యెద్దెస మేయునే [3]పుల్లు?
[4]క్షీరాబ్ధిలోపలఁ గ్రీడించుహంస - గోరునే పడియలనీరు ద్రావంగఁ?
జూతఫలంబులు సుంబించు చిలుక - [5]భాతి బూరుగుమ్రానిపండ్లు గన్గొనునె?
రాకామలజ్యోత్స్నఁ ద్రావు చకోర - మాకాంక్ష [6]సేయునే చీకటిఁ ద్రావ?
విరిదమ్మివాసన విహరించుతేఁటి - పరిగొని [7]సుడియునే బబ్బిలివిరుల?

నెఱుఁగునే యలదిగ్గజేంద్రంబుకొదమ - యెఱపంది [8]చను సీక? నెఱుఁగవుగాక
యరుదగు లింగ [9]సదర్థులయిండ్ల - వర(రు?)వుడ నా కొకసరకె యర్థంబు
పుడమీశ మీ ధనంబునకుఁ జే సాఁప - నొడయల కిచ్చితి నొడయలధనము
[10]పాదిగ దఱిఁగిన భక్తుండఁగాను - గాదేని ముడుపు [11]లెక్కలుసూడు” మనుచు
ధట్టుఁడు బసవనదండనాయఁకుఁడు - పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ - నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

నక్కలు గుఱ్ఱములైన కథ


మధుర[12]పాండ్యుడు దన మంత్రిచే నిట్టు - లధికమర్థం బిచ్చి హయముల [13]విలువఁ
బనుచుడు నతఁడు సద్భక్తిపెక్కువను - [14]జనిచని జంగమార్చ[15]న సేయఁ జేయ
నర్థమంతయుఁ బోవ హయముల విలువ - నర్థంబు లేకున్న ననుమాన ముడిగి
పొలమునక్కలనెల్లఁ బిలిచి తెప్పించి - నలిఁ బాండ్యభూనాథునకుఁ [16]బొడసూపఁ
జొక్క నైనారుల మిక్కిలికరుణ - నక్కజం బంద నానక్క లన్నియును
నిలఁ గంకణములతేజలు నయ్యెఁ గాదె - మలహరుభక్తులమహిమ దలంప
నిది సోద్యమే” యంచు నెల్లభక్తులును - సదమలచిత్తులై సంతసం బంద
నతివిస్మయాక్రాంతుఁడై బిజ్జలుఁడు - "ఇతఁ డీశ్వరుఁడకాక యితరుండె?” యనుచు
వర[17]వస్త్ర[18]భూషణావళి సమర్పించి - పరమానురాగుఁడై నరులెల్ల వినఁగ
“బండారిమీఁద నెవ్వండేని [19]యింకఁ - గొండెంబు [20]సెప్పు నా కుక్కలఁ జెండి
నాలుకల్గోసి సున్నము సాలఁబూసి - పోల వేఁచినయిస్ము వోయింతు నోళ్ల”
ననుచు నబ్బసవసింహము వీడుకొల్పఁ - జనుదెంచె నగరికి జనులు నుతింప.

బసవఁడు తన భార్యచీర విప్పించి యొక జంగమున కిచ్చినకథ


వెండియు నొక్కయ్య వేశ్యాలయమున - నుండి బాని[21]సఁ బిల్చి “బండారినగర
[22]మన [23]నిత్యపడి వేఁడికొని వేగరమ్ము" - అనవుడు "నట్లకా” కని పోయి యచటఁ
బడఁతి యబ్బసవయ్య పట్టంపుదేవిఁ - బొడగని కట్టినపుట్టంబు సూచి

యసలారఁ బడి [24]వేఁడుడంతఁ జాలించి - మసలక బానిస [25]మగిడి యేతెంచి
అక్క [26]యేమందు నీయాన నేనిప్పు - డొక్కసోద్యముఁ గంటి నక్కడి కేఁగి
యట్టి దివ్యాంబరం బఖిలలోకములఁ - బుట్టదు బసవయ్యపట్టంపుదేవి
కట్టినపటవలిపుట్టంబు సూచి - నెట్టణ వచ్చితి నీ కెఱిఁగింప
[27]భావ వేఁడినఁజాలు బసవయ్య యిపుడ - యావస్త్ర మొసఁగెడు [28]నరగలిగొనఁడు
పరగు మహాదేవుభక్తులచేత - నరుదరు దనఁగ [29]గణారాధనములఁ
గొనివచ్చి జంగమకోటి సస్నేహ - మున నిచ్చినట్టి యమూల్యవస్త్రములు
[30]వెంజావళియు జయరంజియు మంచు - పుంజంబు [31]మణిపట్టు భూతిలకంబు
శ్రీ వన్నియయు మహాచీని చీనియును - భావజతిలకంబు పచ్చనిపట్టు
రాయశేఖరమును రాజవల్లభము - [32]వాయుమేఘము గజవాళంబు గండ
[33]వడము గావులు సరిపట్టును హంస - [34]పడియు వీణావళి పల్లడదట్టి
వారణాసియు జీకు వాయుఁ [35]గెందొగరు - గౌరిగనయమును క్షీరోదకంబు
పట్టును రత్నంబుపట్టును సంకు - పట్టును మరకతపట్టు పొంబట్టు
నెఱపట్టు వెలిపట్టు నేత్రంబుపట్టు - మఱి తవరాజంబు మాందోళిరవియుఁ
జంద్రాతపంబును సాంధ్యరాగంబు - నింద్రనీలంబు మహేంద్రభూషణము
సన్ననడంచును శరధియు మేఘ - వన్నెయు రుద్రాక్షవన్నె కాంభోజి
పులిగోరుపట్టును భూపతి రుద్ర - తిలకంబు సరిపట్టు మలయజసిరియు
గొలనిమేఘము గజావళి హయావళియు - వలిపంబు సరి [36]గమ్మితెలుపు దివ్యాంబ
రంబును నుదయరాగంబు దేవాంబ - రంబు పొత్తియు గుజరాష్ట్రంబుపట్టు
మొదలుగా నెఱుఁగమే మును దరతరమ - పదపడి [37]మనవారు వడసినయట్టి
మానితవస్త్రవితానముల్ గలవు - గాని యావస్త్రసమానముల్ గావు
తథ్య మిట్టిద” యని దాసి సెప్పుడును - మిథ్య సేయక వేశ్య మిండనిఁ జూచి
“నలి దలిర్పఁగ [38]నీవు నా[39]తోడి వలపు - గలవేని బసవయ్యకాంత గంగాంబ
కట్టన [40]పుట్టంబుఁ గ్రక్కునఁ దెచ్చి - నెట్టణ నా కిమ్ము నేర్పు దలిర్ప”
ననవుడు "నట్లకా” కనుచు మిండండు - సని కాంచి! బసవ “నీవనిత గంగాంబ

కట్టిన [41]పటవలిపుట్టంబు [42]మాకు - నిట్టున్నభంగిన యిప్పింపవలయు”
ననవుడుఁ దనసతి నాస్థానసదన - మునకుఁ బిల్వఁగఁబంచి ముద్దియఁ గదిసి
“పుట్టు సా వెఱుఁగనియట్టిమహాత్ముఁ - డిట్టలంబుగ నీదు పుట్టమడ్గెడిని
పుట్టమీ వేగ మీపుట్ట మిచ్చినను - బుట్టము మన” మనియట్టిచందమున
లజ్జయు సిగ్గు దలంపక బసవఁ - డజ్జలజాక్షి వల్వఱిముఱిఁ బట్టి
యొలువంగ నొలువంగ నొక్కవస్త్రంబు - దళితాంబుజానన మొలఁబాయకున్నఁ
గనుఁగొని యద్భుతాక్రాంతాత్ములైన - జనములఁ గనుఁగొని జంగమంబనియె
“గహనమే చూడ జగద్ధితసూత్ర - సహజవాహనులగు శంభుభక్తులకు
నలి నిడిగుడినయనారను భక్తుఁ డిల [43]నాలిచీరలొ [44]ల్బీడె భక్తులకుఁ
బండ్రెండువర్షముల్ వాయక నేని - పండ్రెండుమూరల [45]పసిఁడిపుట్టంబు
విపరీతగతిఁదన్ను [46]వేఁడుడు నొక్క - దపసికిఁ దేడరదాసయ్య యీఁడె
అదిగాక బల్లహుం డఖిలంబు నెఱుఁగ - సదమలచిత్తుఁడై సతిని మున్నీఁడె?
యఱలేక రూపించి యడుగంగఁదడవ - మఱిమొన్న యధరుండు మాణిక్య మీఁడె?
[47]దండియై మొన్న యధరుఁ డిమ్మడించి - మిండభక్తునకు నర్మిలి నర్థమీఁడె?
మహి నిడుగుడిని బెర్మాణి యన్ గణము - గహనంపుదుర్భిక్షకాలంబునందుఁ
జాటించి సకలార్థ[48]సంపదల్ సంద్ర - జూటుభక్తుల [49]కిలు చూఱవెట్టండె?
తనయపెండిలిసేయుతత్ప్రస్తవమునఁ - జనుదెంచి యొకతపోధనుఁడు వేఁడినను
నక్కాంత వెండ్రుక లప్పుడ కోసి - చక్కన మానకం [50]జారుఁ డీఁ డెట్టు?”
లనుచు గీటునఁ బుచ్చుచును మిండగీఁడు - కినియునో [51]తడవైనఁ దనవేశ్య యనుచు
బసవని వారించి వసుధఁ బ్రోవైనఁ - బసిఁడిచెఱంగుల పట్టువస్త్రములు
మోపిడి తనమోవనోపి [52]నన్నియును - నేపారఁ గొని [53]వచ్చి యిచ్చె లంజియకు
“నిక్కంబు బసవని నిజభక్తిమహిమఁ - దక్కువ [54]గాదయ్యెఁ దరుణిమానంబు”
అని భక్తమండలి వినుతింపుచుండ - వనిత యంతర్వాసమున కేఁగె నంత.

సూర్యాస్తమయ వర్ణనము


బసవనిభక్తి ప్రభాపటలంబు - దెసల వసుంధర దివి [55]దీటుకొనఁగ
దినకరుఁ డాత్మీయతేజంబు దఱుఁగు - డును మది లజ్జించి చని యపరాబ్ధిఁ

బడియెనో యన్నట్లు భానుండు గ్రుంకెఁ- జెడిమిత్రుఁడరుగ రాజీవముల్ మొగిచె
భేరులు శంఖముల్ భోరనఁ జెలఁగె - మార[56]సంహారు నాగారాంతరముల
నలరుచుఁబంచమహా[57]శబ్దరావ - ములు మ్రోసె భక్తసమూహాలయముల
ఘనధూపధూమసంజనితమేఘములు - సెనసి కప్పినమాడ్కిఁ జీకటుల్ వర్వె
వరముక్తిసతి బసవని[58]కి నారతులు - పరువడినెత్తు దీపంబులో యనఁగ
నక్షత్రచయ మంతరిక్షంబు నిండి - యక్షీణతరకాంతి యసలార వెలిఁగె
చంద్రునిచేటు దైత్యేంద్రునిపాటు - నింద్రునిభంగంబు నెఱిఁగి యెఱింగి
గొఱియ [59]మ్రుచ్చిలి శూద్రకుండను రాజు - నఱకు వడుటతొల్లి యెఱిఁగి యెఱింగి
[60]జారులఁ జోరులఁ జర్చించుకవుల - భూరివివేకంబుఁబొగడం[61]గనేల?
యనఁగ సంధ్యావేళయందు సద్భక్త - జనులు లింగార్చనల్ [62]సలుపంగ నంత
మిండజంగమకోటి నిండారుభక్తి - దండనాయకుఁడంప దండతండములు
ఘనసారతాంబూలగంధప్రసూన - వినుతాభరణవస్త్రవితతులు గొనుచుఁ
గరమర్ధి [63]లంజెఱికంబు సేయంగ - నరిగెద మేమంచు ననురక్తి నరుగ

ముగ్ధ సంగయ్యకథ


లింగసర్వేంద్రియలీనుండు ముగ్ధ - సంగయ్య నానొక్క శరణుఁ డీక్షించి
భక్తిననుచువాఁడు బసవబండారి - వ్యక్తమిట్లేఁగెడు [64]వార్జంగమములు
కొనిపోవునవి గంధకుసుమకర్పూర - వినుత తాంబూలాదివితతులట్లయ్యుఁ
జను నిది లింగావసరవేళ [65]యున్న - పనులకు నేఁగెడు పగిది గా” దనుచు
నదియును నొక్కలింగార్చన గాఁగ - మది నిశ్చయించి సమ్మదము [66]దుల్కాడఁ
గలనైన లంజెఱికం బనునట్టి - పలు కెఱుంగమిఁ జేసి బసవయ్యఁ జూచి
“యేనును బోదునా యీయయ్యగాండ్ర - తోన లంజెఱికంబు మానుగాఁ జేయ”
ననవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁడగుచుఁ - "జనుజియ్య! నా ముగ్ధసంగయ్యదేవ!”
యని గారవింపుచు నాయయ్య కపుడుఁ - గనుఁగొన సహజశృంగారంబు సేసిఁ
పరిచారకులఁబిల్చి పటుభక్తి గల్గు - తరుణియింటికిఁ బంపఁ దత్సతిఁజూచి
“గణుతింపఁ బ్రమథలోకంబుకన్యకయొ? - గణిక సాక్షాద్రుద్రగణికయో? తలఁప

జిత్తరురూపమో? [67]చెలువయో పసిఁడి - పుత్తడియో” నాఁగఁ బొలఁతి యేతెంచి
ముగ్ధమిండనిపాదములమీఁదఁ బడివి - దగ్ధ [68]మిండెత సముద్యద్భక్తి మెఱసి
పడిగంబు వెట్టించి పాదముల్ గడిగి - కడువేడ్కఁ బాదోదకంబు సేవించి
ప్రీతియెలర్ప విభూతి వీడియము - లాతన్వి దాన సమర్పణ సేసి
యనుపవచ్చినవారలరుగ మిండనికిఁ - దనహస్త మిచ్చి తోడ్కొని పోవునెడను
స్ఫాటికసోపానసంక్తి నొప్పారు - హాటకకుట్టిమహర్మ్యస్థలమునఁ
గలయంగఁ గస్తూరికలయంపి [69]మీఁద - వెలుఁగు ముక్తాఫలంబుల మ్రుగ్గులమరఁ
గంభకట్లను మేలుకట్లను బొలుచు - గంభీరపుష్పకాగారంబునందు
మహితలంబితరత్నమాలికానిచయ - బహుమణిదీపవిభ్రమకాంతి వర్వ
మించి వెల్గెడుపట్టెమంచంబు పుష్ప - సంచితంబగు నండజముపాన్పు దనర
వివిధసౌరభసుఖాన్విత మగుమంద - పవనంబు జాలకపంక్తిఁ [70]దన్పార
శ్రీరుద్రవరదివ్య సింహాసనంబొ? - గౌరీమనోహరు చారుపుష్పకమొ?
గంగావతంసుని శృంగారగృహమొ? - అంగజవిజయుని యనుఁగుమంటపమొ?
అన నతిరమణీయమగు సజ్జపట్టుఁ - గని మిండఁ డద్భుతాక్రాంతాత్ముఁ డగుచు
[71]నదియును నాతి లింగార్చన సేయు - [72]సదనంబుగాఁ దన మదిలోనఁ దలఁచి
యుత్తుంగసింహాసనోపమంబైన - యత్తన్విచారు పర్యంకంబు దిగువ
నవనిపైఁ [73]గంబళి యాసనంబుగను - శివసమారాధన సేయఁ గూర్చుండి
భూతి సర్వాంగముల్ పూయుచో నతఁడు - "భూతివూయవదేవి వొలఁతి నీ”వనిన
“నిచ్చఁబార్వతి వూయు పచ్చవిభూతి - యిచ్చె నొక్కయ్య నా కీ[74]మునిమాపు
పూసితి సర్వాంగములఁ జూడు” మనుచు - భాసురంబగు మేని [75]పసుపుఁజూపుడును
వలయుచో రుద్రాక్షములు ధరింపుచును - "లలన! రుద్రాక్షముల్ దాల్పవే”మనిన
“కడుఁ గందు లవణసాగరతీరమునను - బొడమిన రుద్రాక్షములు [76]సహింపమిని
దెల్లంబు క్షీరాబ్ధితీరమందుండు - తెల్లరుద్రాక్షముల్ దెచ్చె నొక్కయ్య
యెప్పుడుఁ దాల్ప నున్ఫెక్కిన” వనుచు - నప్పొల్తి ముత్యాలహారముల్ సూప
నక్కజుండగుచు ముత్యాలసూసకము - ముక్కునఁ దాల్చిన ముత్యంబుఁ జూచి
“యుత్తమాగంబున నువిద! రుద్రాక్ష - లుత్తమంబయ్యెఁ బో క్రొత్త మాకిదియు

నెక్కడ వినఁబడ [77]దిట్లు రుద్రాక్ష - ముక్కునఁ [78]దాల్చిన ముఖ్యమే?”మనిన
“దేవ! యేమనిచెప్ప? దేవుఁడే యెఱుఁగు - నా విశేషంబు వేదాతీత” మనుఁడు
నురుజటావలి విచ్చి యొత్తిచుట్టుచును - "దరళాక్షి! జడలేల తాల్ప వీ” వనిన
సగముప్రసాదపుష్పములకు [79]నునిచి - [80]సగమునఁదాల్చితి సన్నంపుజడలు
సన్నుతతద్భస్మసమ్మిశ్ర మగుచు - వెన్నున [81]నిదె చూడు వ్రేలెడి” ననుచు
పటుగళాభరణసంఘటితమై యొప్పు - పటవలికుచ్చులు వడఁతి సూపుడును
“భువి నిట్టిభక్తురాలవు గచ్చడంబు - ధవళాక్షి! మఱి యేల తాల్ప వీ” వనిన
"లింగవంతులు గాని లెంగుల దృష్టి - భంగిగా నాపయిఁబాఱకయుండఁ
గట్టితి సర్వాంగకచ్చడం” బనుచుఁ - గట్టిన సమకట్టుఁగాంత సూపుడును
వనిత యపూర్వలాంఛనధారిగాఁగ - మనమునఁ దలపోసి మహిఁజాఁగిమ్రొక్కి
“యిట్టిలాంఛనమున కెవ్వ రాచార్యు? - లెట్టివి నియమంబు? లెట్టిది సపర్య?
తరుణి! మీ గురుసంప్రదాయంబు వారు - ధరణి నే ఠావునఁ దపము సేయుదురు?
సంతతంబును [82]నేరి సద్గోష్ఠి [83]నుందు - రింతయుఁజెప్పు మాకేర్పడ” ననిన
“నాగమనిగమోక్తి నవ్వామదేవ - యోగిచే శివదీక్ష యొప్పంగఁబడసి
కైలాసమునఁ దపోవేళ మెప్పించి - శూలిచేఁ బడసె మున్నీలాంఛనంబు
అది గారణముగఁ బూర్వాచార్యురాలు - సదమలాత్మక హిమశైలతనూజ
శ్రీనందనుని గెల్చి శివుని మెప్పించి - మేన నర్ధము గొన్న మెలఁతవర్గంబు;
జగములన్నియుఁ దన శక్తిఁబాలించు - జగదేకసుందరి సంతతిమేము;
శివరహస్యాది ప్రసిద్ధశాస్త్రములు - శివునిచేఁబడసిన చెలువశిష్యలము;
ఆకాంక్షతోడ జన్నావులపాలు - సేకొని యష్టావశేషంబు సేసి
చెఱకుకట్టెలపొడి సేరెఁడు సల్లి - మఱి యిష్టలింగసమర్పణ సేసి
తప్పక యీ ప్రసాదంబింతగొందు - మెప్పాటఁగలనైన నెఱుఁగమోగిరము
[84]గలిగెనే వెండియుఁ గందమూలాది - ఫలపత్త్రశాకముల్ భక్తులిచ్చినను
స్వామికర్పించి ప్రసాదంబు గొందు - మేమని చెప్పుదు [85]మీ తపశ్చరణ?
తనువును, మనమును, ధనమును విడిచి - మనికులై రసికులై, మగ్నులై గోష్ఠి
తవులంబు [86]గలిగినతజ్జంగమాను - భవమందు నెప్పుడుఁ బాయకుండుదుము.
అనఘ! త్రికాలలింగార్చన మీఁది [87]పనులు దక్కఁగ లేవు [88]బగళులు రేలు

గతి మాకు వేఱొండు గలదె జంగమమ - గతి మనోవాక్కాయకర్మంబులందు
ఇట్టిది గురుమార్గమిది నిజవ్రతము - ఇట్టిది సారిత్రమిది లాంఛనంబు
తలఁప మా గురుసంప్రదాయంబువారు - గలరు శ్రీగిరి యాదిగా నెల్లయెడల
నధిపసాక్షాజ్జగదంబాసమాన - లధికంబు గలరు దాక్షారామమునను”
అని సమంచితవిదగ్ధాలాపములను - వినుపింప నాయయ్య విస్మితుండగుచుఁ
జెలువ పర్యంకంబు సింహాసనముగఁ - దలఁచి గంధద్రవ్యతాంబూలవితతి
యొడఁబడ నంత నొండొండు శోధించి - [89]“పడఁతర్ఘ్యపణ్యముల్ వట్టు” నావుడును
“దనరఁగ నీయయ్య మనసు వచ్చుటయుఁ - గనుఁగొన నా నేర్పుకలిమిగా” కనుచు
హసనంబు దళుకొత్త నర్ఘ్యపణ్యములు - పసిఁడిబిందెలఁ [90]బట్టి పడిగముల్వెట్టి
గ్రక్కున సకలోపకరణంబులోలి - జక్కొల్పి యమ్ముగ్ధసంగయ్య కలరఁ
గరమొప్ప గంటలుఁ గాంస్యతాళములు - నరుదొంద మ్రోయ ధూ[91]పానంతరంబు
దెఱవ యుదంచిత [92]దృగ్దీధితులను - నఱితిహారంబుల యంశుజాలములఁ
బొలుపగు కంకణస్ఫురితరోచులను - మిళితమై కన్నులు మిఱుమిట్లు [93]గొనఁగ
వెలుఁగు నీ రాజసంబులపల్లెరముల - నలర నందిచ్చునయ్యవసరంబునను

