పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/రాసక్రీడా వర్ణనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(తెభా-10.1-1083-ఉ.)[మార్చు]

మయంబునన్ విభుఁ డనంతుఁడు కృష్ణుఁడు చిత్రమూర్తి యై
చే సెను మండలభ్రమణశీల పరస్పరబద్దబాహు కాం
తా సువిలాసమున్ బహువిస్ఫురితానన హస్త పాద వి
న్యా ము రాసముం గృతవిచ్చరనేత్ర మనోవికాసమున్.

(తెభా-10.1-1084-వ.)[మార్చు]

ఇట్లు బహుగతులం దిరుగ నేర్పరి యగు హరి దర్పించి తన యిరుకెలంకుల నలంకృతలై కళంకరహితచంద్రవదన లిద్దఱు ముద్దియలందుకొని వీణ లందుకొని వీణలం బ్రవీణలై, సొంపుమెఱసి యింపుగ వాయించుచు నానందలహరీ నిధానంబగు గానంబు చేయ నవిరళంబై తరళంబుగాని వేడుక సరళంబగు మురళంబు లీలంగేల నందుకొని మధురంబగు నధరంబునం గదియించి మించి కామినీజన కబరికా సౌగంధిక గంధ బంధుర కరాంగుళీ కిసలయంబులు యతిలయంబులం గూడి వివరంబుగ మురళీవివరంబుల సారించి పూరించుచు సరిలేని భంగిం ద్రిభంగి యై కమల కర్ణికాకారంబున నడుమ నిలిచి, మఱియు గోపసుందరు లెంద ఱందఱకు నందఱయి సుందరుల కవలియెడలం దానును దన కవలియెడల సుందరులును దేజరిల్ల, నృత్యవిద్యా మహార్ణవ వేలావలయ వలయితంబై, విస్మితాఖండలంబైన రాసమండలంబుఁ గల్పించి, వేల్పులు హర్షంబునం గుసుమవర్షంబులు గురియ నందుఁ బ్రసూనమంజరీ సహచరంబు లైన చంచరీకంబుల మించుఁ బ్రకటించుచు, సువర్ణమణి మధ్యగంబు లైన మహేంద్రనీలంబుల తెఱంగు నెఱపుచుఁ, గరణీవిహారబంధురంబులైన సింధురంబుల చెలువుఁ గైకొలుపుచుఁ బల్లవిత కుసుమిత లతానుకూలంబులైన తమాలంబుల సొబగు నిగుడించుచు మెఱుపుతీఁగల నెడ నెడం బెడం గడరు నల్లమొగిళ్ళపెల్లు చూపుచుఁ దరంగిణీ సంగతంబు లైన రోహణాచల శృంగంబుల బాగు లాగించుచు, జగన్మోహనుండై యుండి రక్తకమలారుణంబులును, జంద్రశకల నిర్మల నఖర సంస్ఫురణంబులును, శ్రుతినితంబినీ సీమంత వీధికాలంకరణంబులును, సనక సనందనాది యోగీంద్ర మానసాభరణంబులును నైన చరణంబులు గదియనిడి సమస్థితి నంజలి పుటంబులం బుష్పంబు లుల్లసిల్లఁ జల్లి, సల్లలిత కమలప్రశస్తంబు లైన హస్తంబులు వల్లవీజనుల కంఠంబులపై నిడి, తాను గీతానుసారంబగు విచిత్ర పాదసంచారంబులు సలుపుచు, వర్తులాకార రాసబంధంబుల నర్తనంబునంబ్రవర్తించి వెండియు వ్రేతలుం దానును శంఖ పద్మ వజ్ర కందుక చతుర్ముఖ చక్రవాళ చతుర్భద్ర సౌభద్ర నాగ నంద్యావర్త కుండలీకరణ ఖురళీ ప్రముఖంబులైన విశేష రాసబంధంబులకుం జొక్కి, యేకపాద సమపాద వినివర్తిత గతాగత వలిత వైశాఖ మండల త్రిభంగి ప్రముఖంబులైన తానకంబుల నిలుచుచుఁ, గనకకింకిణీ మంజుల మంజీర శింజనంబులు జగజ్జనకర్ణ రంజనంబులై చెలంగ, ఘట్టిత మర్దిత పార్శ్వగ ప్రముఖంబులైన పాదకర్మభేదంబులు చేయుచు, సమపాద శకటవదన మతల్లి శుక్తి ప్రముఖంబులైన పార్థివచారి విశేషంబులును నపక్రాంత