బ్రహ్మానందము/బ్రహ్మానందశతకము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

బ్రహ్మానందశతకము

సీ.

శ్రీ మించు యోగీంద్ర, సేవ్యమై ఖలుల కగమ్యమై లోకైక్య, రమ్య మగుచుఁ
దనరార గోలోక, మున రాసమండలి నభినవక్రీడాగృ, హంబులందు
విరజాతటంబున, బృందావనంబున, గోగోపగోపికా, కోట్లు కొలువ
వేడ్కతో విత్యంబు, విహరించు రాధికాకృష్ణు లొండరులపై, ప్రీతిపూర్వ


గీ.

కముగఁ బరగించు నవసుతా, కలితవీక్షణములు, వారలప్రియభాషణములు సరస
[1]జారరతులు వెల్గోటికు, మార యాచభూవరేంద్రు నజశ్రంబు, బ్రోచుఁ గాత


సీ.

వరగుణశాలి స, ర్వజ్ఞకుమార యాచక్షమానాథుండు, సత్కళావి
శారదుం డొకనాడు, సంతోషమున గోపినాథ వేంకటకవి, నాథు నన్ను
రావించి మన్నించి రమణ శ్రీకృష్ణునిఁ గోర్కెతోఁ గృతినాయ, కునిగఁ జేసి
యతని విహారంబు, లన్నియు శృంగార[2]శతకంబు సేయుము, సరసఫణితి


గీ.

నరయ నానందపరిపూర్ణుఁ, డైన కృష్ణు చారుతరవిషయానంద, సరణులెల్ల
నవ్యమృదువాగ్విభూతి వర్ణనము సేయు టరసిచూడ బ్రహ్మానంద, మదియె కాదె.


సీ.

కామసంతృప్తుఁడు, గానివాఁ డిల మోక్షకామి గాఁడను గాథ, గలిగియుండ
నదిగాక సురతభ, వానంద మరయ బ్రహ్మానందలేశంబె, గాని వేఱు
గాదు కావున మీరు, గరిమతో మొదల శ్రీకృష్ణుఁడు పల్లవ, స్త్రీలఁ గూడి
చేసిన లీలావి, శేషంబు లన్నియు శృంగారశతకంబుఁ, జేసి ప్రీతి
నవల తదుక్తగీ, తార్ధసారం బంత సంగ్రహించి సమస్త, సమ్మతముగ


గీ.

నొక్కశతకంబుఁ గావింపు, ముర్విలోన దేనియెడఁ బ్రీతిగలవారు, దానిఁ జూచి
తెలిసి సౌఖ్యవారాంబుధిఁ, దేలుచుందు రంచితముగ బ్రహ్మానంద, మదియ కాదె.


సీ.

అని యిట్లు [3]కౌతూహ, లాతిరేకంబున నాన తిచ్చిన యేను, హర్షమొంది
హరి హర బ్రహ్మల, నభినుతిఁ గావించి పద్మా శివా సర, స్వతుల కెఱఁగి

కరివక్త్రునకు నతిఁ గావించి వాల్మీకి సాత్యవతేయుల సంస్మరించి
కాళిదాసాది సత్కవులను గొనియాడి గరిమతో నాంధ్ర సత్కవులఁ దలఁచి


గీ.

రాధికామాధవుల విహారంబు లన్ని పూని శృంగారశతకంబుఁ గా నొనర్తు
సరసులందరు విని చాల సంతసింపుఁ డనఘులారా! బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గుణదోషములు వర్ణగణములు శబ్దార్థపద్ధతుల్ గని యతి ప్రాస బంధ
నియమంబు లెఱిఁగి యెన్నికకెక్కి మృదుమధురోక్తులుగదియించి యుక్తభంగి
నతివిపులార్ధంబు మితపదంబులలోనఁ దెలియించి ముద్దుమాటలను గూర్చి
[4]విరళార్ధ సంయొక్త సరళశబ్దంబులు పొసగఁ నలంకృతుల్ పొందు పరచి


గీ.

రసము చిలుకంగ [5]వాచక రౌచకాది సప్తవిధ సత్కవీంద్రుల జాడ లెఱిఁగి
శౌరి లీలావిలాసముల్ సన్నుతింతు నరసి చూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సచ్చిదానంద లక్షణ పరబ్రహ్మంబు మును విషయానంద మనుభవింప
దలఁచి తా గుణమయతనువుఁ గైకొని తనయోగమాయను రాధ గాగఁ జేసి;
పరగ బ్రహ్మాడంబు బయల క్రీడార్ధంబు గోలోకము సృజించి కోరి తనదు
కళలచే రాధికా కళలచే, గోపగోపికలను నిర్మించి నకళు డగుచు


గీ.

నందు గ్రీడించెఁ గానిచో నగులు, డేల మోహనకిశోరరూపంబుఁ బొసగ దాల్చె
నట్టి కృష్ణుని శృంగార మభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియ కాదె.


సీ.

ధరలోన మనుజు లందఱు మానుషానందమందు సదాశక్తులగుట వలన
తాను మానుషరూపధారియై తగ మానుషానందమును బ్రీతి ననుభవింప
కరమర్ధి తనదు శృంగారచారిత్ర ప్రపంచమంతయు నాలకించి చాల
మధురసాచ్ఛాదితౌషధముటికాన్యాయమున నిహపరసౌఖ్య మనుభవించి
ధన్యు లౌటకు మహా ధన్యుండు గోలోకవాసి యా కృష్ణుండు భాసురముగ


గీ.

కోరి బృందావనంబున గోకులంబునందు విహరింప, మధురలో నవతరించె
నట్టిశౌరి విలాసంబు నభినుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

కడువేడ్క దేవకీగర్భంబున జనించి ప్రాకృతబాలుని పగిది జాణ
వికసనంబులు లేక వెస బరాధీనుడై సర్వోపచారముల్ సంగ్రహించి
టరయ, నామాయ నా యంతవానికె యజ్ఞతయును బరాధీనతయును గలుగఁ
జేయు సామర్థ్యంబు చేనొప్పునట్టిద, యని యెఱింగించుట కంతేగాక

గీ.

తలప సర్వజ్ఞునకు సర్వశక్తియుతునకు పారవశ్యంబుగలదె
యట్టి కృష్ణుని చరితంబు లభినుతింతు నతులమైన బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అరయ నెవ్వాని వీర్యంబున విరజకు బుట్టిన తనయు లేడ్వురును సప్త
వసరాసులైరి యెవ్వడు సృష్టిగావింప రాధతో గూడి సురతము సేయు
తఱి మేన బొడమిన తతఘర్మజలము బ్రహ్మాండముల్ నిండి యేకార్ణవంబుఁ
గావించె నట్టిజగత్కర్త కృష్నుండు జనని దోయిట నీట స్నపితుడగుచు


గీ.

భక్త సుకృతోపచారంబు స్వల్పమైన నదియ సంతుష్టికరమని యన్నమాట
సత్యముగ జేసె నవ్విభు సన్నుతింతు ననుపమానబ్రహ్మానంద మదియకాదె


సీ.

దాటరాని భవాబ్ధి దరియించుటకు తవరమ్యపాదాబ్జమరందపాన
మదియ ముఖ్యోపాయమనియు నాత్మీయంగములలోనఁ దలపోయ మోక్షలక్ష్మి
కంఘ్రులే కుచ్యంబు లనియును భక్తుల కెఱిగించుటకే కాక యింపుమెఱయ
బంగారుతొట్లలో బవళించి కరముల చరణంబు వదనకంజమున జేర్చి


గీ.

మొనసి యంగుష్టమానుట జనని పాల దనివిదీరక గాదట్టి యనఘమూర్తి
రమ్యలీలావిలాసవర్ణన మొనర్తు నరసి చూడ బ్రహ్మనంద మదియకాదె.


సీ.

పశువులు ఫణులు గానరసంబు నెఱుగుఁదు రను వాక్య మెఱుక పరుప
గానంబు సర్వదుఃఖంబుల నడచి జడంబులకైన సుఖంబు నొసఁగు
ననునది ప్రకటింప నదిగాక, తా సామగానలోలుండను గాథ తథ్య
మొనరింప జనయిత్రి యొఱపైన చికిలిబంగరుతొట్లలో నుంచి క్రమఫణతి


గీ.

పాటఁపాడుచు నూచిఁనఁ బవ్వళించి నేత్రములు మోడ్చి సుఖలీల నిద్రబోయె
నట్టిశౌరివిలాసంబు లభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వ్రేపల్లెలో నున్న గోపాలకుల నెల్ల నాఢ్యుల గావింతునని తలంచి
పుడమి నకారణంబుగ సిరి నొసగిన నస్మదుక్తి విరోధ మగును గాన
నెటులైన వీరి సొమ్మించుక యైనను మెసవి సౌభాగ్యంబు నొసగుటొప్పు
నవి వారి సదనంబు లందున్న వెన్నయుపాలు మ్రుచ్చిలి మెక్కి భాగమొసగె


గీ.

నల కుచేలుండు గొనితెచ్చినట్టియటుకు లొడిసికొని తిని యైశ్వర్య మొసగలేదె
యట్టికృష్ణుని శృంగార మభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తను భక్తి ననిసంబుఁ గొనియాడువారి కిప్పగిది నధీనుండ నగుదు ననెడు
భావంబు తెల్లంబుఁ గావించుటకు ఱోలకరమర్థి తల్లిచే గట్టుపడియె

గానిచో యఘటన ఘటనా పటీయ్యసి యగుతన మాయచే జగములన్ని
కర్మవశంబునఁ గదలకుండఁగ గట్టివైచిన యాపరబ్రహ్మ మేల


గీ.

యబలయగు తల్లిచే దొల నట్లు కట్టుబడియె నది చాలతానుకంపవలన గాదె
యట్టి పరమేశుచారిత్ర మభినుతింప నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అవని గోబ్రాహ్మణు లనుచు విప్రులకన్న గోవుల మొఁదఁట బేర్కొనుటవల్ల
నావులు విప్రులు కన్నఁ బ్రాశస్తంబు గాంచినవనియు నుత్కంఠతోడ
గోప్రదక్షిణమున భూప్రదక్షిణజాతఫల మబ్బుననియు భావమర్ధి
నెల్ల మానవులకు తెల్లంబు గావించుటకు కూర్మి గోపబాలకులఁ గోడి


గీ.

ప్రేమమీఱ బృందారణ్యసీమయందు పసులచుట్టును దిరుగుచు, కసవు మేపె
నట్టిశౌరి విలాసంబు లభినుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అనిశంబు తన్నునమ్మినవారియపమృత్యువులు రోగములఁ బాసి
యఖిలాపద లడంచి యాపన్నగారకుం డనుమాట నిజము చేయంగఁదలచి
యఘదైత్యవదనంబునందు కాళీమహ్రదాంబుపానమున నీ రైనగోప
బాలగోగోవత్సజాలంబులను సురామయవీక్షణంబుల మనఁగజేసె
నంతియగానిచో నట్టియాపద వారి కేయెడ లేకుండఁ జేయలేఁడె


గీ.

కర్మమును దాటఁ గాదను, గాథ యితరజనములకె కాక నిజభక్తజనులఁ జేర
దనుట నిజముచేసినహరి నభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

హరిహరవిధులు నిజాంశసంభూతులై ననుతమయోగమాయను తరింప
లేరను యర్థంబు నారక వివిధకారణములు లేకనే వ్రజకుమార
వత్సరూపంబులు వరుసతో సృజియించినట్లు విశ్వంబు నేపారసృష్టి
గావించు పటుశక్తి గలదను నర్థంబు క్షితిలోనఁ బ్రకటింపజేయుటకును


గీ.

