ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/మూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

మూడవ అధ్యాయము

మొఖాసా ప్రభుపరంపర

మొఖాసా ప్రభుపరంపర

క్రీస్తుశకము తొమ్మిదవ శతాబ్దమునుండియు యూరోపు లోని తక్కిన దేశములలో వలెనే ఫాస్సు 'దేశమునందు గూడ 'మొఖాసాప్రభు 'పరంపరాపద్దతి స్థాపించబడెను. రాజులు బలహీనులగుటచేత నీపద్ధతి త్వరితముగ వ్యాపించెను. పదవ శతాబ్దమున నీ పద్ధతి పరాసు జర్మనీ దేశములలో పూర్తిగా విజృంభించెను. 1066 వ సంవత్సరమున నార్మండీ రాష్ట్ర ప్రభువగు విల్లియం ఆంగ్లేయు దేశమును జయించి పాలనము నెలకొలిపెను. ఆయన ఆంగ్లేయ దేశమునందుగూడ నీ మొఖానాపద్ధతిని పూర్తిగ స్థాపించెను. ఈ పద్ధతివలన నేర్పడిన రాజకీయ నాంఘిక పరిస్థితులు

21


22

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


యూరఫుఖండములోని అన్ని దేశములలోను పదునెనిమిదవ శతాబ్దము వఱకును నిలిచియుండెము. ఈ పరిస్థితుల పై తిరుగ బాటు చేసి నాశనము చేయుటకు 1780 వ సంవత్సరమున పరాసు దేశములో ప్రజాస్వాతంత విప్లవము జరిగెను. ఈ ప్రభుపరంప రాపధ్ధతి ఇంకను ఇంగ్లాండులో పూర్తిగచావక ఆంగ్లేయ పొర్ల మెంటులోని ప్రభువుల సభ రూపమునను, ఇంగ్లాండులోని భూ ఖామందు రయితుల మధ్య హక్కు లలో కొంతపఱకును, నిలిచి యిన్నది. ఇప్పటికీని ఇంగ్లాండులోని ప్రభువులు సామాన్య ప్రజలతో కలియక వేరుగ క్లబ్బులను స్థాపించుకొనియున్నారు. నామాన్య ప్రజలను తమకన్న తక్కువవారిగ చూచుచున్నారు. పరాసు విప్లవము తిరువాతి ఫ్రాస్స దేశములోను అమెరికా లోను ప్రభువులు లేరు.


ఆ కాలపు ప్రజల అవసరములను బట్టియు అభిప్రాయములను బట్టియు నీ ప్రభువు పరంపరాపద్ధతి ఏర్పడినది. దీనియొక్క ప్రధానలక్షణము రాజుయొక్క , అధికారము మిగుల బలహీనమై సామంత రాజు లయొక్కయు వారి కింది ప్రభువుల యొక్కయు అధికారము మిగుల బలముగానుండుట. తొమ్మిది, పది శాతాబ్దములలో యూరపులోని రాజులు బలహీనులుగ నుండిరి. రోమక సామ్రాజ్యము కూలిపోయెను. దానితరువాత వచ్చిన షార్ల మేను యొక్క సామ్రాజ్యము ఆయన మరణముతోనే విచ్ఛిన్న మయ్యెను. ఫోన్సులోని బలహీనులగు రాజులు నార్మనుల నుండియు జర్మ

నీలోని రాజులు మాగీయారులనుండియు తమ ప్రజలను నంద

మూడవ అధ్యాయము

క్షించ లేక పోయిరి. అందువలన రాజులు తమ అధికారమును సామంత రాజులకును ప్రభువులకును పంచి యీయవలసి వచ్చెను, నార్మనులనుండి పరాసు దేశ మును కాపాడుటకై ప్రభువుల ను కోటలు కట్టుకొమ్మని రాజు లు తరువులిచ్చుట చూచి యున్నాము. ప్రభువులను సామంత రాజును బలవంతులుగ చేయవలసివచ్చెను. సంఘ: మరాజకముగ నుండెను. బలవంతు' లు బలహీనులను ఒత్తిడి చేయుచుండిరి. పశుబలమే. రాజ్యము చేయుచుండెను. ప్రతివారును స్వసంరక్షణ కొరకై కత్తి పట్ట వలసి యుండెను. సామాన్య జనులు తమ్ము తాము రక్షించు కొన లేక తమ స్వతంత్రతను పోగొట్టుకొని బలవంతులగు ప్ర భువు లయండను జేరిరి. ప్రభువులు ప్రజలను సంరక్షించుచుండిరి. ఈ విధముగా ప్రభుపరంపర యొక్క యావశ్యకత ఏర్పడినది.