చంద్రోదయ వర్ణనము


“మలసంహరుఁడు జటామకుటంబుమీఁద - నిలిపియు నా కందు నెఱిఁబుచ్చలేఁడు
భక్తులపాదసంస్పర్శనంబునను - వ్యక్తిగా నిర్మలత్వంబుఁబొందుదును”
అని యాత్మఁ దలపోసి యరుదెంచుమాడ్కి - వనజారి ప్రాఙ్ముఖంబున నుదయించె
బసవని సితకీర్తి వర్వెనా, శివుని - భసితాగరాగప్రభలు వర్వె నాఁగ,
నా రుద్రునట్టహాసాంశులు దనరె - నా, రజతాచలచారుదీధితులు
విలసిల్లెనా, నభోవీథి నెల్లెడల - నెలకొని యచ్చవెన్నెల వెల్లి [94]విరియ
నక్కాంత ముగ్ధసంగయ్యకుఁ బ్రీతి - నెక్కొని యాత్మలో నివ్వటిలంగ
ననయంబు లింగపూజనల నటించు - తనదు విలాసినీజనుల రావించి[95]
యక్కమహాదేవి! యల్ల మద్దెలలు - జక్కొల్పి వేగంబ సంధించుకొనుఁడు (ము)
[96]స్వరమానమున బసవప్రమథవ్వ! - కరమర్థిఁ బట్టఁడు(ము?) కాహళ లోలి;

సకళవ్వ! నీవును సంగళవ్వయును - [97]నొకరీతి నిలువుఁడు సుకరంబుగాఁగ;
బాలరుద్రమ! యెత్తుపట్టఁగ [98]వాళ(సె?) - గ్రోలు వాయింపుము! గుడ్డవ్వ! నీవు
సిట్టితాళము వట్టు శివదేవి! నీవు - సట్టన నృత్యంబు సరసంబెఱింగి;
సంగుదాసమ! మహేశ్వరి! వీర[99]భద్ర - లింగవ్వ! మీరు గేళికలు [100]సేయుండు;
రమణదుకూలాంబరమును [101]గంచుకము - నమరించికొని [102]చల్లడము బిగియించి
యేతెమ్ము నీవు పురాత్మ! శీఘ్ర - మాతతమ్ముగ నృత్యమాడుదు గాని
తాళముల్వట్టుఁడు దాళగింపుండు - నాళతివేళకు నందఱు ననుచు
నవిరళంబుగ [103]నంత నార్భటం బిచ్చి - జవనిక [104]రప్పించి సరసమై నిలిచి
పొలుపగు ముఖరసంబును సౌష్ఠవమ్ము - లలియు భావంబు ధూకళియు [105]ఝంకళియు
మఱియు ఠేవము విభ్రమమును రేఖయును - నెఱయంగ నీ రీతి నృత్యంబు సలుప
లింగార్చనంబు సల్లీలఁ జేయుచును - మంగళారవములు [106]సంగడి నులియ
[107]వెల్ల వేగుడు స్వచిత్తోల్లాస [108]మమర - సల్లీల [109]నమ్ముగ్ధసంగయ్యకిట్టు
లంగన పరిచర్య లాచరింపగ - లింగావసరము సెల్లించు [110]నంతటను
నొగి మనోహరుని పాదోదకసేవ - నగణితలీల దివ్యాంగుండనైతి
నఖిలమాహేశసమగ్రప్రసాద - సుఖసేవ నా కింకఁజొప్పుడునేని
నిలుకాల నిలువంగనేరక తిరుగు - నలమట వాయుఁబొమ్మని తలపోసి
వచ్చినమాడ్కి దివాకరుండంతఁ - జెచ్చెర నుదయాద్రిశిఖరమెక్కుడును
బసవనియాత్మ కింపెసఁగ మిండండు - వెస నేఁగుదెంచి తా వెండి యిట్లనియె
“బసవ! యేమని చెప్ప భర్గుఁడే యెఱుఁగు - నెసఁగ లంజెఱిక మే నీ రాత్రిసేఁత
నీవును మా తోడ రావైతిగాని - వేవునంతకు నొక్క విధమైన సుఖము
ఐనను లంజెర్క మచ్చోటఁ జేయు - చో నిన్నుఁ దలఁచితిఁజుమ్మయ్య బసవ!
పుట్టితిఁగాని మున్నిట్టి సుఖంబు - నిట్టిలంజెఱికంబు నెఱుఁగ నెన్నఁడును
మలహరుకృపలేని మత్తికాండ్రకును - గలుగునే లంజెఱికం [111]15బిట్లు నేయఁ
బగలు రాత్రియు నెడఁ[112]బడక లంజెఱిక - మొగినెన్నియుగము [113]లిట్లొప్పుగఁ జేసి
పడసితి చెప్పుమా పరమేశుచేతఁ - గడునొప్పు లింగజంగమసంపదలను

సడిసన్న శివభక్తి సౌభాగ్యమహిమ - లొడఁగూడునే వెండి యొండుమార్గమున
నాకును నీ కారణమునఁ గాఁజేసి - చేకూరెనిట్టి లంజెఱిక మీ రాత్రి
బండారి! నీయాన [114]పసిబిడ్డనాఁట - నుండియు శ్రీగిరి నుండుదునచట
ననుపమకదళీవనాంతరబిల్వ - వనముల నేకాంతవాసంబునందుఁ
బన్నుగా నఱకాలఁగన్నును నొసలఁ - గన్నును గలమహాగణములు గలరు
చూతుము గాని యెచ్చోట మున్నిట్టి - భూతిశాసనధారిఁ బొడగాన మేము
పొలుపగు పచ్చవిభూతిపూఁతయును - దెలుపగు రుద్రాక్షములు నెఱ్ఱజడలు
నంతకుఁదగిన సర్వాంగకచ్చడము - వింతయై యున్నది యింతి [115]వేషంబు
నిట్టిలాంఛనదారి నిట్టివిరాగి - నిట్టి [116]నిష్ఠాశాలి నేమనవచ్చు?
ఇంతి నొక్కతెఁజెప్పనేల తత్సతికి - సంతతంబును బరిచర్యలు సేయు
లలనలందఱు నట్టిలాంఛనధరులు - చెలువలమహి[117]మంబు శివుఁడె యెఱుఁగు”
ననుచుఁ దత్సతుల లాంఛనములు నచటి - తన మిండతనమును దప్పకచెప్పఁ
బలుమాఱు నడుగుచు నలి జంగమములు - సెలఁగుచు నొండొరుఁ [118]జేవ్రేసి నవ్వ
బసవం డసమసముల్లసనుఁడై చెన్న - బసవని దెసఁజూచి పసరింపఁదొడఁగె
"ఇట్టి నెట్టణభక్తి యిట్టి ముగ్ధత్వ - మిట్టిమహత్త్వంబు నెందును గలదె?
నిక్క మీశ్వరుఁగాని నిజ మెఱుంగమిని - ముక్కంటి భక్తులు ముగ్ధలు గారె?”
అని ప్రశంసింపంగ నా చెన్నబసవఁ - డనురక్తి ముకుళితహస్తుఁడై మ్రొక్కి
“పరగు నీ నూతన ప్రాక్తనభక్త - వరగణంబులలోన వచియింపఁజూప
నిల నిట్టి ముగ్ధలు గలరొకో?” యనుచు - నలి దీటుకొనఁగ విన్నపము సేయుడును
బరమానురాగసంపదఁ దేలి సోలి - కరమర్థి మఱి ముగ్ధగణముల కథలు
పసరింపఁ దలఁచి సద్భక్తి బండారి - బసవయ్య యా చెన్నబసవనికనియె

రుద్రపశుపతి కథ


వ్యక్తంబెఱుంగవే యయ్యళయూర - భక్తుండు మును రుద్రపశుపతి నాఁగఁ
ప్రథితమౌ నాదిపురాణమందబ్ధి - మథనావసర మొక్కకథికుండు సదువఁ
గమలజ కమలాక్షు లమితదైత్యాదు - లమరులు సెడి పాఱ నందుద్భవించి
పొరి నజాండములెల్ల దరికొని కాల్చు - గరళంబు మ్రింగె శ్రీకఱకంఠుఁడనిన
నా రుద్రపశుపతి యాలించి భర్గుఁ - డారగించుట నిక్కమా విషం? బనుడు

'ననుమానమా! త్రావె హరుఁడు విషంబు - బనుగొన నటమీఁదిపను లెఱుంగమన
విని యుల్కిపడి వీపువి[119]ఱిగి “హా! చెడితి' - ననినేలఁబడి [120]పొర్లి యక్కటా! నిన్ను
వెఱ్ఱిఁ జేసిరిగాక! విశ్వేశ [121]యెట్టి - వెఱ్ఱివారైనను విషముఁ ద్రావుదురె?
బ్రదుకుదురె? విషమ్ముపాలైనవార? - లిది యెట్లు వినవచ్చు; నేమి సేయుదును?
నిక్క మెవ్విధమున నిన్నె కానె(కె?)ఱుఁగ - ముక్కంటి! నాకింక దిక్కెవ్వరయ్య?
నా కొఱకైనఁబినాకి! యివ్విషము - చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను
కటకటా! మేన సగంబున నుండి - యెట [122]వోయితవ్వ! నీ వెఱుఁగవే గౌరి!
ప్రమథగణములార! పరమాప్తులార! - సమసిన వెండి మీ శక్యమే కాన?
శతరుద్రులార! యసంఖ్యాతులార! - క్షితిధరకన్యకాపతిఁ గావరయ్య!
వీరభద్రయ్యరో! విషముఁ బ్రాణేశుఁ - డారగించె [123]నిఁ కెట్టులవునోకదయ్య!
ఓ పురాతనులార! యొడయండు బ్రదుక - నోపు[124]నొకో! విషంబొగి నారగించెఁ
జావు దప్పింపరే సద్గురు [125]నాథు - దీవన [126]లీయరే కావరే శివునిఁ
దల్లి లేని ప్రజలఁ దలఁతురే యొరులు - తల్లి యున్న విషముఁ ద్రావనేలిచ్చు!
పరమేశుఁడీ బారి బ్రదికెనేనియును - మరణంబు లేదువో మఱి యెన్నఁటికిని!
నని ప్రలాపింపుచుఁ [127]బనవుచు నొండు - వినఁజాలఁ బ్రాణము ల్విడుతు నే ననుచుఁ
దడయక ఘనజలాంతరమున నుఱుకఁ - బడకుండ నా రుద్రపశుపతిఁ బట్టి
పార్వతీసహితుఁడై ప్రమథరుద్రాది - సర్వసురాసురసంఘంబు గొలువ
హరుఁడు ప్రత్యక్షమై “యడుగుము నీకు - వరమిత్తు నెయ్యది వాంఛింతం” బనుడుఁ
గడుసంభ్రమంబున మృడుపదాబ్జములఁ - బడి రుద్రపశుపతి భట్టారకుండు
“ఏమియు నే నొల్ల నీ విషసేవ - [128]నేమేమి వుట్టునో యే వినఁజాల
గ్రక్కున నుమియవే కాలకూటంబు - నిక్కంబు [129]నాకెక్కె నీయీవి” యనిన
దశనకాంతులు దశదిశలఁ బర్వంగఁ - బశుపతి యా రుద్రపశుపతి కనియె
“ఇట లోకములలోన నెన్ననే కాక - యట మ్రింగ నుమియంగ నది యెంతవెద్ద
యణుమాత్ర [130]నా కంఠమందుఁ జిక్కినది - గణుతింప నున్నదే కాలకూటంబు
యింత సంతాపింప నేల నీ” కనుచు - వింతన వ్వొలయంగ [131]సంతరించుడును
“నమ్మంగఁ జాలఁ బినాకి యివ్విషము - గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను

[132]బెద్దయుఁ బుట్టునో పిమ్మటివార్త - దద్దయు విన [133]నోపఁ దా [134]మున్న చత్తు
సమయనిమ్మొండేనిఁ జావనీవేని - యుమియు మివ్విషమొండె నొండు సెప్పకుము
తక్కిన [135]మాటలు దనకింప” వనుచు - నిక్కంబు తెగువమై నిష్ఠించి పలుక
‘నుమియకుండినఁజచ్చునో ముగ్ధ’ యనుచు - నుమ [136]బోటి యాత్మలో నుత్తలపడగ
“నుమిసినఁ [137]గొని కాల్చునోతమ్ము” ననుచుఁ - గమలాక్షముఖ్యులు గడగడ వడఁకఁ
బ్రమథు లాతని ముగ్ధభక్తికి మెచ్చి - యమితమహోత్సవులై చూచుచుండ
నొక్కింత నవ్వుచు నుడురాజధరుఁడు - గ్రక్కున లేనెత్తి కౌఁగిటఁ జేర్చి
ప్రమథులయాన నీ పాదంబులాన - సమయ నివ్విషమున సత్యమిట్లనిన
నమ్మవే వలపలి నా తొడ యెక్కి - నెమ్మిఁ జూచుచునుండు నీలకంఠంబు”
నని యూరుపీఠంబునందు ధరించె - మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
నదిగాక కుత్తుక హాలాహలంబు - కదలినంతటనె చచ్చెదఁగాక! యనుచుఁ
దన కరవాలు ఱొమ్మున దూసి మోపి - కొని కుత్తుకయ చూచుచును ఱెప్పలిడక
పశుపతి తొడమీఁదఁ బాయక రుద్ర - పశుపతి నేఁడును బరగుచున్నాఁడు

నక్కనైనారు కథ


ఇల నొప్పు చోళమండలమున మఱియు - నలి నీలనక్కనైనారనుగణము
ఉవిదయుఁ దానును శివలింగపూజ - సవినయప్రీతిమైఁ జలుపు చున్నెడను
శివదేవుపై నొక్క సెలఁది వ్రాకుడును “శివశివ! ప్రేలు శివునకు” ననుచు
[138]నా పొల్తి యప్పుడ తూపొడ్వఁ దడవ - కోపించి యాతఁడు గొంతి కిట్లనియె
“పాపికా! బ్రమసితే ప్రాణవల్లభునిఁ - దూపొడ్వఁగూడునే [139]తుంపురు ల్నిండ
నిటుగాని నీ భక్తి యెఱుఁగంగరాదె! - యెటయేనిఁ బొమ్ము ని న్నే నొల్ల” ననుచు
వెడలంగ నడిచి యవ్విభుఁ[140]డు దా రాత్రి - మృడునర్చనము సేయునెడ లింగమందు
[141]నక్కాంత దూపొడ్చు చక్కటిఁ దక్కఁ - దక్కెల్లఁ [142]బ్రేలిన నక్కజంబంది
పతి వేగ సతి [143]వెంటఁ బాఱి పాదముల - కతిభక్తియుక్తి సాష్టాంగుఁడై మ్రొక్కి
“పాపి! పొ”మ్మని నిన్నుఁబఱపినయట్టి - పాపంబు సైరింపు పటుభక్తినిరత
నీవు దూపొడిచినఠావు దక్కంగ - దేవుని మేనెల్లఁ జూవె ప్రేలినది
ఈ దిక్కు దూపొడ్చి యీ సంకటంబు - నా దేవునకు మాన్పవే దయతోడ”

ననుచు వెండియు మ్రొక్క నంగన వచ్చి - తనపతి ప్రాణేశుతనువున నున్న
పొక్కులు వొడఁగని పురపురఁబొక్కి - అక్కటా! యీ పొక్కు లణఁగునే యింకఁ
బెనిమిటి దన్నుఁ జంపినఁ జంపనిమ్ము - అనుచుఁ దూపొడువ కే నరిగితినపుడు
కాన, నా తప్పునఁ గాఁజేసి శివుని - మేనఁ బొక్కులు గడు [144]ఇక్కుటంబయ్యె
పోనవే మున్ను దూపొడిచినచోట - నీవలిపొక్కు [145]లింకెన్నియు నేల?
నా నిమిత్తమునఁ బినాకి కిట్లయ్యె - నీ నిరోధం బింక నేఁ జూడఁజాల
ననుచుఁ బరిచ్ఛేదియై భక్తురాలు - దన శిరంబున కల్గఁ దత్ప్రస్తవమునఁ
దెఱవ ముగ్ధత్వంబు దేట[146]తెల్లముగ - మెఱయింతుఁ బొమ్మని మెచ్చి [147]యక్షణమ
భవరోగవైద్యుఁడు వార్వతీకాంతుఁ - డవినాశుఁ డజుఁడు ప్రత్యక్షమై నిలిచి
ప్రమథులు రుద్రులు బ్రహ్మాచ్యు[148]తేంద్రు - లమరసంఘము యథాక్రమమునఁ గొలువఁ
గరు[149]ణానిరీక్షణస్ఫురితసుధాబ్ధి - నిరువుర నోలార్చి యీప్సితార్థములు
[150]వేడుఁ డిచ్చెద” నన వెలఁదియుఁ బతియుఁ - బోఁడిగా సర్వాంగములుఁ బొదమ్రొక్కి
'దేవ! దేవాధీశ దివ్యలింగాంగ! - నీవు ప్రత్యక్షమై నిలిచిన మీఁద
వెండియు మఱియొండు వేఁడెద మనుట - యొండేమి? యది[151]యు నిన్నొల్లమిగాదె!
కావున, మీ పాదకమలాంతరంగ - భావసంపూర్ణసంపద గృపసేయు'
మని విన్నవించుడు నతివకుఁ బతికి - ననుపమపరమవరానందమూర్తి
ముఖ్యాపవర్గసముదితోపభోగ - సౌఖ్యత్వ మపుడు ప్రసాదించె శివుఁడు.

బెజ్జమహాదేవి కథ


మఱియును [152]విను బెజ్జమహాదేవి యనఁగఁ - గఱకంఠ శ్రీపాదకమలాంతరంగ
“యెల్లనియోగంబు లెల్ల బాంధవులు - నెల్లవారలు గల్గ నిట్లు భర్గునకుఁ
దల్లి లేకుండుట దా విచిత్రంబు - దల్లి [153]లే కది యెట్లు దా నుదయించె?
దల్లి సచ్చెనొ కాక త్రైలోక్యపతికిఁ - జెల్లఁబో! యిట్లేమి సేయంగవచ్చుఁ?
దల్లి సచ్చినఁగాదె తాను [154]డస్సితిని - ఎల్లవారికి దుఃఖ మిట్టిదకాదె
తల్లి గల్గిననేల తపసి గానిచ్చుఁ - దల్లి గల్గిననేల తల జడల్గట్టు?
దల్లి యున్న విషంబుఁ ద్రావ నేలిచ్చుఁ? - దల్లి యుండినఁ దోళ్లు దాల్ప నేలిచ్చుఁ?