అజుఁడు దాచినబాలవత్సాకృతుల ధరించి యొకయేఁడు మందలో సంచరించె
నట్టికృష్ణుని శుభలీల నభినుతింతు నమితమైన బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఏఁటేటఁ గావించు నింద్రయాగమునకు సమకూర్చిన పదార్థజాత మెల్ల
తనమాట నమ్మి శకృనకు నొసంగక యచలాకృతి ధరించినట్టి తనకు
నిచ్చినందున నిర్జరేంద్రువలన గల్గిన యువద్రవ మణఁగింప గేల
గోవర్ధననగంబు గోర్కెతో నెత్తి గోగోపగోపికలను గూర్మి బ్రోచి

గీ.

దైవతాంతరముల వీడి, తనుభజించునతని రక్షింతుననుచు తా నన్నమాట
సత్యముగ జేసె నద్దేవు సన్నుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ధరలోనఁ దా నవతార మొందెడువేళ తన యోగమాయఁ గన్గొని సమస్త
జనులకు కామదాయివివయి యుండెదవీవు నిన్ను జనంబు పెక్కు
నామధేయంబుల నయముతోఁ గొలిచెదరని ప్రీతి నిచ్చిన ఘనవరమున
కనుగుణంబుగను కాత్యాయనిపూజలు చేయ గోపాలకస్త్రీల చేల
ములు గొనుటది వారు జలములో నగ్నలై ప్నానంబుచేయుదోషము నడంచి
తనకర్థి మ్రొక్కించుకొని వారివ్రతము సేయుటకె కా కతులితముగ
ద్రౌపదీదేవి తన్ దలఁచినమాత్రాన పెక్కువస్త్రములు కల్పించి యిచ్చి


గీ.

నట్టి దివ్యప్రభావున కంబరములు లేక కాదు కామాసక్తి లీలగాదు
అట్టియోగీశ్వరు నాదిదేవు నభినుతింతు బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నూనూగుమీసాలనూత్నయౌవ్వనుఁడును నలువొప్ప మధురగానంబు సేయు
పురుషుఁడు తరుణున కరయ వల్లభుఁడంచు పలుమాఱు వేదంబు బలుకునుడువు
నిజము సేయుటకు దా నిత్యకైశోరసుందరవిగ్రహము దాల్చి సరసభంగి
భువనమోహనముగా మురళీవినాదంబు సేయుచు గోపికాస్త్రీలకెల్ల


గీ.

వలపు పుట్టించి మోహించి వారి తనదుకడకు రతికాంక్షఁ జనుదేరగా నొనర్చె
నట్టికృష్ణునిచరితంబు నభినుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తౌర్యత్రికము సురతక్రియోపకపామగ్రి యని గోవసతులఁ గూడి
రాసోత్సవము చేసె రహి గోపికల కందఱకు నన్ని హరిశరీరములు దాల్చి
మించి సంక్రీడఁగావించి దా యోగీశ్వరేశ్వరత్వము నర్థి నెఱుకపఱచె
నేకకాలమున నేకరూపములతో గోర్కెతీఱ ననేకగోపికలకు


గీ.

వేట్క విధువనతృప్తి గావించి తనదుసర్వసమతయు దెలిపె నాశ్చర్యఫణితి
నట్టిరసికాగ్రణి విలాసఁ మభిమతింతు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

లీల బ్రహ్మానందలేశసన్నిభరతిక్రీడాసుఖంబు లౌకికసుఖంబు
లందు ముఖ్యంబని యనుభవసిద్ధంబుగా నెఱిఁగి జనంబు దానిమీద
నమనస్కసిద్ధిచే ననుభవింపగ నర్హమైన బ్రహ్మానంద మాత్మలోన
నూహించి తగుయత్న మొనరించి కృతకృత్యులౌట కనేకగోపాంగనలను

గీ.

గూడి గోలోకమందు గోకులమునందు వేడుకలుమీఱ విధువనక్రీడ సలిపె
నట్టి కృష్ణుని శృంగార మభినుతింప నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

[6]రణము గావింప నొల్లక విషాదంబు నొందిన యర్జునుని నిమిత్తీకరించి
సర్వోపనిషదర్థపాదభూతంబు సద్యోముక్తిదము మహా యెగి వేద్య
మైన గీతాశాస్త్ర మత్యంతకరుణచే కర ముపదేశించు టరయచూడ
భావికాలజనంబు భవబంధములఁ బాసి దోడ్తోడ ముక్తినొందుట గాదె


గీ.

యట్టి కంసారి సృష్టిరక్షాంతకారి భువనహితకారి గోపికామోహకారి
శౌరి లీలావిలాసము ల్సన్నుతింతు నతులమైన బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అంతిమన్మృతి తనయందుఁ గల్గుట జేసి చేదీశ కంస మురాదులకును
సతతంబు భావించు కతన గోపికలకు నల నందునకు యశోదాదులకును
సకలధర్మంబులు చాలించి శరణంబునఁ దిన విజ యెద్ధ వాదులకును
మోక్ష మొసంగుట మొనసి గీతోక్తులు నిజము సేయుటకును విఖిల సమతఁ


గీ.

దవిలి లోకహితార్థమే యవతరించె నుర్వి ననునది తెలియఁజేయుటకుగాదె
యట్టిహరిలీల లన్నియు నభినుతింతు నార్యులార! బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మధురలో నుండి యమ్మాధవుం డొకనాడు వ్రేపల్లెలో నున్న గోపికలను
రాధను యిళనును రతిరహస్యంబులు వారల లీలావిహారములను
రాసోత్సవంబు జలక్రీడలను మఱి వారల నర్మసంభాషణములు
మనమున తలపోసి మమతనిల్పగలేక యేకాంతసీమకు నింపుమెఱయ


గీ.

యుద్ధవుని వేగరావించి యుత్సుకమున నతనితో నెయ్యమునఁ బల్కినట్టిశౌరి
విప్రలంబశృంగారంబు విస్తరింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒనర పిన్నటనాఁటనుండియు నాసోయగము శఠత్వాది భావములు జూచి
ననుఁ గూడి క్రీడింప బనిబూని వనిత లింపొసగ కాత్యాయనీపూజ సలిపి
వరములు వడపి యవ్వల శరద్రజనివనంబులో మద్వేణునాదము విని
పతిసుతాదుల వీడి బాళితో నావద్ద కరుదెంచి యేనీతు లాడ వగలు


గీ.

మీఱ బ్రతుకాసమాని కన్నీరుగార "నిన్ను నమ్మితిమ" న్నమాటెన్నుకొనిన
జాలియగుచున్న దట్టియోషల వలపులు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

ఉత్సుసత్వమున నన్నొకనాడు పైకొన్న చెలికి లో మెరిపింపు వలన మిగుల
సౌఖ్యరూపకపరిశ్రమము బాటిలఁజేయ తాళలేనని యది తత్తఱమున
నక్కు వ్రాలి దామ్రొక్కుచు కళవింప గమకింప నది చూచి కరములేను
బలు పిఱుందులకు లంకెలు వైచి చంద్రనాడికి రాపుఁ జేఁయదప్పక తనంత


గీ.

చిలుచిలు మటంచుగళ జాఱజిక్కి "నీకు దక్కితి యింక నన్ను గదల్పకుండు"
మనుచు బతిమాలుకొన్న యవ్వనితహొయలు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సమబంధ మొనరించు సమయంబునను వీకగళలంటి చూచుకంబులు స్పృశించి
మొనసి పాదాంగుష్టములు మోపి పైకుబ్బి కాయజచ్ఛత్రసంఘర్షణంబు
గా రతిక్రియ సల్ప గనుగొని యిది యేమి యాతురం బింతలో నకట తృప్తి
గావించుటకు నీవు గమనించెద వటంచు కుర్నీషు చేసి నా కోర్కె తీర


గీ.

రతి యొనర్చినపిదప నీలాటి పనులు సేయదగు గాని యిప్పుడే సేయదగునె
యనుచు నను వేఁడుకొన్నయయ్యబలసొంపు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సుదతి యొక్కరు నే నెదురుగా గూర్చుండి మొనసి సేతులు వెన్క మోపి యుబికి
తగరుఁ తాకుల కొంతతడవు మెప్పులుగాంచి యట మేథూనమున నేనబ్జనాడి
మీటిచు మొనలంట మెలఁత చన్మొనలు చక్కగనొక్కి రసనచే గదలఁజేసి
యవ్వల కెమ్మోని నానుచు చూచుకంబులు కరంబుల నంటి కళలు రేపఁ


గీ.

కదలనీయక చేత లింగంబు బట్టి కమలశరుడోలికను కఠోరముగ నూచిఁ
కళను చిలచిలమని కుమ్మరిలగ జేసి పరవశత్వము నొందిన పడతి పొగను
మదిదలంప బ్రహ్మానంద మదియ కాదె


సీ.

మునికొని గోబంధమున నేను గూడిన నాతి హస్తము లుర్వి నూతఁజేసి
కొని యెదురెత్తుచు దననితంబము నెత్తి రహి నిల్వ పవనపూరణముచేత
మరుగేహము తరతర యను నాదంబు వెడల నేనవ్విన వ్రీడనొంది
తడయక లేవనంతకు కిర్రుమన తలవంచి యూరులు బిగియించి కదల


గీ.

కున్న గనుగొని దానిచె య్యిడిచిపట్టి పొలుపుమీఱంగ విరులపాన్పునకు దీసి
కలసి హాయి యొనర్సిన క్రమములన్ని మరిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తరుణి యొక్కతె నేను దిరునాళతఱి నలంకారము గావించి కౌతుకమున
వేడుక చూడంగ వెడలునప్పుడు రతి గావింప మనసైన గలయుటకును

పాయ మూహించి నైపద్యంబు జడకుండ నొకకంబ మూనుకయుంటి నేను
పడఁతి నాతొడలపై పదములుంచి కరాబ్జములు నాదు మెడకు లంకెలు ఘటించి


గీ.

యేను చేతుల తననడు మెత్తి పట్టుకొన నగారూఢమునఁ గూడి కోర్కె మీఱ
తనమనసు దీర్చుకొన్నట్టి దానిసొబగు మదిఁతలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పూబోడి యొక్కతె పురుషాయితమున నీదగుశక్తిఁ జూతునా యనుచు లేచి
చెలగి పైకెక్కి బస్కీలు సేయగ నొక్కమాటు నే వంచించి మీటె తొలగ
నిడిన వంకర దిద్ది యెడనెడ నవ్వుచు నభిముఖంబుగ నుండి యంత మీఁద
ఘటచక్రముగ నది కడువేడ్క ఱివ్వున తొలగి పోనీక వెన్కలకు దిరిగి


గీ.

కొంతసేపు రమించి దా నంతమీఁద మఱల నెదురుగ దిరిగి సమంబు గాఁక
సుఖము గలుగంగజేసినసొంపుపెంపు మదిఁదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గ్రామ్యబంధముననే రతిసేయనిది జాణతనము గావింక నీవు వెనుక దిరిగి
నేర్పునఁ గ్రీడింప నిను మెచ్చుకొందునో యనఁగ నే నారీతి వెనుక దిరిగి
యురమును వంచించి యెప్పుగా దానిపిఱుందుల పైకొచ్చి యంద మలర
సరిజేసి సురతంబు సలిపిన భళిర నీయట్టి విసగ్ధుని నవని నెందు


గీ.

