ప్రసన్నరాఘవనాట్యప్రబంధము/ప్రరోచన
ప్రరోచన
మూడున్నర శతాబ్దములు మూసినముత్తెమై పడియుండి ఒక్కసారి తెలుగువారి కనులు మిరుమిట్లుగొన జిగేలుమని వెలసినదీ ప్రసన్నరాఘవనాట్య ప్రబంధము. ఇది వెలుగు చూచుటతో తెలుగు సాహిత్యచరిత్రమునకును రాజకీయచరిత్రమునకును క్రొత్త వెలుగువెల్లువల యుల్లడము అల్లుకొన్నవి. ఈ మేలుకట్టు తెలుగు చదువుల తల్లికి ఆంధ్రరచయితల సంఘమువారు నోముపీటపై గట్టిన 'పాలవెల్లి'.
'ప్రసన్నరాఘవనాట్యప్రబంధమునకు గల వైశిష్ట్యము రెండు విధములు (1) నంద్యాలరాజుల వృత్తాంతమును దెలుపు గ్రంధములం దిది రెండవది ఇప్పటికి లభించినవానిలో కళాపూర్ణోదయము మొదటి గ్రంథము ఈ నాట్యప్రబంధమున మూలాతీశాయి భాగములందు సమకాలీన సాంఘికచరిత్రము గూడ కొంతకొంత ప్రతిబింబించినది. (2) క్రీడాభిరామము తరువాత ఆపద్ధతిలో ఆంధ్రీకృత మైనదీ నాట్యప్రబంధము, కనుక తెలుగు నాటక పరిణామ చరిత్రలో క్రీడాభిరామమువంటి నాటకపరిణామచరిత్రలో రచనములు పదునారవశతాబ్దాంతము వరకును సాగుచుండిన ట్లిది ధ్రువవరచుచున్నది. ఈ గ్రంథప్రాశస్త్యమును క్రమముగా ప్రపంచింతును.
తాళపత్రప్రతి. ఆంధ్రదేశపు ఇతరప్రాంతములందువలె తెలంగాణమున చారిత్రక సామగ్రియు సాహిత్యసామగ్రియు సేకరించుట మిక్కిలి జరుగలేదు. వందలకొలది శాసనములును, తాళపత్ర గ్రంథములును, అనాదరణమున, ఆసక్తి లేమి దినదినము శిథిలములై చివికిపోవుచున్నవి శ్రద్ధాసక్తులు గలవారు నడుముకట్టినచో ఇప్పటికిని అమూల్య గ్రంధము లనేకము లభించును. నాకీ గ్రంధము పాలమూరు (మహబూబునగరం) మండలమున లభించినది దీనిలో రెండు గ్రంథములున్నవి
1 సభాపతి లక్షణము ౧-౧౫ కమ్మలు
2 ప్రసన్నరాఘవనాట్యప్రబంధము. ౧-౧౨కా కమ్మలు
ఈరెండు గ్రంధములలో మొదటిది యసమగ్రము కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారు ప్రచురించిన (1983) రాయవాచకము పుట 18 లో "శ్రీకృష్ణదేవరాయలకు మంత్రులు రాజనీతి యుపదేశించుట” యను శీర్షిక క్రింద నున్న "శ్రీరమ్యు" డాదిగాగల పద్యములతో నారంభమైనది. సభాపతి లక్షణము లిందు రాయవాచకములో నున్నవానికన్న అధికముగా గలవు. రాజకీయ చారిత్రక
1 ఆంధ్రప్రభ దినపత్రిక - ప్రత్యేక సంచిక 15-8-1962. వృత్తాంతము లేమియు లేవు. బహుశః ఇది "నాట్యలక్షణము” గ్రంథాంతర్భాగమై యుండును.
రెండవదైన ప్రసన్న రాఘవనాట్య ప్రబంధము సమగ్రముగా నున్నది తాటాకులు రెండు జేనల పొడవును, అంగుళము వెడల్పును గలవు ప్రతి కమ్మకు ఇరువైపుల ఐదేసి బంతులును బంతికి దాదాపు ఎనుబది యక్షరములును గలవు. ప్రతి ప్రాచీనమని తోచును. దీని వయసు కనీస మిన్నూరేం డ్లుండును కమ్మలు క్రిమిదష్టములై అచ్చటచ్చట శిథిలము లైనవి వ్రాత గూడ ప్రాత పద్ధతులకు సంబంధించినది. ప్రాచీన తాళపత్రగ్రంధపరిచయ మున్న వారికే గాని తదితరులకు సులభముగా "కొరుకుడు బడదు" అరసున్న లుండవలసిన చోటులం దెల్లెడలను పూర్ణబిందువు లున్నవి. శకటరేఫము లేదు పద్యాంతములనుండు పొల్లక్షరములును హ్రస్వాక్షరములును దీర్ఘములుగా నున్నవి ఉట, సన, సవ, రద, ఖళ, డద, ధధ మున్నగు నక్షరముల భేదమును పోల్చుకొనుట కష్టము 'చేత' అనుటకు 'చాత' అనియు. "సేయు' అనుటకు 'జేయు' అనియు నుండును రేఫతోడి సంయుక్తాక్షరము వచ్చినపుడెల్ల వలసలగిలక యుండును గుడులేకాని గుడిదీర్ఘములు లేవు. 'మర్యాద' యని వ్రాసినప్పుడు 'రా' దీర్ఘ ముండక ఒత్తక్షరమగు క్యావడి (కియ్యవడి)కే దీర్ఘ ముండును బిందుపూర్వకాక్షరమునకు ద్విత్వము సహజము. కొన్ని యంకములు ఆద్యంతములందును కన్నాకుల మీదను దేవనాగరిలిపిలో కొన్ని యక్షరము లున్నవి ఈనాటి దేవనాగరిలిపికిని ఆ యక్షరములకును పోలికే లేదు. అవి 'శ్రీరామ' 'సీతారామ' యను మాటలై యుండు ననుకొంటిని.
కృతిభర్త. ప్రసన్న రాఘవనాట్య ప్రబంధమునకు కృతిభర్త నంద్యాల తిమ్మరాజు. ఈతడు లక్ష్మీ దేవీనరసింగరాజుల తనయుడు, తిరుమలదేవీ కుమారౌ బళరాజుల మనుమడు, మాడల(మాదల) దేవీనరసింగరాజుల మునిమనుమడు కళాపూర్ణోదయ కృతిభర్తయగు నంద్యాలకృష్ణరాజును, ప్రసన్న రాఘవనాట్యప్రబంధకృతిపతియగు నంద్యాల తిమ్మరాజును అన్నదమ్ముల మనుమలు. నంద్యాల రాజులను సమగ్రముగా వర్ణించువానిలో నిప్పటికి కళాపూర్ణోదయము మొదటి సాహిత్యచారిత్రకాధారము. ఈ ప్రసన్న రాఘవము రెండవది. రెండును సమకాలీన రచనము లగుట రెండు గ్రంథములందున్న వంశవృక్ష మొకేతీరుగా నున్నది. ఎవరి కోవవారినిగూర్చి వారధికముగా చెప్పుకొన్న పద్యములే భేదము గాని వంశక్రమమున నేమియు భేదము లేదు ప్రథమాశ్వాసమున కానుండి ౭౯ వరకు గల గద్యపద్యములీ నంద్యాల రాజుల
A descriptive catalogue of the Telugu Mss Tanjore Saraswati Mahal Library Vol II Pages 310, 314 వంశావతారమును వర్తించును. వీనిలో 28 నుండి 8x వరకు గల పద్యములు కృతిపతియగు నంద్యాలతిమ్మరాజు గుణగణములు వర్ణించునవి. ఈ వంశావతార పద్యములన్నియు గుణగణములు పొగడుట కంకిత మైనవేకాని యొక్క దానిలో కూడ ఆనాటి చారిత్రక సంఘటనము లేమియు లేవు. రెండు పద్యములు మాత్రము నంద్యాల తిమ్మరాజు బిరుదప్రశస్తు లుగ్గడించునవి గలవు.
