ప్రబోధ తరంగాలు/656-698

వికీసోర్స్ నుండి

656. ప్రాణాయామము నేర్చినవాడు బ్రహ్మయోగికావచ్చును. కానీ కర్మయోగి కాలేడు.

657. కర్మయోగిని ఎవరు గుర్తించలేరు. కానీ బ్రహ్మయోగిని అందరు సులభముగ గుర్తిస్తారు.

658. బ్రహ్మవిద్యను డబ్బుతోకొనలేము. కానీ ఒక్క శ్రద్దతో మాత్రమే దానిని సంపాదించవచ్చును.

659. జ్ఞానము కల్గిన పుస్తకములను డబ్బుతో కొనవచ్చును. కానీ ఆ పుస్తకములోని జ్ఞానమును శ్రద్దతో తప్ప డబ్బుతో తలకు ఎక్కించుకోలేము.

660. దుస్తులు శరీరమునకు అందమును చేకూర్చినట్లు ఆత్మజ్ఞానము జీవునకు ఆనందమును చేకూర్చగలదు.

661. తినేదానికి బ్రతకడము, బ్రతికేదానికి తినడము జీవితముకాదు.

662. దైవజ్ఞానము కల్గిన జీవితము గొప్పకార్యములాంటిది. దైవజ్ఞానము లేని జీవితము వృథాకార్యములాంటిది.

663. ఆత్మానందమును తప్ప మరి ఏ ఇతర ఆనందములను గొప్పగ తలవవద్దు.

664. దినములో ఉదయకాలము, మధ్యకాలము, సాయంకాలము ఉన్నట్లు మనిషి జీవితములో పుట్టడము, పెరగడము, చావడము కలవు.

665. భూమి విూద ఎవరైన గురువులుగ, స్వావిూజీలుగ, బాబాలుగ చలామణి కావచ్చును. వీరిని ఎవరూ కాదనరు. కానీ భగవంతుడు భూమివిూదకు వచ్చినపుడు వారి స్థోమత ఏమిటో భగవంతుడు చెప్పు జ్ఞానము వలన బయటపడగలదు.

666. గురువులుగ, స్వావిూజీలుగ, బాబాలుగ, పీఠాధిపతులుగ చలామణి అగువారిలో అసలైన ఆధ్యాత్మికత ఉందో లేదో చెప్పువాడు ఒక్క భగవంతుడే.

667. గురువులకు, స్వావిూజీలకు, బాబాలకు, పీఠాధిపతులకు విభిన్నముగనున్న భగవంతుని ఎవరు గుర్తించలేరు.

668. దేవుడు భూమివిూదకు వేల సంవత్సరములకొకమారు ఎవరికి తెలియకుండ భగవంతుడిగ వచ్చును. భగవంతుడు వేల దినములకొక మారు ఎవరికి తెలియకుండ దేవునిగ ప్రవర్తించును.

669. ఆదరణకర్త అయిన భగవంతుడు మానవులను తన జ్ఞానముతోనే ఆదరించును. అట్లుకాక ధన, కనక, వస్తు, వాహనములనిచ్చి ఆదరించడు.

670. మనిషి భూమివిూద దైవజ్ఞానము ద్వారా తప్ప ఏ దాని చేత నిజమైన ఆదరణ పొందడు.

671. దేవుడు భూమివిూదకు వచ్చునపుడు పలానా మతములో, పలానా కులములో వస్తాడని ఎవరు చెప్పలేరు.

672. శృతి ఉంటే లయ ఉంటుంది, శృతి అంటే జ్ఞానము, లయ అంటే మోక్షము.

673. శృతి లయలు కల్గిన దానిని "సంగీతము" అంటున్నాము. "సం" అనగ మంచి "గీత" అనగ హద్దు. సంగీతము మంచి జ్ఞానము కల్గినదని అర్థము. 674. సం అంటే మంచిదనీ, సారము అనగ రుచి అని అర్థము. దీని ప్రకారము సంసారము అనగ మంచి రుచిగలదని అర్థము.

675. సంసారము దేహములోపల ఉన్నది. దేహములోని సంసారములో సంగీతమును కల్గినవాడు ధన్యుడు.

676. సంసారము సంగీతమయము కావాలి కానీ సాగరమయము కాకూడదు.

677. "సంసారము సంగీతము" అను వాక్యము "సంసారము సాగరము" అను వాక్యము రెండూ కలవు. అందరికి సంసారము సాగరమనే తెలుసు, కానీ సంసారము సంగీతమని తెలియదు.

678. సంసారము ఎవరికి బయటలేదు. అందరికి దేహములోపలే సంసారముగలదు.

679. నీవు నీకన్ను వెనుకలనుండి దృశ్యములను చూస్తున్నావు. నీకన్ను వెనుకల నీవు ఎంతదూరములో ఉన్నావో చెప్పుకోగలవా?