నెఱుఁగ నింక సమంబుగాఁ దిరిగి కేళిసలుపు మన నట్ల జేసి యాచెలికి తృప్తి
గలుగఁజేసిననాఁటి కోమలిసుఖంబు మదిఁదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఎలనాగయును నేను నిలువుటద్దములలో సొగసుగా నొకనాడు చూచుకొనుచు
పెక్కుబంధంబుల బెనఁగొని క్రీడించి యలసటఁగొని సరికళలు విడిచి
వరుసఁ గూర్చుండి యెండొరుల చెమట లార్చుకొనుచు కళావిసర్జన మొనర్చు
టకు నిల్పుకొనుట కెంతయు సమర్థులమైన మనకు నిర్వురకే సామ్యంబు కాని


గీ.

కళలు రతివేళ తమయిచ్చకొలది విడువ నాగికొననేర్పులేనివా రవని రసిక
తములె? యని లేమ యన్నయందంపుమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ప్రణయకోపమున నే బవళింప దగ్గఱిముద్దాడ చా ల్సాలు పొమ్మటంచు
విదలించివైచిన విడుతునా యని మీసములు దువ్వి పైబడి కలియరాగ
నటునిటు దప్పింప పటభూషణము లూడ్చి జట్టిపోరాటంబు సలుపుటకును
వదలక పైవ్రాలి కదలకుండఁగఁ బట్టి మకరధ్వజముఁ గొని మరునియింట

గీ.

జొనిపి పాలిండ్లు నాయెద నునిచి యదమి కౌగిట బిగించి కెమ్మోవి కందనొక్క
తనిసి రమియించినట్టి చందంబులన్ని మదితలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఏ నొక్కనాటిరే యేమి గావించునో కలికి చూతమటంచు బలుకకున్న
బహుచమత్కారముల్ బచరించి యంతకు నే బ్రసన్నుడ గామి నిశ్చయించి
తమి జూప యింత నిర్దయుడ వైతివిదేల? యేమి సేయుదు నింక నీవు మున్ను
తెలిపిన తెఱగుఁన దృప్తినొందెద నని మరునింట బహునాడి చక్రముంచి


గీ.

నాడిమన్మధచ్ఛత్రంబు గూడ మీటి మెదపి కదలించి కళజార గదిసి నన్ను
కౌగిట గదించినట్టి భోగక్రమంబు మదినలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నలు వొప్పక నాడు నాగరంబున నేను బెనఁగెడితఱి నాదునింత నీవు
కను మని చిఱునవ్వు గదురంగ కడు పక్కళించి యూపిరి బిగియించి చాల
ముక్కుచు మరుగేహమున నున్న లింగంబుచేత నాశేఫ మచ్చెరువు గాఁగ
మెడ బట్టి దోఁచిన వడువున బయలకు ద్రోచిన వెఱగంది చూచుచుండ
యోనికవాటంబు నొయ్యన బంధించి యిది గట్టితనము గాదింక నీదు
ఘఁనతజూతము గూడు మన రోసమున శక్తి జూపి మెండినయిది జొరకయున్న


గీ.

హేళనము జేసి పదపడి కృప చెలంగ క్రీఁడ కవకాశ మొసగ నే గూడి యప్పు
డనుభవించిన సురతసంజనితసుఖ మదిదలంప బహ్మానంద మదియకాదె.


సీ.

ఒక కాముకియును నే నొక్కనా డేఁ నెక్కుడే నెక్కు డనికర మేపుజూప
సరి తారసిలి క్రీడ సలుపుచో నాకు ముందుకళ జాఱిన మగువ నవ్వ
యింతమాత్రమునకే యేల నవ్వెద వని నేను గ్రమ్మరగూడి దానికళను
వెసవీడగా జేయ నిసుమంత తాళు మటన్న నేనవ్విన నవ్వెలంది
నీ కెట్లో నాకట్లు నిలిపి కూడుదు మన్న నేనట్లు గావింప నిటుల రోస
మలర రేయంతయు గలసి పురుషునకు తొరయైన నావృత్తు లరయ నధిక


గీ.

మతివ కావర్తులవి తక్కువైన చిరపతనము గలిగుండు గావున దలపతుల్య
మనుచు సరసోక్తు లాడుకొన్నట్టివిధము మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పరకీయతోఁడ బల్మరు గూడుటకు విడంబనము గల్గమి నేను ప్రథమసురత
మందె జాగుగ జేసి యతివకు కళజారజేయు నుపాయంబు చింత చేసి

కూడుచు నిల్పి తత్కుచములు చుంబించి మఱిసేయు చేమేమొమాటలకును
బెట్టుచు పగదాని దిట్టుచు కొమ్మ నీసౌందర్య మెంతని సన్నుతింతు
ననుచు నీ యొడలు మెల్లనఁ జూడనిమ్మని యొఱపుగాఁ జూచుచు మరలగూడి
వెడలించి దానిపై బెట్టితిట్టుచు గూడుచును వెన్క కటుదీసి వనజనేత్రి


గీ.

యీఁటెపోటులు గనుమంచు నిట్లులేనివ్యాజముల నిల్పినిల్పగా వలసినట్లు
జేసి చెలి కళ జారజేసినవిధంబు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

చిఱుతప్రాయమున నే నెరతనం బెఱుగక చదురతతోఁగూడ చనువుమీర
నది చెంప గొట్టుచు నటు గోరు బెట్టుచు వెఱపు దెల్పుచు తొడ బెల్లమిడుచు
తఱి యయ్యె విడువంగ దగదని వేడుదు నింతయే? నీశక్తి యింక విడువు
మనుచు దాకరమున నది బట్టి జొన్పుచు గౌగిట బిగియించి గారవించి
మొనపంట నొక్కుచు ముతికొని శ్రమముచే నవమానముల కళ నాగికొనుచు


గీ.

మొనసి యెడనెడఁ బురికొల్చుకొనుచుఁ గూడి సమత నిరువుర కేకకాలముకళలు
జాఱఁజేసినచెలి చమత్కారములను మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మఱియొక్కనాడు నే మక్కువ నొకదాని స్మరశాస్త్రనిగదితస్థానములను
చుంబన మొనరించి శృంగిబేరంబు చుంబనము జేయుచు లోని కొనరనూపి
ఎక్కింప గుర్రని యొక్కనాదము బుట్ట నేనవ్వ సిగ్గుచే నెలఁత లేవ
తొలగితివేఁ మన్న తెలియక ననుమానపడి చీరకొంగున దుడిచి చూడ
నాతమ్ములపురంగు నలుపుగా గనుపింప చెఱగు మాసినదని చెలియ తొలగి


గీ.

శిరమవాంచినతత్వంబు దెలియజెప్పి తల్పమున జేర్చి కూడి యిద్దరము సౌఖ్య
మంది ముదమున నవ్వుకొన్నట్టివిధము మదిదలంప బహ్మానంద మదియకాదె.


సీ.

పడతి నేనును గత వసనుల మైలేచి మారయుద్ధమునకు దారసిల్లి
కలబడి పోరి నే కాల ల్డెమిడి దాని బడద్రోచి పైనెక్క పదముచేత
తొలగఁ ద్రోయుచు నది తోడ్తోడ పైకొని కుదియబట్టిన నేను కొప్పులాగి
పొర్లించి కూడలా పోటు దప్పించుక కాళ్ళు కత్తెరవేసి గరిత ముందు
కొగి నిగ్గి పైకి లేవగ బోవ రొమ్ములబట్టి నే పడద్రోచి పైకి నెక్కి
యదిమిపట్టిన వేగ నదియు నాసిగ బట్టి యీడ్చి చెక్కుల గొట్టి యేపుమీఱ
ప్రక్కకు పొర్లించి పైకెక్కి చేత లింగము బట్టి ననుబాల గాసిపఱచి

గీ.

తరుణి నొప్పించి యొప్పించి తాను గూడ ననంగబలాయెనంచు నే నభినుతింప
నాతి యుప్పొంగి చేసిన నాటిరతులు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వగలాడి వగటచే బిగువు గల్గగఁ జేసికొని రాగ నేజొన్పి వనిత జూచి
వగరుచేత రవంత బిగువుండునొక్కింత చెమ్మగిల్లినది యిమ్ముజూపు
రతిలోన దగనిద్దఱకును మంటని జూపుబిగువుకు నేనొక్క వెరవు జెప్ప
సక్థిద్వయము జేసి సాచుక పవళింప నిరుదెస కాళ్లుంచి యేను మీఁద


గీ.

జేరికూడి బిగువుజూపి చెలియె సంపృతోరుబంధ మిది యటన్న నౌర వింత
నేర్పితివటంచు మెచ్చిన నెలతమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె


సీ.

అతివ యొకర్తు నే నన్యోన్యపాదముల్ ప్రక్కనుదలలుంచి పవ్వళించి
యెదురుగాదిరిగి మేమెడను కాళ్లను సాచి తలగడల్ చేసి క్రిందులకు వామ
కరములు సాచి పైకాళ్ళ సందులకు బోనిచ్చి కొంచెమువంచి యిలను పదము
లానించి దక్షిణహస్తంబులటు మోడ్చి పృథివిపై మోర యొక్కింత యుబికి
సరిజేసి వెసజొన్పి జాఱిపోకుండ ఖబద్ధారుగా వింతపరిఢవిల్ల


గీ.

చెలుపు మీఱంగ గూడి ఖుషిని జెంది నీవె సరి; నీవె సరి; యని నేర్పు మీఱ
యిరువురము మెచ్చుకున్న యానెరతంబున మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకరాత్రి నేను దర్పకయుద్ధమున లెక్క సలుపుచు ఘడియలు జరిపి నిలిపి
జాములు వెడలించ సరి నాకు సంతృష్టి గాకున్న చెలి నన్ను గాంచి, మందు
మహిమయో! మఱిమఱి మంత్రంబులో లేక తంత్రమో! యీ వింత ధరణి నెందు
గన్నది విన్నదిగా దింక తాళలేనని యొక్కచే పాద మవలచేత


గీ.

చుబుకమును బట్టి ప్రార్థింపజూచి కళను తక్షణమె డింప నూర్ధ్వరేతస్కుడవని
వనిత శాబాసుగిరి యొసంగిన పసందు మదిఁదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పడతి యొకనాఁడు పరిహాసింపదలంచి సమరతిఁ జేయుచు క్షణము నిలిపి
లలి తర్జనీమధ్యములలోని కటు జొన్పి యూర్ధ్వభాగంబున నున్న సలిల
నాడిక కదలించి ననువొప్ప ముందుపారిన యొంటేలు జాలనవ్వి
తోయజానన లిట్లు సేయుదురా? యని పరిహసింపగ వక్త్రపంకజంబు


గీ.

