Jump to content

ప్రపంచ చరిత్ర/జన్మదిన లేఖ

వికీసోర్స్ నుండి

జన్మదిన లేఖ

నాయిని సెంట్రల్ చెరసాల

అక్టోబరు 26, 1930

ఇందిరా ప్రియదర్శినికి

పదమూడవ పుట్టినరోజున

నీవు పుట్టిన రోజున బహుమతులను, ఆశీస్సులను అందుకొనుట నీ కలవాటు. ఈమాఱుకూడ నీవాశీస్సులు పుష్కలముగా అందుకొనగలవు. కాని ఈ నాయిని చెరసాలనుండి నీ కెట్టి బహుమతులను నే నంపగలను? నేను పంపు బహుమతులు వస్తురూపమున నుండజాలవు. వాయురూపమునగాని. మనోరూపమునగాని. ఆత్మరూపమునగాని ఉండవచ్చును. ఏ అభిమానదేవతయైన నీ కీయగలిగిన విట్టి పారితోషికములే. వీనిని పంపుటకు చెరసాల ఎత్తుగోడలు సైత మడ్డురాజాలవు.

ఉపదేశములు చేయుట, మంచి సలహాలనిచ్చుట నా కిష్టములేని పని యని నీ వెరుగుదువుగదా, చిట్టితల్లీ , ఇట్లు చేయ నాకు బుద్ధిపుట్టినప్పుడు, నే నొకమారు చదివిన కథజ్ఞప్తికి తెచ్చుకొందును. ఆది " మిక్కిలి తెలివిగల మనుష్యుని" కథ. ఆ కథగల గ్రంథములను ముందుముందు నీవే చదువుదువేమో. పదమూడువందల సంవత్సరములకు పూర్వము, చీనాదేశమునుండి ఇండియాకు. వివేకము, జ్ఞానము నార్జించు ఉద్దేశముతో ఒక గొప్ప బాటసారి వచ్చెను. అతని పేరు యుఁవా౯ చ్వాంగ్. ఉత్తర దిక్కున నున్న కొండలను దాటి, ఎడారులను దాటి ఆతడు వచ్చెను. ఎన్నియో అపాయములనుండి అతడు తప్పించుకొనెను. ఎన్నో అంతరాయముల నాతడు గడచెను అతని జ్ఞానపిపాస యంత గొప్పది, నేడు పాట్నా యని పేర్కొనబడుచున్న పాటలీపుత్ర మను నగరమునకు సమీపమున ఆకాలమందున్న నలందా విశ్వవిద్యాలయమునం దాతడు ముఖ్యముగా తాను విద్యనభ్యసించుచు, ఇతరులకు విద్యగరిపుచు పెక్కేండ్లు గడపెను. యుఁవాన్‌చ్వాంగ్ విద్యాధికుడాయెను. అతనికి ధర్మాచార్యుడను బిరుదము లభించెను.ఇట ధర్మమన బౌద్దధర్మమని యభిప్రాయము. అతడు హిందూదేశమంతయు తిరిగెను. ఆ కాలమున నీదేశమున నివసించు ప్రజల నాతడు చూచెను. వారినిగురించి తెలిసికొనెను. తరువాత నాతడు తన యాత్రలనుగూర్చి యొక గ్రంథమును రచించెను. నాకు జ్ఞాపకమువచ్చిన కథ ఈ గ్రంథములో నుస్నది. దక్షిణ హిందూదేశమునుండి ఒకపురుషుడు కర్ణసువర్ణ నగరమునకు వచ్చెను. బీహారు రాష్ట్రమున నేడు భగల్పూరున్న చోటికి సమీపమున ఆ కర్ణసువర్ణ నగర ముండెను. ఇతడు నడుముచుట్టును రాగిరేకులు ధరించియుండెను, తలపై వెలుగుచున్న జ్యోతిని పెట్టుకొనెను. దండమును చేతబూని, సగర్వముగా, గంభీరముగా నాతి డీవింత దుస్తులతో తిరుగుచుండెను. ఇట్టి వికృత వేషముసకు కారణ మెవ్వరైన అడిగిన నాతడు చెప్పు సమాధాన మేఘన - నేనెంతో విద్యావంతుడను. అందుచే నాకడుపు పగులు నను భయముచే నడుముచుట్టును రాగిరేకులు బిగించితిని. మూర్ఖులగు ప్రజలు ఆంధకారమున మునిగియుండుటచే జాలిజెంది తలపై జ్యోతిని పెట్టుకొంటిని. అయితే, తెలివి అధికమై పగిలిపోవుదు నేమోయన్న భయము నాకులేదు. కాబట్టి రాగిరేకులనుగాని, కవచమునుగాని ధరించవలసిన అవసరము నాకు లేదు. అయినను నాకున్న తెలివితేటలు నాకడుపులో లేవు. అవి ఎక్కడ వున్నను. అధికమునకు ఇంకసు ఎంతో చోటున్నది. చోటు లేకపోవుట యను సందర్భ మెప్పటికి నుండదు. తెలివితేటలు ఇట్లు పరిమితముగా నున్నప్పుడు, నేను జ్ఞానవంతుడనని ఎట్లు చెప్పుకో గలను? ఇతరులకెట్లు సదుపదేశములను చేయగలను? న్యాయాన్యాయములను, కర్తవ్యాక ర్తవ్యములను నిర్ణయించుటకు ఉపదేశములు చేయుట సరియైన మార్గము కాదవియు, ప్రసంగించుట, చర్చించుటవల్లనే నిజము బయల్పడుననియు నానమ్మకము. నీతో చేసిన ప్రసంగములు నా ఇష్టమైనవి. మన మెన్నో విషయములు ముచ్చటించుకొంటిమి. చర్చించు కొంటిమి. పృథివి విపులమైనది. మన లోకమున కావల వింతలోకము లెన్నోకలవు. కాన క్రొత్త విషయములు నేర్చుకొనుటకు మనకు విసుగు జనించరాదు. యుఁవాన్‌చ్వాంగ్ చెప్పిన కథలోని గర్వియగు తెలివి తక్కువ పురుషునివలె తెలియదగిన సర్వమును తెలిసితిమనియు, పండితుల మైతిమనియు ఆనుకొనరాదు. మనము మిక్కిలి తెలివిగలవార మగుటకూడ కోరదగ్గదికాదు. అట్టివారెవరైన నున్నచో, ఇక తెలిసికో దగిన దేదియు లేదుకదా యని వారు విచారగ్రస్తులు కాకతప్పదు. క్రొత్త విషయములను కనిపెట్టుటలోను, క్రొత్తవిషయములను గురించి నేర్చు కొనుటలోను గల యానందమునకు వారు చూరు లగుదురు. కోరినచో నట్టి యానందము మనకు చిక్కునుగదా !