స్వంతముగ నౌకరీ చేయుట

మఖాసాప్రభు పరంపరాపధ్ధతిలోగల ప్రధాన సూత్ర మేమసగా స్వయముగా నౌకరీ చేయుట. ఒకరి యొద్ద మరియొకరు భూమిని కౌలుకుతీసికొనినచో ఈకాలమున ద్రవ్య రూపకముగ శిస్తు నిచ్చును. అకాల మందు భూఖామందుకు స్వయముగా నౌకరీ చేయవలెను. యూరఫుఖండమున మధ్య మ యుగములో తగినన్ని నాణెము లు లేవు. కాగితపు దవ్యమును (నోట్లను) వా రెరుగ నేయెగరు. ఆ కాలమున మూలధనము కూడ తక్కువ. మరియు నీ పరిస్థితిలో మనుష్యులు చేసిన చట్టములకన్న అచారమే ప్రధా

నముగ నుండెను.
24

ప్రెంచి స్వాతంత్ర్య విజయము



భూమి నిచ్చుట

భక్తిప్రమాణము

మొఖాసా పద్ధతిలో గల మరియొక సూత్రము దేశము లోని భూమియంతయు రాజుది అనునది.. రాజు కొద్ది భూమిని తనక్రింద నుంచుకొని మిగత యావత్తు భూమిని తినకింది సామంత రాజులకుపంచి యిచ్చెను. అభూమిని పుచ్చుకొనినందుకుగాను రాజునకు సా మంత రాజులు రాజభ క్తిప్రమాణమును చేసిరి. రాజు వొద్దకు సామంత రాజు తలకు టోపిలేకుండసూ, చేతిలో నాయుధము లేకుం డసు వచ్చి మోకరించి " నేను మీమనిషిని” అని ప్రమాణ ము చేయును. రాజు సామంత రాజును ముద్దాడి చేతులతో లేవ నెత్తును. సామంత రాజుకు భూమిని స్వాధీనము చేసితినని చెప్పి అందుకు చిహ్నముగ నొక చెట్టుకొమ్మ నిచ్చును. అటు లనే సామంత రాజు కొంతభూమిని తన స్వంతముక్రింద నుంచు కొని మిగిలినదానిని నంతను కొందరు ప్రభువులకు పంచియిచ్చె ను. సామంత రాజుకు ప్రభువులు మోకరించి 'నేను మీమనిషిని' అను ప్రసూణము చేసిరి. సామంత రాజు ప్రభువులను ముద్దాడి లేవ నెత్తి భూమిని స్వాధీనము చేసితినని చెప్పి చెట్టు కొమ్మ నిచ్చెను. తిరిగి ప్రభువులు తమ కిందనున్న భూమిని చిన్న ప్రభువులకును, వారు తమభూమిని ఇంకా కొద్ది ప్రభువుల కును, వారు మరికొద్ది ప్రభువులకును పంచియిచ్చిరి. పైవారికి క్రిందివారు భక్తి సూచకమైన ప్రమాణము చేయుటయు, క్రింది వారిని పైవారు లేవనెత్తీ భూమినిచ్చితినని చెప్పి చెట్టు కొమ్మ నిచ్చుటయు జరిగెను. రాజు సామంత రాజును, సామంత