680. మానవున్ని తనవైపు లాగుకొనుటకు మాయకు మొదటి ఆయుధము "ఆకలి".

681. కడుపులో కలుగు ఆకలివలన ధనికుడుగాని, బీదవాడుగాని, జ్ఞానిగాని, అజ్ఞానిగాని బయట ప్రపంచములో ఏమైన చేయుచున్నాడు.

682. మానవున్ని తనవైపు లాగుకొనుటకు మాయకు రెండవ ఆయుధము ఆలోచన.

683. ఆకలి, ఆలోచన రెండు మాయయొక్క ప్రియపుత్రికలు, నిన్ను వీడని చెల్లెండ్లు. 684. నీకు తండ్రి పరమాత్మకాగ, తల్లి ప్రకృతి (మాయ) కాగ, ఆత్మ అన్నగ ఉండగ, ఆకలి పెద్దచెల్లెలుగ, ఆలోచన చిన్న చెల్లెలుగ ఉండగ, జ్ఞానము మేనమామగ ఉన్నది.

685. పెద్ద చెల్లెలైన ఆకలికి ఆహారము ఇస్తే కొంతసేపైన ఊరక ఉంటుంది. కానీ చిన్న చెల్లెలైన ఆలోచన మాత్రము ఏమిచ్చినా క్షణము కూడ ఊరకుండక నిన్ను వేధిస్తూనే ఉంటుంది.

686. నీ చెల్లెళ్ళ బాధ తప్పాలంటే నీ మామతో చెప్పుకో. నీ చెల్లెండ్రను ఓదార్చు బాధ్యతగానీ, స్థోమతగానీ నీమామకే గలదు. అందుకే నీ మామను చందమామ అంటున్నాము.

687. నీ అన్న ఇంటిలో, నీ అన్న పనిమనుషుల మధ్యలో నీవు నీ కుటుంబ సభ్యులతో కాపురముంటున్నావు. అది తెలియక అంతా నీ సంసారమే అనుకొంటున్నావు.

688. అండజ, పిండజ, ఉద్భిజములని జీవుల శరీరములు మూడు రకములుగ ఉన్నవి. అందులో అండజ పిండజములు ఆకలి కలవిగా ఉన్నవి. ఉద్భిజములు ఆకలి లేనివిగా ఉన్నవి.

689. ఆకలిగల అండజ పిండజముల వలన రోగములు వ్యాపిస్తున్నవి. ఆకలిలేని మొక్కల వలన ఔషధములు తయారగుచున్నవి. అందువలన శరీరములు మాయకు గుర్తు, మొక్కలు జ్ఞానమునకు గుర్తు.

690. మాయ నీకు చెడును చేస్తుందని తెలుపుటకు శరీరములు దుర్గంధమును, జ్ఞానము నీకు మంచిని చేస్తుందని తెలుపుటకు చెట్లు సుగంధమును కల్గియున్నవి. 691. మాయకు గుర్తయిన శరీరములు క్రిందికి పెరిగి అధోగతిని సూచించగ, జ్ఞానమునకు గుర్తయిన వృక్షములు పైకి పెరిగి ఉన్నత గతిని సూచించుచున్నవి.

692. నిజంగా లేని దేవున్ని లేడు అనువారు నాస్తికులు. అబద్దముగ ఉన్న దేవున్ని ఎలా ఉన్నాడు అనువారు హేతువాదులు.

693. లేని దేవున్ని లేడు అనడములో నాస్తికుల వాదన సరియైనదే అవుతుంది. కానీ ఉన్న దేవున్ని ఎలా ఉన్నాడు అని ప్రశ్నించక లేడు అను హేతువాదము సరికాదు.

694. నాస్తికవాదము, హేతువాదము విడివిడిగ ఉండాలి. కానీ హేతువాదులమను వారికి హేతువాదమేదో తెలియక నాస్తికవాదులవలె మాట్లాడడము హేతువాదమనిపించుకోదు.

695. భౌతికము, అభౌతికము రెండు వాస్తవమే. అవి ఏ దేశములోనో లేవు నీ శరీరములోనే ఉన్నాయి.

696. తెలియని విషయమును క్షుణ్ణముగ ప్రశ్నించుకొని పరిశోధించి జవాబు తెలుసుకొనువారు నిజమైన హేతువాదులు. తెలియని అభౌతికమును లేదనువారు అజ్ఞానులేకాని హేతువాదులుకారు.

697. సైన్సును అడ్డము పెట్టుకొని అడ్డముగ మాట్లాడు అబద్దపు హేతువాదులూ, సైన్సుతో తెలియని వానిని తెలుసుకొను నిజమైన హేతువాదులూ. రెండు రకములవారు భూమి విూద కలరు.

698. ఉంటేనే ఏదైన తెలియబడేది. ఒకటి తెలియబడాలి అంటే మనలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబు దొరకాలి. అలాకాకుండ