పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దక్షసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9దక్షసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-417-వ.)[మార్చు]

అట మీఁదటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మను వయ్యెడు; నతని కొడుకులు ధృతకేతు, దీప్తకేతు, ప్రముఖులు రాజులును; బరమరీచి గర్గాదులు నిర్జరులును; నద్భుతుం డను వాఁడింద్రుండును; ద్యుతిమత్ప్రభృతులగు వారలు ఋషులును నయ్యెదరు; అందు.

(తెభా-8-418-ఆ.)[మార్చు]

నుజహరణుఁ డంబుధార కాయుష్మంతు
కు జనించి రక్షణంబు చేయ
మూఁడు లోకములను మోదంబుతో నేలు
ద్భుతాఖ్య నొప్పు మర విభుఁడు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:18, 22 సెప్టెంబరు 2016 (UTC)