సీ ఆటడిగ్గియలు కర్ణాటతాటంకినీ కాంతశ్రవఃపుటాభ్యంతరములు కేళి సద్మములు బంగాళభృంగాటకా సరసమానససరస్సంభవములు కమ్మ సెజలు సింధుగం ధేభగామినీ 83 స్వప్నచంద్రాతపాంచ తలములు కొలువుకూటములు కోసల పేళలాధరా కమనీయతరనేత్రకే రవములు గీ గాయిగోవాళ చెలువరగండ చండ మండలీకరమారాండ భండనో బిరుదభూషితనందేలతిరుమలేంద్ర మహితసౌందర్యలక్ష్మీకి నహరహంబు సీ యవనసైన్యవిధాళ భువనైకమల్ల క ల్యాణపురాధ్యక్షరి క్షితుండు బిరుదుమన్నె విభాళ ధరణీవరాహ సౌ రాసిదుర్గ విభాళ భాసితుండు ఘనత రాత్యంబరగండనానావర్ణ మండలీకరగండమండితుండు సంగీత సాహిత్యసం గరాంగణ సార్వ భౌమ నిశ్శంకాంకబంధురుండు గీ. భండనార్జున చెలువరిగండ మన్నె బెబ్బులి ఖ్యాత సంజాతపృథులజయుఁడు రాజమాత్రుండె నరసింగరాజసుతుఁడు దీ ప్తిదినరాజు నందేలతిమ్మరాజు (I - 58) (1 - x)
పైవానిలో రెండవపద్యమునగల బిరుదములవలన సమకాలీన చారిత్రక సంఘటనము లేవేని చారిత్రకులు కనుగొనగలిగినచో నీ గ్రంథము ప్రశస్తి యినుమడించును. నంద్యాలరాజులవంశ క్రమము గ్రంథమున వర్ణితమైనది యిట్లుండును. (ప్రక్కపుట) నంద్యాలరాజుల వంశవృక్షము
1 (I - e) కృతిక ర్తకాలము : ప్రసన్న రాఘవనాట్యప్రబంధకృతికర్త బొడ్డుచెర్ల చిన తిమ్మయమంత్రి ఈతడు తన్ను గూర్చి ఒకే పద్య మీవిధముగా చెప్పుకొన్నాడు ఉ ధీరుఁడు బొడ్డుచెర్ల చినతిమ్మయ మంత్రికుమారుఁ డంచితా కారుఁడు సత్కళావిదుఁడు కౌశిక గోత్రుఁడు పద్మనేత్రసే వారతబుద్ధి నందవరవంశ్యుఁడు ప్రాకవిలోకనాధుఁ డా చారసమగ్రవర్తనుఁడు సారవచోనిధి యున్నవాఁ డొగిన్ ఇంతకు మిక్కిలి తన యూరిపేరులు గూర్చికాని తండ్రితాతల గూర్చికాని గురువుల గూర్చికాని ఏమియు చెప్పుకొన లేదు ఈ పద్యమునకు ముందున్న దీర్ఘ వచనమున చిట్టచివరన మాత్రము తాను తిమ్మరాజు నాస్థానమున నర్ధాసన మలంకరించినట్లును కృతిపతి వంశావతారము ముగిసిన తరువాత వచనమున (1 - 8౯) తన కారాజు "ప్రవిమలముక్తాఫలాతపత్రాందోళికాంగద పదక పదకటక హారాగ్రహార కర్పూర గంధసారాదికంబులు తోరహత్తుగా మెచ్చి యిచ్చి” నట్లును చెప్పుకొన్నాడు 1 కీశే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంకలనముచేసిన చాటుపద్య మణిమంజరి: ప్రథమభాగమున "శ్రీకృష్ణదేవరాయ"లను శీర్షిక క్రింద నిట్లు గలదు "రాయలకుఁ జదరంగపు డెత్తులు వేయుటయం దత్యంతాసక్తి యుండెడిదట. బొడ్డుచర్ల చినతిమ్మనయను కొప్పోలు కరణము కవీశ్వరదిగ్ధంతీయను ప్రతిష్ఠగల వాఁడై శ్రీకృష్ణదేవరాయలతోఁ జదరంగ మాడుచుండెడువాడు శ్రీకృష్ణరాయల పక్షమున నెంద తాలోచించి యెత్తు వేయుచున్నను నీతఁ డొక్కఁడే యెదురెత్తు వేసి యాట గెల్చుచు వేయార్లు పందెము గొనుచుండెడివాఁడట : ఆతని శక్తికి సంతోషించి కొప్పోలు గ్రామమునకుఁ గృష్ణరాయపురమను నామ మేర్పఱచి రాయలు సర్వాగ్రహారముగా నాతనికి ధారవో సెను క శతసంఖ్యు లొక్కటైనను సతతము శ్రీకృష్ణరాయజగతీపతితోఁ జతురంగ మాడి గెల్చును ధృతిమంతుఁడు బొడ్డుచర్ల తిమ్మన బళిరే: ఉ ధీరుఁడు బొడ్డుచెర్ల చినతిమ్మన మంత్రికుమారుఁ డంచితా కారుఁడు సత్కళావిద్యుడు కౌశిక గోత్రుఁడు పద్మనేత్ర సే వారతబుద్ధి నందవరవంశ్యుఁడు సత్కవిలోకనాథుఁ డా చారసమగ్రవర్తనుఁడు చారువచస్థితి నొప్పువాఁ డొగిన్." 1 వావిళ్ళ - మద్రాసు. 1924 పుటలు 155, 158 6 అధోరేఖాంకితములైన కొలదిమార్పులతోనున్న ఈ పద్యము ప్రసన్న రాఘవ నాట్యప్రబంధమున కృతికర్త తన్ను గూర్చి చెప్పుకొన్నదే కాని వేరు కాదు ఇది కీ శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి కెట్లు లభించినదో చిత్రముగానే యున్నది పై వృత్తాంత మంతయు మెకంజీ రికార్డులం దున్నట్లు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు డాక్టరు నేలటూరు వెంకటరమణయ్యగా రనుచున్నారు పై రెండుపద్యములందు మొదటి కందపద్యమే చాటువు గాని రెండవది కాదు కృష్ణదేవరాయలతో చదరంగమాడిన వాడు బోడ్డుచెర్ల తిమ్మయ గాని చినతిమ్మయ కారు మొదటి కందపద్యము తిమ్మ యకు సంబంధించిన చాటువు రెండవ పద్యము ప్రసన్నరాఘవనాట్య ప్రబంధరచయిత చినతిమ్మయకు సంబంధించినది ఈ పద్యమునకును నాట్యప్రబంధమునకును గల సంబంధము చదరంగముతోడి సంబంధమునకంటే ప్రకృష్టము మరియు నుచితము. B ఈ యిరువురు వ్యక్తు లభిన్నులని తలచి కాబోలు నీ రెండుపద్యముల నొకచో చేర్చినారు మీదుమిక్కిలి యీ చాటువులకు వ్రాసిన ప్రారంభవాక్యములందు "బొడ్డుచర్ల చినతిమ్మయయను కొప్పోలు కరణము కవీశ్వరదిగ్దంతీయను ప్రతిష్ఠ గలవాఁడై శ్రీకృష్ణదేవరాయలతో ఁజదరంగ మాడుచుండెడివాఁ" డన్నారు రాయలతో చదరంగమాడిన బొడ్డుచెర్ల తిమ్మయ కవీశ్వరదిగ్ధంతి యగునో కాదో తెలియదుగాని చినతిమ్మయమంత్రి ప్రసన్న రాఘవనాట్య ప్రబంధకర్త) మాత్ర మీ బిరుదమున కర్ణుడు చదరంగపు డెత్తుల తిమ్మయ నిజముగా కవీశ్వరదిగ్ధంతి యైనచో అను స్యూతముగా మన మనుకొనుచున్న అష్టదిగ్గజములం దోకని పదవి యూడిపోవును తిమ్మయ చినతిమ్మయలకు గల కొలది భేదమువలన కీ శే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పొరపడియుందురు లేదా వారి సామగ్రి సేకరించిన రికార్డులందే యీ పొరపాటు దొరలియుండును ఇంటిపేరు, పేరు. ఒకటిగా నుండు టేకాక వీరిరువురు తాత మనుమలై యొక గ్రామమున నధికారము నెరపియుండిన కారణమున కాబోలు కాలక్రమమున నీ యిరువురు వ్యక్తు లోకవ్యక్తిగా మారియుందురు మన చరిత్రయం దిట్టి సంఘటనలు పెక్కు లున్నవి కొప్పోలు గ్రామము కడప తాలూకాలో నున్నట్లు మద్రాసు ప్రభుత్వము వారి రికార్డులం దున్నది కాని ప్రస్తుత మిది కమలా పురము తాలూకాలో నున్నదట. రాయలతో చదరంగ కూడిన బొడ్డుచెర్ల తిమ్మయ మనుమడు చినతిమ్మయ మన గ్రంథకర్తయని నాయూహ తరమున కిరువదియైదేండ్ల ఆయుర్దాయ మనుగ్రహించినను మన చినతిమ్మయ పదునారవ శతాబ్దము చరమ పాదమున నున్నవా డగును 1 Alphabetical list of villages in the Madras Presidency Page 158 7 V కృతిభర్త కాలము ననుసరించి కూడ చినతిమ్మయమంత్రి పదునారవ శతా బ్దము చివరివాడే యగును ప్రసన్న రాఘవనాట్యప్రబంధము కృతి నందుకొన్న నందేల తిమ్మరాజు ఆరవీటి బుక్కరాజున కబ్బలదేవివలన గలిగిన వారిలో నారవ తరమువాడు. కళాపూర్ణోదయకృతిపతియగు సందేలకృష్ణరాజును ఈ తిమ్మరాజును అన్నదమ్ముల మనుమలు, మరియు వరుస కన్నదమ్ములు, కనుక సమకాలీను లగుదురు నంద్యాల కృష్ణరాజు తండ్రి నరసింగరాజు, ఆతని తండ్రి నారపరాజు నంద్యాల తిమ్మరాజు తండ్రి నరసింగరాజు, ఆతని తండ్రి కుమారౌబళరాజు నారపరాజు కుమారోబళరాజు అన్నదమ్ములు ఈ నారపరాజు శకవర్షములు ౧౬కా కీలకసంవత్సరమున (క్రీ. శ 1548) తిరుపతిలో గోవిందరాజస్వామి యాలయము ముం దిరువురు ద్వారపాలకులు