"రాజు ప్రభువును, ప్రభువు తన కింది ప్రభువును, ఆతఁడు తన

మూడవ ఆధ్యాయము

క్రింది. చిన్న ప్రభువును, ఈవిధముగా పైవాడు తన క్రింది వానిని శత్రువులనుండి రక్షించెదనని వాగ్దత్తము చేసిరి. భూమిసిచ్చినందునకు పైవానికి క్రింది వాడు భక్తిప్రమారాణము గావించుటయేగాక సైన్యములతో సహాయము చేయవలెను. రాజు యుద్ధమునకు వెడలగనే సొమంత రాజు, సామంత రాజు వెడలగ నే ప్రభువు, ప్రభువు వెడలగ నే కింది ప్రభువు, ఈవిధ ముగ ప్రతికిందివాడును తన పైవానికి సహాయముగ సైన్య ములను తీసికొని వెళ్ళవలెను. ఇటుల భూమునిచ్చుట, భక్తి ప్రమాణము, శత్రువుల నుండి రక్షణ, సైనిక సేవ, ఇవి మొఖా సాపద్ధతిలో పై వానిని కిందివాసిని బంధించు ముఖ్య నిబంధనలు. రాజ్య మంతయు భూఖామందులగు సామంత రాజులతోడను గొప్ప ప్రభువులతోడను చిన్న ప్రభువుల తోడసు నిండెను. ఈ ప్రభువు లెప్పుడుసు ఆ యుధములను ధరించి సైన్యములను తయారుచేసికొని కోటలను నిర్మించుకొని యుద్ధములకు సం సిద్ధులుగ నుండిరి. ప్రభువులు చిన్న తనమునుండియు యుద్ధమున కౌశలము చూపి పేరు పొందవలెనని శిక్షను పొందుచుండిరి. ప్రతిదానికిని కత్తిదూయుట సామాన్యమయ్యెను. ప్రభువులకు యుద్ధము ప్రథానవృత్తియయ్యెను.


ప్రభువునకు
చేయుపమలు.

రాజు మొదలగు పై వారిని ప్రభువులనియు , శ్రీది వారిని సామంతులనియు పిలుతము. ప్రభువునకు సామంతుడు సంవత్సర మునకు నలుబది దినములు మాత్రము సైనిక సహాయము చేసి తీరవలెననియు తాను పొందిన భూమి నుండి కొంతదూరముకన్న నెక్కువ దూరము సామం

26

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

తుడు ప్రభుసహాయమునకై పోనక్కర లేదనియు క్రమముగా నాచార మేర్పడినది. ఒక సైనిక సహాయ మేగాక ప్రభువునకు సామంతుడు కొన్ని ఇతర సహాయములను చేసితీరవలెను . సామంతుడు చనిపోయినప్లు,డాతని వారసులు ప్రభువునకు కొంత ద్రవ్య మిచ్చినగాని భూమిలో ప్రవేశించవీలు లేదు. దూరవార సునకు భూమి సంక్రమించినపుడు ప్రభువున కెక్కువ సొమ్ము నియ్యవలెను. ఇయ్యవలసిన సొమ్ము ఆచారమువలన స్థిర పడి నది. ప్రభువు ప్రయాణము చేయుచున్న వుడును,వేటాడుటకు బయలు దేరినపుడును ఆయనకును ఆరుస అనుచరులకును సామంతుడు ఆతిథ్య మీయవలయును, ప్రభువు యుద్ధ ములో శత్రువులచే జక్కి నపుడు సామంతుడు ఎంతధసమై నను ఇచ్చి ప్రభును విడిపించుకొని రావలెను. ప్రభువు యొక్క ప్రథమ పుతిక యొక్క వివాహమునకును అతని ప్రథమకుమారుడు ఆయుధధారణము గావించినపుడును సొమం తుడు కొంత సొమ్ము నియ్యవలెను, ప్రభువు కోరినపుడెల్ల సామం తుడు సలహా ఈయవలెను. భూమి వారసత్వముగా జ్యేష్ఠ కుమారునికి మాత్రమే సంక్రమించును. వారసు లెవరును లేనపుడును, సొమంతుడు ప్రభువుపై తిరుగ బాటు చేసినపుడును సామంతుడు షరతులకు వ్యతిరేకముగ ప్రవర్తించినపుడును భూమిని ప్రభువు తీసికొనును.

వ్యవసాయక
బానిసలు

రాజుగాని సామంత రాజుగాని ప్రభువులుగాని తను క్రింది వారికి స్వాధీనపరుపక తమ స్వంతకమతము కింద నుంచు కొనిన భూములను వ్యవసాయక బానిసలచే

(సర్ఫ్స) సేద్యము చేయించుకొనిరి. కొంత

మూడవ ఆధ్యాయము.