డోలాపాదసూచీ ప్రముఖంబులైన వ్యోమచారి విశేషంబులం జూపుచు, సురేంద్రశాఖి శాఖామనోహరంబులు, నపహసిత దిక్కరీంద్రకరంబులును ద్రిలోక క్షేమకరంబులును నగు కరంబులం దిరంబులగు రత్నకటకంబుల మెఱుంగులు నింగి చెఱంగులం దఱచుకొన నర్ధచంద్ర కర్తరీముఖ కపిత్థ కటకాముఖ శుకతుండ లాంగూల పద్మకోశ పతాక ప్రముఖంబులైన స్వస్వభావసూచక నానావిధ కరభావంబు లాచరించుచుఁ గటినిబద్ధ సువర్ణవర్ణ చేలాంచల ప్రభానికరంబులు సుకరంబులై దిశాంగనా ముఖంబులకు హరిద్రాలేపన ముద్రాలంకారంబు లొసంగుచు, నాస్కందిత భ్రమర శకటాసన ప్రముఖంబు లైన జానుమండల భేదంబులు నలాత దండలాత లలిత విచిత్ర ప్రముఖంబులైన దైవమండలంబు లొనర్చుచుఁ గమనీయ కంబుకంఠాభిరామంబులు నుద్దామ తేజస్తోమంబులును నైన నీల మౌక్తిక వజ్ర వైఢూర్య దామంబుల రుచు లిందిరాసుందరీ మందిరంబులై సుందరంబులయిన యురంబులం దిరుగుడుపడి కలయంబడ నంగాంతర వాహ్యలకు ఛత్ర ప్రముఖంబులైన భ్రమణ విశేషంబుల విలసించుచు నిద్దంబులగు చెక్కుటద్దంబుల నుద్దవిడిఁ దద్దయుం బ్రభాజిత చంద్రమండలంబు లగు కుండలంబుల మెఱుంగు మొత్తంబులు నృత్యంబు లొనరింపఁ గటిభ్రాంత దండరచిత లలాట తిలక మయూర లలిత చక్రమండల నికుంచిత గంగావతరణ ప్రముఖంబులైన కరణంబు లెఱింగించుచు వెలిదమ్మి విరుల సిరుల చెన్నుమిగులు కన్నులవలని దీనజనదైన్య కర్కశంబులై తనరు కటాక్షదర్శన జాలంబులు జాలంబులై కామినీజన నయనమీనంబుల నావరింప లలితకుంచిత వికాస ముకుళ ప్రముఖంబు లైన చూడ్కులం దేజరిల్లుచు, ననేక పరిపూర్ణచంద్రసౌభాగ్య సదనంబులగు వదనంబులఁ బ్రసన్నరాగంబులు బ్రకటించుచు నుదంచిత పింఛమాలికా మయూఖంబు లకాల శక్రచాపంబుల సొంపు సంపాదింప, నికుంచి తాకుంచిత కంపి తాకంపిత పరివాహిత పరావృత్త ప్రముఖంబులైన శిరోభావంబులు నెఱపుచు మృగనాభి తిలకంబులుగల నిటలఫలకంబులఁ జికుంరబుల నికరంబులు గప్ప, నపరాజిత సూచికావిద్ధపరిచ్ఛిన్న విష్కంభ రేచిత ప్రముఖంబులగు నంగహారంబుల విలసిల్లు చరణ కటి కర కంఠ రేచకంబు లాచరించుచు నొప్పెడు; నప్పు డా రాసంబు సంజనిత సకల జన మానసోల్లాసకరంబై సుధార్ణవంబునుం బోలె నుజ్జ్వలరసాభిరామంబై రామరాజ్యంబునుంబోలె రాగపరిపూర్ణంబై, పూర్ణచంద్రమండలంబునుం బోలెఁ గువలయానందంబై, నందనవనంబునుంబోలె భ్రమరవిరాజమానంబై, మానధనుని చిత్తంబునుంబోలెఁ బ్రధానవృత్తి సమర్థంబై, సమర్థకవివిలసనంబునుంబోలె బహుప్రబంధభాసురంబై, సురలోకంబునుంబోలె వసుదేవనందన విశిష్టంబై, శిష్టచరితంబునుంబోలె ధరణీగగనమండలసుందరంబై, సుందరీరత్నంబునుంబోలె నంగహార మనోహరంబై, హరవధూనిలయంబునుంబోలె ననేకచారి సుకుమారంబై, సుకుమార వృత్తంబునుంబోలె నుద్దీపితవంశంబై, యుండె; నందు.
<a href="http://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=rasa%20Krida%20Ritului">రాసక్రీడా రీతులు</a>