నెలకొల్పి, పల్లిపట్టు, గుండిప్పూండి గ్రామములు దాన మిచ్చి శాసనములు వేయించినట్లు శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వ్రాసి యున్నారు' నారపరాజకుమారౌబళరాజుల ప్రసక్తి ఈ గ్రంధమందే మరియొకచో (పుట 253) గలదు 1548లో దానశాసనము వేయించిన నారపరాజు మనుమడుగు నంద్యాల కృష్ణరాజును నారపరాజు తమ్ముడు కుమారౌబళరాజు మనుమడుగు నంద్యాల తిమ్మరాజును పదునారవ శతాబ్దము చివర నుండినవారే యగుదురు కనుక బొడ్డుచెర్ల తిమ్మయ కూడ పదునారవ శతాబ్దము చివరవా డగును నంద్యాలకృష్ణరాజు చంద్రగిరి రాజధానిగా విజయనగరసామ్రాజ్య మేలిన ఇమ్మడి వెంకటపతిరాయలకు (1585_1614) ఎదురు తిరిగినట్లును యుద్ధము చేసి యోడినట్లును అనేకాధారములు కలవు వానిలో నొక్కదాని నుదాహరింతును "తరువాత శ్రీమద్రాజాధిరాజపరమేశ్వర వీర ప్రతాప శ్రీ వీర వేంకటపతిదేవ మహారాయలు పెనుగొండ దుర్గమందు రత్నసింహాసనాధీశ్వరుండై పృథ్వీ సామ్రాజ్యం సేయుచుండగాను నంద్యాలవారి వంశీకుడు కృష్ణమరాజు ఘండి కోట దుర్గం యేలుతూ వుండినంతట, చిటివేలి సంస్థానీకుడైన మట్లవారి వంశీకు డైన యల్లమరాజు అనేఆయ్న సూర్యవంశపురాజు చోడమహారాయలు వంశీకులు యీ వెంకటపతిరాయల పక్షం కలిగి సందేలకృష్ణమరాజుతో జంబులమడకవద్ద యుద్ధముచేసి జయించి నందేలకృష్ణమరాజును పట్టుకొని అభయం యిచ్చెను"2 Kaifiyat of Cuddapah L R. 8, PP 133-37 ఈ యుద్ధ ప్రసక్తి 206(b), 211, 212, 213(a), 213(b), 214 పరాలలో యుద్ధప్రస కూడ కలదు. ఈ నంద్యాల కృష్ణరాజు క్రీ.శ. 1580 నుండి 1599 వరకు గండికోట 1. Trupati Devasthanam Epigraphical report, Page 265. (Madras - 1930) 2 Further Sources of Vijayanagara History Vol. II. Para 206(a) Page, 321. 8 నేలినట్లును 1599_1800 లో జరిగిన జంబులమడక యుద్ధమున వీరవెంకటపతి రాయలచే నోడి జీవగ్రాహముగ పట్టుబడి చంద్రగిరి కారాగారమందే కొన్నాళ్ళకు మరణించినట్లును డాక్టరు నేలటూరు వెంకటరమణయ్యగారు నిర్ణయించినారు' కనుక నంద్యాలకృష్ణరాజు చినతాతగారి మనుమడును, వరుసకు తమ్ముడునగు నంద్యాల తిమ్మరాజుకు ప్రసన్నరాఘవనాట్య ప్రబంధమును అంకితమిచ్చిన బొడ్డుచెర్ల చిన తిమ్మయగూడ క్రీ శ 1600 ప్రాంతమున నుండియుండును ఈవిధముగా మన చినతిమ్మయమంత్రి పింగళిసూరనకు సమకాలీను డగు చున్నాడు పింగళిసూరన కాలమును గూర్చి వివాద మున్నది ఈవిషయమై చారిత్ర కుల దొక నిర్ణయము మరియు కవిచరిత్రకారుల సంకొక నిర్ణయము కలదు చరిత్రకారుల మతమున సూరన వదునారవ శతాబ్దము చివరన నున్నవాడు, కవి చరిత్రకారుల మతమున సూరన తుళువకృష్ణరాయల (శ్రీకృష్ణదేవరాయల)మరియు నంద్యాల కృష్ణరాజుల యంతము గన్నవాడు. శ్రీకృష్ణదేవరాయలతో 'దిఎకేగలేక ' నంద్యాల కృష్ణరాజు దివికేగగా చూచినవాడు. కీ. శే కందుకూరి వీరేశలింగం పంతులుగారు మొదలుకొని ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారి వరకున్న శ్రీ కవిచరిత్రకారులు పింగళిసూరనార్యుడు శ్రీకృష్ణదేవరాయల సమకాలీను డను చున్నారు కాని కీ. శే కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు పింగళి సూరన రామరాజ భూషణునికి చాల తరువాతవాడని విశ్చయించిరి : ప్రస్తుతము మనకీ వివాదము లతో పనిలేదు బొడ్డుచెర్ల చినతిమ్మయ సూరనవలె శ్రీకృష్ణదేవరాయల కాలము నుండి నంద్యాలకృష్ణరాజు కాలమువరకు దీర్ఘమైన బ్రదుకు బ్రతికెనో లేదో తెలియదు కాని సూరనార్యుని మాత్రము చూచినవాడే యగును. P తెలుగునాటి నాటకములు. తెలుగుదేశమున మార్గ- దేశీ ఈ రెండు సంప్రదాయములకు చెందిన రూపకములు ప్రయోగమం దుండినట్లు మన ప్రాచీన సారస్వతమున సాక్ష్యము లున్నవి. నన్నిచోడుని కుమారసంభవమునను (X11_148) నన్నయభారతమందును (ఆదిపర్వము - ప్రథమాశ్వాసము-10, ద్వితీయాశ్వాసము... 27) పాల్కురికి సోమనాధుని పడితారాధ్యచరిత్రమందును (పర్వత ప్రకరణము) మార్గ - దేశ సంప్రదాయముల రూపకము లానాటి ప్రభువులును, ప్రజలును చూచిన ట్లున్నది దేశిసంప్రదాయమునకు చెందిన యక్షగానములు, బహురూపములు, తోలు బొమ్మలాటలు మున్నగునవి ప్రాచీనకాలమునుండియు తెలుగుభాషలో నున్నవి. 1 అష్టదిగ్గజములు పిరిక - పుట 18 హైద్రాబాదు - 1960 2. కళాపూర్ణోదయము వీరిక రాజమండ్రి 1988 8 9 కాని మార్గసంప్రదాయమునకు చెందిన రూపకములు తెలుగులో ప్రాచీనకాలమందు లేకుండెనని తోచును ఇక తెలుగువారు చూచిన మార్గసంప్రదాయపు నాటకములు సంస్కృతరూపకములే కావలెను. సంస్కృతరూపకములు తొలుదొల్త తెలుగులో ప్రబంధరూపమున నవతరించుట విజు లెరుగుదురు సంస్కృతరూపకములు తెలుగులోకూడ రూపకములుగా నేల యనూదితములు కాలేదో పలువురు విమర్శ కులు పలు విధముల నూహించినారు ఇదమిత్థమని తేల్చి చెప్పుటకు గల కారణ మింతవరకును తెలియలేదనియే నా నమ్మకము మొదటిది ఇప్పటికి లభించినంతవరకు సంస్కృతమున రూపకముగానుండి తెలుగులో కూడ రూపకముగా నవతరించినవానిలో, వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామము సంపూర్ణ రూపకలక్షణము లందు గలవా లేవా యనునది వివాదాస్పద విషయమైనను ఆ కోవలో నది ప్రధమగణ్య మనుట నిర్వివాదాంశము డాక్టరు పోణంగి శ్రీరామ అప్పారావుగారిసూచనల ప్రకారము' దానిని ముద్రించినచో నది వీధీస్వరూపము కొంతకుకొంత ధరించును క్రీడాభిరామము తరువాత అదే పద్ధతిలో అనూదితమైనదీ ప్రసన్న రాఘవనాట్య ప్రబంధము సంస్కృతమున ప్రసన్న రాఘవ నాటకమును రచించినవాడు పీయూషవర్షబిరుదాంచితుడైన జయదేవుడు ప్రసన్న రాఘవనాటకమును కొంద రాధునికులు నాటకముగా ననువదించిరి కీ. శే కొక్కొండ వెంకటరత్నంగారు 1887 సంవత్సరమునను, మంత్రిప్రగడ భుజంగ రావుగారు 1928 సంవత్సరమునను, బి సుబ్రహ్మణ్యశర్మగారు 1933 సంవత్సరము నను ఆంధ్రీకృత ప్రసన్నరాఘవములను ప్రకటించిరి సి రామానుజదాసు రచించిన ప్రసన్న రాఘవవిలాసము (1881) బహుళః యక్షగానము కావచ్చును బొడ్డుచెర్ల చినతిమ్మయకృతానువాదము అటు పిల్లలమఱి పినవీరభద్రుని యనువాదము (శృంగారశాకుంతలము) ప్రబంధమువలె గాని ఇటు కొక్కొండవారి యనువాదము నాటకమువలె గాని లేదు. ఇది మధ్యేమార్గముగానున్న ప్రక్రియ మీదుమిక్కిలి కవి దీనిని నాట్యప్రబంధ మనినాడు. అనగా దీనిలో ఆటు నాటక లక్షణములును, ఇటు ప్రబంధలక్షణములును కలియగలుపుగా నున్నవి. మన నాటకసరిణామమున నిది యొక వినూత్న ఘట్టమని భావించుచున్నాను. సంస్కృతమున ప్రసన్నరాఘవము ఏడంకముల నాటకము. తెలుగులో కూడ నిది ఏడంకముల నాట్యప్రబంధము, తెలుగులో తక్కిన ప్రబంధములందువలె ఆశ్వాసవిభజనము గాక ఈ నాట్యప్రబంధమున అంక విభజనము గలదు. మూలమున 1 స్రవంతి - మార్చి, 1959 10 గల అర్థోపక్షేపకాదులు నాట్యప్రబంధమున గూడ కలవు. నాందీ ప్రస్తావనలు, విష్కంభములు, పాత్ర ప్రవేశ నిష్క్రమణములు, స్వగతములు, ఆకాశభాషితములు, ప్రకాశములు, నేపథ్యములు, ఆయాపాత్రల సాత్త్వికభావసూచనములును ఉన్నవి యున్నట్లుగా నాట్యప్రబంధమున నిరూపితములై నవి కాని మూలమున గల వచన సంభాషణములు గూడ అధికముగా పద్యబద్ధము లై పోయినవి దీనిలో వచనభాగ ములు లేకపోలేదు వాని సంఖ్య చాల తక్కువ అనిన నావుడు, అనవుడు ఇట్లనియె - వంటి కవివచనములు లేకున్నచో నిది యచ్చపు నాటకానువాదమై యుండును ఈ కవివచనములతో నిది నాట్యప్రబంధ మైపోయినది అనువాద విధానముగూడ కొంత స్వతంత్రముగా నున్నది దానిగూర్చి ప్రత్యేకముగా మనవి చేయుదును కవి సూచనములను, సంధివాక్యములను కుండలీకరణములం దుంచి పాత్రల పేరులు, వాని కెదురుగా వారి సంభాషణము లుంచి ముద్రించినచో నిది యొక పద్యనాటక మగును జయదేవుడు . సంస్కృతమున ప్రసన్నరాఘవనాటకమును రచించిన కవి జయదేవుడు సంస్కృత వాఙ్మయచరిత్రమున జయదేవు అనేకు లున్నారు. గీతగోవిందకర్తయగు జయదేవునకంటె నీతడు భిన్నుడు ఈ జయదేవుడు సుమిత్రా మహాదేవుల తనయుడు మరియు కౌండిన్యగోత్రుడు (౧౨౨౧.౨౩) ఈతని యితరకృతులు సీతావిహార, చంద్రాలోకములు రతిమంజరియను మరియొక కృతి యున్నట్లు కీశే మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు తెలిపియున్నారు' ప్రసన్న రాఘవమున కై దు వ్యాఖ్యానములు గలవు ఈ జయదేవుని కాలమునుగూర్చి పెక్కు వివాదములు గలవు సదుమూడవ శతాబ్దమునుండి పదునారవ శతాబ్దము మధ్యభాగము వరకు ఈతని కాల మూగులాడుచున్నది ప్రసన్నరాఘవనాట్యప్రబంధమును పరిష్కరించునప్పుడు నే నుపయోగించు కొన్న సంస్కృతప్రసన్న రాఘవము కీ. శే శివరామమహాదేవ పరాంజపే, మరియు నారాయణసఖారాం పాన్సేయను మహారాష్ట్ర పండితులచే సుపరిష్కృతమై షిరా ల్కర్ & Co, పూనావారిచే (1894) ప్రకటితమైనది ఆ పండితు లీగ్రంథమునకు చక్కని పీరికను వెలయించినారు. వారు జయదేవుడు క్రీశ 1500_1677 నడుమ 1981. 1 సంస్కృత వాఙ్మయచరిత్ర పుట 418, అంధ్రసారస్వత పరిషత్తు, హైద్రాబాదు 2. History of Classical Sanskrit Literature M Krishnamacharar Pages 645,646,776 (Madras 1937) 11 నుండినట్లు సిద్ధాంతము చేసినారు వారి సిద్ధాంతము మన ప్రసన్నరాఘవనాట్యప్రబం ధము వెలువడుటతో పరాస్త మగుచున్నది. ఉత్తరదేశపు సంస్కృతనాటకము దక్షిణదేశమున ప్రచారమంది అనూదిత మగుట కెంత కాలము పట్టునో విజ్ఞుల యూహకు విడిచి ఈ విషయ మింతటితో విరమింతును అనువాదపద్ధతి బొడ్డుచెర్ల చినతిమ్మయమంత్రి ప్రసన్న రాఘవమును నాట్యప్రబంధముగా ననువదించునప్పుడు శ్రీనాధుని యనువాద పద్ధతిని ఆదర్శముగా నిడుకొన్న ట్లున్నాడు నాటకములోని భావములు, అర్ధము లన్నియు 'తు, చ' తప్పకుండ చేసిన యనువాదము కాదిది శ్రీనాధుడు హర్షనైషధాంధ్రీకరణము చేసినట్లే చినతిమ్మయమంత్రి జయదేవుని ప్రసన్న రాఘవము ననుసరించుచు స్వతం త్రానువాద మొనర్చెను పద్యమునకు సద్యము, గద్యమునకు గద్యము, అనువాద ముగా నున్నచో నిది యెట్లుండెడిదో కాని నాట్యప్రబంధమగుటచే మూలమందలి చిన్నచిన్న సంభాషణము లొక పద్యమున నిమిడించునప్పుడుగాని, లేదా రెండు మూడు మూలశ్లోకముల యర మొక్క పద్యమున చెప్పునప్పుడుగాని, మూలమున కొలదిగా నున్నదానిని గొప్పగా వర్ణించినప్పుడుగాని తాను వ్రాయుచున్న పద్యముల కనుకూలముగా అర్థభావములను మార్చి కుదించి, పెంచి స్వతంత్రానువాదమును వెలయించినాడు. ఆతని యనువాదము రెండు తెరగులు 1 అమూలకములు మూలమందు లేకున్నను తన పధకమున కను గుణముగా, తన యవసరమున కనువుగా చి తిమ్మయమంత్రి చేర్చిన గద్యపద్యము లిందు పెక్కు లున్నవి ఇట్టి యమూలక రచనములకు ప్రత్యేకముగా ప్రథమ, ద్వితీయ, సప్తమాంకములు తావలము లైనవి నమూలకములు ప్రథమాంకమునగల ౬ నుండి రాం వరకు గల గద్యపద్యము లన్నియు ఈ నాట్యప్రబంధము నందేల తిమ్మరాజున కంకితము కనుక ఆ కృతిభర్త వంశావతారాదికములు వర్ణించుట తప్పదయ్యెను అందుచే నీ గద్య పద్యముల సంఖ్య ప్రథమాంకమున నింతగా పెరిగినది. కవి వీవినిగూడ ప్రస్తా వనలో జేర్చి సూత్రధారుని నోట పలికించుట నాటకము మరియు ప్రబంధము అను రెండు భిన్న ప్రక్రియల నడుమ వంతెన గట్టి నాట్యప్రబంధముగా తీర్చిదిద్దుట ప్రతి యంకము చివరను గల యంకితపద్యము లేడును ఆమూలకములని వేరుగా చెప్ప నక్కరలేదు. కవికి ప్రబంధములందుండు వర్ణనములపట్ల మక్కువ మిక్కిలి. ఆత 12 డాయుగమువాడు కనుక నట్టి యభిరుచి సహజమే కనుకనే నాటకాంతర్భాగమున గూడ వీలు కలిగినప్పుడెల్ల ఆమూలకములగు వర్ణనములు పెంచినాడు ప్రధమాంక మున గల ౨౨౯వ పద్యము అమూలకము ద్వితీయాంకమున ఉద్యానవనమున శ్రీరాముడు సీతను జూచి వర్ణించు వాద్యములు మూలమున నొకకొన్నియే యుండ చినతిమ్మయమంత్రి తనివిసనక యిట ఒ౪ నుండి రాళ వరకు గల గద్యపద్యములను పెంచి సీత నాపాదమస్తకము వర్ణించినాడు. ఈ యంకమందే గల అవ పద్యము కవి తన శబ్దాలంకార ప్రావీణ్యమును చూపుటకు రచించినదీ గూడ అమూలకము పద్యము నాట్య ఇటులే స ప్తమాంకము చివరన రావణవధానంతరము సీతారామలక్ష్మణులు అయోధ్యానగరమును ప్రవేశించుచుండగా సుగ్రీవవిభీషణులకు లక్ష్మణు డయోధ్యా పురమును వర్ణించి చెప్పుపట్ల గల అజ మొదలు అజ౫వరకున్న గద్యపద్యము లన్నియు నమూలకములు ప్రబంధప్రారంభములందుండు పురవర్ణనాదు ప్రబంధము ప్రారంభమున చేయుటకు వీలు కలుగమిని, తన నాట్యప్రబంధమును సర్వాంగసుందరముగా తీర్చిదిద్దుకొను నుద్దేశము కలిమిని, చివరి యంకమున అవకాశము లభించగనే అయోధ్యాపురవర్ణనము సాకుతో కవి యిచట పురము, చాతుర్వర్ణ్యము చతురంగబలము, సౌధములు, పుష్పలావికాదులు వర్ణనములు ప్రబంధఫక్కిలో చేసినాడు ఇది యానాటి నంద్యాల వర్ణనమో లేదా గతానుగతిక ముగా వచ్చు పురవర్ణనమో యనుకొనవచ్చును ఎటులైనను అమూలకము, స్వక పోలకల్పితము నగుటచే కవిసమకాలీన వాతావరణము మరియు నభిరుచు లీవర్ల నములందు ప్రతిబింబించుచున్నవనుట మాత్రము నిజము 193 2 : మూలాతీశాయి వర్ణనములు : చినతిమ్మయమంత్రి మూలమందున్న వర్ణనములను, అర్థభావములను తన పద్యములకు సరిపోవునట్లుగనో, లేదా తనివి దీరకనో మరికొంత పెంచిన పట్టు లీ నాట్యప్రబంధమున చాల గలవు. అట్టివానిలో కొన్నింటిని మాత్రము దిజ్మాత్రముగా సుదాహరింతును ప్రారంభమున సూత్రధారుడు సరించు మూడు నాందీశ్లోకములు నాట్యప్రబంధ మున మూడు పద్యములుగా నవతరించినవి ఈ పద్యముల నాల్గవపాదములందలి కృతిపతియాశీర్వాదము మూలాతివిషయమని వేరుగా చెప్పనక్కర లేదు. ప్రస్తావ నలో నటీసూత్రధారులు జయదేవక వివాణిని ప్రస్తుతించుచు క్వచి ద్వక్రతా కఠినతా చ" (1-82) అను వాక్యము నాట్యప్రబంధమున నొక పద్యముగా (1_౧౩౭) నవతరించి నది ఒకవేళ మన కవినాటి సంస్కృతప్రతులంది సారమున్నదో యేమోతెలియదు. 