27


కాలమువరకు పరాసు దేశములో రాజు యొక్క స్వంతకమతము కింద సుంచుకొనిన భూమి స్వల్పమై సామంత రాజులుసు, ప్రభువులును దేశములో రాజున కన్న ఎక్కువ బలవంతులు గ నుండిరి. ఆకాలమున రాజు వేరుగ పన్నులు వసూలు చేయు పద్ధతి లేనే లేదు.987 వ సంవత్సరమున పరాసు దేశమునకు హ్యూజు కాపటు రాజయ్యెను. ఈకాపటు పంశీకులగు రాజులు తమ స్వంతకమతపు భూములను వృద్ధి చేసికొని క్రమముగా బలవంతులైరి. ఏదో సాట బెట్టి సొమంతుల నుండి భూమిని లాగుకొని స్వంతకమతములో జేర్చుకొనిరి. 'స్వంతకమతపు భూములలోని వ్యవసాయక బానిసల స్థితి దుర్భరముగ నుండెను. భూములను విడిచి ఇష్టము వచ్చిన చోటికి పోయి జీవించుటకు వీలు లేదు. వీరిని తమ భూఖామందులను ప్రభువు లెట్టిశిక్ష విధిం చినను ఖైదులో వేసినను కొరడా దెబ్బలు కొట్టినను భూమిలో నుంచి వెడలగొట్టినను ప్రభువు నడుగు వారు లేరు. వీరు ప్రభువు చెప్పిన అన్ని పనులును చేసితీరవలెను. భూమి అమ్మబడినపుడు భూమితో కూడ వీరు నూతన ప్రభువుకిందికి పోవుదురు. వీరు చనిపోగనే వీకిఆస్తి అంతయు తమ భూకామందునకు చెందుసు. ఇట్టివారుగాక భూఖామందులగు ప్రభువు" భూములను వ్యనసాయము చేయుచు వారికి నియమిత మైన సేవను శిస్తును అర్పించెడి వ్యవసాయకులు కూడ కొందరుగలరు, వీరు సాధా రణముగ పండిన పంటలో కొంతభాగము చెల్లింతురు. భూ ఖామందుయొక్క ఇతర భూములమీదసు . దాక్షతోటల

లోను పనిచేయవలెను. ఆయన కోటను బాగుచేయవలెను.
28

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

సామానులను బండ్లను బాగు చేయవలెను. భూ కామందు యొక్క రోడ్లను వేయవలెను. వీరి ఆస్తి వీరిపిల్లల కు చెందును. వీరిపై విచారణహక్కు భూఖామందులకే గలదు. భూఖామందుల తీర్పుపై వ్యవసాయకులకు మరెక్కడను చెప్పు కొనుటకు హక్కు లేదు.

జాతి భేదములు

మధ్యమయుగమున యూరపుఖండము లోని దేశము లన్నిటిలోను సంఘముమూడు జాతులుగా విభజింపబడి యుండినది.

మొదటిజాతి
ప్రభువులు,

మొదటి జాతీయగు ప్రభువులకు శిరస్సు రాజు. సామంత రా జులు, పెద్ద ప్రభువులు, చిన్న ప్రభువులు, మొదలగు ప్రభువు లంద రుసు ఈ జాతి లోనివారు. వీరందరును భూఖామందులు వీరిలో వీరు వివాహమాడుచుండిరి. సామతం రాజులుసుగొప్ప ప్రభువులును సాధారణముగ రాజ బంధువులుగ నుండిరి. సామాన్య ప్రజలకన్న పుట్టుక వలన అధికుల ముని భావి చుచు నీ ప్రభువులజాతి నామాన్య ప్రజల మీద గొప్పగొప్ప అధి కారములను గలిగియుండెను. ప్రభువులకు తమ భూములలోని వ్యవసాయకులమీదను, వ్యపసాయ బానిసల మీదను, కాపుర ముండు ఇతర ప్రజల మీదను నిరంకుమగు న్యాయవిచా ణాధికారి హక్కులు గలవు. ఖైదు, దెబ్బల శిక్ష మొదలగు సవి వేయవచ్చును. గొప్పప్రభువులకు మరణశిక్ష విధించు హక్కుగూడ నుండెసు. ప్రభువులందరును తమంతట తాము యుద్ధము చేయవచ్చును. సంధి చేసికొనవచ్చును. ఇష్టము.