చిన్నబోవ దిగ్గున లేచి చీర ముడిచి యౌర యిది యేమి యాగడమంచు కళల
మందుకొని సందులకు బోయినట్టిహొయలు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

మఱియొకనాడు సమర్తప్రాయముదాని మొలకచన్నులు గలముద్దులాఁడి
నెలమితో ఫలదానముల సొమ్ములను మేలిమాటల చేష్టల మరులు కొలిపి
విరులశయ్యకు దాల్చి వివృతోరుబంధక్రమంబుల సారె మరునిసిడము
దగిలించి చెమ్మగిల్లఁజేసి లోని కంగుళి జొన్పి సులభంబు దెలియబఱచి
వెస మేహనముమీది ముసుగు ముందటికటు బోద్రోచి జొనిపినముసుగుప్రక్క
లాని వెన్కకు రాగ నది ముందుకు బోవ కెవ్వున నొప్పిచే కేకవేయ


గీ.

కదలకుండగ బట్టి యో కలికి! యింక నొప్పిలేదని యభయంబు జెప్పి చెప్పి
కలిసి యభ్యాస పఱచిన కౌశలంబు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పచ్చిపఠాన రూపము దాల్చి కైసేసి తెచ్చిన వెలలేని తేజ నెక్కి
బాజి భావా వుడాన్ వరుస నడువంగచేపి చెలికాండ్లు చేరి “యౌరశాబాస”
నంగ నే స్వారి బోవగా నొక్కయువతి దా కిటికీల నుండి చూచి
కడుమోహమున నాదుకడ కిపు డేతెంచి యొకమాట విని బోవు టొప్పు ననుచు
కబురు పంపిన నేను వేడ్కబోయిన పైబడి కౌగిట బట్టి నిలిచి
క్రీడ గావించి ముద్దాడి బాళినిగొని దృష్టి నాకునొ యంచు తిరుగు సెలవొ


గీ.

వంగి "యల దాని వీథికి జనగ నింక వలదుసామి నాయొద్దకే వచ్చుచుండు"
మనుచు జవ్వని ప్ర్రార్థించినట్టి నెనరు మదిదలంప బ్రహ్మానంద మదియెకాదె.


సీ.

పరగ హిందుస్థాని దిరుసువేసుక జరీతాజూ ధరించి ఝోకా జెలంగ
చాలుగా నాల్గు తేజీల బూన్చిన రథమెక్కి నా చెలికాని యెదుర నుంచు
కొని రాత్రిచేసిన పనులన్నియు జెప్పుకొనుచు నేరా హర్మ్య మొనర నెక్కి
కనుగొని యొకతన్వి కళ చెళుక్కున లోనకలకబాఱి చెమర్ప నిలువలేక
తొడలు కంపము నొంద నుడుకుచు రాత్రికి తనవంతు గాకయుండినను మమత


గీ.

నిలుపగా జాల నేడె రావలయు నందు బాలకునిచేత నొకచీటి బంపిపిలువ
నంపి ననుగూడి గ్రీడించినట్టి సొంపు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నెఱజాణతో గూడి సురతాంతమున నిల్పి కౌగిట నదిమి నే కళను విడువ
నది చూచి యిదియేమి యాతురం బని నాకు కడు వేగ నుద్ధతి గలుగజేసి

పైకొని పలుమాఱు బస్కీలు వేయుచు పఁరగ మత్కళ కల్క బాఱజేఁసి
ఖలనవేళను గ్రీడ నిలుపక గావించి తుది నందులోఁ జాల తొరయ జూప


గీ.

నిలిపి కళలను విడిచిన బలుసుఖంబుకన్న శతగుణిదానంద మనుభవించి
యబలను నుతించి యది మొద లటుల చేసి ముదముగంట బ్రహ్మానంద మదియకాదె.


సీ.

విను పూర్వసంకేతమున నేను సందుగోడలమఱుగున పొంచి దలగకుండ
నను సైగజేయ మెల్లన తల్పుచాటున నీవలావల నిల్చి యింటివార
లిసుమంత వినకుండ గుసగుసననుచు చేమార్పుల మేము మర్మములు దడువు
కొనుచుండ నంతలో తన భర్త వచ్చిన నుపచారములు చేసి యోగిరమిడి
కరగతకలశియై పెరటిలోనికిఁ పోయివచ్చెదనని చెప్పి వచ్చి నన్ను


గీ.

గలసి గోబంధమున క్రీడ సలిపి, మరల నను గలియు టెప్పుఁ డనుచు మేహనముచేత
బట్టి కదలించి సెలవిచ్చినట్టి నెనరు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తలిరుప్రాయమువాడు వలపు నాపై జేర్చి మరిగి యర్ధంబుగా దిరుగులాడు
నుడిగంపుపనులు చేయుటకు దగ్గర జేరి మేనిసోకులఁ గొంత మెరపుజూపు
ప్రియలన్నమాటలు వినుమని చెవియొద్ద చేరి తాగుసగుస జెప్పసాగు
నది విని కలికిరో యిది యేమి! యన నవ్వితలవంచి తనకోర్కె దెలుపవెఱచు


గీ.

దయగలిగిగూడ తిన్నతిన్నగయటండు బాల సుఖియించి యింక నెప్పటికి నన్ను
విడువవలదంచు బలికిననుడులసొంపు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఇంత కన్నెరికంబు నెఱుగని చిన్ననా డచ్చికమచ్చికలాడి కూడి
మన సొక్కటిగ చేసికొనినపిమ్మట సిగ్గువిడిచి సందేహంబు లడుగదొడఁగి
నీచేయి దాకిన నాచోట జెమరించు మొలకచన్నులమొనల్ జిలజిల మను
మనసైన యంగుళి మరువింట జొనిపిన నీదుప్రథానంబు నించినట్లు


గీ.

గలుగదు సుఖంబు స్వప్నగరములందు కన్నులకు గప్పినట్లుందు విన్నిటికిని
మూలమెఱిగింపుమన్న యమ్ముగుదమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సరసత నొకదాని సంకేతదినమున నన్యకాంతను గూడి యపుడె వచ్చి
దానితో గూడ నాతమక మించుకయున్న ననుమానపడి పైకి యడరి చూచి
స్మరకేతుబిలము విశాలమై ద్రవముండి కఱకుమీఱియు మొన గడుసుబారి
యున్న విదానించి యుపరతికి గడంగి నిలుపక సేయుచు నెలతనాదు

గీ.

కళ నిలువ కొంతవడి కతికష్టముకను కలగబారంగ జేయ నాకళయు జాఱ
నాదు ద్రవసుఖన్యూనతల్ నాకు జూపి చెంప గొట్టిన నే మ్రొక్కి చింతదీర్చి
నది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సామాన్య యెంత నిజంబు బల్కిన మరియొక్కనితో గూడకుండ దనిన
యే నట్టిదానిగా నది చూడు మంచు పందెమువేసి యట కొన్నిదినములకును
యే నూర లేకుండు టెఱిగి యన్యుని గూడ మఱుదినంబున వచ్చి మరునికేళి
గావించుచో లోన కరకు లేకుండుట రెప్పల బిగియెల్ల గప్పియుంట
యంగజగృహమధ్యలింగమార్గము విస్తరించి యుండుట విలోకించి దొంగ
చిక్కితివో యన్న చిఱునగ వొలయ లేదంచు గొంత సాధించి పిదప


గీ.

గురుతులను జూప దప్పించుకొనగలేక వియ్యకొనియట్టి జాణ లెందేని కలరె?
యనుచు జంకుచు నాతోడ నన్నమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకయెలనాగ నే నొప్పుగా క్రీడించి క్షాళనంబులు చేసి సరసనుండ
బాలకుం డేడ్చిన పాలిచ్చుటకు బోవ చెలగి వెంటనె దాని చెలిని నేను
కలిసిన నది యది తెలిసి నాతో పునఃకరణంబునకు గొంత కాలయాప
నము చేసి కూడుదు వనుదినం బట్టి నీకింతలోపల శక్తి యెట్టుకలిగె
కరము చిత్రం బని పురుషస్వభావంబు నెరుగక కోపించి యిపుడు మరల
నను గూడుమన నిప్డు నాకేమియునులేక నలుక దీర్చుట కుపాయంబు వెదకి


గీ.

వేగ వెడవిల్తుడోల చుంబించి వ్రేలిచేత గదిలించి యేమేమొ చేసిచేసి
నాతి కళ జారజేసిననాటియొప్పు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఇధరు యిస్తంబుల్ సహీగుబాబీ చేర్చి ఆర్ గజా నామేన నలదరాగ
నాతి నేకడవాడ నాయన్న తక్సీరు మాపుకరో యని మమత తోడ
వెస నంబరంబులు నిచ్చి తా చందాన పంక మలంది నాపైన వ్రాలి
గొగలించి పెనంగి కలయ నామేన గంధము పూసి సురత ముద్ధతి సలుపుచు
దగ్గుచు లోమొగ్గతాకుల కడుబిగువులతమి జూప నే బలుకుకున్న
నగలాడి యెక్కెక్కి వగయేడు లేడ్చుచు పట్టువిడ్పులలోన పరగచేయ


గీ.

పంతనలోన చక్కలిగింత లిడుచు కాంత కారెండుతెఱగులు గలుగచేయ
నెలమి కళలట్టు విడిచిన నెరతనంబు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

కాంత వేడుక నన్ను గనుంగొని నీయట్టి తనయుండు కావలెనని యడిగిన
కడఁగి లోపలి కళికారంధ్రవైపుల్య మది లేక చెమ్మగొడ్రాలి నీచు
వాసన మిగుల రాబరికించి నీకు బిడ్డలు గల్గరన నవ్వెలది రోస
మున ఋతుదినములఁ బురుషులఁ దప్పకగలియుచు నటు కొంతకాలమునకు
మది నాసమాని గ్రమ్మర నన్ను బ్రార్థింప యెముక కర్ణికలోన నునిచి యపుడు


గీ.

శ్రమము నొందించి నాళరంధ్రము సడల్చి పరగమందిచ్చి కూడ గర్భంబు వచ్చి
శిశువుఁ గని నన్ను మెచ్చినచెలియప్రేమ మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

కాముకి ననుజేరి కలయుమటన్న నే నెలమి బాహ్యరతంబు సలిపి తెలిపి
గాఢరతమ్ముకు కాలంబు గాదన్న నదియేమి కారణం బనుచు నడుగ
పొనఁగలో కమలంబు ముకుళించియుండుట యొఱపైన మరుడోల యుబికియుంట
ప్ర్రక్కలు మందమై ద్రవములో చద్దివాసన గల్గియుంట కుచములు కఠిన
తను వహించుటయును గన్మొనల నాఫర్మాని రంగుమీరుట సలిలంబు నోర
నూరుట చప్పని సౌరభం బొరయుట మొదలైనగురుతు లింపొదల జూపి


గీ.

యింతి నీకింక ముట్టురా దిదిమొదలుగ నల్పరతమునఁ దనివొందుమనుచు నట్లు
చేయనను మెచ్చుకొన్న యాచెలువహొయలు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గాఢరతంబున వైపుల్య మందిన నతనుడోలిక చేత నమర బట్టి
పైకి నాకర్షింప ప్రక్కలు గదిపిన బిగివొందనట్లు నీ దగుకరమున
తొలగి సడలకుండ ద్రోసి పట్టుమటంచు సమవిపరీతబంధముల బెనగి
గ్రామ్యబంధమున గలయు మీవని పల్క వాలాయమఱుకాళ్ళు నేలనూది
జఘనంబు వంచి బెల్చనకేల బిగియించి వీ పెత్తి బట్టి బల్ వేడ్క మీఱ


గీ.