కాబట్టి నే నుపదేశములు చేయరాదు. అయిన నే నేమి చేయవలసి యుండును? జాబు ప్రసంగమువంటిది గాదు, జాబులో ఒక్కరి భావములే వెల్లడియగును. కాన నేను చెప్పు విషయములలో మంచి సలహాలవలె తోచు విషయ ముండిన దానిని పరిహరించుము. మ్రింగరాని చెడ్డ మాత్రవలె దానిని పరిహరించుము. మన ముభయులము ప్రసంగించు కొనుచున్నట్టే యూహించి, అట్టి విషయములు నేను నీకు నీవాలోచించు కొనుటకై చేసిన సూచనలుగా భావించుము.

జాతులు తమ జీవితములో గొప్పయౌన్నత్యముచెందిన కాలముల గూర్చియు, గొప్పపురుషులనుగూర్చియు, స్త్రీలనుగూర్చియు, వారు చేసిన గొప్ప కార్యములనుగూర్చియు మనము చరిత్రలో చదువుదుము. ఒక్కోక్కప్పుడు ఆయాకాలములందు మన మున్నట్లును ప్రాచీనవీరపురుషుల వలెను. వీరనారులవలెనుసాహసకార్యములు చేయుచున్నట్లును ఊహించు కొని కలలు గనుచుందుము. నీవు మొట్ట మొదట జిన్‌డఆర్ ను గురించి చదివినప్పుడు ఎంతటి యానందమును జెందితివో జ్ఞాపకమున్నదా? ఆమెవలె నీ వుండవలెనని యువ్విళ్ళూరితివిగదా! సామాన్య స్త్రీ పురుషులు సాధారణముగా వీరులుకారు. తిండినిగూర్చి, పిల్లలనుగూర్చి, సంసారపు చిక్కులు మున్నగువానినిగూర్చి వారు తంటాలు పడుచుందురు. కాని ఒక మహత్కార్యము సాధించుటకై ప్రజలు పూనుకొనవలసిన తరుణము వచ్చినప్పుడు సామాన్య స్త్రీ పురుషులు సైతము వీరులగుదురు. చరిత్ర యుద్రేక పూరిత మగును. నవయుగారంభమగును. మహాపురుషులలో నేదియో శక్తి యిమిడి యున్నది. వారు ప్రజలలో నావేశము పుట్టించి వారిచే ఘనకార్యములు చేయింతురు.