దల్లి పాముల నేల ధరియింప నిచ్చుఁ? - దల్లి బూడిద [155]యేల తాఁ [156]బూయనిచ్చుఁ?
దల్లి వుచ్చునె భువిఁ దనయునిఁ దిరియఁ? - దల్ల వుచ్చునె సుతు వల్లకాటికిని
దల్లి లేకుండినతనయుండు గాన - ప్రల్లదుఁడై యిన్నివాట్లకు వచ్చెఁ
జన్నిచ్చి పలుమాఱు వెన్నయుఁ బెట్టి - పన్నుగా నిన్నియుఁబాలును బోసి
[157]యాఁకొనఁగాఁ గడు పరసి పాలిచ్చి- సాఁకించి పెనుపదే జనని గల్గినను
దా నింతవాఁడయ్యెఁ దల్లి లేకయును - దానెంత వెరుఁగునో తల్లి గల్గినను?
బెండిండ్ల నోములఁ [158]బేరంటములను - బండువుదినములఁ బాటిజాతరలఁ
దగినపోఁడిమి సేయుతల్లి లేకున్న - వగవరే మఱి యెట్టిమగబిడ్డలైన
నూర కుపేక్షించి [159]యుండంగఁ దగునె? - [160]ఆరంగఁ దల్లి[161]నై హరిని నేనైన
నరసెదఁగాక; యిట్లఱేక పెనుచు తరుణియ కాదెట్లు దల్లి దా” ననుచు
ననయంబు బెజ్జమహాదేవి దాన - జననియై [162]పరమేశుఁ దనయుఁ గావించి
[163]తొంగిళ్లపై నిడి లింగమూర్తికిని - నంగన గావించు నభ్యంజనంబు
ముక్కొత్తుఁ జెక్కొత్తు ముక్కన్నుఁ బులుము - నక్కొత్తుఁ గడుపొత్తునట వీపు నివురుఁ
బెరుఁగంగవలె నని తరుణి వీడ్వడఁగఁ జరణము ల్కరములుఁ జాఁగంగఁదిగుచు
నలుఁగులు నలుచు నర్మిలి గట్టిపెట్టి - జలములు వీపునఁ జఱచు [164]నంతంత
వెగచి బెగడకుండ వెన్ను వ్రేయుచును - నొగి మస్తకమున నీరొత్తు దోయిటను
వదనంబు సొచ్చునో యుదకంబు లనుచు - నదుముఁ [165]బొట్టను నోరికడ్డంబు వట్టుఁ
జెన్నుగాఁ [166]బసుపార్చి చేయు మజ్జనము - గన్నులుఁ జెవులును గాఁడంగనూఁడు
నంగిటముల్లొత్తు నందంద [167]వ్రేల - దొంగిళ్లఁ గార్నీరు దోనెత్తి మిడుచు
బడఁతిచే నీరఁ దూపొడిచి బొట్టడును – [168]మడఁది యంగుష్ఠంబు మన్నింత [169]మెదిచి
[170]కడవ నంటినయట్టి పిడుకవిభూతి - యడరఁ బుత్త్రుని నొసలారంగఁ బూయు
[171]నెత్తుగ్రుంగెడు నని యెత్తంగ వెఱచి - యత్తన్వి ఱొమ్మున నక్కున నదుము
కాటుక [172] యిడునంత గన్నగు ననుచుఁ - గాటుకయిడు మూఁడుగన్నులఁ గలయఁ
జన్నిచ్చుఁ బక్షులఁ జననీదు మీఁద - నన్నాతి గొందిన వెన్నయుఁబెట్టుఁ
జెక్కిలి గీఁటుడుఁ జెలఁగి యేడ్వంగ - నొక్కవేలిడి పోయు నొకకొన్నివాలు

ఉగ్గులు [173]వోసియు నువిద సంప్రీతి - నగ్గించు నొగియించు నట బుజ్జగించు
ముద్దాడు నగియించు ముద్దులువేఁడు - నద్దికొన్ వీరెవ్వరయ్యరో యనుచుఁ
బన్నుగా నుదరంబుఁ బాన్పుగాఁజేసి - [174]కున్న జోసఱచుచు సన్నుతిఁబాడుఁ”
గొడుకని [175]యిబ్బంగిఁ గొనియాడుచుండఁ - బడఁతి నిశ్చలముగ్ధభావంబునకును
శివుఁడును మెచ్చి తాఁ జేకొనియుండె - నువిద గావించు బాల్యోపచారములు
శ్రుతి “యేకయేవహి రూపేణ”యనియు - స్మృతి “సాధకస్సంస్మరేత్సదా” యనియు
ధర “తస్య తన్మయతాంయాతి” యనియు - హరునివాక్యము గాన యది యేలతప్పు
భక్తుఁ డెబ్భందిగా భావించు శివుఁడు - వ్యక్తిగాఁ దద్రూపుఁడై యుండు టరుదె?
యని భక్తమండలి [176]వినుతింపఁ గొన్ని - దినములు సనఁగ నద్దేవదేవుండు
వెండి యమ్మకుఁ బ్రసన్నుండు గాఁదలఁచి - దండిరోగంబైన [177]తఱుచంటిక్రియను
జన్నును గుడువక సంధిల్ల నోరు - వెన్నకుఁ దెఱవకయున్న యక్షణమ
బిట్టుల్కిపడి [178]తల్లి బిమ్మిటి నొడలుఁ - బట్టలే కాపద గిట్టి “నాయన్న!
నాకున్న! నా పట్టి! నా [179]చిన్నవడుగ! - నా కుఱ్ఱ! చన్నేలరా కుడ్వవైతి
నీ చెమటయుఁ జూచి నెత్తురు [180]నవుదు(?) - నో చెల్ల! [181]యెటు సూడనోపుదునన్న!
తల్లిఁగదన్న! యింతటి కోర్తునన్న! ఎల్లెడ నొరుల నే నెఱుఁగఁగదన్న!
[182]కలిగితి లేక యొక్కఁడవు గదన్న! - తలరక యే నెట్లు ధరియింతునన్న!
నేలపై [183]నా కాళ్లు నిలువవురన్న! - ఏల పల్కవు సెప్పవే యన్న! నీకు
నఱిమియో? [184]కోవయో? [185]యంగిటిముల్లొ! - ఎఱుఁగను మందుమ్రా కేమియు” ననుచు
[186]బనవుఁ బలవరించుఁ బయిబడి పొరలుఁ - గనుఁగొను మైవుడ్కుఁ గౌఁగిటఁ జేర్చుఁ
గప్పుఁ దెఱుచుఁ గప్పుఁ గ్రమ్మఱఁ దెఱుచుఁ - దప్పక వీక్షించుఁ దల్లడంబందుఁ
బొంగెడుఁగడుపుముప్పునను 'బొప్పనికి - నంగిటిముల్లయ్యె'నని నరులనఁగ
నడలుచుఁ గడుశోకజడధిఁ దేలుచును - బడఁతి పుత్త్రుండున్నభావంబుఁ జూచి
కడుపు వెలితియైన నొడయనంబికిని - నెడవోయి [187]యచ్చటఁ గుడువ లేకున్నఁ
గునియుచుఁ గుమ్మరగుండయ్య వాద్య - మున కాడి యచ్చటఁగొనఁదిన లేక
వచ్చి చేరమ చక్రవర్తి వాయింప - నచ్చెరువుగ నాడి యాఁకట [188]బడలి

'వెడయాట లివి [189]యెల్ల వేగి యాడినను - గడుపు నిండునె' య[190]ని గ్రక్కునవచ్చి
పిట్టవ్వకై రాచవెట్టికిఁ బోయి - యెట్టకేలకు నింత పిట్టారగించి
సామవేదులయింటఁ జచ్చినపెయ్యఁ - బ్రేమం[191]బుతో వండి పెట్టంగఁ గుడిచి
[192]కామింపఁగాఁ గరికాళవ్వయింట - మామిడిపండులు మఱుఁగున నమలి
పోయి చెన్నయయింటిఁబులియంబకళముఁ - జేయుఁ దీయక జుఱ్ఱి చిఱుతొండనంబి
కొడుకు [193]మాంసము వేఁడికొని [194]విందుసేసి - యెడపక నిమ్మవ్వయింట భుజించి
యారగింపఁగఁ జవియైనఁ జోడవ్వ - కోరతో నిచ్చినఁ గొని యారగించి
యాసక్తి సురియచౌడ[195]య్య చేకళ్ల - కాసించి తట వెండి యంతటఁబోక
నిన్న నింతయు నొక్క నొలఁతుక సెప్పెఁ - గున్న! యాఱడి [196]వుచ్చఁగూడునే నన్ను
మలమల మఱుఁగుచు నిలనాడనేల - కొలఁదిదప్పినకుడ్పు గుడువంగనేల?
బ్రదుకున్నదే యిట్లు వైకుడ్పులందు - నది యేల కడుపూఁదదయ్యెడుఁ జెపుమ
చన్నిత్తుఁ బలుమాఱు వెన్నయుఁ బాలు - నెన్నఁడుఁ దప్పింప నెందైనఁ దెత్తుఁ
[197]గుడుపు నీ కెయిదదే కొడుక యిట్లేల? - అడిగి కుడువఁబోయి తాదట [198]లేక
యిన్ని దినంబులు [199]నేరీతిఁ జాలె - నిన్న నీ కడు పేల నిండదు సెపుమ
యేయెడ వంచింప 'రేయును బగలుఁ - జేయి దిగం డిట్టిసితగుండు గలఁడె?”
యని యొండె వేసర నాసరఁగన్న - జననిగదా యని [200]చనవునఁ బలుకఁ
దెల్ల మిప్పుడు మీఁదఁ దొల్లి నా యట్టి - తల్లులు గలరె యీ ముల్లోకములను
బనుగొన నీవు నా ప్రాణంబు [201]గాఁగ - [202]ననురక్తి గొనియాటకది నీవె సాక్షి
[203]యెట్టేని మాయుంచినట్టుల యుండి - బెట్టినంత గుడిచి యట్టుండితేని
యెప్పాట నినుఁ బొందునే తెవుల్నొప్పి? - నిప్పునఁ జెదలంటునే నీకు నీవ
చేసికొనఁగఁ దెవుల్సిద్ధించెఁగాక - యీ సంకటంబు నీ కేల [204]తావచ్చుఁ
బనియేమి? మాటలఁ బాయునే తెవులు - నినుఁ [205]గొంత వీఱిఁడితనమడ్గనేల?
[206]చాలఁ జూడంగ నీ సంకటం బింక - బాలుండ! నీ మీఁదఁ బ్రాణము ల్విడుతు”
నని తనశిరమున కలు[207]గ నున్నంతఁ - దన తల్లి కపుడు ప్రత్యక్షమై నిలిచి
యడుగు మిచ్చెద నీకు నభిమతం బనుడుఁ - గొడుక! నా కొకకోర్కికొఱఁతయుఁ గలదె?



నీవు నిరోగివై నిత్యుండవై సు - ఖావాప్తి [208] నుండు నాకంతియె చాలు
కన్న మోహంబునకంటె నగ్గలము - ఎన్నఁ బెంచినమోహమెందు నటండ్రు
అటుగాన నినుఁ గన్నులారం జూచుచును - నిట యుండుటయె నాకు నీప్సితంబనిన
మందస్మితముఖారవిందుఁడై తల్లి - నందంద కౌఁగిట నప్పళింపుచును
'ముల్లోకములకెల్ల ముత్తవ(త్తోవునా?) నాకుఁ - దల్లివిగాన నా తల్లి! నీయట్టి
తల్లి[209]వి గలుగంగఁ దనకు రోగంబు - లెల్లెడఁబొందఁగ నెట్లుండవచ్చు'
ననుచు నిత్యత్వ మాయమ్మకు నొసఁగె - ననుపమ పరమ పరానందమూర్తి
యమ్మయై శివుఁ గొనియాడుటఁ జేసి - యమ్మవ్వ యను నామమయ్యె వెండియును

గొడగూచి కథ


“శివుదేవుఁడన నొక్క శివభక్తి[210]యుతుఁడు - నువిదయుఁ [211]దానుఁ బొర్గూరి కేఁగుచును
రూపించి [212]కడగొట్టు పాపఁదారింటి - కాపిడి 'యటయిట కదలకుమమ్మ!
పడుచులతో నాడఁ బఱవకు మమ్మ! - నొడివిన మా వ్రతం బెడపకుమమ్మ!
గుడి కేఁగి నిత్యంబుఁ గుంచెఁడుపాలు - బడరున కారగింపఁగఁ బెట్టుమమ్మ!
నమ్మిపోయెదము సుమ్మమ్మ! మఱాకు - మమ్మ! మా యమ్మ! మాయక్క! మా తల్లి
కొమ్మ! నీకొక [213]మంచిబొమ్మయు లెస్స - బొమ్మపొత్తికలును బోయి తెచ్చెదము”
అని యప్పగించుచు నరిగిన, వారి - తనయ గాళ్లు మొగంబు దాఁ గడిగికొని
మంచిగంగులపాలు [214]మరగంగఁ గాఁచి - కుంచెఁడు గోరతోఁ గొలిచి చేపట్టి
కోరయు [215]బొత్తిస(?) కొంగునఁ గప్పి - భోరునఁ జని శివాగారంబుఁ జొచ్చి
కోర ముందఱఁ బెట్టి ధారుణిమ్రొక్కి - "యారగింపవె దేవ!” యని విన్నవించి యా
పిఱుసని యొక్కింత మఱువున నిలిచి - మతి వచ్చి చూచుడు గఱిగంటి గామి
బాల దల్లడమంది భయమునఁబొంది - పాలేల యారగింపవు లింగమూర్తి?
కాఁచుట సాలదో కమ్మ వల్వమినొ- ప్రాఁచియో విఱిగెనో పడుచ నేననియొ?
ప్రొద్దెక్కెనో [216]యొంద [217]బొగయువల్చెడినొ? బుద్ధివుట్టదొ నెయ్యివోయకుండితినొ?
కడువేఁడియో నీరు గలసినవనియొ? - ఎడ వాద్యములు లేక యేనె తెచ్చిననొ?
చాలవో యివి యాలపాలు గావనియొ? - పాలపైఁ జిత్త మేఁబఱపితి ననియొ?
కోర బెడంగనో [218]కుంచెఁడు లేవొ? - ఆరగింపఁగఁ బెట్ట నేరకుండితినో?

మీఁదువో [219]యినవనో మీఁగడ లేదొ? - దెచ్చునెడ నెవ్వరేఁజూచిరనియొ?
యూరకేమిటికిఁ బాలొల్లవు ద్రావఁ - గారణంబేమేనిఁ గలదేనిఁ జెపుమ
నిక్కంపుటాఁకలి నీకు లేదేని - గుక్కెఁడైనను గొని [220]చిక్కించు నాకుఁ
[221]గుడుపునకియ్యెడ [222]గుడగుడ లేల - కుడికెఁడు దెత్తు నా గుజ్జునోగిరము
మూలపన్నారుల యాలోవిలోనఁ - బోలె లున్నవి వంపు వోయి తెచ్చెదను
ఉట్టిపై బానలో నున్నది నెయ్యి - యిట్టున్నఁ దెచ్చెద నిష్టమే చెపుమ
కుండెఁడున్నది వోయి కొనివత్తుఁ బుల్ల - [223]కండంబు వలెనేని గ్రక్కునఁజెపుమ
[224]అచ్చన యెల్లి మాయయగారినగరఁ - జెచ్చెరఁ బిల్వవచ్చెద నారగింపు
మా శివసోదరిమఠమునఁగలదు - పాసెంబు దెచ్చెదఁబాలు మున్త్రావు
షోడశపండువు సూడఁబోదండు(?) - పోఁడిగా నీ పాలు పురహర! కొనుము
వీరభద్రుని జాత్రవేళ [225]నిన్బండి - యే రొప్పఁ బనిచెద నీ పాలు ద్రావు
మెడమడు గేమిటి కీ పాలలోని - కడుకులు దెచ్చెద నల్లైనఁ జెపుమ
యిత్తఱి శిశువుండ నెట్టులంటేని - పొత్తుననైనను నెత్తి త్రావుదము
పిన్నపన్నారులు సిన్నిబొమ్మలును - నిన్ని గూడడుకులు నెన్నేనిఁబండ్లు
నా కెల్లి మా వారు నలిఁ దెత్తురపుడు - నీకు నిచ్చెదఁగాని నీ యాన! త్రావు
పాలును జల్లారెఁ బలుకవు దోడ - నేల యాలింగ! నన్నేఁచెద వనుచుఁ
బాప యీశ్వరునకుఁ బలుమాఱు మ్రొక్కుఁ - గోపించు భంగించుఁ గుప్పించు నఱచుఁ
గటకట వాపోవుఁగరము[226]లు విఱుచుఁ - దటతట నేలతోఁదాఁకించుఁగాళ్లు
ధారుణిఁబడి బయల్దన్నుచు నేడ్చుఁ - గోరదిక్కును జూచు మారారిఁజూచు
బుజ్జగించును [227]వెడ్లు బుడ్లును బెట్టు - నిర్జీవిక్రియఁబడు నివ్వెఱఁగందు
నెప్పటి య ట్లేడ్చు నెలుఁగెత్తి పిలుచుఁ - దొప్పనఁ బడుఁ గోరఁ దొలఁగంగ [228]నూకు
వెఱచి ముందఱఁబెట్టు మఱి పలుమాఱు - నెఱఁగుఁ [229]బాదంబుల కెట్లుఁ ద్రావమిని
[230]నిట్టైనఁగాని పాలేఁ ద్రావ ననవు - ముట్టవు మూర్కొనవట్టె యున్నవియు
నీవారగింపమి మా వారు విన్నఁ - జావనడ్తురు నన్ను సంశయంబేల
తనకు నెప్పుడుఁ జావు దప్పదు[231] మగిడి - చన నిచ్చటనె చత్తు సరివోదు” ననుచుఁ
దనతల శివునితోఁ దాఁకించుకొనఁగఁ - జనునంతలోనన [232]చక్కనఁబట్టి

యా రుద్రుఁడతిదయాహసితాస్యుఁ డగుచుఁ - గోరతోఁ బాలెత్తుకొని యారగింప
“నన్నింత యేఁచితి పిన్నగాఁ[233]జేసి - మిన్నకపోదు మాయన్నకుఁజెప్పి
మఱికదా యున్నది మాట[234]లింకేల - కఱకంఠ! యింతయు మఱవకు”మనుచుఁ
గుడుక దెమ్మని పుచ్చుకొనుచు నబ్బాల - వడిగొని యింటికి వచ్చి నిత్యమ్ము
నిట్ల కొంపోయి తానిచ్చుచునుండ - నట్ల శివుండుఁబాలారగింపంగ
నూరికిఁబోయిన వారెదుర్గాఁగఁ - దా రేఁగుదెంచు నత్తఱిఁదొంటియట్ల
మృడుఁడు వాలారగిం[235]చుడు బాల రిత్త - కుడుకఁ [236]జేతను బట్టికొని యేఁగుదేరఁ
బొడగన 'యిట యెందుఁ [237]బోయెదు రిత్త - కుడుక యెచ్చటనుండి కొనివచ్చె'దనిన
'మీరు సెప్పినయట్ల మృడునకుఁబాలు - కోరతోఁ గుంచెఁడు గొలిచి కొంపోవ
నారగింపఁగ మ్రొక్కి యనయంబు నిట్లు - కోర యిమ్మన పుచ్చికొని వత్తు'ననిన
“నేనాఁటఁ ద్రావుఁ బాలీశుండు వడుచ - కానీవ త్రావితో కాదేని తోడ
నాడెడు పడుచుల కచటఁ[238] బోసితివొ? - యేడఁ [239]జల్లితివొ [240]మైయెఱుఁగవు గాక
తన్నుమహాభక్తతతి [241]యుద్దెసించి - పన్నుగా 'నారగింపవె దేవ!' యనుచు
నతిభక్తిఁ బ్రార్ధింప నారగించుటయు - క్షితి దుర్లభంబన్న నితరులతరమె?
యెట్టు నమ్మెడి దంచుఁబట్టిఁదిట్టుచును - 'నట్టెనఁజూత'మం చామఱునాఁడు
బాలచేతనె తండ్రి వట్టించుకొనుచు - లీలతోఁగుడికేఁగి పాలతోఁ గోర
ముంద[242]ఱిక్రమమున ముంద[243]ఱనఁ బెట్ట - నందికొనండయ్యె నా లింగమూర్తి
బాలముగ్ధత్వంబు ప్రవిమలభక్తి - [244]యీలోకమున వెలయింపంగఁ దలఁచి
యా శివదేవుఁడు నంతఁ గోపించి - [245]యోసి! నేఁడేల పాలొల్లండు ద్రావ
ముక్కంటిముట్టెనే [246]మూర్కొన్నె చెపుమ - పెక్కులు వ్రేలితి [247]వక్కజంబుగను
శివునకు నని యుద్దెసించినపాలు - దవిలి నిత్యంబును ద్రావినద్రోహి!
పొట్టవ్రచ్చెద[248] నెందుఁ బోయెద'వనుచు - గట్టుగ్రమునఁగూడ [249]ముట్టుడు మున్న
బాల వాపోవుచు బలువిడినేఁగి - [250]హాలింగ! హాలింగ! హాలింగ! యనుచు

జేతికోరకు మున్ను [251]సేయిసాఁచుచును - నాతని కొదుఁగుడు నంతలోపలను
హరుఁ డోడకోడకు మనుచు నక్షణమ - వరదయామతిఁ దనవక్షంబుఁ దెఱవ
జగదభినుతకరడిగ భోగనాథు - నగణిత [252]దివ్యలింగాంగంబు సొరఁగ
నమ్మాత్రలో [253]నహహా! పోయె ననుచుఁ - గ్రమ్మనఁ దండ్రి [254]గూఁకటి వట్టుటయును
వెలుపలఁ [255]గూఁకటి వెండ్రుకల్ సిక్కె - వెలయ లింగంబులోపలఁ జిక్కెబాల
యిల నేఁడు నాఱునెలల కొక్కమాఱు - నలరి [256]కూఁకటివెండ్రుకలు [257]గత్తిరింప
'బాల నిశ్చలముగ్ధభావ సంపదకు - నీ[258]లోకమున దృష్ట' మిది యని పొగడ
గొడగూచి యని చెప్పఁబడి మహామహిమ - నడరెఁ దా నాముగ్ధ యదియునుగాక

దీపదకళియారు కథ


ఏపార మఱియుఁ గాంచీపురంబునను - దీపదకళి యన దృఢభక్తియుతుఁడు
పొరుగూరి కొక్కనాఁడరుగ నొక్కెడను - హరుఁడు జీర్ణాలయంబందుండఁజూచి
"కటకటా!యీశుఁడొక్కఁడ యున్నవాఁడు - పటుతరాటవిలోనఁ బగయును బెద్ద
కచ్చడంబులు గూడఁ గట్టించె మునులఁ - జెచ్చెర ముక్తులఁజేసె దానవులఁ
గనుమూయ నెడయులే [259]దనఁగ మువ్వెట్టి - గొనియెనవ్వాసవాద్యనిమిష వరులఁ
దిరముగా ద్వాదశాదిత్యుల నొక్క - [260]దెరువునఁ బోకుండఁదిరువుడుకొలిపె
వెలయ ననంగుఁ గావించె నంగజుని - వెలుఁగనిపురములు వెలిఁ[261]గించెఁ బేర్చి
చెనసి దామోదరుఁజేసె దామోద - రుని విధిపాలు సేసెను విధిఁబట్టి
కరుణాకరుండని గారవింపంగ - నరుదగు సర్వసంహారంబు చేసెఁ
గావునఁబగ వెద్ద దేవదేవునకు - నీ విపినంబులో నెట్లుండవచ్చు
గుడియును[262]వ్రస్సియుఁ [263]గూలిపోయినది - యడరుమంటపమును నరివియైనయది
కోటయుఁబడ్డది గూడ నయ్యైక - వాటంబు [264]లును జివ్కి వసుధఁ ద్రెళ్లినవి
ఒడల నర్ధము గొన్న యుమబోటి వుట్టు - పొడ లేదు శివునంద యడఁగెనో [265]కాక
భయమందియొంటిగోడయు[266] మీఁదఁగసువు - వయిచుకొన్నదియును వనరుచు నెదుర
మును శివుఁడిచటఁబుట్టిననాఁటనుండి - చెనసి తమ్మళి భజించిన చొప్పు లేదు
ఇది యేల వేయును నిచ్చట నునికి - యది ప్రమాదమ యసహాయంబుగాన