13 ప్రథమాంకమున సీతాస్వయంవరమంటపమున సమావిష్ణులైన హరశరాస నారోపాఒసమర్ధులగు రాజకుమారులను మంజీరకు డిట్లు దెప్పిపొడుచును "పశ్య పశ్య సుభటైః స్ఫుటభావం, భక్తిరేవ గమితా నతు శక్తిః, అజ్ఞలి ర్విరచితో నతు ముష్టి, ర్మౌలిరేవ నమితో నతు చాపం” (I-55) దీని యనువాదము తెలుగులో నిట్లున్నది ఉ భావము పల్లవింపఁ గడు భక్తియ చూపిరి శక్తి లేదు సం భావనఁ జేసి రజ్జనులు పాణి ఘటింపరు ముష్టి ముద్ర యి స్సీ వదనంబు వంచి రీదె సిగ్గరి భరుని విలు వంప రీ m భూవరసూను లెల్ల మగపుట్టునఁ బుట్టరె ప్రోలు ముట్టరే (1ం౬) పై పద్యము చతుర్థపాదమందలి భావము మూలాతిశాయి ఈ సంద్భముననే నేపధ్యమునుండి వినవచ్చు రావణుని కర్కశభాషణము లను వివి నూపురకుడు మంజీరకునితో "వయస్య కస్యాయం మహీతలచలద్రోహు రధచక్రరవకర్కశః కణ్ణధ్వనిః శ్రూయతే" యనును (1-59) దీని యనువాద మెంత స్వతంత్రముగా నడచినదో గమనింపుడు క అచ్చెరుపడి నూపురకుఁడు నెచ్చెలి : గుండ్రాలకొండ నెట్రపుఁ ద్రోవ వచ్చు పెనుబండి మ్రోతకు నెచ్చగు నీ కంఠరావ మెవ్వనియడియో (I_02) చిత్రపటమును దెచ్చు చెలికత్తె పేరు మూలమున (I_71) చందనికయని యుండ తెలుగులో (I_౨౩౬) మందారకళిక యైనది నూపురకు డమంగళము లాడగా రావణుడు కుపితుడయ్యును వానిం జంపక “తదేష కేవలం వైతాళిక ఇత్యుపేక్షః" అనును (1-92). దీని యనువాదము తనివి తీరక కవి యీరీతిగా పెంచినాడు క తిట్టిన దీవించిన రా కొట్టినఁ జలపట్టినను దగుం దగదనినకా భట్టు బహుమానయోగ్యుఁడు గట్టిగ నని వంది నిన్ను గాచితిఁ జుమ్మీ" (loss) బాణరావణులసంవాదమున బాణుడు రావణుని "సోషయ మశక్తి ప్రకారం" యని దెప్పిపొడిచిన మాట తెలుగులో నొక కంద పద్యమై కూర్చున్నది(IL౯౧). 14 ద్వితీయాంక ప్రారంభమున "తతః ప్రవిశతి తాపసః" యను సూచనము తెలుగులో నొక సీసపద్యముగా పెరిగినది (II). ఈ సీసపద్యము ఎత్తుగీతి చివరి పాదము "వచ్చెఁ దాపసుఁ డాతరువాత నొకడు" అనునదే కావలసిన యనువాదము తక్కిన తాపసివర్ణన మంతయు మూలాతిశాయియే భిక్షుక తాపసుల సంవాదమున గల(II-8x) పద్యము మూలాతిశాయి మరియు నమూలకము. ఒక వేళ మన కవినాటి సంస్కృతప్రతులందీ యధికపార ముండిన నుండియుండును సీత రాకకు పూర్వము ఉపవనమున రామలక్ష్మణులు చండికాయతనమును చూచినప్పుడు మూలమున గల శ్రీరామోక్తములగు “కధ మిద మిత శ్చణికాయ తనమ్" అను చిన్న గద్యమును, "మాతః కరుణతరజిణి వికసన్నయనామృతోర్మి శీక రిణి తరుణతుహినకరచూడామణిరమణి త్వాం నమస్యామి" (II_41) అను చిన్న శ్లోకమును తెలుగులో ఒకసీసము, ఒకవచనము, ఒకశార్దూలము, మరి యొక గీతముగా నవతరించినవి(II-50,51,52,58) వీనిలో చివరి గీత పద్యము సీతావివాహమను భావ్యర్థమును సూచించు నాటకీయవ్యంగ్య మైనది గీ సింధుకోటీర దేహార్ధ సింహవీరి నిండు కొలువుండు నీకు నెవ్వండు మ్రొక్కు వాని కవనిజయగులక్ష్మి వచ్చు పొదపు సంతతానందసామ్రాజ్యజనక మగుచు (II_x3) ఈ యుపవనమునందే శ్రీరామచంద్రుని జూచి సీతాదేవి తుమ్మెద నుద్దేశించి యన్యాపదేశముగా చదుపు పద్యము (II_౧౫౬) మూలాతిశాయి మరియు నమూలకము చతుర్థాంకమున విజితుడగు భార్గవరాముడు శ్రీరామచంద్రు నిట్లు స్తుతించును. "ఆపూరణాయ పురవై రిశరాసనస్య బాణాత్మనా పరిణతః కిల లీలయా యః, ఆరోపణాయ పునరస్య సఏవ శజ్కే బాలాత్మనా పరిణతః పురుషః పురాణః"
(1V-87) దీని భావ మంతయు పుణికిపుచ్చుకొని శ్రీరామచంద్రునికి మరికొంత వన్నెయు వాషియు కూర్చినది దీని తెలుగు సేత (IV-00౨) పంచమాంకమున హంసము గంగాదినదులకు శ్రీరామాదుల వనగమన వృత్తాంతము చెప్పుపట్ల వారి మార్గమున మూలమున లేని చెంచుపల్లి తెలుగు 15 నేతలో(Va౫) వచ్చి చేరినది. జనస్థానమందలి రాక్షసులను వర్ణించునప్పుడు (V-F౯), వారు "వాహరరనాగభటోత్కటు" లనుట కూడ మూలాతిశాయి ఈ యంకమందే కాళింది "కా పున రియం సూచిళలా కావిద్దాని మమ నఖా న్యల క్తక ర సేన సీఞ్చతి"(V-168) యను మాటను "ఎవ్వరోకో తూలెడు తన మెయి శీతసుధా లవనవదృష్టిచేతఁ దడి పెడువారల్" (V_౧౫౦) అని మార్చుట మిక్కిలి యుచితమైన యనువాదము షష్ఠాంకమున సీతావిరహముననున్న శ్రీరామచంద్రుడు తన పూర్వపు మధురస్మృతుల నిట్లు తలపోయును "తాన్యేవ పక్ష్మలదృశో వచనామృతాని భూయోఒపి కర్ణచుళుకై రహ మాపిబేయమ్ యె ర్మా మదర్శయ దసౌ వికసత్ప్రమోదా గోదావరీకమలవీచివిచేష్టితాని (VI_28) దీని యనువాదమున(VI_3జ) నాల్గవపాదమున మూలాతిశాయిగా చేరిన "రాచిలుక మాడ్కిం బల్మరుం బిల్వఁగః" అను ఉపమానము మెరుగులు దిద్దినట్లున్నది నుండి వినబడు, జయదేవకవి భావమునకు ఈ యంకమందే లంకావాసుల నుద్దేశించి నేపధ్యము "తత్సమ్ముఖం ప్రచలితః స్వయమక్షనామా నన్వేష రాక్షసపతేః కుపితః కుమారః" (VI_51) అను ఉత్తరార్ధశ్లోకమునకు, (VI-ae) పద్యపు ఎత్తుగీతిలో గల “దోర్మండలాగ్ర చండరుచికాండహిండితాఖండదిగదిపాలఖేలత్ప్రతాపవాతూలసఖుఁడు, రణకళా దక్షుఁ డయ్యక్షరాక్షసుండు" అను భాగ మంతయు మూలమును మించిన అక్ష కుమారప్రశంస ఇదే యంకమందలి ౧౧౯వ పద్యము గొప్పగా పొడిగించిన యచ్చతెనుగు కబ్బపు మచ్చుతునక సప్తమాంకమున సీత చంద్రోదయము నిట్లు వర్ణించును "ముకు ళీ కృతారవినో మానవతీమానవారణమహేన్ద్ర ః త్రిభువన నయనాననేవో, రజనీముఖ చన్దన శ్చన్ద్ర..” దీని యాంధ్రీకరణ మిట్లున్నది. గి, కమలముల తూఁగుమందు లోకముల విందు మానినీమానమ తసామజగ దారి 19 కొలది మూలమును (VII-142) 16 తామసీముఖచంద్రచందనము చంద్రుఁ డింద్రవరమునఁ జంద్రికాసాంద్రుఁ డయ్యె. (VII_ex) ఈపద్యమున "కమలముల తూఁగుమందు" వంటి స్వతంత్రానువాద మేకాక మూల మందలి యనౌచిత్యమును సరిహరించుటకై “మానవతీమానవారణమ హేన్ద్ర ." అనుదానిని “మానినీమానమ త్తసామజ గజారి” గజారి" యని మార్చుట ఎంతయు సమంజసముగా నున్నది మూలమున 'మృగేన్ద్రః' అనుటకు మారుగా "మహేన్ద్రః” అవి అచ్చు పొరపాటు దొరలిన దనుకొందమన్న దీని ప్రాకృతచ్ఛాయయు నిట్లే యున్నది ఇది సంస్కృతప్రతులు వ్రాసిన వ్రాయసకాండ్ర పొరపాటో యేమో : సరిష్కర్తలు కూడ దీనిని గమనించినట్లు లేదు లిర్వురును ఏడు సంస్కృతప్రతి పూర్వోక్త మహారాష్ట్ర పండితు సంస్కృతప్రతులాధారముగా ప్రసన్నరాఘవమును పరిష్కరించి ప్రకటించినారు (1894) వారుపయోగించిన ఏడు ప్రతులలో A B అనునవి ప్రాచీనప్రతులు ఈ యేడు ప్రతులందు సమంజసములని తోచినవానిని గ్రంథమున చేర్చి తక్కిన పారాంతరములను అడుగున పేర్కొన్నారు వారిచ్చిన A B ప్రతులలోని పారాంతరములకును తెలుగు ప్రసన్నరాఘవనాట్యప్రబంధమందలి పొరములకును పెక్కుచోట్ల సరిపోవుచున్నవి అనగా పరిష్కర్తలకు ప్రాచీన ప్రతులుగా లభించిన A B వంటి