నీవు పుట్టిన సంవత్సరము (1917) చరిత్రలో జ్ఞప్తియందుంచు కొనవలసిన సంవత్సరములో నొకటి. అప్పు డొక మహానాయకుడు ఆర్తులపట్లను, పేదలపట్లను కరుణా రసపూరిత హృదయుడై ఎన్నటికిని విస్మరింపరాని గొప్ప అధ్యాయమును చరిత్రలో తన ప్రజలచే వ్రాయించెను. నీవు పుట్టిన నెలలోనే లెనిన్ మహా విప్లవమును ప్రారంభించెను. దానిచే రష్యా, సైబీరియాదేశముల స్వరూపమే మారిపోయెను. నేడు ఇండియాలో వేరొక మహానాయకుడు-ఆర్తజనరక్షణ పరాయణుడు, మన ప్రజలను పౌరుషమునకు పురిగొల్పి వారిచే మహాత్యాగములు చేయించెను. మరల వారు స్వేచ్చనందుటకును, క్షుధార్తులు, దరిద్రులు, పీడితులు భాఛా విముక్తి నందుటకును ఈ మహాప్రయత్నము. బాఫుజీ (గాంధీ మహాత్ముడు} చెరసాలలో నున్నాడు. కాని యా మహాపురుషుని సందేశ మను ఇంద్రజాలము హిందూదేశ ప్రజాకోటిహృదయముల బ్రవేశించెను. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు సైతము తమ చిన్నగూళ్ళనుండి బయటికి వచ్చి ఇండియాకు స్వాతంత్ర్యము సంపాదింప సైనికులైరి. ఇండియాలో మనమిప్పుడు చరిత్రను సృజించుచున్నాము. మన కన్నులముందు జరుగు నీ విషయములు నీవును, నేనును చూచుచున్నాము. ఈ మహోద్యమమున మనమును శక్తికొలది పాల్గొనుచున్నాము. మన మెంతటి యదృష్ట వంతులమో!