నిక్క మీశుండపో యెక్కటి [267]వీరుఁ - డొక్కఁడు నిక్కడ నున్న యప్పటికి
నూరక వట్టివిచారంబులెల్లఁ - దా రక్షయగునె సంహారరుద్రునకు”
నని నిశ్చయించి తానచ్చోన యుండి - తనయింటి [268]యావత్తుధనమును మున్ను
సంచితంబగు వస్తుసమితియుఁ జిల్ల - పెంచాదిగా [269]మట్టగించి తెప్పించి
గుడియు మంటపమును గ్రొత్త గావించి - కడునొప్పఁ జట్టు నగడ్తఁ ద్రవ్వించి
కోటయుఁ గొమ్మలుఁ గొత్తడంబులుఁ గ - వాటంబులును దగువంకదారలును
బెట్టించి [270]వంపుడుగట్ట యగడ్త - చుట్టును బోయించి యట్టళ్లు దీర్చి
పొలుపొందఁ [271]డెంకణంబులు వెక్కువన్ని - నలిఁబడగలుఁదోరణంబులు గట్టి
కొత్తడంబులఁగోటకొమ్ముల [272]గొడుగు - లెత్తించి బలుమగలెందఱో యనఁగ
[273]వ్రాలినకుసులును వసులుదూలములు - ఱాలుగుండ్లును నిస్ము సాలఁదెప్పించి
కోటకొమ్ములఁ దగుచోటఁ బంచించి - కోట యీ క్రమమునఁ బాటించి యంత
లోఁతుగా నడబావిలోనఁ గట్టించి - [274]పాఁతర్లఁ గొలుచు నేర్పడ సంగ్రహించి
యగ్గుడిచుట్టు బిల్వాశోకసురభి - గుగ్గులు క్రముకాదికుజములు వెట్టి
మరువంబు దవనంబు మాచిపత్తిరియు - వరుసను బహుపుష్పవాటికల్ నాఁటి
[275]జాలవారిని దివ్వటీలను బల్ల - గోలలవారిని గుడిపూజరులను
నొడిసెలకాండ్రను నోజులవారి - బడిపని [276]జనులను బంతంబుబంట్ల
ద్వారపాలుర సువిధానుల విండ్ల - వారిఁ దలారుల వారక యేలి
వారును దాను నవారితశక్తి - [277]గోరంతప్రొద్దు మేకొనికట్టు బిగిచి
యాయత పంచమహావాద్యరవము - పాయక రేయును బగలును మ్రోయఁ
బోటరులగు నజాంభోజనాభులకుఁ - గోట సాధింప నగోచరంబనుచు
మనుజులక్కజమంది వినుతింపుచుండ - ఘనకీర్తి నటు గొంతగాలంబు సనఁగ
ధనమెల్లఁ దన్నిమిత్తమునను సమయ - మునుకొని పరివారమునకు జీవితముఁ
బెట్టలేకున్నను [278]బెగడక జగతి - చుట్టును జాల రాచుచుఁ దిరుగుచును
అంతంతఁ గవదివియల నాఁటఁ బొడిచి - యంతఁ దొల్లిటికంటె నగ్గలికముగ
మొలనున్నగంటలు మ్రోయఁ దాళంబు - లులియ నొడ్డణము గుబ్బలు గజ్జియలును
ధ్వనియింప నల్లన తాటన వుచ్చు - చును సువిధానంబు సువిధాన మనుచుఁ

[279]గుడిని మానిసి గొమ్మకొమ్మ దప్పకయ - [280]యడువరిపై నున్నయట్లొక్కరుండు
వేయుముఖంబుల వేనవేల్విధులఁ - బాయక యట్టుల బలము సేయుచును
నీ విధంబున రాత్రులెల్ల వేగింపఁ- గా వెండి నూనియ గవదివియలకు
నొక్కింతయును లేకయున్న నూహించి - గ్రక్కున మాఁకుల కణికలు వేర్చి
కవదివియలభాతిఁ గాల్చుచు మంట - లవిరళంబుగఁ బెట్టి యట్లు వేగింప
నొక్కకొఱడు గొట్ర యొక [281]మ్రానుమట్ర - యొక్కబడియ బట్రయొక కట్టెగిట్టె
మందునకైనను మ్రాఁకనుపేరు - నెందును లేకుండ నేఁగుడు నంత
[282]కసువునఁబిరు(పిరి?)వెంట్లుగాఁ దాల్చిచేత - నసలారఁ గవదివియలభాతిఁ బట్టి
యిలఁ[283] దీగదీపంబుపొలుపు వట్రిల్ల - నలి మనోవేగంబున జగతిచుట్టుఁ
దిరుగుచు మఱి కొన్ని దినములు [284]నడవఁ - బొరిఁ బల్లు [285]గుట్టెడుపూరియఁ బుడుక
సదసట్ర నలి నట్ర సరి [286]గస్వుగట్ర - వెదకియుఁ గానక మది విచారించి
కచ్చడంబాదిగాఁ గలచీరె లెల్లఁ - జెచ్చెర వెంట్లుగాఁ జేసి ముట్టించి
దివి[287] వెలింగెడు మెర్గుదీగెలో నాఁగఁ - గవదివియల [288]భాతిఁ గరములఁబట్టి
వెసఁగొని తిరుగ న [289]వ్వెంట్లుఁ జెల్లుడును - మసలక చీకటి మఱువునఁజేసి
పగవారు సొత్తురో పరికింపరామి - నగుఁ బ్రమాదం [290]బంచు నాత్మలోఁదలఁచి
గ్రక్కునఁదలవెండ్రుకల జడయల్లి - చక్కన దీపంబు సంధించిపట్టి
యింతట వేగుఁబోయిం[291] కఁబ్రొద్దనుచు - నెంతయు రయమున నెప్పటియట్ల
[292]జగతిచుట్టుఁ దిరుగ జడ యెల్లఁగాలి - బగబగయనఁగ దీపదకళియారి
తలగూడ దరికొనఁ దడవ శంభుండు - జలజాక్ష జలజజ శతమఖార్చితుఁడు
కంతుసంహరుఁడంత కాంతకుఁడతిని - తాంతసదానందుఁ డంబికాధవుఁడు
త్రిభువనారాధ్యుండు దివ్యశరీరుఁ - డభవుండు శివుఁడు ప్రత్యక్షమై నిలిచి
దీరు మహోదారు దీపదకళియ - నారును గారుణ్యవారాశిఁ దేల్చి
“యిచ్చ యెయ్యది నీకు మెచ్చితి [293]వేఁడు మిచ్చెద” నావుడు నిలఁజాఁగిమ్రొక్కి
“మెచ్చులు వేయును వచ్చె నొండొల్ల - నిచ్చమై విన్నపంబేర్పడ వినుము
ఈవిపినంబులో నెక్కడి బడుగు - దేవరో యనఁగ శ్రీదివ్యలింగాంగ
లోకాశ్రితుఁడ! భక్తలోకకుటుంబి! - యేకాకివై యుండు టిది నీతిగాదు

అనయంబు రజితాద్రి[294]యట్టిదుర్గంబు - మనకుఁ గల్గఁగ వేఱె మన్నెముల్ సేసి
కొనియుండనేల యీ వనదుర్గ మందుఁ" - [295]జనుసనుమనుచుఁ బుష్పకవిమానంబుఁ
జక్కన నద్దేవు నెక్కించి తాను - నెక్కి దీపదకళి యెంతయునొప్పు
గుడియు మంటపమును గోటయుఁగూడఁ - గడునర్థిఁ గొనిపోయెఁ గైలాసమునకుఁ
బురహరు మెప్పించి బొందులతోన - యరుగుభక్తులు గలరన్నిలోకముల
గుడితోన లింగంబుఁ గొనిపోవుభక్తుఁ - డడరఁగఁ గలఁడయ్య! యఖిల లోకములఁ
గడుఁగడుఁ జోద్యంబుగాదె తలంపఁ - బుడమిఁ బుట్టనిభక్తిఁ బుట్టెఁదా ననుచు
దేవదానవమానవావలి వొగడఁ - గా వీరభక్తశిఖామణి యైన
యట్టిదీపదకళియారి ముగ్ధత్వ - మిట్టలంబైయొప్పె నిల” నట్టుఁగాక

నాట్యనమిత్తండి కథ


“కడునొప్పు వెండియుఁ గంచిలోపలను - మృడుమూర్తి నాట్యనమిత్తండి యనఁగఁ
బోఁడిగా శివభక్తపుంగవుఁడొక్క - నాఁడు శ్రీ యేకామ్రనాథుని గుడికి
నాయతభక్తిమై నరిగి కూత్తాడి - నాయనారిని సదానందస్వరూపిఁ
దాండవమూర్తి నత్యద్భుతాకారు - దండిగజాసురదళనావతారు
బాలేందు శేఖరు ఫాలలోచనుని - గాలకంధరు శూలఖట్వాంగధరునిఁ
బొడగని పూజారి నడిగె “నీశ్వరుని - [296]నడుమటు వీఁగియున్నది యొక్కదెసకు
వారక కొంకరవంకరల్వోయి - గౌరీశుచేతులు పూరించి[297]నవియు
ముక్కొంకులును బోయి మోచియు మోవ - కొక్కవాదంబట్టులున్నది శివున
కున్నపాదంబును నూరుమధ్యమున - నున్నది [298]యీచవో యున్న భావమున
నిలువులువడి శివునేత్రత్రయంబు - నొలుపుగా ఱెప్పలు వొందకున్నవియు
మలహరుశిరమును [299]నిలువక యొక్క - వలనిక యంతయు వ్రాలియున్నదియు
మృడదేవు కెంజడ [300]ముడివీడినదియుఁ - గడుఁజోద్యమిదియేమి గారణం?"బనుడు
నా శివబ్రాహ్మణుఁడల్లన నగుచు - “నీ శివునకు రోగమిట్టులైనదియు
వాయు [301]దోషము దీని వారింపకున్నఁ - గాయజహరునకుఁ గడుఁ బ్రమాదంబు
దడసిన నింకొండు దలఁచిన శివుని - యెడలెల్లఁ గూడ నిప్పుడ కొంకు [302]వోవు
దీనికి నౌషధంబే నెఱుంగుదును - బూని చేయింపుమా మానెడు” నంచు
నాలిసేయుచుఁ బల్క నది దథ్యగాఁగ - నా లింగవంతుఁ డట్లాత్మఁదలంచి

తనయింటఁగల పదార్థమ్ములు ధనము - [303]మునుకొని కొనివచ్చి ముంద[304]టఁబెట్టి
"కోరియింతయును జేకొనియైననిపుడు - మారారిరోగంబు మాన్చి తేనియును
నా సతియును నేను నా సుతుల్నీకు - దాసులమయ్యెద మాసక్తితోడ
నెట్టైన నీ వింతవట్టు పుణ్యంబు - గట్టికోవే” యనఁ గల ధనంబెల్లఁ
గొని"వాయుతైలంబుఁగూర్చి యౌషధము - లెనయంగవండితి” ననుచు నాముదము
నూనియ నొక్కింత నులివెచ్చఁ జేసి- చేనిచ్చెఁదత్క్రియ సెప్పుచు నతఁడు
వాయుతైలముఁ గొనివచ్చి యక్షణమ - మాయాపహరుమేన మర్దనసేసి
తవిలి యా వావిలిచివుళులుమ్మెత్త - చివుళులు [305]దక్కెడిచివుళు [306]లాముదము
చివుళులు పండినజిల్లెడాకులును - నివి యాదిగా మందులిన్నియుఁగూర్చి
చెచ్చెరఁ దనువెల్ల సేకంబుసేసి - పొచ్చెంబు లే కిస్ముపొట్లాలఁ గాఁచి
పుచ్చుచు నరచేత వెచ్చఁ జూపుచును - నిచ్చ యెఱిఁగి కాఁక లిచ్చును వలయు
పథ్యంబులారగింపంగఁ బెట్టుచును - [307]దథ్యంబుగా వెండి తగుక్రియ ల్సేయఁ
గొన్నిదినంబులు సన్నఁ దద్భక్తుఁ - డన్నీలగళుఁ జూచి "యిన్ని నాళ్లయ్యె
నాపోవ నొక్కింతయైనను గుణము - సూపదు వార్వతీశుశరీర మందు
నననేల! నిక్కము నట్టిద కాదె; - పనుగొన నేనెంత భ్రాంతిఁ బొందినను
నారంగ నడవులయాకులు నలము - వేరు వెల్లంకియు మారసంహరుని
యొడలిరోగము మాన్ప నోపునే యింక - నెడసేయనేటికి నేఁగాక శివుని
వాయుదోషమునకు వైద్యుండ”ననుచు - నాయయ్య గడునిశ్చితాత్ముఁడై యంతఁ
దలఁ కించుకయు లేక తన ప్రాణమునకు - నలుగంగఁ బ్రత్యక్షమై నిల్చి శివుడుఁ
పార్వతీకాంతుఁడు భక్తవత్సలుఁడు - శర్వుఁడర్వాచీన సౌమ్యస్వరూపి
గీర్వాణవంద్యుండు [308]సర్వేశ్వరుండు - సర్వజ్ఞుఁడజహరిశతమఖార్చితుఁడు
నాట్యలోలుండు బినాకహస్తుండు - నాట్య [309]నమిత్తండి నలిఁగౌఁగిలించి
“మేదురకీర్తి! నిన్ మెచ్చితి వేఁడు - మాదట నిచ్చెద నభిమతార్ధములు”
ననుడు "నేమియు నొల్లనభవ! మీ దివ్య - తనువు వేఱొండుసందంబైన యదియు
వెండి వంకలువోయి వెడరూపుగాక - యొండేమి గడుఁజూడ నొప్పియున్నదియు
రోగమో! సహజమో! యోగీంద్రవంద్య! - ఈ గరిమంబు నా కెఱిఁగింపు” మనిన
“నిది దాండవాకార[310]మెట్టులంటేని - ముదమున నాట్యాభిముఖుఁడనై నిల్చి

'హో'యని డమరుగంబొగినొక్కమాటు-వాయింపఁదడవసర్వములయ[311]బొందుఁ (ద)?
జరణంబు దొంగలి చలనగాఁ జేసి - పరగంగ నక్షత్రపంక్తులు డుల్ల;
వినుతమహోద్రేకవీక్షణాటోప - మున నజాచ్యుతదేవముఖ్యులడంగ
మూవలగంటల మ్రోఁతకు వెఱచి - దేవి యున్న సగంబు ధృతిఁదన్నుఁగలయ
ఖ్యాత మహోద్ధత కరతాడనముల - నాతతదిక్తతి [312]యవలఁజనంగ
వడి మహోచ్ఛ్వాసనిశ్శ్వాసోపనిహతి - బడబాలనం బాఱ జడనిధు లింక
గతిని మెట్టెడుపాదఘట్టనచేత - నతులధాత్రీతలంబది ధూళి గాఁగ
నురవడిమై జిఱ్ఱఁదిరిగి నిల్చుడును - బొర[313]మాలి దిగ్గజంబులు వొడవడఁగ
[314]గ్రక్కున జాఱి టంకారంబుచేత - నెక్కొన్న కులగిరుల్ నెఱిఁబొడిగాఁగ
నొందంగఁ బాదాగ్ర మూఁది నటింపఁ - - గ్రిందటికూర్మంబు [315]గిజగిజగాఁగ
మహితజటాచ్ఛటా విహతి నజాండ - బహులకటాహంబు వఱియలుగాఁగ
నురుకిరీటవిఘాతనోద్వృత్తిఁజేసి - పొరిఁదత్త్వ సందోహములు వెల్లగిలఁగఁ
దాండవోద్ధతిఁజేసి ధరియింపఁబడిన - దండిఫణీంద్రుండు దలరి రోఁజంగ
నిటురోఁజుచున్న ఫణీంద్రు నూర్పులకు - స్ఫుటఫాలనేత్రాగ్ని భుగులన నెగయ
వడి నెగసెడినేత్రవహ్నిరోచులకు - జడలపైఁ జంద్రుఁడాసగమును గరఁగఁ
గలయ సుధాసూతి గరఁగినకతన - బలువిడి నమృతంబు దల డిగి పఱవఁ
దలడిగి పఱతెంచు తత్సుధాపూర - మలరి ముంచుడు జీవములు వచ్చి యంత
నురమున శిరమున నొగి గళంబునను - గరముల భూషణోత్కరములై వెలిఁగి
పరగుసురాసుబ్రహ్మాచ్యుతాది - వరకపాలావళుల్ శరణు వేఁడుచును
బొబ్బలు వొడువంగఁ బొంగి యార్వంగ - నుబ్బి యాళతిసేయ నొగిఁ దాళగింప
గ్రీడ వట్రిల జతిగీతముల్ వాడ - నాడుదుఁ బ్రమథులు సూడఁదాండవము
కావునఁ దాండవాకార మత్యర్థి - భావించి కొలుతురు[316]భక్తు లెప్పుడును”
ననుచు నానతియిచ్చి యద్దేవదేవుఁ - డనురాగలీలమై నతుల మౌగ్థ్యమున
మించిన నాట్య నమిత్తండి మహిమ - నంచితకనక దివ్యవిమానమునను
గొనిపోయెఁ గైలాసమునకు సద్భక్త - [317]జనులు సజ్జనులును వినుతింప” మఱియు:

ఉడుమూరి కన్నప్ప కథ


"శ్రీకాళహస్తిగిరి ప్రదేశమున - శ్రీకంఠభక్తుండు లోకైకసుతుఁడు
ఉడుమూరి కన్నప్పఁ డొక్కనాఁడర్థి - నడవికి వేఁటమై నరిగి యొక్కెడను

దోడెఱుకులుఁ దాను దోఁపున నుండి - యాడ నొక్కింత నిద్రావస్థ దోఁపఁ
గలయఁగ రుద్ర చిహ్నలతోడ నీశుఁ - డలరుచుఁ దపసియై యరుదెంచి తన్ను
జవుకమందునిచి నొసల భూతివెట్టి - శివతీర్థకలశాభిషిక్తుఁ గావించి
“చనఁజన ముందట ఘనలింగమూర్తిఁ - గనియెదు; ప్రాణలింగంబు నీకదియు'
నని యుపదేశించినట్లు స్వప్నమునఁ - గని మేలుకాంచి నల్గడలు వీక్షింప
మును లేని దొకద్రోవ ముందటనున్నఁ - 'బొనరనిక్కలయయ్యెఁబోకల'యనుచు
దన తోడి యెఱుకుల నునిచి యొక్కండ - చనఁజన ముందట ఘనలింగమూర్తి
యున్న సంతోషించి కన్నప్పదేవుఁ - డున్నత భక్తి సంయుక్తుఁడై మ్రొక్కి
"కలగన్న చోటికి గంపఁ గొంపోవ - ఫలసిద్ధి యగుటెల్ల భాగ్యంబుగాదె?
మును దపోమూర్తి సెప్పిన లింగ మిదియ - తన ప్రాణనాథుఁడౌ” నని నిశ్చయించి
“బాస గాదింక నీ ప్రాణలింగంబుఁ - బాసి పోఁదగదు మా [318]పల్లియ కితని
గ్రక్కునఁ గొనిపోయి కట్టుదుఁ బాక - నిక్కడ నునుపరాదెండఁగాలంగ
బుద్ధులు సెప్పియు బుజ్జగించియును - దద్దయుఁగీడ్పడఁదగ వెడ్డు వెట్టి
వలసిన వస్తువు లిలఁ దెచ్చియిచ్చి - వలపించి కొని పోవవలె” నని తలఁచి
పరమహర్షమున విస్ఫా[319]రాంగుఁడగుచు - వరముగ్ధభావన హరునకిట్లనియె
 “అక్కటా!యిదియేమి హరుఁడ యొక్కరుఁడ - విక్కడనుండుట[320] యేమి గారణమొ?
తల సూప కేయూరి తమ్మళ్ళతోడ - నలగి వచ్చితి సెప్పు మలుక దీర్చెదను
గొరగ లుమ్మెత్తపత్తిరిఁ బూజసేయ - మరులెత్తి వచ్చితో యురుతరాటవికి;
[321]పరసలత్రొక్కునఁ బడఁ జాలకీవు - సిరిగిరి నుండక సురిఁగి వచ్చితివొ?
జడలకు నొడలికి సవతులువోర - నుడుపఁ జాలక వచ్చి యడవిఁ జొచ్చితివొ?
చెన్నయ్య గలసినఁ జెడెఁగులంబనుచు - నిన్ను లోకులు వెలియన్న వచ్చితివొ?
పలుమాఱు నంబికి బడిపనుల్సేయ - సొలసి వచ్చితివొ యిచ్చోట డాఁగంగ
నాఁటి బ్రహ్మయు నేఁడు నాయంబు దప్ప - వేఁటాడ వచ్చితో వేయును నేల
నా తోడి మోహంబునన నన్నుఁబ్రోవ - నేతెంచితో వేడ్క యెసఁగ నిచ్చటికి!
యెట నుం(యుం? )డి వేంచేసి తెట్లు నీ బ్రదుకు? - ఇట నుం(యుం? )డ! [322]జొచ్చి
నీవెంతగాలంబు?
ఎక్కుడుగోద నిన్నిక్కడ వైచి - యెక్కడవోయె నే నేఁగెదఁ జెపుమ?
ఒడల నర్ధము గొన్న యుమబోటి యెద్ది? - యెడరైన నవ్వరే యెక్కడివారు?