(తెభా-10.1-1085-చ.)[మార్చు]

డుములు వీగియాడఁ, జిఱువ్వులు నివ్వటిలంగ, హారముల్
సు డివడ, మేఖలల్ వదలఁ, జూడ్కిమెఱుంగులు పర్వ ఘర్మముల్
పొ మఁ, గురుల్ చలింప, శ్రుతిభూషణముల్ మెఱయన్, సకృష్ణలై
తుక లాడుచుం జెలఁగి పాడిరి మేఘతటిల్లతాప్రభన్.

(తెభా-10.1-1086-క.)[మార్చు]

అం రహితేందు వదనలు
పం జలోచనునిఁ గూడి రఁగ నటింపం
గిం కిణుల నూపురంబుల
కం ణముల మ్రోఁత లెసఁగెఁ ర్ణోత్సవమై.

(తెభా-10.1-1087-క.)[మార్చు]

రిణీనయనలతోడను
రి రాసక్రీడ చేయ నంబరవీధిన్
సు నాథులు భార్యలతో
సొ రిది విమానంబు లెక్కి చూచి రిలేశా!

(తెభా-10.1-1088-క.)[మార్చు]

కు రిసెం బువ్వుల వానలు
మొ సెన్ దుందుభులు మింట ముదితలుఁ దారున్
సన్ గంధర్వపతుల్
రుసన్ హరిఁ బాడి రపుడు సుధాధీశా!

(తెభా-10.1-1089-క.)[మార్చు]

రా లతోడను రాసము
రా మానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రా ములమీఁద వియచ్చర
రా లు మూర్చిల్లిపడిరి రామవినోదా!

(తెభా-10.1-1090-క.)[మార్చు]

తా రాధిపనిభవదనలు
తా రాధిపవంశుఁ గూడి తారు నటింపం
దా లుతోడ సుధాంశుఁడుఁ
దా రును వీక్షింప రేయి డవుగ జరగెన్.

(తెభా-10.1-1091-మ.)[మార్చు]

మునా కంకణ చారియై వనజ పుష్పామోద సంచారియై
ణీఘర్మ నివారియై మదవతీ రాసశ్రమోత్తారియై
ప్ర దామానస నవ్యభవ్యసుఖ సంత్కారియై చేరి యా
లాక్షుం డలరంగ గాలి విసరెం ల్యాణభావంబునన్.

(తెభా-10.1-1092-వ.)[మార్చు]

అప్పుడు.

21-05-2016: :
గణనాధ్యాయి 11:14, 11 డిసెంబరు 2016 (UTC)