వచ్చినంత సైన్యము నుంచుకొని వచ్చును. ఇష్టమువచ్చిన ఆయు

మూడవ అధ్యాయము

29


ధములను ధరించవచ్చును. కోటలు నిర్మించుకొనవచ్చును. కొందరు నాణెములుకూడ వేసికొనవచ్చును. వీరిక్రింద నుం డిన భూములకు పైవారికి సైనిక కొలువుతప్ప చెల్లించవలసిన పన్నులు లేవు. క్రమముగా నీ ప్రభువులు తమలో తాము యుద్ధ ములు చేయుచు చుట్టుపట్టు ప్రాంతములలోని ప్రజలను దోచు కొనుచు దేశములోని అరాజకమునకును, కామమునకును కారకులైరి. పదకొండవశతాబ్దమున యూరపుఖండమున మితి లేని అరాజకము, దోపిళ్ళు, హత్యలు ప్రబలి మహా క్షామము కలిగెను. ప్రజలు మానవకళేబరములను తినిరి. ప్రభువులు ప్రతివారిమీదీకిని కత్తిదూయుటకు సిద్ధముగా నున్నను స్వాతంత్యప్రియులై ఆత్మగౌరవమువముగలవారైయుండిరి. స్త్రీల, అనాధల, శరణాగతుల సంరక్షణ తమ ప్రధాన ధర్మమని తలచిరి. వీరు కవిత్వమును చిత్ర లేఖనమును కొంతవ రకు పోత్సహించిరి.

రెండవజాతి
మతగురువులు.

రెండవ జాతి మతగురుపులలో రెండు రకముల వారుగలరు. బిషపులు మొదలగు పెద్దగురువులు, చిన్న గురువులు. వీరు వివాహ మాడుటకు వీలు లేదు. ప్రభువుల ఆ స్తి జ్యేష్ఠపుత్రుల కుమాత్రమే సంక్రమించు చుండినందున తక్కిన పుత్రులలో కొందరు సన్యాసాశ్రమమును స్వీకరించి బిషపులు 'మొదలగు పెద్దగురువులగు చుండెడివారు. పెద్దగురువులలో చాల వరకు ప్రభువంశీకులుగ నుండి.. చిన్న గురువులు సాధారణముగ సామాన్య ప్రజలలోనుండి యాశ్రమమును స్వీకరించినవారు.

మతగురువు లందరును రోములోని క్రైస్తవ ప్రధానాచార్యుడగు
30

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పోపుకులో బడియుండిరి. స్త్రీ లుగూడ సన్యాసిను లగుచుండిరి... ఈ గురువులజూతి వారు దేవుని కెక్కువసాన్నిధ్య మందున్నారని భావింపబడుచు సామాన్య ప్రజలకంటే వధికులుగ భావింపబడు చుండిరి. వీరికి గూడ చాల ఆస్తులుండెను. భక్తులు విశేషముగ ఆస్తుల నిచ్చుచుండిరి. క్రీస్తుశకము 1000 వ సంవత్సరాంతము నకు ప్రళయము కలిగి ప్రపంచమంతయు తప్పక నాశనమగునను దృఢనమ్మకము కైస్తవ ప్రపంచము నందలి యందరిజనులకును గలిగెను. యూరపుఖండమంతయు నాప్రళయమున కై మిగుల నాతురతతో సిద్ధపడెను. ఆ సంవత్సము యూరపులోని ప్రతి వారును మతగురువులకు గొప్ప, గొప్ప ఆస్తి దానములను చేసి. ప్రతి వారును పాసములకొరకు పశ్చాత్తాపపడి ముందులోక ఘు న కై సిద్ధపడియుండిరి. కాని నూతన సంవత్సర ప్రారంభ పురోజున సూర్యుడు చక్కగా ప్రకాశించెను. ప్రళయమురాక నీ ప్రపం చము యధాప్రకారముగ నే నడుచుచుండెను. ప్రజలభయము భ్రమ తొలగిపోయెను. దేశములోని అయిదవవంతు భూమి మతగురువుల కిందికి వచ్చెను. మతగురువుల ఆస్తికి సంబంధించి నమట్టుకు వారును ప్రభువులై తముభూములను రాజులనుండి గాని ప్రభువుల నుండి గాని సామంతులుగ మొఖానా షరతులకు లోబడి గ్రహించుటయు తమకు సామంతులుగా ప్రభువులకు గాని ఇతర మతగురువులకు గాని అదే ప్రకార మిచ్చుటయు జరుగుచుండెసు. వీరు స్వయముగా యుద్ధమునకు పోగూడదు కావున ప్రతినిధు లను బంఫుచుండిరి. వీరికి భూఖామందులుగ ప్రభువులతో బాటు

న్యాయవిచారణాధికారము మొదలగు సమస్త హక్కులుండెను.