కట్టిన గోచి యెక్కడ [323]నొల్వువడితి? వట్టేల వచ్చితి వడవి కొక్కఁడవ?
చంక బొక్కసమును సడలియున్నదియు - శంకింప కొంటెట్టు సరియించెదయ్య!
కొండలలోన నొక్కండ వీవిట్టు - లుండంగ వెఱవవా ఖండేందుమౌళి?
మృగములు నురగము ల్మితి మేరలేవు - నగవు గాదిచటనున్నను బ్రమాదంబు
ఎఱుకుఁ బన్నలు గన్న నేఁతురు నిన్నుఁ - గఱకంఠ! మా పల్లెఁ గలదెల్ల సుఖము
అడవుల మనుబిళ్ళ కడు మంచిపాలు - నొడిపిలి పాసెంబు నుడుప నేతులును
నిప్పపూవును దేనెలెల్ల ఫలాదు - లొప్పెడు వెదురుఁబ్రాలోగిరంబులును
మఱి యట్లుఁగాక నీ మనసు వచ్చినను - నెఱచులుఁ గఱకుట్టు లెన్నేనిఁగలవు
రావయ్య! మ్రొక్కెద దేవదేవుండ! - ప్రేవులు మాడంగఁ జావఁదప్పినదె?”
యనుచుఁ బాదాక్రాంతుఁడైన నీశ్వరుఁడు - దన తోడఁ బలుకీమి మనసులోపలను
“నింత[324]గాలము నుండి యిట గుడువండొ? - కంతునిర్దళను డాఁకటఁ బల్కలేఁడు
చెవులు సిల్లులు వోవఁ జీరంగనేల - శివునకేమేనిఁ దెచ్చెదఁ గాక”యనుచుఁ
జని కందమూలాదిశాకముల్ మృగము - లును దృష్టి మాత్రలోనన పరీక్షింప
మునుకొని “యంతకుమున్నధరిత్రిఁ - జనిన జీమూతవాహనుఁడును శిబియుఁ
గీర్తిముఖుండును గీర్తింప నాది - కర్తకు నర్పింపఁగా నెఱుంగమిని
దమ శరీరము లొండుగ్రమమున సమసి - యమిత సాహసవంతులనఁగ నిబ్బువిని
సవిశేషకీర్తిభాజను లైరిగాని - ప్రవిమలమతి లింగభాజను ల్గార”
యనుచు సౌందర్య మహాకాయులనఁగ - దనుజేశులతిఘోర తపమాచరింప
నెంతయుఁబరితోష హృదయుఁడై భర్గుఁ - డంత దైత్యులకుఁ బ్రత్యక్షమైనిలిచి
“యా యధోక్షజ కమలాసనవాస - వాయతస్వర్గ మోక్షాది భోగములు
చెచ్చెర వేఁడుఁడిచ్చెద" నని యాన - తిచ్చుడు సాష్టాంగమెఱఁగి దానవులు
“మా జలంధరుఁడభిమానంబుగొన్న - యాజనార్దనుపదమరిదియే మాకు
మా గజాసురునిచే మడిసినయట్టి - వాగీశ్వరత్వంబు వలెనె నిన్నడుగ
మా తారకునిచే విధూతమై చెడ్డ - యాతని యింద్రత్వమది యేల చెప్ప
నటుగాక వ్యాఘ్రాంధకాది దానవులు - నిటలాక్షు పగతులై నీ చేతఁదొల్లి
వడసన మోక్షంబు భక్తిమైతగిలి - పడయుట సోద్దెమే పానలొండేల
దేవ! నిత్యానంద! దివ్యలింగాంగ! - దేవ! మహాదేవ! దేవాధిదేవ!
ఎల్ల దైవత్వంబులెల్ల భోగంబు - లెల్లవి యెఱుఁగుదు మొల్ల మేమియును

నీ రమ్యమగు మా శరీరము ల్మీకు - నారగింపంగ నాహారము ల్గాఁగఁ
గరుణింపుఁ”డనుడు శ్రీకంఠుఁడిట్లనియె - "ధరఁగాళహస్తి భూధరసమీపమున
మృగములై పుట్టుఁడు మిమ్ము వధించి - బగుతుఁడొక్కఁడు పరిపక్వంబుసేసి
యర్పింపనేర్చుఁ గన్నప్పఁడనంగ - [325]నర్పింప నపుడు మిమ్మారగించెదను”
అని యానతిచ్చుడు నసురు లక్షణమ - చనుదెంచి ప్రజలును వనితలుఁదారు
మృగములై లింగసమీపంబునందుఁ - దగిలి జన్మించి యెంతయుఁబ్రీతిఁదమ్ము
నొరులకుఁ గానరాకుండ వర్తింప - వరమృగావలి సేరవచ్చిన నుబ్బి
యొక్కొక్కకోలన యొక్కొక్క మృగము - నుక్కడఁగింపుచు నుత్సవంబలరఁ
జెచ్చరఁగోలలు దెచ్చియక్షణమ - త్రచ్చి మెల్లన మంట దరికొల్పి కాల్చి
మంచి మాంసముగ శోధించి [326]శోధించి - పంచిన మాడ్కి ఖండించి ఖండించి
కాల్చుచుఁ బక్వంబుగాఁ ద్రిప్పి త్రిప్పి - ప్రేల్చుచు వెండియుఁగ్రియకొల్పికొల్పి
తవిలి ఖండింపుచుఁ దాఁజవిసూచి - చవి[327] యున్న లెస్స మాంసము దొప్పఁబెట్టి
చిఱుతయుఁగఠినంబు ఛిద్రంబుమొఱకు - కఱకును గారాకు గాకుండఁజూచి
యింపారి నునుపారి కంపు సొంపారి - పెంపారి చాల నొప్పెడు బిల్వపత్రి
నలి దీటుకొనఁగోసి తలసజ్జఁజేసి - యలరు జుంజుఱు వెండ్రుకలమీఁదఁదాల్చి
చక్కనమొగలేటి సదమలోదకము - లక్కజంబుగ రెండువుక్కిళ్లఁబట్టి
దావలికరమునఁ జాపంబు శరము - లేపార వలచేత నిట మాంసమున్న
దొప్పయుఁబట్టి కన్నప్పఁడేతెంచి - చెప్పుఁగాలనుదొంటి శివుమీఁది పూజ
పోనూకి తెచ్చిన పుక్కిటినీట - మానుగా శివునకు మజ్జనంబార్చి
పఱికివెండ్రుకలపైఁబత్తిరి రాల్చి - మఱి దొప్పఁ దెచ్చిన మాంసమర్పించి
యనయంబు నిట్లు గన్నప్పదేవుండు - ననురాగమునఁ గొల్వ, మునుగొల్చుతపసి
యేతెంచి యప్పరమేశ్వరు మ్రోల - నీ తెఱంగంతయు నేర్పడఁజూచి
యెక్కడి మ్లేచ్చుఁడో యెన్నఁటఁగోలె - నిక్కడ నన్యాయ్య మిట్లుసేసెడిని
నేమిసేయుదు నంచు నేవగింపుచును - నా మాంస ఖండంబు లటు [328]వాఱనూకి
యపవిత్రమయ్యె శివా[329]గారమనుచుఁ - దపసి పంచామృత స్నపనంబుసేసి
పాదోదకములు దత్ప్రాంతంబునందు - వేదోక్తముగఁ జల్లివెండి పూజించి
వేగుండి యాతని [330]విధమెల్ల నరసి - వేగినఁ దపసి యుద్వృత్తిమై వచ్చి
“అక్కటా! యెంగిలి యదియు మాంసంబు - పుక్కిటినీరును బూజ్యమే పూజ;

చెప్పుఁగాలను నూకు శివభక్తిగలదె? - యెప్పాట వినఁబడు [331]నే? [332]యెట్లుసైఁప
వసుధ మృగాదుండు వాఁడు; నేఁ దపసి - నసమానవిగ్రహంబన నెట్లువచ్చు?
[333]నిచ్చటఁ దొల్లియు నేనుంగుతోడఁ - జెచ్చెరఁబోరదే చెలఁది యెట్లనిన
హరుఁడెండఁగాలెడి ననుచు నచ్చెలఁది - పరువడిఁదన నూలు దెరచీరభాతిఁ
దిరిగివచ్చిన వృక్ష తృణగుల్మలతలఁ - బురికొల్పి మీఁదఁగపోతముల్ దీర్చి
కరువుఁ బ్రతిష్టించి గంటయు వేది - విరచించి శిఖరంబుఁగరమొప్ప నిలిపి
ద్వారబంధంబులు దగిన వాకిళ్లు - నారంగ గర్భగృహాదులు దీర్చి
యకలంక కరవీరముకుళప్రభాతి - ప్రకటించి దేహళీబంధంబునందు
రమణీయ శతసహస్రదళాబ్జపంక్తు - లమరు పూజాప్రబంధానేకరచన
గావించి చెలఁది ద్రికాలంబు భక్తి - భావనమై శివుఁబాయక కొలువ
హరుమీఁదఁ జెలఁది మున్నల్లిన నూలు - గరి యంత నేతెంచి కాంచి కోపించి
“పాయకశివుమీఁదఁ[334] బాదొట్రువెట్టి - పోయెడునిది[335] యేమివురు [336]వోకో”యనుచు
ఘనకర్ణ చలిత సంగత మారుతమునఁ - బొనరిన[337]పా దొట్రుఁబోవంగఁ [338]ద్రోచి
వెండి [339]తాఁదెచ్చిన తుండాంతరమున - నిండారుమొగలేటి నిర్మలాంబువుల
[340]నంబికాధవునకు నభిషేకమార్చి - [341]యింబులఁ గుంభస్థలంబుపైఁబెట్టి
తెచ్చినకలువల నచ్చఁ దామరల - నిచ్చలుఁ [342]బూన్చుచు నిటలలోచనునిఁ
గరియును [343]నిట్లు ద్రికాలంబుగొలువ - నరుదెంచి చెలఁది దా నాగ్రహంబంది
“కమనీయలీల నా కట్టినగుడియు - నమరుమదీయ[344] నిత్యార్చనావలియు
నెట్టికర్మియొ చెర్చి యేఁగెడు నింక - నిట్టి శివద్రోహ మెట్టుసైరింతు”
ననుచు నొక్కెడఁబొంచికొనియుండ గజము - సనుదెంచికోపించు చందంబుసూచి
యంతరాంతర మించుకైనఁ దలంప - కంతఁ బరిచ్చేది యై యుపాయమున
దుండాగ్రమునఁ జొచ్చి తొలుచుచుఁ జెలఁది” - దండిమదేభంబు తలకెక్కి చంపెఁ
గాన యిక్కడ నమార్గము సేయుధీర - మానసుఁడెంతవాఁడైనఁగానిమ్ము
అట్లు నేఁడును వాఁడు నరుదెంచెనేని - యెట్లైన జంపక యేఁ బోవననుచు”
వెనుకదిక్కునఁ బొంచికొని సమీపమునఁ - దన పొడసూపక తపసి యున్నెడను

గన్నప్ప దేవుని ఘనముగ్ధతయును - సన్నుతభక్తియు [345]సంస్పృహత్వంబుఁ
దపసికిఁ జూపఁగఁ దలఁచి [346]శంకరుఁడు - విపరీతగతిఁద్రినేత్రపరీతమైన
వదనంబు ధరియించి వలపలికంట - నుదకంబు గాఱంగ నున్నయత్తఱిని
అరుదొందఁ దొల్లిటియట్ల కన్నప్పఁ - డరుదెంచి యరుదెంచి హరుకంటినీరు
పొడఁగని బిట్టుల్కిపడి భయభ్రాంతిఁ - దొడరుచు నరుదారఁదొల్లింటిపూజ
గ్రక్కునఁదన చెప్పుఁగాలఁ బోనూకి - పుక్కిటి నీరు[347]ను బుగులున నుమిసి
తలవంచి పత్తిరి [348]డులిచి మాంసంబుఁ - దలరుచు [349]నర్పించు తదవసరమున
నా నేత్రజల పరిహారార్థముగను - దా నీశ్వరునకు నంతర్ధారయెత్తు
భంగి జలంబులుఁ బత్తిరిబ్రుంగి - మంగళంబై యొప్పె మఱియుట్లఁగాక
తలఁగంగ నతనిపాదహతిఁ దొలంకి - [350]యలరి పాదోదకంబై వెల్లివిరియఁ
బొలుపుగఁ గన్నప్పపుక్కిటనీరు - గలయఁ ప్రసాదోదకం[351]బయి తనర
నాలింగమూర్తి యపాంగోదకముల - పోలలింగోదకపూరమై తనరఁ
ద్రివిధోదకంబులుఁ ద్రినయనుమేనఁ - బ్రవిమలంబై యిట్లు భ్రాజిల్లె నంతఁ
దవిలి ప్రసాదికిఁ ద్రివిధోదకములు - ప్రవిమలమతిఁ [352]బొందఁబాడియ[353]నంగ
సర్వాంగములుగూడ జలములు వర్వ - సర్వేశుభక్తుఁ డాశ్చర్యంబు నొంది
యగ్గలంబయ్యె నపాంగాశ్రు లనుచు - బెగ్గిలి నేత్రమ్ము దగ్గఱి చూచి
“కటకటా! యిదియేమి గర్జంపుపుట్టె - నిటలాక్ష! నీకంట నీరుగాఱెడిని
నీ నింద విని గౌరి నీఱైననాఁడు - దానించు కేనియుఁదడి [354]గంటలేదు;
జనకుచేఁ దనయునిఁ దునిమించునపుడు - కనికరంబునఁగంటఁ గ్రమ్మదు నీరు
చీర సించుచువిప్రు [355]లార(ఱ?)డివైచి - కారించుతఱి నుదకము లేదు గంట
నాఱాల వాట్లు ఱివ్వనఁ దాఁకునొవ్విఁ - గాఱవకు నాఁడును గంటఁ బాష్పములు
పరసతికై పట్టువడ్డ భంగమునఁ - దొరుగవు నాఁడును దోయముల్ గంట
వెట్టికేఁగెడు [356]తట్టఁబట్టి యెత్తుడును - నట్టిచో వెడల వపాంగోదకములు
నేఁడు నీకడకంట నిర్నిమిత్తంబ - పోఁడిగా జలములు పూరించుటేమి?
ఆలుబిడ్డలఁబాసి యడవుల గిరుల - పాలైతినని [357]దుఃఖపడి యేడిచెదవొ?
ఏకాకినైతి నింకేక్రియఁ బ్రోతు - లోకంబులని ధృతిలేక యేడ్చెదవొ?

కడపుగాలంగ నాఁకటికోర్వలేక - తడవయ్యె రాడఁని తలఁచి యేడ్చదవొ?
అక్కడ దండిమృగాలిచే నాదు - చిక్కుట నూహించి నిక్కమేడ్చెదవొ?
పనిపాటుసేయనోపక యొంటివిడిచి - చనియెనో తమ పల్లెకనుచు నేడ్చెదవొ?
అఱిముఱినొక పువ్వుమఱిమూరుకొన్న - నెఱయఁబ్రాణమునకు వెఱచియేడ్చెదవొ?
కారణం బేమి? గన్గంటఁ బుట్టెండు - నీరు గాఱఁగ నేడ్వ నీకేమి వలసె?
చెప్పవేనా”కని చేర్చు గౌఁగిటను - నప్పళింపుచును 'నాయట్టి పుత్త్రుండు
గలుగ నీ కేల యప్పుల బ్రుంగ'ననిన - పొలుపునఁగంటి యప్పులు వాఱఁదుడిచి
“పాసియుఁ బాయదు వ్యాసంగ"మనుచు - నీసరి లింగముల్ నిను నరరయ్య!
[358]ఊరకోనాయన్న! [359]యూరకో తండ్రి! - [360]యూరకో నా స్వామి! [361]యూరకింతేల?
యుమ్మలికము తగ దుడుగవే” యనుచు - ఱొమ్మున నేత్రోదకమ్ములట్లొత్తు
'నెసఁగ నా ముగ్ధత కీకంటిలోని - [362]కసువ పొ'మ్మన్నట్లు గన్నుశోధించుఁ
గరతలాంగుళములఁ గనుఱెప్పలెత్తి - 'నెర సున్న'దని పాఱ[363]నిష్ఠించి యూఁదుఁ
బరగునాలుక గ్రుడ్డుపైఁ ద్రిప్పిత్రిప్పి - యెరయుచు నొరయుచు నొయ్యనఁజూచుఁ
జీరావిఁగొని కంటఁజేర్చి హత్తించి - చీరెల్లఁదడిసినఁజిక్కువెండియును
నీ కడకంట వ్రేలిడి యొత్తనొత్త - నా కడకంట ధారావలి వర్వె
నా కడకంట వ్రేలదుమ నట్లదుమ - నీ కడకంట నీరెంతయుఁ దొరిగెఁ
గొలుకులు రెండు నంగుళములనదుమఁ - గలయఁగఁగన్నెల్ల గొలుకులై కాఱె
నక్కన్నుఁగొలుకులు నరచేతమూయఁ - బక్కిళ్ళఁ బింజించి పాఱంగఁ దొడఁగె
నెట్టును నేత్రాశ్రులెడతెగకున్న - నెట్టణ దుఃఖించి బిట్టువాచఱచు
నడుగులఁబడి మ్రొక్కు నంజలియొగ్గు - నడలు నిల్చును నిల్వఁబడు లేచుఁజూచుఁ
'కటకటా!' యనుచు లింగముఁ జుట్టిచుట్టి - యటయిట యేఁగుచు నాత్మలోపలను
“నానంద బాష్పమ్ము లంద మేనియును - నాననంబునఁ దోఁప దానందచిహ్న”
సారకటాక్ష వీక్షణ జాలమైనఁ - గారుణ్య జలములు గావ యుష్ణములు
ఘర్మజలంబులక్రమ మందమేని - ఘర్మ జలంబులు గన్నులఁగలవె?
ఒండు దుఃఖం బేని యూహించి చూడ - రెండుగన్నులఁ గాఱ కుండునే నీరు?
తానొక్క గంటనె ధార వర్వెడిని - కానోపు [364]నక్షిరోగంబ యేమేని
చెప్పఁ జిత్రము! గోడిఱెప్ప వెర్గినదొ? - తప్పవోనోపునో? తడికంటివిధమొ?