గలయుమన నేను జొన్ప మిక్కిలిబిగువుగ యుంట గని మెచ్చుకొన్న యయ్యువతి ఇట్టి
యరిదిసేత లెఱుంగుదే యన్నమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకప్రౌఢకామిని యొక్కనా డొకముద్ద కేమేమొ రుచిదెల్సి యింపుమీఱ
గొనితెచ్చినా ప్రక్కనుంచి హస్తము బట్టుకొని యది చూడంగ కోర్కె మీఱ
మొదల తా ననుఁ గూడి యిది యెంత హాయిగా నున్నదే! యని బాళియొదవజేసి
యంత దా లేచి యయ్యబల వల్దనిన నీవి సడలించి బలిమిచేఁ శయ్యఁ జేర్చి
కదలకుండగబట్టి గవియుమటన్న నేనటుగూడ నొప్పి నొప్పనిన నింక

క్షణ మోర్చుకొమ్మని సఖి యూఱడించి యించుకసేపునకు బాలసురతసౌఖ్య
పారవశ్యము జూచి పడతి నాతోడె యిప్పు డెటున్న దనిని పొలతి నవ్వ
"కన్నెఱికఁ బాయెగద!" యని పల్కి దానంతట నన్ను ముద్దాడి సామి!


గీ.

యిటుల మనసొప్పి నీదయావృద్ధికొఱకు నేను జేసితి నీపను లింక నెపుడు
మఱువవలదని చెప్పినమగువమాట మది దలంప బ్రహ్మానంద మదియకాదె


సీ.

యువతి కైసేసి నాయొద్దకు రా జూచి మొనసి కన్నులు వేగ మూసుకొంటి
నాతిదగ్గరఁజేరి “నానేర మేమ" న్న నలిగినట్లుగ నేను బలుకకుంటి
లేమ యోచించి శరీరభేదములకు విశ్లేషసంభోగశూన్య
తలకు చింతించు నాతలం పెఱింగి నిరీక్షనాలింగనములకు నడ్డమైన
మొలచీర కంచుకంబును విచ్చి నగ్నమై కదియరా విదలించి కసరుకొంటి
భూషణంబులు డుల్చి పూబోఁడి చేరరా మనసియ్య కేనట్లు మరలుకొంటి


గీ.

యొడలి గంధంబు గడిగిరా నూరకున్న సామి యలుకేల యీతప్పు సైపు మనుచు
చెలియ నను గూడి హాయి చేసినవిధంబు మది దలుప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పసిడిపళ్లెరములో బహువిధరుచ్యపదార్థంబు లిడుకొని తరుణి నేను
యెదురుగాఁ గూర్చుండి ముదముతో భుజియించుతఱి కబళంబు లొండొరులనోటి
కందిచ్చుచును బుగ్గ లందంద బొడుచుచుఁ బ్రేమ మీఱంగ ఫీడామిఠాయి
యిరుప్రక్కలను నోళ్ళ నిడుకొని చప్పరింపుచు కరంగినవెన్క మోవియందు
కొని "యిది కడురుచి" యనుచు నొండొకచేత మర్మముల్ దడవుచు మమత మీఱ
గలయుచు నిది వేళ కాదని నిలుపుచు నతియత్నమున దమి నాపికొనుచు


గీ.

పాలుపాయసమునుఁ దాను గ్రోలి నోర జెలిమి నుంచుచు రుచులను జెప్పికొనుచు
నాతితో నారగించిన నాఁటిసొగసు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాఁడు పలుమారు నుడుగక రతి సల్పి ఱాపుచే లోపలిద్రవ మడంగ
మంటచే నుద్ధతి మఱి తగ్గిపోవ నే నన్యకాంతను చిత్తమందు దలచి
కన్నులు మూసి చిక్కగ నూపిరి బిగియించి వదలక కడువడివడిగఁ జేయు
తఱి దానిపేరు మైమఱపుచే జాఱిన నది విని యావృత్తు లధికమగుట
వలనను చిరకాలపరిచయంబునఁ బరిశ్రమమునఁ దనమీద మమత లేక
మఱియొక్కకామిని మనమున దలంచి యివ్వడువున రతి కడువడిగ జేయు

గీ.

చున్నవానిగ మదిలోన నన్నెఱింగి చెలియ కినిసి ఛటాలున జెంప గొట్ట
బదరిలేవబొ బోనీక యదిమిపట్టి నాతితో గూడితనిసిన నాటిసొగసు
మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మగవారిపేరన్న దిగులొంది పఱుగెత్తు ముగుద నొంటిగఁ జూచి పొంచిపట్ట
విదిలించివైచుచు దనఁ దెన్నుకొనుచు బెగ్గిలుచు నేడ్చుచు బుజ్జగింపులకును
సాధ్య కాకున్న బెల్చనఁ గ్రింద బడపైచి గోడకు తల మోపి గూడి పదము
లుడుఁగక పైకెత్తి తొడలచే బిగియించి జానుపార్శ్వముల హస్తములు సాచి
మెలతచేతులు పట్టి మెడకు లంకె ఘటించి కదలకుండగఁ బట్టబదరి రోద


గీ.

నంబు సేయుఁచు దిట్టుచుండంగ బలిమి గ్రక్కున క్రీడ గావింప గోర్కె తీర్చు
కొనిన రుచి గని బాల సౌక్కినవిధంబు మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

మఱియొక్కప్రేయసి మదనోత్సవము సల్ప శృంగార మొనరించి రంగుమీఱ
వేడ్కతో క్రీడించుధములన్నియు మది నూహించి యుత్సాహ మొప్ప హంస
కములు మ్రోయగ బాన్పుగదియవచ్చిన లేచి గౌగిట జేర్చి యంకమునుంచి
బాహ్యకేళీకళాపరిపాక మొనరింప నది తమి నిల్పలేననుచు బైకి
నెక్కి బో ననుమాన మించుకదోచిన దిగులొంది పాదంబు దీసి గ్రింద
బెట్టి పానుపుడిగి వెనదీపముజూచి యశ్రులనించుచు నాడుదానినై


గీ.

పుట్టినది యేటికని తన్ను దిట్టుకొనుచు విరుదిదండలు సొమ్ములు చెఱికివైచి
కలశమందుక తొలఁగిన కలికిపెతలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సురతాంతమున దన్వి సొలసి నాయుర మానుకొని సుఖాసీనయై యొనర మేని
విఱుపున పైకెక్కి కరములు పైకెత్తి చనుమొనల్ నిక్కగ వెనుకకొఱగ
దిలకించి యేను నవ్వులకు జన్నులపై నఖాంకురంబులనింప జంకుసొలగు
వెలది యేమరియుండ వెనుకనేవచ్చి చన్నొడచి పట్టిన నుల్కిపడుచు నెవ్వ
డని గిఱుక్కున మళ్ళి కనుగొన్నచూపులు నిదురించియున్నచో నేను కూడ
ఝల్లని తనకాలు జాడించుసొగసును నీరాడుతరి బొంచి నేను బోవ


గీ.

లేచి చెయ్యడ్డమిడికొని లేమ వంగి యంబరమును బుచ్చుకొని యిట్టి యాగడంపు
బనుల వలదంచు వెంత పల్కిన రమించినదియు దలప బ్రహ్మానంద మదియగాదె.

సీ.

బాహ్యకేళి దొనర్సి వదలిన నిట్టిచేతల చానలకు దృప్తి కలుఁగ దనిన
యంతకు నేనేమి యనకూరకుండిన మగవానివలె నింతమాత్రమునకు
పలుమఱు నన్నేల బిలిపింపవలె నన్న నంతట నేగూడి పంతమరల
కళ చలింపగచేసి గ్రక్కున వెనుకకుఁ దీసినఁ గోపంబు చేసి తిట్టి
నఖముల గిల్లి క్రన్నన పదంబుల దన్ని బొలిగి యేడ్చుచు దల మోదికొనుచు
ధర్మమే! యని వదలక పైకెక్కి కలచి చెక్కులుగొట్టి కలిసి మెలసి


గీ.

గ్రద్దన మనోజసదనంబు రుద్దుకొనుచుఁ గ్రమ్మ చిమ్మనగ్రోవిచే జిమ్మినట్లు
కళను జిలికించినట్టియాకాంతహొయలు మది దలంపఁ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకలేమ పరిమాణ మూహించి నీచరితము దీనికింక సత్వమున పెద్ద
కాలంబునకుగాని కళజాఱదని క్రీడసలుపఁ దనంతనాకళ స్రవింప
నది యీసడించిన సదిగాంచి వృద్ధిలోపింపకనె మున్ను యూపిరిబిగించి
యతివేగమునగూడి యాక్షణంబున పునఃకరణంబుకు శక్తి గలుగజేసు
కొని సరి[7]చేసుట కువిదను పైచేర్చి సుఖింపచేసిన జూచి యౌర!


గీ.

నామన సెఱింగి క్రీడించి నన్ను దనిపినట్టివారి నెందును గాననైతి నెంత
జాణవని మెచ్చుకొన్న యాసకియమాట మది దలంప బ్రహ్మానంద మదియెకాదె.


సీ.

నవమాసగతయైన యువతితో నే గ్రామ్యబంధంబునందు శేఫంబు జొనిపి
గదియించి చేతులగరిత కొంకులుబట్టి యదిమిన మన్మథసదన మపుడు
పైకుబ్బ మోకాళ్ళు వంచి నే లోమొగ్గ దాకించి మెండింప దప్పకపుడు
రమణి మిక్కిలిశ్రమము గల్గిన నిదానించి రోగము గలదంచు విడుతు


గీ.

సుఖపరవశత్వమొందిన జూచి దీని కేమి వ్వాధియు లేదంచు నెఱింగి మమత
మిగుల నామీద గల్గునట్లుగ నొనర్చి యనుభవింప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సంఘాటబంధంబు సలుపంగ గోరియే నరమరలేని సుందరులనిద్ద
ఱిని శయ్యపై జేర్చి యనువుగా నొకదాని గూడి వేరొకదాని కుచయుగంబుఁ
బట్టి ముద్దాడ నప్పడతి తన్నాంతరంతి సేయలేదంచు ఱహిదలంచి
మోమువాంచిన చాన మొగమొప్ప నేగూడి తొలుతటిదాని నంగుళిరతంబు

సలుప శైపక యది తొలగి క్రమ్మఱ నన్ను చేరుమటంచు చేఁగీర దాని
సన్నయు గనుగొని న్నదివిడకున్న పరగ జ్యేష్టకనిష్టభావములను
నారియీర్షాప్రీతు లారసి యేను జోడుగగూర్చి సమబంధమున బెనంగి
మార్పులు సేయుచు నేర్చున నొకతెకు [8]ముందు కళాస్రావ మొందజేసి


గీ.

సమ్మదముఁ జూపి పెఱదాని సైగజేసి క్రీడ గావించి కళ చిలికించి తనుప
ఖనత నిరువురు దృప్తులై నను నుతించుటె దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఇంతియొక్కతె దొడ్డయిల్లాలిననియుంచు దానిభావ మెఱుంగదలచి యొక్క
వెరపున నాలేమ వినుచుండ వెంబడితరుణితో లోకవార్తలుగ నేను
విటవిటీజనులు గావించుచేతలు పచ్చిపచ్చిగ దెల్ప కోపంబులేక
ఈర్ష్యనొందక నవ్వ నే నది వీక్షించి యింతి జిక్కెనని ధైర్య మెసఁగ నొంటి
నున్నచో నట్టినర్మోక్తులే జెప్పిన నవ్వుచు సిగ్గున నన్ను జూడ


గీ.

తరుణి సిగ్గేల యిక నంచు గరము బట్టి యొద్ద నిడుకొని యది వద్దువద్దనంగ
లేదులేదంచు గ్రీడసల్పిన నెలంత యన్యు లెరగిన గర్హింతు రన్నమాట
మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

అతివ నేనును నూత్నయౌవనమున నుండి సురతవైదగ్ధ్యంబు లెఱుగనితఱి
నితరేతరప్రేమ నెంతయు మితిలేక బెరుగు నేకాంతంబు దొరుకునపుడు
సంభాషణంబులు సలిపెదమని పొంచి సమయమైనప్పుడు సాత్వికోద
యమున మాటాడలే కటు దాటిపోయిన మఱియొకవేళ దొరక
యొడ లంటగా బోవ వణకుచు చెయ్యి కాలాడకుండగ నుండ నవల దూతి
కలయగూర్చిన నధికప్రీతి నే రమించుట కేమిలేక యాసురభిళాంగి


గీ.

కొనరచే మెలుకువ చేసి మనసు దీర్చుకొనంగలే కిర్వురము నిట్లు కోర్కె బెల
చనఁగ నతికష్టమున గూడికొనినవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు నేను తోటకు బోవదిమంచివేళ యంచొకతన్వి విభునితోడ
నమ్మగారింటికి నటుబోయివచ్చెద నని భర్తతో జెప్ప నాత డొకని
తోడిచ్చిపంపిన తోటయొద్దకు వచ్చి మఱచి వచ్చితి నేను వెరపు సొమ్ము
దెమ్ము నే నందాక నమ్మయింటికి బోవనని బొంకి పంపి తా నవల నన్ను

గనిపించుకొని ప్రీతి గనుసన్నజేయ నే దెలిసి యాచెలిగూడి దృప్తిజేసి
యలివేణి యింతసాహసము జేతురు యన నవ్వి యిన్నాళ్ళకు నన్ను నిన్ను


గీ.

నలువ యిట గూర్చెనింకొకనాడు వత్తు ననుచు నొప్పించుకొని తోడిమనిషి కెదురు
గలుసుకొనిపోయినట్టి యాకలికిపనులు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వేసవులందు నే వేటబోవఁ దలంప వేడుకజూడ మీవెంటవత్తు
ననిన నీవేల రేయడవిలో శార్దూల భల్లూక సూకరభయము తేళ్ళ
చిలువలబాధలు గలవన్న నీయొద్దనున్న నాకొకభయ మొదవదనుచు
రోదనమొనరింప నేదోడుకొనిపోయి నీటిచెంగట నొక్కమాటులో
నాసీనఁ గావించి యచ్చోటమృగముల వంచించి వధియింప బొంచియుండి
మెకములురాగ నేనొకతుపాకిని పడవ్రేయ గన్గొని నాదు వెన్ను చఱచి


గీ.

భళిరయని మెచ్చుకొనుచు వార్తలు సలుపుచు తనసమక్రీడ జేయుచు నట్టె నిళలు
క్షణములుగ బుచ్చినట్టి యాగరికచేత లెద తలంప బ్రహ్మానంద మదియ కాదె.


సీ.

నెరిసాము జేసి ముప్పరిగొన్న కనకంపుప్రతిమరాయని చెప్పవచ్చుమేను
బటువై టెంకాయ పగులగొట్టుటకు సంశయములేదని చెప్పజాలు చనులు
కఠినతయును మణికళికత్తె నెడు బంపుబంగారు సబగారుపగిది నొప్ప
విగతలోమ భగంబుబిగువునుగల యొకశ్యామయు నేనును సమ్ముదమున
నగ్నులమై మదనక్రీడ గావించుతరి నదినాపైకి దాటి కూడి
గుండియదడరనొక్కుచు మేనుచెమరింప తేలగన్నులపైడి సోలివ్రాలి
కళను నేవిడువంగ గనివేశబాసనిబలుకుచు చుబుకంబు బట్టియెడలు
గలయంగ నిమురుచు గాంతరో నిన్ను నమ్మితి నింక నామీద సతదమిట్టి


గీ.

స్నేహమంచు మటంచునేఁ జెప్పుకొనిన మాటలాడంగలేక నామమత జూచి
నాతి తలయూచి చెప్పిన నాటిహొయలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

విజిటింగుహాలులో వెలలేని నిలుదర్పణముల నన్నియు బ్రతిఫలింప
సరిగులోబులు వాలుస్లైడ్లు లస్టర్ల లోపలిదీపములు పట్టపగలుజేయ
నగరుబతీలు మేలైనయత్తరు మల్లెపూలవాసనలు పంఖాలగాలి
చేనిండి మైచర్ల చేయంగపండితుల్ చెలికాండ్లు బంధువుల్ చేరికొలువ
బంగరుబత్తెముల్ రంగుగాగొని చోపుదార్లు ముంగర బరాబర్లుచేయ

మోర్చీలు చామరంబులు దీచుచు సేరుందబ్రక్కల లువకుల్ నిలిపి కొలువ
దండిసోఫాలపై దర్బారు సేయు మేళము జమాయించి యా లలన కొంత
సేపు లాస్యకళావిశేషంబులను జూపి యందున్నవారి కానంద మొసగి


గీ.

యిది సమయమంచు దనభావ మెఱకపరచి కనులతో మొక్క నేబరఖాస్తుచేసి
యచ్చటనె కూడి క్రీడింప హాయినఁదికువలయేక్షణ నన్ను మెచ్చుకొన్నవిధము
మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు హితజనయుతముగా ముఖ్తేసర్ఖాసు దర్బారు నే చేసివేడ్క
నదురుగా నే జెప్పినట్టిహిందుస్థాని ఖ్యాలురఫ్తాలు బల్ మేలుగాగ
నా పైరిబొమ్మచే నయముగ బాడింప నయ్యర్ధ మత్తన్వి కతనుతాప
మొనరింప యహివఖత్తనెడు టప్పా పాడి కనులచే భావముత్కలిక దెలుప
నందఱి నిండ్లకు నవిచి యే నింత యుమ్మర మేల ననగ పైబడి లతాంగి


గీ.

తెఱవలమనంబు మీకేమి దెలుసుననుచు నాకు లోచెమ్మ జూపి తాస నిన్నుగూడి
కోర్కె దీరంగ తమి దీర్చుకొన్నసొబగు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు నేను తప్పక తమ్ములము సేయుతఱి వచ్చి తా గొంతతమ్మలంబు
సేయుచు మడువు నాచేతి కందియ్యవలదన్న తనచేత బట్టి నోటి
కందియ్య నంతెచా లన తన పెదవిచే నానోట నునిచిన నేనుపట్టు
కొన నదివిడువ నేనును వెంటవిడిసిన నెఱిఁగి తాపంటనం దిచ్చిసగము
కొరికికొనంగ నే గొని చర్వణముచేసి యిది రుచిలేదవి యీసడించి
పుక్కిటనున్న తాంబూలంబుతోఁగూడ నుమిసిన నేమిసేయుదు నటంచు


గీ.

రమణి చింతించి యంత దానమలి విడెము దినుమనుచు బెట్ట నెంతకమ్మన యటన్న
నన్ను ముద్దాడ గలసిన నాటిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకలేమ తనభావ మొగిదెల్పుటకు వేఱె యొకదానిబిడ్డ నెత్తుకొని వేగ
దా ముద్దులాడి నాసామి నాపండు నాబంగార మనుచు నబ్బాలునోట
విడియంబు బెట్టి పెన్దొడమీద నిడుకొని చెక్కిలినివురుచు జెంపగొట్ట
బో బాలుడేడ్చిన బుజ్జగింపుచు నింక నేడ్వకు నీకు జన్నిత్తు ననుచు
బయ్యెద దొలగించి పాలు లేవని బల్కి చిరునవ్వు మోమునఁ జెలఁగ నింత

గీ.

కఠినుడగుబిడ్డ డెందును గలఁడె యనుచు నన్ను గని తాకదాడుచుఁ గన్నుసైగ
జేసి కఱగించి చేసిన చెలిరతులు మది దలంప బ్రహ్మానంద మరిదియకాదె.


ీ.

బిడ్డనొప్పులు గనుపించిన నీసారి గడ తేరుదునో లేదో కలయుమనుచు
ప్రసవించి బురిటిలోపల చూడబోయినఁ జేమార్పులకు నేల చెల్లదనును
జ్వరము వచ్చిన మం దొసంగబోయిన నిది మదనజ్వరము నన్నుఁ కదియుమనును
వ్రతరాత్రు లనుచు నూరకయున్న జూచి నన్గలసిన వ్రతఫల మబ్బుననుచు
కాలంబు గాదని కసరిన వలవల చలమొప్ప నేడ్చుచు జత్తుననుచు


గీ.

యుల్లము గఱంగి తత్కాలయోగ్యములగు పనులు నేచేయ నాసామి యనుచు మొక్కి
ముద్దుగొని సన్నుతించిన ముదితమమత మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

అలిగి కొన్నాళ్ళు నే నటుబోవకుండిన తనగర్భమున నొప్పి దగిలె నింక
నోర్వలే నొడలిలో నుండవు ప్రాణంబులనుచు బిట్టఱచుచు నట్టె దన్ను
కొనుచు నేడ్చుచుండ గుంపునుగూడి నాకడ కొక్కచెలి నంప దడయకదియు
నట్లుచెప్పిన భయ మంది నే జన కడుపొత్తుము నీవన నొత్తవచట
గాదని యట క్రిందుగా జూప నచ్చోటఁ బిసుకంగ నొప్పిచే బిగియబట్టి


గీ.

నటుల గౌగిట జేర్చి యా స్యము నాస్యముంచి యప్పని కొప్పిన నొప్పిపోవు
ననుచు ననుగూడి క్రీడించి పట్టి మమత మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

చిన్నారి యొకనాడు చెలులతో సరసంబు లాడుచు నాయొద్ద కరుదెంచి
యాసీనయై యుండ నప్పుడు నేనొకచెలి గనుగొని నవ్విన గినుక గదుర
పొలతి దిగ్గున లేచి పోవంగ జెయు బట్టి బలిమి బానుపుమీదఁ బడగవైచి
[9]పికిలిపిట్టలరీతి వెస లాగ మేసి నే బిగియించి నవ్వుచు వెలది కోప
మొనరింప జెల్లునే యని యురోజము ముట్టుకొని బాసచేసిన కోప మణగి


గీ.

నొకరినొకరు పెనంగి యొండొరులపైకి మొనసి నిగ్గుచు కాటందుకొనుచు తొలగ
ద్రోయుచు నలసి కలసిన సోయగంబు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

ఒకయెలనాగ యింటికి దూరమైయుండి యుబుసుబుచ్చుటకుఁ దా నొక్కనాడు
వచ్చి, దవ్వుల నుండి ముచ్చట లాడెదననిన నే బిలిపింప నణగి యణగి
వచ్చి, కొంగణచి యవ్వలనిల్చి సరసంబులాడుచు ముట్టంటు యంబరమున
కే కదా యదిదీసి క్రీడింపగారాదె యనిన నే నది బ్రహ్మహత్య యనిన
సిలిల ఫేనమునకు చవిటికి చెట్టుబంకకు [10]మాకు పాప మొక్కటియె గాదె
వాటి నంటకయుండ వశమె యేరికినైన నవనిలో స్త్రీహత్య కన్న బ్రహ్మ
హత్యాంశ మది యెక్కఁడగునె యాత్మకు మఱి పరికింప పాప మెప్పగిది గలుగు
ననుచు పైబడిరాగ నది చూచి పరువెత్త శుకవాణి తరిమి పట్టుకొని కూడి


గీ.