ఈ మహోద్యమముపట్ల మన మెట్లు మెలగవలెను? మస మేమి చేయవలెను? ఏమి మనపాలబడునో నేను చెప్పజాలను. అది యేమైనను మనము జ్ఞాపకముంచుకొనదగిన విషయ మొకటి యున్నది. మన యుద్యమమునకుగాని, మన ప్రజలకుగాని దుష్కీర్తి నాపాదించు కార్యములను మనము చేయరాదు. ఇండియా స్వేచ్చకు పోరాడు యోధులముగా మన ముండదలచినచో ఇండియా ప్రతిష్ట మనచేతులలో నుండును. దానిని నిలుపుట మనపవిత్రమగుభాధ్యత. తరుచు మసము కర్తవ్య విమూఢులము కావచ్చును. ఏది సరియైన మార్గమో, ఏది కాదో నిర్ణయించుట సులభము కాదు. సంశయముగా నున్నప్పుడెల్ల నీ విషయమును జ్ఞష్తియం దుంచుకొనుము. దానవల్ల నీకు లాభ ముండును. ఏ కార్యమును రహస్యముగా చేయకుము. ఇతరులకు తెలియజేయరాని కార్యము నెన్నడును చేయకుము. దాచవలెనను కోరిక భయలక్షణము, భయపడుట మంచిది కాదు. నీకు తగదు. ధైర్యము వహించియుండుము. పిమ్మట సర్వమును సక్రమముగా నడుచును, నీవు ధైర్యముగా నున్న నీకు భయముండదు. సిగ్గుపడవలసిన పని ఎట్టిదియు నీపు చేయజాలవు. బాపుజీ నాయకత్వమున నడచుచున్న మనగొప్ప స్వాతంత్ర్యోద్యమమున రహస్యవ్యాపారములకు తావు లేదు. దాచుకోవలసినది మన కేమియులేదు. మనము చేయు కార్యములనుచూచి మనము భయపడము. మనము చెప్పు మాటలను చూచి మనము భయపడము. పట్టపగలు, సూర్యకాంతితో మనము పని చేయుదుము. ఆట్లే మన సొంత జీవితములందు సైతము సూర్యునితో సఖ్యము చేయుదము. సూర్యకాంతిలో పనులు నెరపుదము. రహస్యముగా మన మేకార్యములు చేయవద్దు. చాటుమాటులు మన కుండవచ్చును. ఉండవలసినదే. కాని రహస్యము వేరు; చాటుమాటులు వేరు. తల్లీ, ఈవిధముగా నీవు చేసినయెడల నీవు పెరిగి పెద్దదానవై వెలుతురు బిడ్డ వగుదువు. నీకు భయముండదు, ఏది ఎట్లు వచ్చినను క్షోభచెందవు. శాంతముతో నుందువు.

నీకు చాల పెద్ద జాబును వ్రాసితిని. ఇంకను నీకు చెప్పదలచుకొన్న దెంతయోకలదు. జాబులో అదంతయు ఎట్లిముడగలదు ? నేను చెప్పినట్లుగా నీ వదృష్టవంతురాలవు. మన దేశమున విజృంభించిన స్వాతంత్ర్యోద్యమము నీవు కన్నులార చూచుచున్నావు . మీఅమ్మ ఎంత దైర్యశాలిని : ఎంత ఉత్తమురాలు 1 ఇట్టి తల్లి నీకుండుట ఎంత అదృష్టము ! నీ కెన్నడైన సంశయము కలిగినను, చిక్కులు తటస్థించినను ఆమెకన్న నీకు ప్రియమగు సఖు లెవరు?

ఉందునా యింక, చిట్టితల్లీ : హిందూదేశమునకు సేవ చేయుటకై నీపు ధైర్యశాలినివగు యోధాగ్రణివగుదువుగాక. నీకు నా ప్రేమాశీస్సులు .


1

సంవత్సరాది బహుమానము

సంవత్సరాది, 1931

నీవు ముస్సోరీలోను, నేను అలహాబాదులోను ఉన్నప్పుడు, రెండు సంవత్సరములక్రితము, నేను నీకు వ్రాసిన జాబులు జ్ఞాపకమున్నవా? అవి బాగున్నవని నీవు నాతో చెప్పియుంటివి. అట్టి జాబులను మరల వ్రాసి ఈ మన ప్రపంచమునుగూర్చిన అధికవిషయములు నీకు చెప్ప కూడదా? యని యాలోచించుచుంటిని. కాని అట్లుచేయుటకు సంకోచించి తిని. ప్రపంచముయొక్క గతచరిత్రను, మహాపురుషులను, నారీమణులను, మహత్కార్యములను స్మరించుట సంతోషముతోకూడిన పనియే. చరిత్ర చదువుట మంచిదే. అంతకన్న మనోజ్ఞమైన, సంతోషకరమైన విషయము చరిత్రను నిర్మించుటకు తోడ్పడుట, ఈదేశములో నేడు చరిత్ర నిర్మింప బడుచున్నదన్న విషయము నీకు తెలిసినదేకదా ! ఇండియాపూర్వచరిత్ర పెద్దదేకాని అది అజ్ఞాతముగా నున్నది. అందు కొంత భాగము విచారకరమైనది, దుఃఖకరమైనది. తలచుకొన్నచో మనము తలలువాల్చి కంటతడి పెట్టుకో వలసివచ్చును. కాని మొత్తముమీద ఇండియా పూర్వచరిత్ర దివ్యమైనది. మనము గర్వింపదగినది. తలచుకొని సమ్మోదము నంద