నొవ్వియో పొరగప్పెనో? మాదతెవులొ? - పువ్వువట్రిల్ల నాపువుకంటి [365]పోటొ?
మయిలవడ్డదియొ దుర్మాంసదోషంబొ? - అయిరయో వెండియు నక్షిరోగంబొ?
కానోపు ని ట్లనుమానంబు లేదు - దీనికి[366]మందుమాఁకే నే మెఱుంగ
నాయన్న! నా తండ్రి! నాయిష్ట సఖుఁడ! - నా యయ్య! నా జియ్య! నా ప్రాణనాథ!
సర్వాంగసుందర! శంకర! యీవి - గు(గూ?)ర్వణంబెటు దొరకొనెనయ్య! నీకు
ముక్కంటి వాఁడని మూఁడు లోకముల - నిక్కంబు వెఱతురు నిటలలోచనుఁడ!
యెన్నఁడు నీ కొక్క భిన్నంబు లేదు - గన్నుఁ జూచిన నిట్టు గైకొండ్రె సురలు
కంటి చిచ్చున మున్ను గాలిన వారు - కంటివార్తకు నికఁ [367]గనలరే మగుడ;
వినుమెంత గన్ను గానని వలపైన - వనితలిట్లంగ హీనుననకుఁ జిక్కుదురె?
రూపింప నిట్లు కురూపివై యున్న - నేపార భక్తు'లిహీ' యని నగరె
నేఁడెందుఁ [368]బోయెనో నేత్రంబు హరికి - నాఁడిచ్చి నట్టి యనశ్వరమహిమ
పొలమున నాఁ [369]బోతుఁ బులి గొన్నయట్టి - పొలుపయ్యె నేనెట్లు నిలువంగనేర్తు
నెవ్వరి కెఱిఁగింతు? నెట్లు ధరింతు - నెవ్విధిఁబోవుదు? నేమి సేయుదును?
[370]చెప్పంగలేదొండు సేయ లేదొండు - నిప్పాటఁ జూచుచు నేనుండఁ జాల
నాకంటఁ బుట్టిన నాఁటను గోలె - శ్రీకంఠ రోగంబు సెంద దెన్నఁడును
యొప్పని కన్నులో నున్నట్లుగాఁగఁ - గప్పెద నా లెస్సకంట నీ కన్ను
నా కన్న చూ మందు నీ కంటి కనుచుఁ - జేకొని శరమున ఛేదించి పుచ్చి
కఱకంఠు కంటిపైఁ గన్నప్ప దేవుఁ - డఱిముఱిఁ దననేత్ర మర్పింపఁదడవ
అక్కంటఁ దొరుగు ధారావళి యడఁగి - గ్రక్కున డాపలికంట నుప్పొంగఁ
గించి త్ప్రహాస సంకీలితా ననస - మంచితాంభోజాతుఁడై తన నేత్ర
కమలంబుశివునేత్ర కమలమైయునికి - కమితమహోత్సాహ మాత్మఁదుల్కాడఁ
గ్రేకంట లింగంబు డాకన్నుఁ జూచి - యీ కంటికిని మందు నీ కన్నె కాక
యనుమానమింకేల యనుచుఁ దన్నేత్ర - జనిత నిర్మలజలధారదొరుగ
గందువ దన చెప్పుఁ గాలి యుంగుటము - వొందించి డాకన్నువుచ్చఁ గైకొనునడు
నంతలోపలన ప్రత్యక్షమైయప్పు - డంతకసంహారుఁ డనురాగ మెసఁగఁ
గన్నప్పదేవర కరయుగగ్రహణ - సన్నుతహస్తుఁడై చక్కన నిలువఁ
గలిత సమావలోకనమాత్ర యంద - యలరెఁగన్నప్పని వలపలి కన్ను

నాతనిచేఁ గొన్న యాకన్ను నిచ్చె - నో తన కన్నిచ్చెనో శివుఁడనఁగ
నంతకమున్ను వామాంబకజనిత - సంతతఘన బాష్పజలధారలుడిగి
కన్నప్ప దేవుని కన్నులు శివుని - కన్నులు[371] వోల నొక్కండైన యట్లు
కన్నప్ప దేవుని [372]నన్నుల నపుడు - సన్నుతానంద బాష్పంబులుదొరిగె
హరుకంటఁ దొల్లి ద్రిపుర వీక్షణమునఁ - దొరిగిన జలములు [373]దోడయ్యె ననఁగఁ
గరుణానిరీక్షణ[374]స్ఫురితాంబుధార - విరచింప నానందకరమగు టరుదె?
అంతటనిఖిలసురాసుర ప్రముఖు - లంతంత మ్రొక్కుచు నభయంబు వేఁడ
మస్తక విన్యస్తహస్తులై మునులు - ప్రస్తుతం బెఱుఁగుచుఁ బ్రస్తుతుల్ సేయ
శివదుందుభులు మ్రోయభువిఁబుష్పవృష్టి - [375]ప్రవిమలంబైకుర్యఁ బ్రమథులుప్పొంగ
గన్నప్ప శుద్ద ముగ్ధతయు మహాగు - ణోన్నతియును భక్తియోగ సంపదయు
నాపరాపరుడు ప్రత్యక్షమైయునికిఁ - గోపించి మును బొంచికొనియున్న తపసి
కనుఁగొనిసంభ్రమాక్రాంతాత్ముఁడగుచుఁ - జనుదెంచిభువిఁజక్కఁ జాఁగిలి మ్రొక్కి
“తలఁప నీ సహజ ముగ్దత్వ మెఱుఁగమిఁ - దలఁచితి నీకహితంబు సేయంగఁ
దప్పుసైరింపు గన్నప్ప! దయాత్మ! - చెప్ప నున్నదె నీవ శివుఁడవుగాక
యిట్టి ముగ్ధత్వంబు నిట్టి వీరత్వ - మిట్టి మహత్త్వంబు నెందును గలదె?
విందుమే యవికల వేదశాస్త్రములఁ - గందుమే మూఁడులోకంబులఁ దొల్లి?
బాపురే! కన్నప్ప! పరమ లింగంబ! - బాపురే! కన్నప్ప! ప్రమథవిలాస
నల్లవో! కన్నప్ప! నా లింగముగ్ధ - నల్లవో! కన్నప్ప! నల్లనైనార!”
అనుచు నిట్లా తపోధనుఁడతిభక్తి - వినుతింప నుమబోటి విస్మయంబొందఁ
గన్నప్ప! శివుఁడు నాకాంక్షనొండొరులఁ - గన్నులఁజూచుచు నున్న యత్తఱిని
దవిలి యొండొంటితోఁ దగునన దొరసి - నివిడ యొండొంటితో నిద్దమై బెరసి
చూపులు సూపుల లోపలఁజొచ్చి - యేపార నేకమై యెంతయు నొప్పి
కన్నప్పదేవుని కన్నుల సఖులొ! - అన్నీలకంధరు కన్నుల కవలొ?
తవిలి కన్నప్ప కన్గవ దర్పణములొ? - భవునయనంబుల ప్రతిబింబ యుగమొ?
నెమ్మిఁ గన్నప్ప నేత్రమ్ములపా[376]య - గొమ్ములో? శివునేత్రగుప్తాంకురములొ?
రమణఁగన్నప్ప నేత్రముల బీజములొ? అమృతాంశు శేఖరు నక్షఫలములొ?
అనఁగఁ గన్నప్ప దేవునిలోచనములు - మనసిజహరునిలోచనములై శివుని

కన్నులు గన్నప్ప కన్నులై యిట్లు - సన్నుతి గడచి సమున్నత స్ఫురణ
నాల్గుఁ గన్నప్ప నైనారినేత్రములొ? - నాల్గు నీశ్వరునయనంబులో యనఁగ
మృడుని మూఁడవ కంటిక్రింద నిర్గడల - నడర రెండును రెండునై మించి వెలుఁగఁ
జూపును జూచు తద్రూపును(పము)దారు - నేపారఁ ద్రివిధంబు నేకమై యునికిఁ
దమ నేత్రములఁ దమ్ముదార వీక్షించు - క్రమమయ్యె శివునికిఁ గన్నప్పనికిని
నెఱి నాల్గు గన్నుల నిజదీప్తినంత - పఱగప్పి నట్లుండె ఫాలలోచనము
కాలునే యింక నీ కంటఁ జూచినను - నోలిఁబురత్రయంబొండు గల్గినను
గాలునే యింక నీ కంట జూచినను - నా లక్ష్మి నందనుండంగంబుగొన్నఁ?
గాలునే యింక నీ కంటఁ జూచినను - గాలుఁడు వెండియుఁ గ్రమము దప్పినను?
గాలునే యింక నీ కంటఁ జూచిను - నే లోకమును నంత్యకాలంబునాఁడు?
కన్నప్ప సదయాంబకము మున్నుశివుని - కున్న నట్లునుగాక యుగ్రాక్షుఁడండ్రె?
[377]నాఁడ యీ కన్నప్ప నయనముండినను - వేఁడునే సిరియాలు విందారగింప?
నాఁడ యీ కన్నప్ప నయనముండినను - బోఁడిగా సైఁచెనే భ్రూణహత్యకును
ఈ చారునేత్రాబ్జ మీశునకున్నఁ - జూచునే నిమ్మవ్వసుతుచావు నాఁడు?
పంబి యీయమృతాంబకం బున్నశివుడు - నంబి కన్నులుసెడ నాఁడేల చూచు?
ఈ నేత్రమున్న మున్నీశుండుబాలుఁ - బోనిచ్చునే పాముపుట్టఁ దొడ్కంగ?
ఇతని నేత్రంబున్న నిన్నియు నేల? - యతి దయాపరుఁ డన నుతికి నెక్కండె?
ఇతని నేత్రంబు మున్నీశుకున్న - నతిభూమి సౌందర్యుఁడన భువిఁ జనఁడె?
ఇట్టి నేత్రంబు మున్నెప్పుడు నున్న - నెట్టి కాంతల మెచ్చునే హరుఁ" డనఁగఁ
గన్నప్ప నేత్రంబుకతమున నీశుఁ - డెన్నంగ సర్వసంపన్నుఁడై నెగడె
కన్నప్ప పాదరక్షాస్పర్శ శివుఁడు - సన్నుతభక్తవత్సలుఁడనఁబరగె
ఈ చెప్పు నాఁడు దన్నింత సోఁకుడును - నా చంద్రుఁ డభినంద్యుఁ డయ్యె లోకముల
ఈ చెప్పు నాఁడు దన్నింతసోఁకుడును - నేచిన తీర్థమై యిల నొప్పె గంగ
ఈ చెప్పుదానయ్యెనేఁ బద్మభవుఁడు- చూచున కాదె యీశునిమస్తకంబు
శ్రీపతి గానని శ్రీమహాదేవు - శ్రీపాదభక్తుల శ్రీపాదరక్ష
పరమేష్ఠి గానని యురులింగమూర్తి - శిరమున నొప్పు విశిష్టభూషణము
చెప్పెడిదేమి? గన్నప్పపాదంబు - చెప్పు మహత్త్వంబు సెప్పఁ జిత్రంబు
ఇతని పాదోదకాయత సిద్ధిఁగాదె - సితకరమౌళి ప్రసిద్ధుఁడై పరగె

ఇతని నిర్మాల్యసంగతిఁజేసికాదె - రతిపతిహరుఁడు నిర్మలదేహుఁడయ్యె
ఇతనిగండూషాంబు కృతసేవఁగాదె - జితపురత్రయదైత్యుఁడతిలోకుఁడయ్యె
ఇతనిప్రసాదవిహితభుక్తిగాదె - క్షితిధరకన్యకాపతి నిత్యుఁడయ్యె
ఈ దేవుఁడితని ప్రసాదంబుఁగుడిచి - వేదశాస్త్రముల వివేకంబు గడఁచె
శివుఁడు గన్నప్పయుచ్చిష్టంబుఁగుడిచి - యవికలవిధి నిషేధాతీతుఁడయ్యె
లింగంబు గన్నప్ప యెంగిలిగాన - యంగమంతయు నుత్తమాంగమై యొప్పె
గణనాథుచేత లింగసమేతుఁడయ్యె - గణుతింప నంబిచే ఘనభక్తుఁడయ్యె
సన్నుతికెక్కి మా కన్నప్పచేత - సన్నుతసర్వప్రసాదాంగుఁడయ్యె
ననుచు భక్తానీక మసమానలీల - వినుతింప జగములు విస్మయంబంద
నన్నగజా [378]ధీశుఁ డంత నందంద - కన్నప్ప దేవునిఁగౌఁగిటఁజేర్చి
పరగుచతుర్వర్గ[379]ఫలము లాదిగను - వరమిత్తు నడుగుము వాంఛితార్థమ్ము”
లనవుడుమందస్మితాననుండగుచు - [380]ననురక్తిముకుళితహస్తుఁడై మ్రొక్కి
"యెఱుఁగమోక్షములపేరెఱుఁగవాంఛితము - లెఱుఁగవేఁడెడుమార్గమెఱుఁగనేమియును
ఎఱుఁగుదు నెఱుఁగుదు నెఱుఁగుదు మఱియు - మఱియును మఱియు ముమ్మాటికినిన్ను
కావునఁ గోరిక కడమయుఁ[381] గలదె? - దేవ! మూలస్తంభ దివ్యలింగాంగ!
నీ యతులిత దయాన్వితదృష్టి - నా యందు నాఁటి కొనలు [382]వసరింప
నా దగు సంస్పృహాపాదితదృష్టి యిట్లు - నీ దృష్టిలోనన నెక్కొని పొదలఁ
గరుణింపు దక్కిన వరము లేనొల్లఁ - బరమాత్మ!” యని విన్నపంబాచరింప
నభిమతార్థప్రదుఁడట్ల కన్నప్ప - కభిముఖుఁడై నిల్వనంత నిద్దఱును
వెలయఁ దా రన్యోన్యవీక్షణానంద - కలితాత్ములై తిరుకాళ[383] త్తిపురిని
గన్నప్పదేవుఁడు గౌరీశ్వరుండు - సన్నిరీక్షణలీల నున్న వారిపుడు
నిక్కంబు గన్నప్ప పుక్కిటినీరు - ముక్కంటి కభిషేకమున కెల్లవ్రొద్దు
నేఁడును గన్నప్ప నిర్మాల్యమందుఁ - బోఁడిగా శివునకుఁ బూజసేయుదురు
మృడుఁడు గన్నప్ప కర్పించినఁగాని - యడరంగ నేఁడును నారగింపండు
కన్నర్పితము సేసెఁ గాన లోకములఁ - గన్నప్పఁ డనఁగ మహోన్నతి కెక్కె
నచ్చట నేఁడు గన్నప్పండు శివుఁడు - నచ్చెరువందంగ నట్లున్నవాఁడు
కావునఁ దొల్లి ముగ్ధస్వభావులకు - దేవుండు కృపసేయుఁదెల్ల మి”ట్లనుచు
బసవయ్య ముగ్ధగణసమూహి కథలు - పసరింప నా చెన్నబసవయ్య వినఁగఁ

బృథివి నీ ముగ్ధ(గ్ధు?)ల కథలు దాఁజెప్పఁ - గథలయ్యె' నని కథకథకు నవ్వుచును
నతులితానందసంగతి నున్న భక్త - వితతికి బసవఁడున్నతలీల మ్రొక్కి
“యిప్పురాతనులందు నెఱుఁగరే తొల్లి - యెప్పార నిత్యంబు నొక్క భక్తుండు

కళియంబనాయనారు కథ


నలిరేఁగి కళియంబనయనా[384]రనంగ - నిల మిమ్ము నగియించు నిదియె [385]నేమముగ
మెచ్చించె [386]శివదేవు మీరొక్క మాటి - కిచ్చ నవ్వుట సాలదే నన్ను మనుప”
ననుచు నవ్వించుచు నవిరళభక్తి - జనితసుఖామృతవనధిఁ దేలుచును
బసవఁడు జంగమప్రకరంబునిట్టు - లసలార నోలగంబై యుండిరంత

సకలేశ్వరు మాదిరాజయ్య కథ


“పెద్దలఱేఁడు వెన్నుద్దుల మొదలు - బుద్ధులప్రోక విబుధనిధానంబు
నమితవచోరాశి సుమనోనురాగుఁ - డమలినచిత్తుఁ డుద్యద్గుణాన్వితుఁడు
సకలవీణా ప్రవీణకళావిదుండు - నకలంకనాదవిద్యాపండితుండు
వేదవేదాంతసంపాదితతత్త్వ - వాది సంసారదుర్వ్యాప్తి సంహారి.
యమనియమాదివ్రతాచారవర్తి - శమదమసద్గుణాశ్రయచరిత్రుండు
ధీరమహోదారదిక్పూర్ణ కీర్తి - కారుణ్యమూర్తి నిర్గతసకలార్తి
మహితసజ్జనశిఖామణి నాఁగఁబరగు - మహి సకలేశ్వరమాదిరాజయ్య
గారి సద్భక్తి విఖ్యాపితమహిమ - ధారుణి నెట్లన్నఁ దా విస్మయంబు
నగణితకీర్తిమై నంబెయన్పురము - దగు రాజధానిగా ధరణి యేలుచును
శ్రుతి వీర్య వితరణ రూపవివేక - చతురతరూఢి రాజ్యంబు సేయుచును
జంగమలింగైక్యసద్భక్తియుక్తి - నంగీకరించుచు నర్చలిచ్చుచును
నొడఁబడ రాజవదుపచారములను - గడియగడియదప్పకెడ భజింపుచును
వివిధపుష్పదళ సద్భవనాంతరమున - శివదేవు సంస్తుతిసేయుచున్నంత
రమణ బత్తీసాదిరాగంబులకును - నమరనన్నియు దండియలు నియోగించి
యే రాగ[387]మున సకలేశునకర్థి - యా రాగ వీణ దా నలరి ధ్వనింప
రావణహస్తంబు బ్రహ్మవీణయునున - లావణ్యవీణ కైలాసవీణయును
నాకాశవీణ పినాకివీణయు వి - వేకింప సారంగవీణయుఁ గూర్మ
వీణయు స్వాయంభు వీణయు గౌరి - వీణయుఁగిన్నరవీణయు జనక

యనునివి మొదలుగానందులో మున్ను- ధ్వనియించినట్టి యాదండియల్ దివిచి
తనరుచు మొగచాళమును నవఠాణ - మును మఱి[388]సవఠాణమును దీపు బెరయఁ
దాళపట్టియయుఁ గత్తరి చోళవణియు - లీల సారణయుఁ దలిర్ప సంప్రీతి
నివుడంగ "సకలేశ నిత్యకల్యాణ! - అవధారు ప్రాణనాయక! నాదమూర్తి!
యంచును [389]వాయించు నా రాగమంద - యంచితాళప్తికి నభిముఖుండగుచు
సదమలచిత్తుఁడై సప్తస్వరముల - నుదయించు శ్రుతులిరువది రెండుఁగూర్చి
ఘనతర నారాటకావుళం బనెడు - ధ్వనిగూడఁ [390]జౌదళంబను శారిరమున
[391]ననిబద్ద రూఢమై నాళతిఁ జేసి - తనరెడు గమకసప్తకము సంధిల్ల
మానితంబగు మంద్రమధ్యతారములు - దానొంద లయలంకితంబులు నిగుడ
లాలిత శుద్ధసాళగములు బెరయఁ - గ్రాలుచుఁ దేశిమార్గంబులు వెలయ
లలిద్రుతమధ్య విలంబితంబులను - నలిఁ దాళమాఠమానంబులు సూపి
ధాతులసంగతుల్ జాతులరీతి - భాతిగఁ గూర్చి నిబద్దరూపమున
లాలితంబుగను వైళంబుఁ దాళంబు - సాళి పెళ్ళాపెళ్లి జాయనుజాయి
యుచితమొయ్యారంబునోగిఁబంజళంబు - ఖచరంబు విషమంబు గ్రహమోక్షణంబు
భజవణి [392]రవణియు భరణి [393]మిఠాయి - [394]నిజవణి నివళంబు నిచయవైధసము
నిగితి సుధాయి [395]సన్నిగితంబు మిశ్ర - మగు గ్రహత్రితయంబు నంశుకలలిత
గాఢంబు లలి రాగ కాకును బొచ్చ - గాఢంబు మఱి దేశి కాకును సింధు
నలిఁగరుణాకాకు నఖకర్తరియును - హళువాయియును ధరహరసమవాయి
పరగ గుండాగుండి భ్రమరలీలయును - గురుడి మోడామోడి పొరిరవాళంబు
[396]తీఖ్ఖాయిహొయలును [397]రిఖ్ఖిలవిళగు - చొఖ్ఖాయియాదిగా సొగయు ఠాయములు
దళుకొత్త దేశాక్షి ధన్నాసి దేశి - మలహరి సకలరామక్రియ లలిత
సాళంగ నాట గుజ్జరి మేఘరంజి - వేళా[398]వుళియుఁ జిత్రవేళా[399]పుళియును
మాళవి సిరియు వరాళి కాంభోజి - గౌళపంచకము బంగాళంపు గురిజ
భైరవిద్వయమును బడపంజరంబు - నారంగ గుండక్రియయుఁ గౌశికయును
దేవక్రియయు మధ్యమావతి తోడి - యావసతంబును నాదిగాఁగలుగు
విరచిత స్త్రీ రాగపురుషరాగములు - సరసమై లక్ష్యలక్షణనిర్వికార
పూరితనాదగంభీరవినూత్న - సారోక్తిగీతంబు లారఁబాడుచును

దమతమ [400]కఖిలవాద్యంబులు మ్రోయఁ - గ్రమమొందఁ గేళికగతి నటింపుచును
వారివారికి హర్షపూరముల్గాఁగఁ - గోరి భక్తాలికింపార మ్రొక్కుచును
బాయక రేయును బవలు లింగార్చ - నాయతామృతవారియందోలలాడ
నఖిల సామ్రాజ్య సమంచిత సరస - సుఖముల కెమ్మెయి సొగయకున్నెడను
మల్లరసను నొక్క మండలేశ్వరుఁడు - దొల్లి యిట్టుల రాజ్యమొల్లక విడిచి
శ్రీగిరి కేఁగి [401]సచ్చింతాసమాధి - నాగిరి బిల్వవనాభ్యంతరమున
నున్నవారని వారియురుభక్తిగుణమ - హోన్నతికయు ధ్యానయోగసంపదయు
శివభక్తిత్త్వానుభవసమగ్రతయు - శివభక్తగణములచే వినఁబడుడు
నప్పుడు శ్రీగిరికరుదెంచి రర్థిఁ - బొప్పారు మల్లరసును జూచువేడ్క
రయ మందఁగా మాదిరాజయ్యగారు - క్రియ దులుకాడ నగ్గిరి శృంగములను
స్పాటికపర్వతబహుశృంగములను - హాటకరత్నమయాంచితాద్రులను
బాతాళగుహల నభ్రంకషశిలల - భూతలప్రచ్చన్నపురవరంబులను
స్పర్శవేదుల మణిపర్వతంబులను - దర్శనముక్తిప్రదస్థానములను
ఖగమృగనాగసంకరనివాసముల - నగణితోద్యానవనాంతరంబులను
బర్వతచూడానిపతితధారాంబు - నిర్వికల్పప్రవాహోర్వీస్థలముల
నంతంత నిలిచి యేకాంతదేశముల - సంతతలింగపూజనలు సల్పుచును
జనుదెంచి చనుదెంచి యనుపమబిల్వ - వనసమీపంబున ఘనతరంబైన
రుద్రాక్షశైలముల్ రుద్రాక్షతరులు - రుద్రాక్షగనులును రుద్రాక్షనదులు
భసితంపు గిరులును భసితంపుఁ దరులు - భసితంపు గనులును భసితంపు నదులు
లింగపర్వతములు లింగవృక్షములు - లింగాకరంబులు లింగతీర్థములు
జంగమశైలముల్ జంగమతరులు - జంగమగుల్మముల్ జంగమలతలు
సల్లాపశైలముల్ సల్లాపతరులు - సల్లాపగుల్మముల్ సల్లాపలతలు
గాయకశైలముల్ గాయకతరులు - గాయకగుల్మముల్ గాయకలతలు
గాయకమృగములు గాయకాలులును - గాయకపక్షులు గాయకఫణులు
నాట్యపర్వతములు నాట్యవృక్షములు - నాట్యగుల్మంబులు నాట్యవల్లరులు
నాట్యమృగంబులు నాట్యపక్షులును - నాట్యోరగంబులు నాట్యవానరులు
దనరు కాష్ఠజ్యోతులును దృణజ్యోతు - లును వాలుకాజ్యోతులును జ్యోతినదులు
జలపర్వతంబులు జలవృక్షములును - జలవిహంగంబులు జలమృగావలులు