తనమనసు దీర్చుకొన్నయావెనుక నే వితాప మొనరించి చలువవస్త్రములు దాల్చ
చూచి పకపక నవ్విన సోయగంబు మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

పరసతి యొకనాడు వచ్చి నాకడ నుండ ననుమానపడి యింటివారు దారి
కాచియున్నారని కడువేగ నొగచేటి చెప్పిన నిక నెట్లు సేయుదనిన
నన్నేమి చేయుదు రెన్నాళ్ళనిండియో సారెకు మదినిటె కోరియుంటి
ననఁగనే నిటులేలననిన నీపైయాస ముక్కుటంబుగ మది నెక్కొనంగ
సమయంబు దొరకమీ చనుదెంచుటనులేక మగండు నన్నెప్పుడు దెగడువిడుచు
నోయని మొక్కుచునుంటి దేవుని కృపమాపక నింపించె నేని రొట్టె


గీ.

విరిగి నెన నేతిలో బడ్డ విధముకాదె యపుడు నీయొద్దనే యుండి యిచ్చకొలఁది
క్రీడ గావింతు ననుచుఁ బల్కిన పసందు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పరఁగ నేమెఱుఁగక భయభక్తి నుండిన మగనాలి వచింపఁ దగినదూతి
ననిచిన పనికొప్పుకొనినఁ దానిగైసేసి నీక్షించి వగలచే వెక్కి యేడ్చి
కొవ్విరుల్ సవరించి కుసుమభేదముల వాసన నీకు దెలుసునా యనుచు వడి
యోగిరం బిడి,యన్న మొకపదార్థముననే దినవచ్చునా చెప్పు మనుచు నడిగి
చెలి పండ్లు దిని యుమిసిన దానిలో చవియుండునా యని భావ మొనసి దెలిపి
పవనంబు మెసవి దుర్బలులైన ఋషులన్న నట్టిగాథల కేల వగపు, ధాత్రి
నఖిలవేదాంతంబులం దాత్మ గఘలేపనిరయ లేదనుమాట తరుణి వినవె

ఆనందమే బ్రహ్మ మనిచెప్పు వాక్య మెన్నగ జారసంఘ మా నందమే నెం
పులుగుకు చీమకు దెలియకుండిగజేతు నెరిగిన హరియొద్ద నెప్పుడుందు,


గీ.

వనుచురిచి దెల్పి దానిమంతికమున కెలమిగొని తేఱ బదియారుకళల బెక్కు
బంధముల సౌఖ్య మొసఁగిన భళిర యనుచు నన్నుదూతిక నటు మెచ్చుకొన్న విధము
మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వెలయాలు దనకూతు నెలమి కన్నెరికంబునకు దోడితేర నే నొకటగూడ
నటు గుండె లదర కవ్యాజసాధ్వస లజ్జలును నాగరంబున మొనసి తొడలు
వెన్కకువంగుట బిగితాకుఁలకు కౌనుతాళియుండుటయు గందర్పసదన
మొగి కన్నెబిగువు లేకుండిన శ్రమయని యేడ్చుచు మ్రొక్కుచు నింకవిడువు
మని తన భావగోపనము సేయగ నేను కళను జాఱగజేసి వలువచేత


గీ.

వీక చెమ్మద్ది యెరు పేమి లేకయున్న యిన్నియును దెల్పి నాతోడ నెందరైరి
చెప్పుమన తెల్లబోయినజూచిన నెలంత నెద దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గ్రామ్యబంధమున నే గలయ నాకౌనుకు తరుణిపాదములు కత్తెర ఘటించి
కడగి చేతులు నాదు మెడకు లంకెలువేయ దానివీపున హస్తతలములల్లి
బల్లిగ బట్టి నే వెసనెత్తి తిరుగుచు గోర్కెతో నడుగడుగునకు దాకు
లమరజేయుచు పెద వందుచు గుచములు వదలక రొమ్మున కదిమికొనుచు


గీ.

రమణితో నాటిరాతిరి రతి యొనర్చి బడల నామేని చెమ్మట దుడిచి చాల
యలసితివిగద యని నాతి యన్నమాట మది దలంప బ్రహ్మానంద మదియుగాదె.


సీ.

మరియొకనాడు సామాన్యపందెము వైచి విపరీతతరమున వినుతిగాంచి
చెలియ, నీకేమి కావలెనన్న, నామాట చెల్లింతునని దాస జేసితేని
యడిగెద ననిన నే నట్లు చేసెదనని బలికిన నింక మావారియింట
నుండనొల్లనటన్న నోహో యదేమన జనని విత్తాశకు జారునొద్ద
కఱగు మీ వని తిట్టు నదిగాక నాయీడుజోడు వారందరు వీడు వచ్చె
వాఁడు వచ్చె నటంచు వట్టిమాటలు బల్కుదురు దాన నీమది గరుణదప్పు


గీ.

గావువ భవద్గృహంబున నే వసింతుననుచు బ్రార్థించి మొక్కిన నట్లొనర్చి
యవిశమున దానితో గూడినట్టిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

ఒకదాని బల్మి నూరికి బిల్చుకొని చన్నమాట విన్నను మేను మరచియుంటి
దానిగూడచోట్లు దానిల్లు సఖులనుబరికింప గుండెగుభాలుమనును
విరులు పన్నీరు లత్తరు పండ్లు వంటకంబులు బంపినది మది దలచి వగతు
నాయట్టి దీరుల కేయింత విరహవేదనయుంట నచట నా తరుణి కెంత
పరితాపముండునో పడతి ప్రాణంబులు వాయునో యని నేను బ్రతికియుంటి


గీ.

నంత నాకొఱకది మేన బ్రాణములను నిలుపుకొని రాగ నిద్దర మెలమిగూడి
యొడలు నుంచి క్రీడింపుచు నున్నసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకయెలనాగ యించుక నేరమున నన్ను విడిచిపోయిన నేను వేరుదాని
గూడ నాదినమున గోర్కెతో మఱికొంద రస్మదీయప్రియ లదియు నిదియు
నొక్కచోనుండి నే నుత్సాహమున స్వారిరాఁ జూచి యలిగిన రమణికూడి
నట్టినెలంతతో గట్టిగా నాతప్పు జెప్పుకొనంగ బోగుప్పుమనుచు
నత్తరువాసన లత్తఱి బొలయ దాదెలసి కంపని మోము ద్రిప్పి రోసి
కొనుచు నీవస మండనము లెక్కడివన్న హరి యిచ్చెననగుండె లావటిల్లి
పలుకకుండిన దాని బరికించి తక్కినసతులు నీకేమిచ్చె శౌరియనగ
దనతప్పుల దలపోసి కనుల నశ్రులు నించి యచట నుండక యింటికరుగుదెంచి


గీ.

యచట నాబ్రతుకేల నింకనుచు నొక్క చెలియతో జెప్పిపంప నేబిలువనంప
నన్నిగూడి సుఖించిన నాటిసుఖము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వనజాక్షి మొగ్గావా లినగూడ మదనుండు చిక్కెరంట దూ పెక్కు వెట్టి
లాగినక్రియ దోచు లలన నిల్చి పెనంగ నవలతాపరివేష్టనంబు జూచి
దా నెక్కితిరుగ నెంతయు బిండివిసరెడు ఘనఘరట్టముభంగి గానుపించు
పదపడి నే దాని పైకెక్కి తిరుగుచో వెస గానుగాడినవిధము దోచు
బడతి తామోకాళ్ళు ముడిచి ముందుకు తగ్గి యట్లు పైకుబ్బి చెయ్యాని వదన
మెత్తిన నేవెన్క నింపార గూడుచు ముందుకు చెయ్యూది యకందమరల
యెడచేత దాని రొమ్మెత్తి పట్టి పరస్పరాధరంబులు ప్రీతి నందుకొనగ .
మదగంధి హప్తిచే మావటపం డందుకొన్నచందము దోచు నన్నెలంత


గీ.

యిత్తెఱంగున బాన్పుపైన నత్తమిల్లి చతురతచెలంగ బంధసంగతులు దెలసి
నన్ను గూడి క్రీడించిన నాటిహొయలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

భానుజాహ్రదమునఁ బలువురు చెలులతో జలకేళి సలుపుచు సమ్ముదమున
వనములుదోయిలు గొని మీఁదజల్లుచు మునిగి లోపలనుండి మొనసి కాళ్ళ
నిలచి క్రీడింపుచు నీటిలో ద్రోయుచు నూపిరాడక వెస నుడ్కికొనుచు
మఱియుఁ చేమార్పుల మర్మముల్ జెనకుచు గళలు రేపుచు వెండి కలసుకొనుచు


గీ.

దనిసి ముద్దాడి భళి సెబా సనుచు నిండువేసవుల బ్రొద్దెఱుంగ వేడ్కగ్రీడ
సలిపి యలసి మత్రాణసఖులమరులు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వనజాక్షి చెఱగుమాసిన మూడుదినములు గడఁగి మూడేండ్లుగా గడపి జలక
మొప్పుగానాడి తా నెప్పు డెప్పు డటంచు నింపార నాయొద్ద కేగుదెంచి
పైబడి కూడుచు పాడుచు తాళమానమునకు సరితాకు లమఱచేసి
యెక్కడతగలక చక్కగఁ గూర్చుండి కొనను గోరుంపుచుఁ గొంతసేపు
సందువ నే లేవ జయ్యన నీటిలోబడి నవ్వుకొనుచు సంభ్రమము మీఱ
చనుదోయి నాయురంబుననుంచి పెదవంది బిగియించి లోమొగ్గ దగుల నెలమి
కళ స్రవింపఁగ సీత్క్రుతులు పూత్క్రులు చేసి యూపిరాడకయుండ నొదగబట్టి


గీ.

నాతి తనివొంది కడువేడ్క నన్ను గాంచి యింక నీవని యెట్లంచు నేమిసేయు
దనుచు హాస్యంబు చేసిన యట్టిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సమరతిచే దృప్తి సనక గ్రక్కునలేచి పిక్కులు బిగియ పై నెక్కి చెలియ
మరుశివం బెక్కిన మాడ్కి దాండవమాడ గళకలుక్కని తీవ్రగతికి వచ్చి
కింకిల నవ్వుచు గిల్లుచు గరచుచు వదరుచు జచ్చితి నమ్మ? యనుచు
దిట్టుచు మఱి చెంప గొట్టుచు నేడ్చుచు నొగి వెర్రికేక వేయుచు మమత
జెక్కులు నులుముచు జెయిబట్టుకొని నిన్ను విడవింక ననుచు నవ్వెలది యహహ
యుహుహూ యటంచు నాయురముపై గ్రక్కున వ్రాలి కన్నుల దేలవైచి మేను


గీ.