ప్రతులే ఆనాడు తెలుగుదేశమున ప్రచారమం దుండెనవి భావింప ఈ పండితులు సంస్కృతనాటకమును పరిష్కరించునప్పుడు చేసిన కొన్ని పొరపాటులను ప్రసన్నరాఘవనాట్యప్రబంధముద్వారా సవరింపవచ్చును 'మృగేన్ద్రః' అనుటకు మారుగా 'మహేన్ద్రః' అనుటయు, జయదేవుడు పదునారవ శతాబ్దమువా డనుటయువంటి పొరపాటు అదివరకే యుట్టంకించితిని వలయును సారూప్య వైరూప్యములు నే నుపయోగించుకొన్న సంస్కృతప్రతి కిని మన ప్రసన్నరాఘవనాట్యప్రబంధమునకును కొన్నిచోట్ల వ్యత్యాసము లున్నవి. అట్టివానిని కొన్నింటి సుదాహరింతును ద్వితీయాంకమున సఖి సీతాదేవితో "అహో తే చాతుర్యం యత ఆరామప్రకటనేనై వాకారగుప్తిం కృతవత్యసి” (11-85) యన్న మాటలో 'ఆరామ' పదమునకు బదులుగా ప్రతిలో 'ఆకార' యను పద మున్నట్లు అధోజ్ఞాపికలో సూచితము. ఆంధ్రీకరణమున నీ పారమే గృహీతము (II_౧౪౬) ౧ ౧౫౯వరకు ఈ యంకమందే ౫నుండి వరకు గల గద్యపద్యములు 17 మూలమున క్రమము తప్పినవి. ప్రసన్న రాఘవనాట్య ప్రబంధమందున్న క్రమమే సరియైనది తృతీయాంకమున ౧౪౮, ౧౪౯ పద్యములు మూలమున విశ్వామిత్రో క్తములు (III-139) కాని మన యాంధ్రీకరణమునం దున్నట్లు కంచుకి నోట వెలువడుటే యుచితము పంచమాంకమున ౫౯వపద్యము తరువాత మూలమున సరయూ క్తమగు, "రామే ప్రాప్తే వనా స్తే కథమపి భరత శ్చేతనం ప్రాప్య తాతం నీత్వా దేవేంద్రలోకం మునిజనవచనా దూర్ధ్వదేహక్రియాభిః భ్రాతుః శోకాభిత ప్తః స్వజనపరివృతః పాలయామాస నని గ్రామే తిష్ఠ న్నయోధ్యాం రఘుపతి పునరాగామిథోగాయ వీరః" (V-71) అను శ్లోకమును, యమునానది సల్కు "తత స్తతః" (V-72) అను మాటయును అనువాదమున రాలేదు ఇవి మన కవినాటి పారమున లేవో లేదా యనువదించక విడిచినాడో లేక వ్రాయసకాడే విడిచిపెట్టినాడో తెలియదు (V-౧౧౯)వ పద్యము గంగాముఖోద్ధతము. కాని మూలమున గంగాయుము నాసరయువులు మూడును కలిసి యన్నట్లున్నది. షష్ఠాంకమందలి ౫౬న మత్తకోకిలలోని యుత్తరార్ధము మూలమున గ్రంథ భాగమున లేదు. CE. ప్రతులలోనున్న యధికపారమని అధోజ్ఞాపికలో దాని ప్రాకృతచ్ఛాయ నుట్టంకించినారు కాని యది గ్రంధభాగమున నుండుటే సమంజసము రామరావణయుద్ధమును విద్యాధరుడు విద్యాధరికి వర్ణించి చెప్పుపట్ల గల "రణే ముక్తప్రాణా రజనిచరవీరా దినమణిం విశస్తః శోభనే కమల మివ సాయం మధులిహః, అధా మీఖి ర్భిన్నం గగన నవకుదరదరీ మయచ్ఛత్రచ్ఛాయా మనుభవతి బిమ్బం దినకృతః." (VII-75) అను శ్లోకమున 'నవ' యనుటకు 'వన' యనియును, 'మయ' యనుటకు 'మధు’ అనియును, పారాంతరము లున్నట్లు పరిష్కర్తలు అధోజ్ఞాపికలం దిచ్చి రేకాని మూలములోనికి తీసికొన లేదు అందుచే నీ శ్లోకము స్వారస్యము కొంత చెడినది చినతిమ్మయమంత్రి మాత్రము 'వన' 'మధు' పారములతో నాంద్రీకరించి అలంకార మును పోషించి యౌచిత్యమును పెంచినాడు (VII రాం) ఈ సందర్భమందే యున్న. 18 విద్యాధరః న ఏష రామసమరకౌతుకీ దళకణః. విద్యాధరీ కః పున రేషో ఒజ్జనపుజ్జుచ్ఛవిశరీరః కపివీర సస్యసంముఖం పరావర్తతే విద్యాధరః ప్రియే స ఏష విచిత్ర సమరశీలో నీలః అను సంభాషణములు, (VII_లాం) పద్యము తరువాత రావలసియుండెను సంభాషణముల సాంద్రీకర్తయే విడిచెనో వ్రాయసకాడే విడిచెనో తెలియదు కాని ౧౫౭వ పద్యము శ్రీరామోక్తము మూలమున నిది విభీషణోక్తము ఆత్యంత ప్రాచీన ప్రతియగు A లో నిది శ్రీరామోక్తముగా నున్నట్లు పరిష్కర్త లథోజ్ఞాపికలో నుట్టంకించినారు ఈ యంకమందే అంటవ పద్యము తరువాత నుండవలసిన వాక్కులు, సీతా (విహస్య విలోక్యచ) కధ మయ మున్మీలిత ఏవ “పూర్వగిరిపద్మరాగ ప్రకటీకృతనయశీతలస్వభావః, కుఙ్కుమకృతాఙరాగో నలినీవనవల్లభోదేవః " ఆనూదితములే కాలేదు సీతా దేవి (VII_169) ఆయోధ్యానగరమును ప్రవేశించునప్పుడు శ్రీరాముడు సూర్యభగవానునకు నమస్కరించి యిట్లు స్తుతించును "ప్రాచీముఖై కతిలక, పూర్వాచలశేఖ రైకమాణిక్యమ్, బదులుగా త్రిభువనగృహైకదీపం, వన్డే లోకైకలోచనం దేవమ్ " (VII-174) అధోజ్ఞాపికలో 'ముఖై క'కు బదులుగా 'కుఙ్కుమ'యును, 'శేఖర'కు 'రోహణ'యును, “వన్డే లోకైక లోచనం దేవమ్" అనుటకు బదులు “వన్దేహం కమలినీనాథమ్" అనియును, A B వంటి ప్రాచీన ప్రతుల పారము లిచ్చినారు ఈ ఈ ప్రాతప్రతుల పారములే చినతిమ్మయనాడు తెలుగుదేశమున ప్రచారమున నుండెను కాబోలు(ViI__౨౪8) ఇటి విశేషము లింకను ఈ రెండుప్రతులను పోల్చినచో తెలియగలవు చినతిమ్మయ కృతార్థత: ప్రసన్నరాఘవము నాంధ్రీకరించుటలో బొడ్డుచెర్ల చినతిమ్మయ ఎంతవరకు కృతకృత్యుడయ్యెనో పరిష్కర్తనగు నాకు చెప్పుట కష్టమే పీయూషవరుడని ప్రఖ్యాతినందిన జయదేవకవివాణి యనితర 19 చిన సాధ్యము చినతిమ్మయమంత్రి శక్తివంచనలేక దానిని 'తెలుగువారి కందింప ప్రయత్నించినాడు కొన్నిచోట్ల కృతకృత్యుడైనాడు. మరికొన్ని చోట్ల కాలేదు. భాషాంతరీకరణ మెన్నటికిని భాషాంతరీకరణమే. అందును సిద్ధవాక్కులును వశ్యవాక్కులును నగు మహాకవుల కృతు లనువదించుట యసిధారావ్రతము తిమ్మయ మిక్కిలి శ్రమపడి వీలైనంతవరకు మూలమందలి సౌందర్యమును తెలుగులోనికి తెచ్చుటకై ప్రయత్నించినాడు వీలైనంతవరకు శ్లేషచమత్కారము లను గూడ చేజారనీయలేదు అతడు పడిన శ్రమ కుదాహరణ మొక్కటి మాత్రము చూపింతును రావణుడు కపిబలము నుద్దేశించి మండోదరితో నిట్లనును "ఇయం లీలాలోలాజదభుజలతా నీలచికురా నమున్మీలత్తారా కుముదహసితా చారునయనా ప్లవజ్ఞానాం సేనా యువతిరివ తారాపతిముఖీ మమాగ్రే కన్దర్బం ప్రకటయితు మద్య ప్రభవతి" (VII_58) రావణుడు కపిబలము నబలగా శ్లేషించి వెక్కిరించు పద్య మిది ఇందులోని m 'కన్దర్ప' శబ్దమున గల స్వారస్యము చెడకుండ నిట్లనువదించినాడు గీ లాలితాంగదభుజలత, నీలచికుర, చారునయన, సముజ్వలత్తర కుముద హాస, తారేశవదన : వనాట సేన యబల, నా మ్రోల మారుమాటాడ గలదె చినతిమ్మయమంత్రి దీని (VII_*౮) సంస్కృతమందలి 'కందర్ప' శబ్దము తెలుగులో 'మారుమాట'గా సనూదితమై శ్లేషచమత్కారమును ఔచిత్యమును పోషించుకొన్నది బొడ్డుచెర్ల చినతిమ్మయ కృతార్ధుడు పదములు. ప్రసన్న రాఘవనాట్య ప్రబంధమును పరిష్కరించునప్పుడు అచ్చటచ్చట ఎదురుపడిన మాట అర్ధముకాక శబ్దరత్నాకరమును సంప్రదించితిని అప్పుడు కొన్ని శబ్దము లోనిఘంటువులో కనబడ లేదు. మరికొన్ని శబ్దముల కర్ణము లున్నను ప్రయోగములు లేవు. ఆయా శబ్దము అన్నింటిని ప్రయోగము లతో నాచెంతగల శబ్దరత్నాకరమున ఆటనట చేర్చితిని అట్టివానిలో కొన్నింటి ముదాహరింతును. 1 4 20 అరము క్రీ. విణ. త్వరితము. విణ పడిగంది. "అడలనేటికి సీతాభిహరణబుద్ధి సరము నీ రక్కసుని బల్మి నాగ నిచట " "నిరుపమానందబాష్పశీకరము లరమి " 2. ఆలస్యము 3 ఆలేరు సంవి ఆ న, సోమరితనము జాగు విణ సోమరి (Lex) (1-3) "ఆలస్యములలె నంటితినో లేదో 'పెలుచనై...