బహువర్ణవృక్షముల్ బహువర్ణశిలలు - బహువర్ణగుల్మముల్ బహువర్ణలతలు
బహురూపవృక్షముల్ బహురూపశిలలు - బహురూపగుల్మముల్ బహురూపలతలు
ఖేచరవృక్షముల్ ఖేచరగిరులు - ఖేచరగుల్మముల్ ఖేచరలతలు
హర్మ్యపర్వతములు హర్మ్యవృక్షములు - హర్మ్యగుల్మంబులు హర్మ్యవల్లరులు
మృగరూపవృక్షముల్ మృగరూపశిలలు - మృగరూపగుల్మముల్ మృగరూపలతలు
ఖగరూపవృక్షముల్ ఖగరూపశిలలు - ఖగరూపగుల్మముల్ ఖగరూపలతలు
నరరూపవృక్షముల్ నరరూపశిలలు - నరరూపగుల్మముల్ నరరూపలతలు
సురరూపవృక్షముల్ సురరూపశిలలు - సురరూపగుల్మముల్ సురరూపలతలు
సూతవృక్షములు ప్రసూతవృక్షములు - సూతశైలములు ప్రసూతశైలములు
గంధర్వవృక్షముల్ గంధర్వశిలలు - గంధర్వగుల్మముల్ గంధర్వలతలు
నీడలు దిరుగని నిత్యశైలములు - నీడలు దిరుగని నిత్యవృక్షములు
నీడలు లేని సాన్నిధ్యశైలములు - నీడలు లేని సాన్నిధ్యవృక్షములు
దూరంబునను నీడ దోఁచు శైలములు - దూరంబునను నీడ దోఁచు వృక్షములు
ప్రొద్దొక్కపాయయై పొలుచు శైలములు - ప్రొద్దొక్కపాయయై పొలుచు వృక్షములు
తరులును గిరులును దగిలి రమింపఁ - బరగనప్పుడె పుట్టు బాలశైలములు
తరులును గిరులును దగిలి రమింపఁ - బరగ నప్పుడె పుట్టు బాల వృక్షములు
శైలముల్గొలువంగ శైలములెక్కి - లీలనేఁగెడు రాజశైల సంఘంబు
వృక్షముల్గొలువంగ వృక్షములెక్కి - యీ క్షితిఁ జనురాజవృక్ష సంఘంబు
ఎక్కి వీక్షింప నీ రేడులోకములు - నక్కజంబుగఁగాంచునట్టి శైలములు
ఎక్కి వీక్షింప నీ రేడులోకములు - నక్కజంబుగఁగాంచునట్టి వృక్షములు
ఎక్కి [402]యూఁగించిన నెక్కడికైనఁ - జక్కనఁ గొనిపోవఁజాలు శైలములు
ఎక్కి [403]యూఁగించిన నెక్కడికైనఁ - జక్కనఁగొనిపోవఁజాలు వృక్షములు
ఎక్కి తలంచిన నేరూపమైన - గ్రక్కున నప్పుడ కాఁజేయు గిరులు
ఎక్కి తలంచిన నేరూపమైన - గ్రక్కున నప్పుడ కాఁజేయు తరులు
సగము [404]వృక్షంబులు సగము శైలములు -సగము [405]మృగంబులు సగ మండజములు
పండువృక్షములట్ల ప్రబలుశైలములు - గొండలక్రియ గిరికొన్న వృక్షములు
ఒక్కొకగడియ కొక్కొకపండు రాలు - నక్కజంబగు గడియారవృక్షములు
ఒక్కొకగడియ కొక్కొకమాటు చెలఁగు - నక్కజంబగు గడియార శైలములు

మొదలికి నఱికిన నదికికొన్తరులు - మొదలికిఁ ద్రుంచిన నదికికొన్ లతలు
వైచినఁ గ్రమ్మఱవచ్చి యచ్చటన - పై చని నెలకొను పాషాణములును
రవితోన యుదయించి దివి దాఁకఁబెరిఁగి- రవితోన దిగ[406]జాఱి భువిఁగూడు గిరులు
నాలుగువాఁకిళ్లు నలిఁగానుపించు - నాలుగుచరుల యానడు మెక్కి చూడఁ
బురములు(ను) గాన్పించు భూరిమహత్త్వ - మరుదగు శ్రీగిరి గిరులన గిరులు
నాలుగువాఁకిళ్లు నలిఁ గానుపించు - నాలుగు [407]కొమ్ముల నడుమెక్కి చూడఁ
బురములు(ను) గాన్పించు భూరిమహత్వ - మరుదగు శ్రీగిరి తరులనఁ దరులు
సంగతంబుగ నెక్కుజనులఁబాతాళ - గంగ నాడించు గంగాశైలములును
సంగతంబుగ నెక్కుజనులఁబాతాళ - గంగ నాడించు గంగావృక్షములును
చని యెక్క నయ్యష్టషష్టితీర్థములు - సనక చూపెడు నష్టషష్టిశైలములు
చని యెక్క నయ్యష్టషష్టితీర్థములు - సనక చూపెడు నష్టషష్టి వృక్షములు
పొరిఁబొరిఁ దమలోన నొరయంగ నగ్ని - దరికొని కాలంగఁ దనరు శైలములు
పొరిఁబొరిఁ దమలోన నొరయంగ నగ్ని - దరికొని కాలంగఁ దనరు వృక్షములు
క్షీరపర్వతములు క్షీరవృక్షములు - క్షీరతటాకముల్ క్షీరదీర్ఘికలు
దధిపర్వతంబులు దధివృక్షములును - దధితటాకంబులు దధిదీర్ఘికలును
ఘృతపర్వతంబులు ఘృతవృక్షములును - ఘృతతటాకంబులు ఘృతదీర్ఘికలును
నమృతపర్వతంబులు నమృతవృక్షములు - నమృతతటాకంబు లమృతదీర్ఘికలు
రసపర్వతంబులు రసవృక్షములును - రసతటాకంబులు రసదీర్ఘికలును
కనకపర్వతములుఁ గనకవృక్షములు - గనకతటాకముల్ గనకదీర్ఘికలుఁ
గనకమృగంబులుఁ గనకోరగములుఁ - గనకభృంగంబులుఁ గనకపక్షులును
గనకంపుగుల్మముల్ గనకంపులతలుఁ - గనకంపురేణువుల్ గనకంపుటిసుముఁ
గనకంపుఁబురములుఁ గనకహర్మ్యములుఁ - గనకంపుఁగోటలుఁ గనకంపుగుళ్లు
మణిపర్వతములు మణివృక్షములును - మణిగుల్మవితతులు మణిలతావళులు
రత్నపర్వతములు రత్నవృక్షములు - రత్నగుల్మంబులు రత్నవల్లరులు
ఒకగొమ్మశోకంబు నొకగొమ్ముసురభి - యొకగొమ్మున్యగ్రోధ మొకగొమ్ముసింత
యొకకొమ్ముగురవంక మొక గొమ్ముగ్రముక - మొకగొమ్ముఘనసార మొకగొమ్మునెఱకు
నొకగొమ్ముసందనం బొకగొమ్ముదిలక - మొకగొమ్ముసంపకం బొకగొమ్ముగ్రోవి
యొకగొమ్ముమందార మొకగొమ్మువకుళ - మొకగొమ్ముమారేడు నొకగొమ్మువొన్న

యొకవువ్వువిరవాది యొకవువ్వుమల్లె - యొకవువ్వుసేవంతి యొకవువ్వుగోఁగు
నొకవువ్వుగరవీర మొకవువ్వుగలువ - యొకవువ్వుదామర యొకవువ్వుమొల్ల
యొకవువ్వుగోరంట యొవువ్వుజాజి - యొకవువ్వుసెంగల్వ యొకవువ్వుమొగలి
యొకవండుసహకార మొకవండునిమ్మ - యొకవండు[408]నారింజి యొక్కవండరఁటి
యొకవండు[409]నేరేడు నొకవండు[410]వెలఁగ - యొకవండుఖర్జూర మొక్కవండీడ
యొకవండుదాడిమం బొకవండు[411]మోవి - యొకవండుగంగరే గొకవండువనస
వ్యాపించి మొదలొక్కటై [412]యిట్లుగూడ - రూపితంబగు బహురూపవృక్షములు
ఒకదిక్కు మఱిశ్వేత మొకదిక్కు వీత - మొకదిక్కు మాంజిష్ఠ మొకదిక్కు రక్త
మొక్కదిక్కు గపోత మొకదిక్కు నీల - మొక్కటఁదోఁపంగఁ బెక్కువర్ణముల
వఱలి యొప్పెడు బహువర్ణశైలములు - వఱలి యొప్పెడు బహువర్ణవృక్షములు
కొంత విద్రుమమును గొంత ద్రాక్షయును- గొంత దారదవల్లి గొంత దాంబూలి
యేపార మొదలొక్కటే [413]యిట్లుగూడ - రూపితంబగు బహురూపవల్లరులు
నడర నేతెంచి లింగాంగణంబులను - సుడిగొని కసువులు దుడుచుమారుతము
లిమ్ముల [414]లింగాలయమ్ములఁ గలయ - సమ్మార్జనము సేయు స్వల్పవర్షములు
చట్టన నేతెంచి సర్వలింగముల - చుట్టును మ్రుగ్గులు వెట్టుసస్యములు
ఎలమి లింగము లున్నయెడల కేతెంచి - జలకంబు లార్చుచుఁ జనుతీర్థములును
నందంబుగఁ [415]దిగిచి యా లింగములకుఁ - జందనంబులు వూయు చందనతరులు
భ్రాజింప ముప్రొద్దు వటులింగములనుఁ - [416]బూజింప నేతెంచు పుష్పవాటికలు
వేడుక [417]నెపుడువివిధ లింగములకుఁ - గూడి ధూపములిచ్చు గుగ్గులుతరులు
దనర లింగములకుఁ దగ [418]నివాళులిడి - చనుతృణజ్యోతికాష్ఠజ్యోతిచయము
నలర లింగములకు ననయంబు వచ్చి - ఫలములర్పణ సేయు బహువిధతరులు
నమరలింగములకు ననయంబువీగి - యములునివేదించు [419]క్రముకాదితరులు
ధరణి వెండియుఁ దమతమపేళ్లమీఁదఁ - బరగ నీశ్వరనామ మరుదుగా నిలిపి
“వృక్షేశ శర” ణని వృక్షాలయముల - వృక్షలింగముల నర్చించు వృక్షములు
“గిరినాథ! శర”ణని గిరిగహ్వరముల - గిరిలింగములఁ గొల్చు గిరిసమూహంబు
“మృగనాథ శర” ణని మృగనివాసముల - మృగలింగములఁ గొల్చు మృగసమూహములు

"ఖగనాథ! శర” ణని ఖగమండలముల - ఖగలింగములఁగొల్చు ఖగసమూహంబు
“నురగేశ శర”ణని యురగాలయముల - నురగలింగములఁగొ(?)ల్చురగసంఘములు
“భృంగేశ శర”ణని భృంగాలయముల - భృంగలింగముల నర్చించు భృంగములు
“జలనాథ! శర”ణని జలజాకరముల - జలలింగములఁగొల్చు జలజాకరములు
"తీర్థేశ శర”ణని తీర్థాలయములఁ - దీర్థలింగముఁ బ్రార్థించుతీర్థములు
“మునినాథ శర"ణని మునిపల్లెలందు - మునిలింగములఁగొల్చు మునిసమూహంబు
“శబరేశ శర”ణని శబరాలయముల - శబరలింగము గొల్చు శబరసంఘములు
నుపమకు మిగిలిన యురువీరఘోర - [420]తపములాపాదించు తాపసవరులు
నిట్టలంబుగమీఁద బుట్టలు వెరిగి - మెట్టల క్రియ నున్న మేటి సన్మునులు
విరచితంబై మీఁద వృక్షముల్ మొలవ - నురువృక్షములభాతి నున్న సన్మునులు
శిలలతోడఁగూడఁ గలయఁగఁ బెరిగి - శిలరూపములభాతి నలరు సన్మునులు
క్తకేశములొడల్ముంచిపైఁ బెరుగ - వ్యక్తనీలాద్రులట్లలరు సన్మునులు
మేదిని దలమోపి [421]మీఁదికి నూర్ధ్వ - పాదులై తపములాపాదించు మునులు
నేకపాదాంగుష్ఠమిలమీఁద మోపి - ప్రాకట [422]తపములాపాదించు మునులు
పంచాగ్నినడుమను బయల దీర్ఘికలు - ముంచి పాఱఁగఁ దపములుసేయు మునులు
జలపత్రవాలుకానిలకందమూల - ఫలశిలాహారులై పరగుసన్మునులు
వృక్షముల్వెట్టంగ భిక్షముల్గుడిచి - యక్షయకాయులై యలరుసన్మునులు
పర్వతంబులు వెట్ట భైక్షముల్గుడిచి - నిర్వికల్పస్థితి నిల్చు సన్మునులు
నొనర జలక్రీడయును వనక్రీడఁ - దనరుచుఁ దనియు గంధర్వదంపతులు
నమితస్వయంభు లింగార్చనాసక్తి - నమరంగ నేతెంచ నమరవర్గములు
జలకన్యకలు నొప్పు బిలకన్యకలును - జలపురుషులు నొప్పు బిలపురుషులును
గరినివహంబులుఁ బురుషమృగములు - శరభశార్దూలాదివరమృగావలులు
గండమృగములు భేరుండ తండములుఁ - జండోరగములు శిఖండి యూథంబు
దొడరి యన్యోన్యశత్రుత్వంబులుడిగి - యడరుచుఁ దమలోన నాడుచు నెపుడుఁ
దనరి యొప్పెడు బిల్వవనమహత్త్వంబు - గని వినుతింపుచు వనమధ్యమందు
వినయస్థుఁడై తన్ను వెదకుచువచ్చు - "ననఘుని మాదిరాజయ్య మనంబుఁ
జూచెదఁగాక” యంచును మల్లికార్జు - నాచార్యుఁ డపరిమితాంగంబుఁ దాల్చి
తెరువున కడ్డమై దివియును భువియుఁ - బరిపూర్ణముగఁ జాఁగఁబడియున్నఁజూచి

పరమయోగీంద్రుఁడో? భసితంపుగిరియొ? - ధరఁబడ్డ రుద్రాక్షధరణీరుహంబొ?
సదమలజ్యోతియో శంభురూపంబొ? - విదిత చిదబ్ది సముదితపూరంబొ?
యెచ్చోటఁ బోవరాదెట్లోకో” యనుచు - నచ్చెరువంది మాదాఖ్యుఁ "డీ క్రమము
నరయుదు”నని యుత్తమాంగంబు దిక్కు - పరిగొని మూఁడేఁడులరసి కానకయుఁ
బదపద్మములమీదఁ బడ కిటువచ్చు- టిది దప్పు దానంచుఁ బదపడి మగిడి
యచ్చోటనుండి యయ్యడుగులదిక్కు - గ్రచ్చర వర్షాష్టకమునకు వచ్చి
యంత భయభ్రాంతుఁడై “నీదురూప - మంతసూపక యేలయా! యిటు లేఁప
నే నెంతవాఁడ నిన్నెఱిఁగెద ననఁగ - నానందమూర్తి! నీ యడుగులు సూపి
రక్షింపవే” యని ప్రస్తుతింపుచును - బక్షద్వయము సాఁగఁబడియున్నఁ జూచి
యయ్యవసరమున నమ్మల్లికార్జు - నయ్యగా రంతఁ బ్రహసితాస్యుఁ డగుచుఁ
దన తొంటిభావంబుఁదాల్చి "నీ మనసుఁ - గనుఁగొననిట్లైతి” ననుచు మాదాఖ్యు
“లెమ్మ”ని చెయి సాఁచి లేవంగనెత్తి - క్రమ్మఱ నందంద కౌఁగిటఁ జేర్చి
“యిట్టి సాహసి వౌదువేమమ్ముఁ జూడ - నెట్టయా వచ్చితి విచ్చటి” కనుచుఁ
దన నివాసస్థానమునకుఁ దోడ్కొనుచుఁ - జని యంతలింగావసరము సేయించి
తన ప్రసాదము వెట్టి యనుపమతత్త్వ - జనితానుభవసుధావనధిఁ దేల్చుచును
గొంతవ్రొద్దటయుంచుకొని యుండి“యింకఁ - గొంతగాలము గ్రియాభ్రాంతిమైధరణి
నుండఁగఁదగు” నని యురుతరకీర్తి - మండితసద్గురు మల్లికార్జునుఁడు
నానతియిచ్చుడు నమ్మాదిరాజు - "తా నెట్లు వోవుదు నానందమూర్తి
తగు నిఱుపేద నిధానంబుఁ గాంచి - దిగవిడ్చి యేఁగునే [423]మగిడి కూలికిని?
కంటి మీ శ్రీపాదకమలంబులేను - మంటి నింకేటికి మగుడుదు ననిన
మెల్లన నవ్వుచు [424]మేలు గా కనుచు - మల్లికార్జునుఁడు సముల్లాసకీర్తి
నిత్యస్వరూపవినిశ్చితం బైన - ప్రత్యయంబుల నొడఁబఱపఁగఁ దలఁచి
“యట్టేని ర”మ్మని యట నొ(యొ? )క్కదుమ్మ - చెట్టు గావించి నిశ్చింత సమాధి
నిట(యుం?) నుండు మీవని యట యేఁగి తాను - గుటిల వేషంబున గొల్లని భాతి
బఱపువేళ్లును మొద్దుఁ బాదముల్ గుజ్జు - చిఱుదొడలును దొప్పచెవులును బరడు
ప్రక్కలు బీఱనరములును జిదక - ముక్కును ముడిబొమల్ మొగిదోని కడుపుఁ
బొక్కిళ్లువోయిన చెక్కిళ్లు వలుద - బొక్కిఱొమ్మును బెద్దనిక్కిన మెడయుఁ
బల్లమీసములు నేర్పడు కాయకన్నుఁ - బిల్లి గడ్డంబును నల్లని మేనుఁ

బ్రాఁకువట్టినపండ్లు బ్రద్దచేతులును - వీఁక కాళ్లును నడ్డివీపును దనర
ములుగత్తియుచ్చుఁ గోకలుఁజూఁడుఁగొడుపు - మొలతిత్తి నిడిదొడ్డ మొలకచ్చగట్టి
గాలిదప్ప(బ్బ)ఱ వెండ్రుకల్ దూలియాడ - నీలవెట్టుచు నుఱి[425]మెఱ్ఱఁ జూచుచును
గుక్కలఁ బిలుచుచు ఱిక్క వెట్టుచును - నెక్కొన నొరగాల నిలుచుచుఁ జనుచు
గొడ్డలి [426]బరిగమ్మి గూటికుండయును - దుడ్డుఁగోలయుఁ బట్టి తొడిఁదొడిఁగొన్ని
మేఁకపిల్లలఁ దన చాఁకిట నిఱికి - వీఁక దబ్బఱవాట్ల విసరివ్రేయుచును
గొన్ని మేఁకలరొప్పికొని వచ్చి తుమ్మ - నున్న కాయలు రాల్చియును నంతఁబోక
యిమ్ములఁ దన మీఁది [427]కొమ్మెక్కుగొల్లఁ - గ్రమ్మఱ నఱకంగఁ గలుషించిచూచి
“నా మీఁదికొమ్మేల నఱకె[428]దు రోరి - గామిడిగొల్ల! యీ కాననంబునను
మాకు నీడై యున్న యీ కొమ్మెకాని - చేకొని నఱకంగఁ [429]జెట్టులు లేవె?
శంకమాలితి క్రొవ్వి చక్క మైమఱచి - యింక నా చేత నీ వెట్లు సాఁగెదవు
పాపవుగొల్ల నిన్ బఱతుఁగా క”నుచుఁ - గోపించి తిట్టుడు గొల్లండు నవ్వి
“బాపురే నిర్వాణి! బాపురే తపసి! - బాపురే బాపురే కోపపుంజంజ!
పాపంబుఁ బొందెడుకోపించువాఁడు - పాపిగా కేనేల పాపి నయ్యెదను
స్ఖలియించు కోపాగ్ని కణములఁజేసి - కలఁగదే మానసఘనసరోవరము
ఎసఁగెడు కోపాగ్ని నింకదే చెపుమ - మసలక హృదయాబ్జమకరందధార
[430]వెలువడు కోపాగ్ని వేఁడిమిఁజేసి - నలఁగదే సచ్చిదానందపద్మంబు
జ్ఞానంబు సొంపొ! విచారంబు పెంపొ? - ధ్యానంబుఫలమొ యీ తామసగుణము?
నా కేమి సెప్పెద, వీకాననమున - లేకున్నవే చెట్లు నీకుఁగూర్చుండ
నిట్టిశాంతాత్మకు లెచ్చోటఁగలరు! - పుట్టుదురే నినుఁబోల సంయములు!
వఱదవోవునెలుఁగు గొఱుపడంబనుచు - నెఱుఁగక యీఁత కాఁడేఁగి పట్టుడును
వడిఁ బాఱునెలుఁగంత వానినపట్టఁ - గడనున్నవాఁ'డోరి! విడువిడు' మనుడు
'విడిచితి నది దన్ను విడువ' దన్నట్టి - వడువున విడిచిన విడుచునే [431]మాయ
పొంగి చిచ్చుఱుకంగఁ బోవుచుఁ జీర - కొంగోసరించు పెన్వెంగలియట్ల
[432]చెల్లుఁ బొమ్మని సన్న్యసింపఁబోవుచును - నిల్లప్పగించు నయ్యిబ్బందియట్ల
పదిపడి నూతిలోఁబడఁబోయి తాప - వెదకుచు మెట్టెడి [433]వీఱిఁడియట్ల
జ్ఞానాత్ముఁడై సర్వసంగముల్ విడిచి - తా నాశ్రమముఁ గోరు తపసిచందమున