మూడవ అధ్యాయము

31

కాని మతగురువులు తమ మఠములలోను దేవాలయములలో ను పాఠశాలలను బెట్టి గొంతవఱకు సామాన్య జనులలో విద్యా వ్యాపకము చేయుచుండిరి. అనేకమంది మగురువులు గొప్ప పండితులై కవిత్వము తత్వశాస్త్రము మొదలగునవి వ్రాసి ప్రసిద్ధి కెక్కిరి. క్రమముగా వ్యవసాయక బానిసలను దేవుని పేర బానిసత్వమునుండి విము క్తి గావించిరి.


మూడవజాతి
సామాన్య ప్రజలు


సామాన్య ప్రజలు మతగురువులచే హీనముగ చూడబడి, ప్రభువుల నిరంకుశత్వమునకును వత్తిడికిని లోబడి, వారుకోరిన నౌకరిని చేసి తీరవలసి, చెమట కార్చి కష్టించు వ్యవసాయకులు వ్యవసాయ బానిసలు ఇతర చేతిపనులు చేయు ప్రజలు ఈ మూడవజాతిలో చేరియుండిరి.'

న్యాయవిచారణ.

ఒక రాజు కిందనున్న సామంత రాజు లందరును సమా నులు. అటులనే ఒక దర్భాగల సామంత రాజు కిందగాని ప్రభువు కిందగాని యుండిన ప్రభువులందరును సమాసులు. సమానులగు ప్రభువులలో తగువులుకలిగిన చో తమ యొక్క పై ప్రభువువద్ద చెప్పుకొనెదరు. ఆయన ఉభయులను పిలిపించి రాజీగా పరిష్కరించుటకు యత్నిం చును. అటుల కుదరనిచో ఇద్దరు కక్షి దార్లను ఒక నియమిత ప్రదేశ మున స్వయముగా నొకరితో నొకరు పోరాడవలెను. పోరా ములో జయమొందినవారిపక్షమున న్యాయమున్న టుల ఆయన తీర్మానించును. ఒక కక్షిదారు స్త్రీగాని వృద్ధుగాని శిశువుగాని మతగురువుగాని అయినచో నీపోరాటమునకు ప్రతి

నిధిని బంపవచ్చును. ఆప్రతినిధి పోరులో గెల్చిన యజమాని
32

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

పక్షమున న్యాయముగలదనియు నోడినచో .యజమాని షక్ష. మున న్యాయము లేవనియు తీర్పు చెప్పబడును. కాని పై ప్రభు పుతో చెప్పుకొని అక్కడ పోరుసలుపుటకు బదులుగా ప్రభు వులు తమ కెవరయిన అపకారము గావించినచో ప్రతిక క్షి కి ముందుగా తెలిపి స్థలనిర్ణయము చేసికొని వారిమీదికి తామే పోరాటమునకు బయలు దేర సాగిరి. ఇట్లు ప్రభువులు తమలో తాము తరుచుగా పోరాడుచుండిరి. ఈ పోరాటపు పద్ధతి ప్రభు పులు కాని సామాన్య ప్రజలకుగూడ వ్యాపింప జేయబడెను. ఒకరి మీద నేరారోపణ జరిగినపుడు నేరమారోపింపబడిన ముద్దాయి తాను నిర్దోషినని ఋజువు చేసికొనుటకు మండుచున్న విప్పులలో నుండి నడుచుటగాని మసలుచున్న నీటిలో చేతినుంచుటగాని. ఎఱ్ఱగా కాలిన ఇనుపకడ్డీని చేతితో పట్టుకొనుటగాని చేయు వలెను. నిర్ణీతమైన దినములలో కాలిన దేహము స్వస్థత చెందినచో నాతడు నిర్దాషియనియు బాగు కానిచో దోషి యనియు తీర్పు చెప్పబడును. ఈ విధమయిన విచారణ పద్ధతి యూరఫుఖండములోని యన్ని దేశములలోను కొన్ని . వందల సంవత్సరము లమలులో నుండెను.