({VxE) (VII_౨౨౯) "ఆలేరనఁ దనరు లోచనానందంబై .” ఇది శబ్దరత్నాకరమున లేదు ఇది 'ఆలకాపరి వలె ఆవుల + ఏరు 'ఆలే ' రగునో మరింకేదేని పదమగునో నా కర్దము కాలేదు ఇలకు దే వి కీళ్ళ నరము బెడఁకుట. "ఇదియు నొక కానిపని యిపు, డెదిరించెనె యిలుకు మీదనే Docs..." 5. ఈరిమి. ఈ పదము కర.లో లేదు (005-1) "ఎ త్తిన మూర్ఛ సీత చెలు లీరిమి గొల్పినఁ దేరదయ్యే” (V_8) 6. ఉత్తరాని దేవి తలుపు క్రింద తిరిగెడు కుబుసము "ఈ నా యంగము లెంతయుం బౌడవులై యిట్లున్కిమై ద్రిమ్మరం గా నీ ద్వారము నుత్తరాసి విరుగుంగా మస్తకాఘాతమై కవి యిట నాసా (ఉద్వారశిఖరమను నర్థమున ఈ యర్థము శ ర లో లేదు. బ్రౌణ్యములో కలదు. 7. కన్నడుపు (III_3) ప్రయోగించినాడు కన్నడ ( దేవి ఆలము ఉపేక్ష) రూపమే శరలో కలదు గాని కన్నడువు రూపము లేదు "ఓ జగదేక విక్రమ యయో నను గన్నడు వేల సేసెదం" (V-౧౩౫) వై. వి. కాళియ కాహళిక "కాళె వట్టిన కవి నోరు కాళే నట్టు తి కమ్ము. శ.ర లో లేదు (I Loo) "కిమ్ములఁ బూతపూ వలుకు కెంపుల కన్నులు" (V_nno) 10. కూర్ప. మోచేయి కూర్పరము శ.ర.లో కలదు గాని 'కూర్ప' యను రూపములేదు. 21 "కూర్ప గకపాలవాఁడు చే కుండివాఁడు" కుండి శబ్దమునకు గూడ ఇందే ప్రయోగము లభ్యము. (II-~) 11. ఖళూరిక సం వి. ఆ సాముకూటము గరిడీ నిఘంటువు అన్నియు కాని ఈ గ్రంథమున నిది దొన్నె యను నీ యర్ధమునే యిచ్చుచున్నవి నర్థమున ప్రయుక్తము. "లలితకువలసుమపలాశఖకూరికా" (II_ose) 12 గిడుగు దే వి కామలేని గొడుగు "గిడుగు చందమున లంకించు మూపులమీఁద" (II) 13 గీమాడు శరలో లేదు "గీమాడు చెక్కుల కిలకిలలకు" 11 గుంటికోవి కరలో లేదు పెట్లదిమ్మేయని బ్రౌణ్యము. "చెందోరపు గుంటికోవుల గుదుల్ గనఁ క్రొత్తగు కొ ఇందులోని కొత్తల మను మాట గూడ ళ రలో లేదు 15. చెంగనాడు శరలో లేదు 16 “చెంగనాడకు మమ్మ నీ చెలుల నెల్ల " (II_03_) 氣 "తలంబులన్" (VIT___2x) (IIL౧౩౯) తిరియు దే స క్రి భిక్షించు కాని యీ కావ్యమున వేరొక యర్ధమున ప్రయు క్త మైనట్లు తోచును "శ్రీమీరఁ గటిసూత్రధామంబు తిరియంగ ముడిగొన్న యినుపకచ్చడమువాఁడు" (II) 17 తవ్వ శ ర.లో లేదు. తీఁగ. "ఎవ్వాడును హరచాపపుఁ దివ్వం దివలేడె యనిన..." (190×) 18 తూల(ము) దూది 19 "వెనుకటి గౌరవము దూలవిధమై తూలున్" తొకుదొకులాడు శరలో లేదు "తో తేరక యనుడు నవ్వు తొకుదొకులాడు." 20 శ్రేణి శర తద్భవదేశ్యముల యనుబంధమున దీనికి మిచ్చి ఆముక్తమాల్యద (VI_86) ప్రయోగ మిచ్చినారు ప్రయోగమునకు పై యర్థము సరిపడుటలేదు "వెదకు"అను నర్థ కాని ఈ గ్రంధ > (1-30=) (1-208) 22 "చంద్రోపమానుఁడై జలరాశితటమున ద్రేణి యుండిన పూర్ణతేజుఁ డనవు" (VII_3L) ఇచ్చట 'అధిశయించిన' అను నిర్ధమున ప్రయుక్తమైనదీ శబ్దము మూల మున 'నధిశేతే'యని కలదు (VI1-88) 21. దొరగిలు శరలో లేదు "దనుజుఁడు తన చెవుల కవలు దారగిలంగళా 22 నాలి మందము (1-3.౨౨) "క్రొత్తవిలాస మేరుపడఁ గ్రోలుచుఁ దేఁటులు నాలిగాలిచే" (II_ఆది) 28 పట్టేయము వై వి పెద్దక త్తి. 24 “పట్టి యొరపుట్ట వెడలు నా పట్టియంపు." (VILO౧) పదువ ఈ రూపము శ ర లో లేదు (పదువు - దే వి సజాతీయప్రాణి "పచ్చదనం బలఁతి చిలుక పదువలచేతన్ " సమూహ మని కలదు ) 25 వినుఁగు - ఆ వీణ లుబ్ధుఁడు "పినుఁగుం గోమటు లప్పురమున" " (II--) (VII_92) 26 పొవడు. దే స క్రి వి పొగడు యొక్క రూపాంతరము. "పొవడఁగ నేనృపాలకులపుంగవుకీర్తులు ద్రొక్కు దిక్కులన్ ' 27 bt (III-F౪) బవరి · దే విణ. గుండ్రము. శర లో "బవరి యని యకారమధ్యముగా కొన్ని గ్రంథములయందు రూపము కానఁబడుచుండినను రూపాంతరము బవ్రియని కనఁబడుటచే బవిరియను రూపమే సాధువని తోఁచెడి" యని కలదు. "పగిది చెడకుండ నొయ్యన బవరిపరచె 28. బేరము : సం. ఆ న ప్రతిమ “కనకోత్సవబేరంబులు.” బంగారు ఉత్సవవిగ్రహములని యర్థము. 29. మర - దేవి కీలు తిరుగుడు నొక్కు "మరలేని పసిఁడి తామరపువ్వు మరపించు కలికి ముద్దుమొగంబు కలకలలకు." ఇట పై యర్థము పొసగునో లేదో తెలియదు (IV_౧౦౬) (1100) (II_) 28 30 మిట్ట 31 ముయ్యంచు తీక్షము "ఏయు మిట్టకోల నేవరి మారీచు" మూడు మూలలు గది. (II_so) "చంచలాలోక చూచు ముయ్యంచుఁ జూపు" (II_౧౬c) 32 మేవు శ.ర లో నిట ప్రయుక్తమైన యర్ధము లేదు "మేవించెదఁ జెలిమి కాన మేరు సునాఖీ" (I-30౯) 33 మొనకట్టు ఒకానొక స్తంభనమూలిక "మొనకట్టున మతికృపాణి మొగ తిరిగేఁగదా" (I-998) పై యర్ధ మీట పొసగునో లేదో తెలియదు 34 యంత్రవరుడు శరలో లేదు "కనకధరాధినాయకుఁడు కన్నుల కెంపు వహించెనేని రా జనక చమూవిభుండనక యంత్రవరుండన కాజిఁదూలు" (I-3x) బ్రౌణ్యములో యంత్రకారు డనగా పిరంగులు పేల్చువాడని కలదు యంత్ర వరుండన యంత్రకారుడు కావచ్చును 35. లావణి దే వి పసులు మేసెడు బీటినేలకై ముందుగా నిచ్చెడు ధనము. "లలిత నిజ ప్రతాపరవులన్ వరదక్షితినాధుఁ డెల్లెడకా గలయగ నించి గంచుటురిగ దగ లావణి వైచి పోవనీ కలమె బలంబులంచు " పై యర్థ మీట పొసగునో లేదో. (I_a) 36 అవ శర లో లేదు. ధ్వనియని యర్థము. "లే ముద్దుం గులుకు రవల లివలం బోలెన్.' 37 లెప్పము శరలో ఈ రూపము లేదు. (VII__) “మ, దృలవదభంగతుంగభుజదర్పము లెప్పము సేయనేర్చునే" (IV-కాలా) లెక్క సేయనేర్చునే యని యర్ధము 38 వేలి ఈ రూపాంతరము శ ర లో లేదు హోమము . "వినికియు నక్షమాలికయు వేల్మియుఁ దాల్మియు దండకుండికల్" (IV_σ*) 24 39. సవరము . వై. వి. చపురమృగము తోఁక, "తిన్నని సవరాల గాలివలసకా
- F
(III-000) 40 సెలగోరు శర లో లేదు "సెలయున్ సెలగోరు వాఁడి చేక తి మొనజా (1-8=_) 41 సోఁకిడి శరలో లేదు " ఎదిరించెనె యిలుకు మీఁదనే సోఁకిడి..." (1-200) ఇట్టి పదము లింకను అనేకము గలవు కంచుటురిగ (I-ss), గొంటకట్టి, తెరపాము (I-శిలా), తురుముగోడెలు (1I-౬-౫) గిర్భున (III =). విపాట (IV_౨౭), సరిపంక్తులు (VII_౨2x) వంటి మాటలు నా కర్ణము కాలేదు ఈనాడు సరళాదిగానున్న పదములు పూర్వము పరుషాదిగా నుండెడివి కాబోలు, 'గొనబు' అనుటకు 'కొనబు' అనియు, 'దిదు' అనుటకు 'తిదు' అనియు, 'బెబ్బులి' యనుటకు 'పెబ్బులి' యనియు పరుషాదిప్రయోగములే ప్రసన్నరాఘవనాట్య ప్రబంధ మున గలవు సప్తమాంకమున గల అయోధ్యాపురవర్ణనమున పదునారవ శతాబ్దపు వాతావరణము ప్రతిబింబించినది ఆపట్టులందు నిఘంటువులందు లేని శబ్దము లెన్నియో కలవు ఇట్టి వానిలో కవిప్రయోగము లెన్నియో, వ్రాయసకానిపొరపాటు లెన్నియో, యర్దము చేసికొనలేని నా 'గ్రహపాటు' లెన్నియో నాకు తెలియదు. కొన్ని పట్టులందు కవి తాను చెప్పదలచిన భావమున కనుగుణమైన మాటలు లభించి నప్పుడు ఛందోభంగమునకు భయపడి మాషమును మషముగా చేసిన ఇక్కట్టులును