నిల మరు ల్వోయె రోఁకలి గొనిరండు - తలఁజుట్టుకొనియెదఁ దా నన్నయట్లు
పానలేల చెఱుకుపందెమందొక్క - యీనె సిక్కిన నోడుటేకాదె తలఁప
రోసి సంసారంబుఁ బాసి యెక్కింత - యాసించె నేనియు నది వెల్తిగాదె?”
అని తన్ను ముదలించుచును నెట్టయెదురఁ - దనతొంటి భావంబుఁదాల్చినఁ జూచి
కనుమూసి తలవంచి [434]కలయ లజ్జించి - ఘనతరశోకాశ్రుకలితాస్యుఁడగుచు
“నెక్కడిభక్తి? నా కెక్కడిముక్తి? - ఎక్కడఁ జూచినఁ దక్కునే మాయ
గతి మతిచైతన్య కర్మక్రియాదు - లతిశయంబై కల్గునంతకుఁ దనదు
క్రియ యెట్టులట్లు వర్తింపక శివుని - దయ వడయంగ నిశ్చయమెట్లు వచ్చు
కసుఁగాయఁద్రెంచినఁగా యగుఁగాక - పసనిపండగునయ్య భ్రాంతిఁబొందినను
శాశ్వతకీర్తి నిశ్చల భక్తియుక్తి - యీశ్వరుకృప లేక యేల సిద్ధించు?
కటకటా! నాయట్టి కర్మికినిట్టి - పటు నిస్పృహత్వంబు వ్రాప్తవ్య మగునె?”
యనుచున్న మాదిరాజయ్య గారలను - గనుఁగొని మల్లయ్య గౌఁగిటఁ జేర్చి
“కర్మవిదూర! దుఃఖంబింత వలదు - కర్ములకేల మాకడరు రావచ్చు?
నీవు మర్త్యమునకుఁ బోవుటకొఱకు - నీ వికల్పములెల్ల నేమెచేసితిమి
ఏమిగారణ మనియెదవేని వినుమ - యా మహాదేవుని యానతిఁజేసి
వసుధకు సద్భక్తివర్ధనార్థముగ - బసవండు నా నొక్క భక్తుండు వచ్చి
యున్నవాఁ డాతని యుదితగోష్ఠీ స - మున్నతసుఖవార్ధి నోలలాడుచును
బరమశివాచారసరణి వట్రిల్లఁ - జరియింపవలయు నద్ధరణిలో నీవు
ఎనయంగ నార్నూఱునేఁబదియేండ్లు - సనియె నీ విట వచ్చి సంయమితిలక!
ఎన్న నింకేఁబదియేండ్ల కిక్కడికి - నిన్ను రప్పించికొనెద నిక్కువంబు
యిటుగూడ నేడునూఱేండ్లకుఁగాని - యిట యున్నిగానేర దిప్పు డీప్సితము
నేమేనియును వేఁడు మిచ్చెద” ననుడు - నా మల్లికార్జునయ్యకుఁ గేలుమొగిచి
“శ్రీయందమే పరస్త్రీ నిక్కువంబు - నాయువందమె మాయ కది జన్మభూమి
స్వర్గ మందమె యధ్రువం; బింకమోక్ష - వర్గ మందమె మున్న భర్గునిపదము
ఏమియు నొల్ల నీ వెఱుఁగవే దేవ! - స్వామి! సర్వజ్ఞాన!సకలేశ” యనుచు
నంతంత సాష్టాంగుఁడై మ్రొక్కి నిలుచు - నంత వారి కృపఁగళ్యాణంబునందు

బసవనియెదుటఁ బెంపెసఁగంగ నిలిచె - నసముండు మాదిరాజయ్య తత్క్షణమ
ఇట బసవఁడు సంగమేశ్వరు [435]నందు - నటమున్న పొడగాంచి సాష్టాంగ మెఱగి
మ్రొక్కునమ్మాత్రన ముందటనున్న - నక్కజుండగుచు నందంద మ్రొక్కుడును
వత్సలత్వంబు నివ్వటిలంగ నతులి - తోత్సవలీలమై నుల్లసిల్లుచును
నంచితలింగసుఖాపారసార - సంచితామృతవార్ధి ముంచి యెత్తుచును
బసవనిచేఁబూజ వడయుచునుండె - నసలార మాదిరాజయ్యగారిట్టు
లీ జగత్త్రయి సకలేశ్వర మాది - రాజయ్యగారి నిర్మల చరిత్రంబు
విస్తరించినఁ బ్రీతి విన్న వ్రాసినను - బ్రస్తుతభక్తి శుభంబులు సెందు
ధీమణి! సుజనచింతామణి! బుధశి - ఖామణి! ధర్మరక్షామణి! శుద్ధ
శరణజనానందకరణ! సత్పథవి - హరణ! సంతతదయాభకరణచేతస్క
లలిత నిర్మలయశః కలితదిగంత! - ఫలిత సద్భక్తి సమ్మిళితాంతరంగ!
రహితషడ్భావ! [436]విరచితసద్భావ! - మహిత తత్త్వార్థ సన్నిహితావధాన
విదిత ప్రసాద సంవిత్సౌఖ్యభోగ - ముదితాత్మ సంగత సుఖసుధాశరధినిమగ్న
ఇదియ సంఖ్యాత మాహేశ్వరదివ్య - పదపద్మ సౌరభభ్రమరాయమాణ
జంగమలింగ ప్రసాదోపభోగ - సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ - వరకృపాంచితకవిత్వస్ఫూర్తిఁబేర్చి
చను బసవపురాణమను కథయందు - ననుపమంబుగఁ దృతీయాశ్వాసమయ్యె.

  1. మింతయుఁ
  2. బెట్లకో
  3. పిల్లు
  4. భాగవతమందలి "మందారమకరంద” పద్యము దీనిఁబట్టి పుట్టినది. ఇట్టిసీస మీయన చతుర్వేదసారమందు నున్నది
  5. యేతెఱంగునఁ బీల్చునే రే(ఁగు)నిపండ్లు
  6. గోరునే
  7. విరియు
  8. చంటికి నేఁగదు
  9. సమర్థుల
  10. పాదికె, పాదిగె
  11. లెక్కకుఁజూడు
  12. పాండ్యుడు
  13. దేరఁ
  14. జనఁజన
  15. నలుసేయుడును, సేయునెడను
  16. దొడుసూప
  17. రత్న
  18. భూషణోత్కరము
  19. మాకు
  20. సెప్పిన చండికుక్కలను; ఇక్కడ యచ్ఛబ్దార్థ మేకవచనమునను దచ్ఛబ్దార్థము బహువచనమునను గలదు.
  21. బానిసె
  22. మున
  23. ఇక్కడ 'నిత్య' అనియే యన్ని వ్రాఁతప్రతులందు నున్నది.
  24. వేఁడుటంతఁ
  25. మగుడి
  26. యేమని చెప్ప నీయాన నిప్పు
  27. బావ
  28. అరుగలి
  29. లింగారా
  30. కెంజావళి
  31. మహి
  32. తాయిమేఘము గజదా
  33. వళము
  34. వళి
  35. గనయము
  36. దమ్మివాలు
  37. దమ
  38. నీకు నా మీఁది
  39. మీఁద - గలదేని
  40. పటవలి పుట్టంబు
  41. పటువలి
  42. నాకు
  43. నారి
  44. ఇట్టిసంధుల నీతఁడు పెక్కుచోట్లఁ గూర్చినాడు.
  45. పట్టు
  46. వేఁడెడు, వేఁడిన
  47. వెండియు
  48. సమితియుఁ జంద్ర
  49. కిలఁజూఱ
  50. జారుండు యీఁడె
  51. తడసిన
  52. యన్ని
  53. పోయి
  54. వడదయ్యె
  55. నిట్టవొడువ
  56. సంహరు నిజమందిరంబులను
  57. వాద్య
  58. నివాసమలఁ బ
  59. మ్రుచ్చను. పెక్కు ప్రతులలో 'మ్రుచ్చను'ఉన్నది
  60. జారచోరులకథల్ నర్చించు
  61. నేమిటికి
  62. సలుపుచు నుండ
  63. 'లంజఱికము' అని వ్రాఁతలలోఁ గలదుగాని కవి “చేకూరె నిట్టిలంజెఱిక” మని ప్రయోగించెను
  64. వారుజంగములు
  65. చిన్న
  66. దొల్కాడ
  67. చెలువపసిండి
  68. మిండెత అనియే వ్రాఁతప్రతులు
  69. చల్లి
  70. నింపార
  71. నదియె యానాతి
  72. సదనంబకా
  73. గంబళంబాస
  74. మును
  75. పసపు
  76. ధరింపమిని
  77. దిట్టి
  78. దాల్చుటముఖ్యమేయనిన
  79. నిలిపి
  80. సగముదాల్చితిఁగడు
  81. నివె
  82. నెట్టి
  83. నుండు
  84. గలిగిన
  85. మిది
  86. గలయట్టి
  87. పనులొండునున్నవే
  88. పగలును రేయు
  89. పడఁతియర్ఘమ్ములు
  90. నించి
  91. పాంతంబునందు
  92. దృగ్విదీధితుల
  93. వోవ
  94. చూప
  95. ఈ పాదమునకుఁ దర్వాత “జవనికఁ బట్టింప సరసమై నిలిచి- కవళవ్వ పూర్వరంగము ప్రసంగించు” ఒక్క ప్రతిలోనున్నది
  96. స్వరమాన మెఱిఁగి బసవప్రమథవ్వ
  97. నొకరితలైనిల్వు, మొకరితలై
  98. వాళ కోలు
  99. భద్రు
  100. సల్పుండు
  101. గచ్చళియు; గంచగళియు
  102. గచ్చడము
  103. నిట్టులావిర్భవించి
  104. ప(పు)ట్టించి
  105. ఝంకంబు
  106. సంగతినొలయ
  107. వెల్లి
  108. మలర
  109. నమ్మిండ
  110. నత్తఱిని
  111. కంబు సేయఁగ
  112. తెగక, తెగకుండ నెన్ని
  113. లొప్పఁగ నిట్లు చేసి
  114. పసు
  115. రూపంబు
  116. నిష్క్రియురాలి; నిస్స్పృహశాలి
  117. దా
  118. రుల్ చేయివ్రేసి
  119. వీఁగి
  120. పొర లక్కటా!
  121. యిట్టు
  122. పోతివపుడు; పోయితపుడు
  123. ను నెట్టు
  124. నకో
  125. మూర్తి
  126. బడయరే, బొందరే
  127. బనువుచు
  128. నేమియుఁ బు
  129. కిది; కింక
  130. మా
  131. సంతసింపుమన
  132. బిందంబు?
  133. నోర్వ
  134. మున్నె
  135. బుద్ధులు
  136. కొన్ని ప్రతులలో బోఁటి (స్త్రీ) సానుస్వారముగా నున్నది
  137. గాలుచునో
  138. నా పొలఁతియు నప్డు తూపాడుచుడును
  139. తుంపుర్లు
  140. డర్ధ
  141. నక్కొంత
  142. బ్రేలుడు
  143. వెన్కఁ
  144. నేని వట్రిల్లె
  145. లింకిన్నియు
  146. తెల్లమిగ
  147. తత్‌క్షణమ
  148. తాదు
  149. ణావలోకన
  150. వేఁడుఁడు నావుండు
  151. నిన్నునొల్లమి
  152. మును
  153. లేకెట్లోకో తా జనియించె
  154. డస్సెడిని
  155. నేల
  156. బ్రుంగనిచ్చు
  157. యాఁకొనకుండంగ నరసి పాలించి; యాఁకొనకుండఁగ డ్పరసి పాలించి(లిచ్చి)
  158. బేరఁటంబులను
  159. యుండుట దగునే
  160. ఆరయఁ
  161. నేహరునకు నైనను
  162. ప్రాణేశుఁ
  163. తొంగిళ్లుపై
  164. నందంద
  165. గడుపునోరి
  166. బసపార్చి
  167. వ్రేళ్ల-పిడుచు
  168. మడఁచి
  169. నొసల
  170. కడువ
  171. నెత్తిబ్రుంగెడు
  172. వార్నంత
  173. వెట్టియు
  174. కున్ననిఁ జఱచుదు
  175. యుబ్బుచుఁ
  176. హర్షింపఁ
  177. తఱిచంటి
  178. మూర్ఛబిమ్మిట
  179. చిన్ని
  180. నవుదు
  181. యిటు
  182. కలిగియులేకయె
  183. గాళ్లును
  184. కొదమయో
  185. యంగుటి; యంగుడు
  186. బనువు
  187. యటకొనఁ
  188. డస్సి
  189. వెల్లివేఁగినాడినను
  190. యంచుఁగ్రమ్మఱ
  191. మీఱఁగఁజేసి
  192. కామించియాకరి
  193. మాంస మడిగి
  194. యెత్తుచేసి
  195. డనిచేతకళ్లఁ
  196. ఁబుచ్చ
  197. కుడుపు నీ కిందదే
  198. బోక; మఱియు
  199. నీది యెట్లు
  200. చదువున
  201. గాన
  202. ననుషక్తి
  203. వట్టేలయట్టేని
  204. రా
  205. గ్రొత్త... మడుగుదురె
  206. చాలుఁ
  207. గంగనంత
  208. నుండ
  209. యునుండంగఁ
  210. పరుఁడు
  211. దా బొరుగూరి(బొన్నూరి)
  212. కడఁబుట్టు
  213. చిన్న
  214. మరలంగఁ
  215. బొత్తిన; బొప్పెన
  216. యెండపొడ
  217. బొగవట్టిచెడెనొ
  218. అన్ని ప్రతుల నిట్లే కలదు.
  219. యిన? (యనొ)మరి.
  220. చిక్కింపు
  221. కుడుపున కెయిదదేఁ గుడువలేననియె
  222. గుదగుద
  223. ఖండంబు
  224. అర్చన
  225. నీ బండి
  226. దాటించుఁ
  227. వెళ్లుబుళ్లును బెట్టిఁ
  228. బెట్టు
  229. బాదములకు నెట్టుఁ
  230. నెట్లైన
  231. మగుడి
  232. చక్కటఁ
  233. జూచి
  234. మాటలేలిఁకను
  235. పుడు
  236. దాఁజేఁబట్టుకొనుచు నేతేర
  237. బోయితి కొన్ని ప్రతులలో 'యెందువోయెదు' అని కలదు. 'ఎందు, అందు, ఇందులు' ప్రథమాంతముగాఁ గళగాఁజెప్పదగియున్నవి
  238. నిచ్చితివొ
  239. జల్లితొదేహ
  240. మైయెఱుఁ , మెయ్యెఱుఁ,
  241. యుద్దెశించి
  242. టి
  243. యీ లోకులకు
  244. యోశి!
  245. ఇక్కడ 'మూర్కొన్నె మూర్కొనెనె, అనునర్థమునఁ గలదు. “ముట్టునేమూర్కొన్నె” అని యెక్క ప్రతిలోనున్నది. మఱియుఁ గొన్నింట “మూర్కొనెనె' అని గణభంగముగాఁగలదు.
  246. ప్రేలరిపడుచ
  247. నెందువోయెద
  248. ముట్టెడు
  249. హాలింగ! హాలింగ! యనుచుడగ్గఱుడు.
  250. చెయిసాఁచునట్టు-లాతనినొడ(ద)రుచు
  251. లీలదివ్యాంగంబు
  252. ననహా,
  253. కూఁకట
  254. గూఁకట
  255. కూఁకట
  256. గత్తరింప
  257. లోకులకు
  258. దనిశమ్మువెట్టి
  259. తెఱఁ(ర)గునఁ
  260. లుఁగించి పేర్చె
  261. వ్రప్పియై, వ్రస్సియై
  262. గూలుచున్నదియు
  263. లుఁజివికి
  264. కూడ
  265. తలఁగస(సు)వు.
  266. ధీరుఁ
  267. యాతుర
  268. ఁబరికించి
  269. చంపుడు
  270. నంకణంబులు
  271. గొడగు
  272. వాలిన
  273. పాఁతళ్లఁ
  274. జాలదారిని
  275. వారిని
  276. గోరతప్రొద్దుమై కొనకట్టు కూడ(డి)
  277. బెగడంగ
  278. గూడ
  279. యాడుపరి
  280. మ్రాఁకు
  281. కసువు
  282. దీపగంభంబు
  283. సలిపి, సనఁగ
  284. గుట్టుకోఁబూరియుబరక
  285. గసవుగట్ర (గాండ్ర)
  286. వెలుంగు మెఱుంగు దీగయోయనఁగఁ
  287. యట్ల
  288. వ్వెట్లు
  289. బనియాత్మనూహించి
  290. యింతవ్రొ
  291. జగిలె(లి)
  292. మడుగు
  293. యనెడు
  294. జనుమందునపుడు
  295. నడుమునువిఱిగి
  296. నయవి
  297. యూఁచ
  298. నలవోక
  299. ముడియవీడినది
  300. దోషంబింక, దోషంబిది
  301. లొదవు
  302. కొనివచ్చిముందటఁ గుప్పగాఁబోసి
  303. తక్కలి
  304. లామిదెపుఁ, జి
  305. దథ్యగా వెండియుఁ ద
  306. కృత్తివాసుండు
  307. నిమిత్తండి
  308. మెట్లంటివేని
  309. మౌను
  310. యౌలనణంగ
  311. ఁబొరి
  312. టక్కున.... కటారంబు
  313. గిజగిజ
  314. భక్తులు భువిని
  315. జనులును మునులును
  316. పల్లెకు నితని
  317. రాంగమమర
  318. కేమి
  319. పరుస
  320. వచ్చి
  321. గోలువడితి, నొల్వఁబడితి
  322. గాలంటేని, (బేమి).
  323. నర్పించు
  324. సాధించి
  325. చూచి మంచి
  326. వోవ
  327. వాస
  328. వృత్తాంత మరసి
  329. నెట్లుసయంప
  330. యేను; యిట్లు
  331. నిచ్చటనే తొల్లియేనుంగు
  332. పాదుట్రు, పాదుట్ర,
  333. యేటి
  334. నకో
  335. బాదుట్రు
  336. నూకి
  337. మున్
  338. నమ్మహాదేవునక
  339. యిమ్ముల
  340. బూజించి
  341. నట్లత్రి
  342. దివ్యార్చ
  343. సత్ప్రియత్వంబు
  344. లింగంబు
  345. పై
  346. డులిపి
  347. నర్పింపఁదద
  348. యలరఁ బా
  349. బులై
  350. బొందుపాడి
  351. నాఁగ
  352. లేదుకంట
  353. ఇక్కడ రేఫప్రాస సాంకర్యము
  354. కట్టె
  355. చింతపడి
  356. ఊరుకో, ఊరకు,
  357. ఊరుకో, ఊరకు,
  358. ఊరుకో, ఊరకు,
  359. ఊరుకోయేల,
  360. కసవ
  361. నిట్రించి
  362. గంట
  363. పాదో
  364. నౌషధంబేనేమెఱుంగ
  365. గలఁగరే
  366. నేఁడెందువో
  367. 'పోఁతు' సానుస్వారముగాఁ గొన్ని ప్రతులలోఁ గానవచ్చును '
  368. చెప్పలే దొండునుజేయ
  369. కొలికి
  370. కనుగవ
  371. దొడరెననంగ
  372. స్పురితసుధాబ్ధి
  373. నవిరళంబై
  374. యుగొమ్మ(మ్ము)లో
  375. ఇది కొన్ని ప్రతులలో లేదు
  376. ధిపు
  377. పదము
  378. ననురక్తి
  379. లేదు
  380. బ్రసరింప
  381. హస్తిపురిఁ
  382. రునాఁగ
  383. నీమముగ
  384. శివునట్లు
  385. మా
  386. సవరాణము
  387. వాయించె
  388. జోకళం
  389. ననిబంధ
  390. ఠవణియు
  391. విఠాయి
  392. నిజవణావలివణి
  393. సనగితంబు
  394. తిక్కాయి
  395. రిక్కిల
  396. హురి
  397. హురి
  398. రఖిల
  399. నిశ్చింతా
  400. యూఁకించిన
  401. యూఁకించిన
  402. మృగంబులు
  403. వృక్షంబులు
  404. బెర్గి
  405. కొమ్మల
  406. నారంగ మొక్క నారదంబొక్క
  407. ఫలపూర మె
  408. ద్రాక్ష
  409. మొరలి
  410. యుండి కూడ
  411. పసరించి
  412. లింగాంగణమ్ముల
  413. డిగిచి
  414. బూజించి చనుదెంచు
  415. తోడ
  416. నివాళించి
  417. క్రముకతరువులు
  418. తపములఁ జరియించు
  419. మెయికొని యూర్ధ్వ
  420. వ్రతము
  421. మగుడి, మగుడఁ
  422. మేలకాక
  423. ముఱిమిచూచు
  424. యునుగమ్మ
  425. కొమ్మయొక్కతఁడు
  426. దవోరి
  427. జెట్లు లేవెట్టు?
  428. వెలిఁగెడు
  429. యాస
  430. చెల్లెఁ బొమ్మని
  431. వీఱఃడి
  432. కమియ
  433. నంద యట
  434. విరహితదుర్భావ