గలవు. సప్తమాంకమున రాము నుద్దేశించి నేపధ్యమునుండి వినవచ్చు మాట లివి : గీ. ఏల పాలార్చెదవు దానవేంద్రు తలల గొలల నిండింపరాదె మా కోర్కి నొక్క బాణమున నో పయోజాత బంధువంశ తిలక నిజకీర్తి చే ధరిత్రియునుఁబోలె. (VILLOSE) ఇచట కోలల (బాణముల)ను పదమును 'కొలల'ని ఛందమున బంధించినాడు. తలల గొలల(గెలల) ని సవరించుకొనుట కవకాశమున్నది కాని మూలములో నిచట 'శరసోమెః' యని కలదు "కిం క్రీడసి శరస్తోమై ర్నన్వేకేనైవ ప్రతిణా, పరిపూరయ నః కామం యశసా చ జగత్తయమ్ ' (VII_122) 25 ఇంతకన్న మరియొక వింత ప్రయోగమును గమనింపుడు. ఆ. వె. మధుర సాటిగాదు మాయయుఁ బ్రతిగాదు కాశి జోడుగాదు కంచి యీడు గాదు ద్వారకయును గాదెన యుజ్ఞని యును సమంబుగా దయోధ్యతోడ. (ViI_౨౪3) లేదా ఈ పద్యమున 'ఉజ్జయిని' 'ఉజ్జని'గా మారుట మాషము మషమగు పే తెలుగునాటి వ్యవహారమున 'ఉజ్జయిని' 'ఉజైని'యై వ్రాయసకాని మాహాత్మ్యమున 'ఉజ్జని'గా మారినదని భావింపవలెను వ్యవహారమున గల 'ఉ 'ఉజ్జెని' వి' రూపమును గ్రహించినచో కవి ఛందోభంగమునకు భయపడి కక్కుర్తిపడినాడను కళంకము తొలగును వ్యవహారమందున్న “ఉజైని" రూపమును గ్రహించుటే నా యభీ మతము కాని గీర్వాణగిరాంధురంధరు లేమందురోయని గుండె గుబగుబ లాడు చున్నది పరిష్క రణము నాకు లభించిన ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము తాళ పత్రప్రతిని దాదాపు రెండేండ్ల క్రిందటనే ఉన్నదున్నట్లుగా ఎత్తి వ్రాసితిని ఈ గ్రంధమున కచ్చగు యోగము పట్టగనే పూర్వము వ్రాసిన ప్రతిని తాళపత్ర ప్రతిని రెంటిని సరిచూచుచు మరల నొకసారి వ్రాసితివి తాళపత్రగ్రంధము మిక్కిలి శిథిలావసలో నుండుటవలనను, వ్రాయసకాని పొరపాటు అధికముగా నుండుట వలనను ఈ ఈ గ్రంధపరిష్కరణము క్లేశావహమైనది తాళపత్రగ్రంథములను భక్షించు కీటకములు గూడ కావ్య రసాస్వాదనమున నారితేరిన వనిపించును మంచి పట్టులందే యవి గ్రంధమును కాజేసినవి. ఊహించుటకును పూరించుటకును కష్టము లైన స్థలములను ఏరికోరి యని భక్షించునట్లు తోచును నాచేత కొన్ని యష్టావ ధానపు కష్టములు గుడిపించినారీ కీటకపృచ్ఛకులు కొన్ని తావులు సమస్యాపూరణ ములు, కొన్ని పట్ల దత్తపదిగ్రహణములు, మరికొన్నిచోట్ల వ్యస్తాక్షరీసంయోజన ములు, చివరకు అనవసర ప్రసంగములువంటి యష్టావధానవిధానముల నెటులో యోపినంత చేసి గండము గడచి బయటపడగలిగితిని కీటకములు కొన్ని యక్షరముల యుపరిభాగములను కొరికి అధోభాగములను విడిచినవి. కొన్ని యక్షరముల యధోభాగములు గొరికి యుపరిభాగములను విడిచినవి కొన్నిపట్ల గుడిని గుడిలోని లింగమును మ్రింగినవి, తలకట్లు, గుడులు, ఎత్వములు, ఒత్వములు పోయిన యక్షరములను అధోభాగముల పోలికలనుబట్టి పూరించు 26 కొంటిని ఇక శిఖరములు మిగిలినప్పుడు ఒక గోపురమునకు మరియొక గోపు రమునకు గల మధ్యప్రదేశము ననుసరించి ఆయా అక్షరముల గుడుల పునాదులు కనుగొంటిని అప్పుడు నాకు ఆంధ్రభాషాలిపియందలి గొప్పతనము గోచరించి నది వానికి సరియైన దేవనాగరి యక్షరములు వ్రాసి వానిని గూడ శిధిలపరచి తెలు గక్షరముల పూరించినట్లు పూరింపవచ్చునేమోయని ప్రయత్నముచేసి విఫలుడనై తిని అప్పుడు మన లిపి గొప్పతనము మరికొంత తెలిసివచ్చినది ఆకులు క్రిమీదష్టములై యక్షరముల కడుపులు చిల్లులు పడినప్పుడును, స్పష్టాస్పష్టపు గురుతులు మిగిలినప్పుడును, నేను పూరించినవానిని ( ] ) ఇట్టి కుండలీకరణములం దుంచితిని కమ్మలు విరిగిపోయిన చోటను, అక్షరములు పూర్తిగా శిథిలములైన చోటను, వ్రాయసకాని పొరపాటువలన యక్షరములు జారి పోయిన చోటను, ఏ యాధారమును లేక నేనే యూహించి పూరించినవానిని ఇట్టి కుండలీకరణములందును ఉంచితిని సమంజసములని తోచి నేను చేసిన మార్పులకడ సంఖ్యలుంచి గ్రంథమందున్న యక్షరములను, పదములను ఆరోజ్జా పికలం దిచ్చినాను వీనిలో చాలవరకు వ్రాయసకాని పొరపాటులనియే నా నమ్మకము నాకు తెలియని పదములును, పదబంధములును, ఉన్నచోట ప్రశ్నార్థకము లుంచి నాను ఛందోభంగములైనచోట గూడ ప్రశ్నార్థకము లుంచినాను పూరించుటకు చేతకాని పట్టు లూరక విడిచినాను. వ్యాకరణ విరుద్ధ ప్రయోగము లున్నను తెలియని మాటలు వచ్చినను వీలైనంతవరకు వాని నటులే యుంచినాను సొంత కవిత్వము చొప్పించిన చోట గుర్తు లుంచి గ్రంథమందున్న వానిని అధోజ్ఞాపికలం దిచ్చినాను. కవి యుద్దేశించిన పారముల నూహించి శిథిలములను పూరించినప్పుడు నాకు కలిగిన శ్రమ వర్ణింపరానిది. సంసృత మూలమును చూడక ముందుగా నేనే ఊహించువాడను నా పారము సిద్ధమైన తరువాత మూలమును చూచెడివాడను మూలముతో సంవదించు శిథిల పూరణ మొనర్చినప్పుడు నాకు కలిగిన సంతోషముకూడ వర్ణింపరానిదే ఒక్కొక యక్షరమును కనుగొనుటకు గంటల కొలది ఉస్సురుస్సు మనువాడను ఆ యక్షరము స్ఫురించినంతట ఆర్కి మెడిసి వలె సంతోషపారవశ్యము ననుభవించు వాడను సొంతముగా కవిత్వము కట్టవచ్చును గాని శిథిలమును పూరించుట కష్ట మనిపించినది. లభించినది యొక ప్రతి గనుక పరిష్కరణము నా పాలిటికి మహా యజమైనది. అమూలకములును, మూలాతిశాయి భాగములును, వచ్చినచోట శిథిల పూరణము మిక్కిలి క్లేశము కలిగించినది ప్రథమన ప్తమాంకములం దింకను సందేహాస్పదములగు తావులు కొన్ని గలపు లేకలేక ఒక్క గ్రంధమును పరిష్క m 27 రించితినో లేదో నా కష్టసుఖము లిట్లుండ వాఙ్మయోద్ధారకు లెందరో మహాను భావులు పదులిరువదులు గ్రంధములు పరిష్కరించి ప్రకటించినవారి పాటు డెనో తలచుకొని సిగ్గుతో క్రుంగిపోయితిని - శిధిలములు కృతజ్ఞతలు తెలుగు చరిత్రమునకును, నాటక చరిత్రమునకును క్రొత్త వెలుగును కలిగించిన ఈ యమూల్య గ్రంధము వెలుగుచూచుట కవకాశము కల్పిం చిన ఆంధ్రరచయితల సంఘంవారికి ప్రత్యేకముగా ఆంధ్రరచయితల సంఘాధ్యక్షు లగు ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారికి నమోవాకములు పూరించుటయందు నా కత్యంతము సహాయభూతులైన మద్గురుపాదులు శ్రీమ దాచార్య రఘునాథచక్రవర్తిగారి కేటికోళ్లు ఈ పీరికను వ్రాయుటకు తోడ్పడిన గ్రంథరచయితలందరకు కృతజ్ఞుడను అల్పవ్యవధిలో నందముగా ముద్రించిన అజంతా ప్రింటర్సువారికి జోహారులు నా పరిష్కరణమునగాని నా యూహలందు గాని పొరపాటు లేవేని యున్న యెడల సహృదయులైనవా రెరిగించినచో కృతజ్ఞ తతో మలి ముద్రణమున సవరించుకొందును ఇందేవేని గుణములున్నచో ధీరుడు బొడ్డుచెర్ల చినతిమ్మయ మంత్రికుమారునివి దోషము లున్నచో నాయవి అచ్చు పొరపాటులు మాత్రము సహృదయపారకలోకము సహించవలె క "నందేల తిమ్మరాజ పు రందరచిహ్న ప్రసన్న రాఘవనాట్యా మందప్రబంధరాజము" విందగుత తెలుంగువారి వీనుల కెపుడున్ 1-8-117/2 చీకటిపల్లి హైద్రాబాదు.--20 ౮౮జ శుభకృత్ విజయదశమి 8_ 10 _ 1962 ఇట్లు రామరాజు