మిగులచమరింప నూపిరి బిగియబట్టి యంచితంబుగ కళ చిలికించి బాల
సొక్కిసొటసొట బోయినచక్కదనము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకలేమ చిరకాల ముపరినాట్యముజేసి యలసి నీవింక లెమ్మనుచు చెయ్యి
బట్టి వెనక్కు వ్రాల బరికించి చివ్వున నేలేచి కళచలియింప నుద్ధ
తిని గూడ నిదితరి యని నన్ను వదలవద్దవి మ్రొక్కులిడుచు సయ్యాటమలర

నీసొమ్ము నేనది నిజమంచు కరువడి వడిగసేయుము నిల్ప వలదటంచు
నీకళ జాఱఁగనీకుము వెన్కముం దైన నిన్ జంపెద ననుకు మిగుల


గీ.

గడగడ వడంకుచును దాను గళను విడచి యెన్నిజన్మంబులకునైన నీవె నాకు
బతివి కావలె నన్న యప్పడతిమాట మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

రమణతో నధికస్రబ్ధ నవోఢను గలసి క్రీడింప నచ్చెలికి కామ
గేహంబునందు గిల్గింతలు దోచినది యేమొ నాదేహ మిపు డిదొక్క
తీరుగానున్నది తెలియరాదనిన నేనిలిపిన నాతోడు వలదనుచు
కట్టి బట్టి యధిక ఎగంబుగ నూచి నాప్రాణమప్పుడునిల్వ దనుచు కన్ను
గవమోడ్చి పాన్చునఁ గదలక మెదలక మాటలాడగలేక మాటిమాటి
కూర్పులు బుచ్చుచు నొడలెరుంగక కళను విడువననునస్కభావమునను


గీ.

దవిలి బాహ్యప్రపంచమంతయును మఱచి యవిరతంబును బ్రహ్మకర్మామభవము
సేయు యోగితెరంగున జెలగుదాని మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

రాజాస్య నేబాహ్యరతి సేయ చెయిబట్టి తనకుచకర్కశత్వంబు జూపి
మొనలచిక్కులు జూపి పొసఁగవచ్చో నెల్లద్రవముష్టముండుటంతయును జూపి
నెలకుమూడహములు నెఱిఁగూడకుండఁగ బ్రతిబంధ మిదె వెంటబడునుగాన
నందాక రతికాంక్ష జెందకుండగ జేయుమన వెసనలు జాము లట్లు నిలిపి
మార్చుకకూడుచు మఱియోసరిల్లుచు నెడనెడ సంక్రీడ నుడిగి మధుర


గీ.

పాఠము ల్మెక్కి పాల్ద్రావి బాళి మరలగలసి గ్రీడించి కళలు విడిచి
సొమ్మసిల్లినట్టి యానాటిసోయగమ్ము మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

ఒకదాని పరిమాణ మూహించకేగూడ నుచ్ఛరతం బయిన నోర్వలేక
కాళ్ళ ద్రోయుచు పొత్తికడు పిరుచేతులనాని పట్టుక సరియైనమటు
కటు బోవనిచ్చుచు నాక్రమంబున దన్ను జల్లచేయుమటంచు చాల వేడ
నిది బాగులేదు నేనిక ధేనుకాబంధమువ గూడ సరియగు ననుచు బల్కి
యటు గూడ సరికొల్తలై నొప్పిలేకున్న జూచి యచ్చెరెవొంది నుదతి తనిసి


గీ.

యౌర, నీవెంతనేర్పరి వైతివనుచు గరము మెచ్చుచు లేచి తాఁ గౌగలించి
నన్ను ముద్దాడి యనిచిన నాటిసుఖము మది దలంప బహ్మానంద మదియకాదె.

సీ.

పడతి నేడిటు పెక్కుబంధంబు గూడవలె నన్న, సుఖమేమి కలదుదాన.
గడుతీవ్రపతనంబు గలవాడు బాగుసేయగ నది సదుపాయ మంతెగాక
కసిదీర గ్రీడించి కాంక్షదీర్చుకొనంగ సమవిపరీతబంధములె గాని
స్థిరకామునకు నీకు జిరతృప్తి గలనాకు చప్పిడిచేతల జనునె తృష్ణ


గీ.

యనుచు బైకొనికూడి యా హాయి కెన్ని నేర్పులైననుసరివచ్చు నేయటంచు
నాతి తనివొంది తనిపిన నాటిహొయలు మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

ఒక నెలంతుక సత్వమూహించి యిది తీవ్రపతనంబు గలదని భావమందు
దెలిసినే నంతంత విలుపుచు మెల్లగ గలసిన నంతకు నిలుపలేక
కళవీడగా జేయ గనుగొని కొనగోట గురుచంబుల మీద చురుకుజేయ
శ్రమముచే కళనిల్వ జాగు సేయుచు నెమ్మదిగ నేనుగూడిన తీవరించ
తరుణి, నీకెంతతొందరె? యని నవ్వుచు నుల్లసం బాడుచు నుత్సకమున
మనుసునొప్పింపుచు మఱికొంతసేపు నే గలసి తొయ్యలుల దీటులను పోటు


గీ.

మాటలను చెంపవేటుల మోసికాటులను మాటిమాటికి కళనునిలిపి
కూడి తనిసిన నన్ను మెచ్చుకొన్నవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

కడువేడ్క నొక పెండ్లికొడుకుతోగూట నాయంతరంగిక లైన యతివలిద్ద
ఱింపుగా గైనేసి సొంపుగా పేరంటమునకు రా నే వారి కనుగొనంగ
నందొక్కలేమ తా ముందుగా దనపోయగము జూప దానికి కడ్డముగనిల్చి
కులుకుచు చాల బెళ్కుచు పై దిద్దుచు వారచూపుల నన్ను బారజూచి
చిరునవ్వు నవ్వుచు జెలఁగి యభిప్రాయబోధకంబుగ నొప్పు మోముజూప


గీ.

తెలిపి నే నాఁటిరాతిరి పిలువనంపి నిండు రేరాజు పండువెన్నెలలు గాయఁ
గూడితనియింప నన్ను మెచ్చుకొన్నవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకదానికే సొమ్ము లొనగుట కని చేయబనిచిన వేరొక్కపడతి యెరిగి
నాటినుండియు దానినామంబు నుడువక నాయొద్ద జేరి విన్నాణముగను
బహుచమత్కారముల్ బచరింపుచును బ్రీతి నొకనాడు కామశాస్త్రోక్తభంగి
డంబుగా దశవిధచుంబనంబులు జేసి యాచోట బలుమఱ ట్లాచరింప
వేగ నాకును ననవిల్తులాహిరి మించి ప్రతిచేసి యచ్చోట బరగ గళను

గలకపాఱగ చేయు కాంక్షతో పైకెక్కి కళలువీడఁగ జేయ గారవించి
వనిత నీకేమి కావలెనని దానికీదలచిన సొమ్ము లింపలర నాకు


గీ.

దయనొసఁగుమన్న నేమాట తప్పలేక దానికన్యభూషణము లీదలచి సొమ్ము
లొసగ మెయిదాల్చి వెలసిన యువతి ముదము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నవరాత్రి వ్రతముండి నలువొప్ప దశమినా డెప్పుడెప్పు డటంచు నింతిగూడి
రమియింప నాకు నిల్వక తీవ్రపతనంబుగా గని యిక లెమ్ము జాగువలవ
దటుపంమనకుబోద మనిచెయిబట్టి యయ్యుతి దోడ్కొనిపోయి యొకరికొకరు
క్షాళనం బొనరింప గడుకాంక్ష కలదన్నట్లు గావింప నా కంతలోన
కాయజధ్వజము ఛడాయింపగా నిల్వజాలక రయమున శయ్యచేరి


గీ.

యిర్వురము బంధంబు లేర్పడంగ రోషమున గూడుకొని బల్ తమాషగాను
సమత గ్రీడించి తనిసిన చంద మెల్ల మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మఱియొక్కనాఁడు నే పెఱలేమతో గూడి రాకున్న, నతవికి నాకు ఋణము
సరిపోయె నని పండ్లు కొరుకుచు నేమేమొ తలపోయచుండంగ దానికడకు
యిదికాదు పని యని యే మఱుంగునఁ బొంచిపోయ తటూలున టొలతిమీద
బడి కౌగిట గదించి పాలిండ్లు బిగబట్టి నొప్పి పుట్టగజేయ నొప్పుకొనక
తిట్టుచుఁ దన్నుచుఁ గొట్టుచు నేడ్చుచు 'విడువిడు' మనిన నే విడువ నొప్పు
కొని యొట్టు బెట్టుకొన్నను వేగవిడిచి నీ యంఘ్రిసేవ యొనర్తు, ననిన నొప్పి


గీ.

కింతి యోర్వక, శఠుడ! నీ కెగ్గుగలదెః?యేమిసేయుదు నింక నీయిష్ట, మనిన
నాతితో నేనుగూడిన నాటిసొగసు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకయిందుముఖియు నే నొకనాటి దినమున వలువలు వెలిబుచ్చి బాహ్యరతుల
మిక్కిలిపొగరెక్కి పెక్కుభంగుల గూడుచును గతాగతములఁ జూచి నగుచు
సరికొల్తలేయుచు సరసమాడుచు చుంబనములు సేయుచు సుఖ మమర మఱల
గలయగూడుచు జయ కాంక్షలు దెలుపుచునొగి పందెములు వైచుచుండ నప్పు


గీ.

డటు కళలు రేగ వెన్కముందౌనొ యనుచు గడగి మనసొక్కదగచేసి కళలు విడిచి
యలసి యటునిటు బవళించినట్టిసొగసు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

తొయ్యలి యుయ్యెలశయ్య నడ్డంబుగా బవళించియుండ నప్పడతి నంచు
నకుఁ దీసి నేక్రింద ననువుగా నిలుచుండి వెస దాని పదము లెత్తి సరిజేసి
జొనిపి నాచేతుల స్తనములబట్టుక నుయ్యెల నూచుచు నొగినిలిచిన
చోనుండి యెడముజేసుకొని యూపూపున కీఁటెపోటులరీతు లెసగ జూపి
వింతలు గావించి యంతమీదట నిల్పియటు మ్రొగ్గిలో గ్రుమ్మ నతనుసిడము


గీ.

ఱాపుచే దానికళయు గలంకబారబరగ నాకౌను జేతులఁ బట్టి రుద్దు
కొని కళవిడిచినట్టి యావనిత మోహ మెద దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

లేమనొక్కెతను మాలిమి సేయుటకు దానిచంకబిడ్డను నేను సరస నెత్తు
కొను నెపంబున గురుకుచము చే దాకించి బిడ్డనుగొన ముద్దు బెట్టుగొనుచు
పతక మెక్కడిదని బల్కి చేనంటుచు నీ మేను చిక్కినదేమి యనుచు
చెక్కులు చేతులు చక్కగా నివురుచు మచ్చెకంటి జ్వరంబు వచ్చినట్లు
తోఁచుచున్నది యని తోడ్తొన చేసాడిఁ బదపడి గుండెలు బట్టిచూచి
జ్వరముగాదిది మేహసంబంధమగు కాక వెస మేహశాంతి గావింతుననుచు
బాలకుం డేడ్చిన బాలివ్వమని యిచ్చి మొనశి గ్రమ్మఱ వాని ముద్దులాడి
మేనితాకులచేత మెయి చెమర్చియు మఱి పులకలెత్తిన నేను గలయఁజూచి


గీ.

భయమెడలి దానిచేయిగీఱ బాళిమీఱ నన్నెలంతయు సైగచే నన్నుబిలచి
కూడిక్రీడించి సుఖముగైకొన్నవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు శయ్యపై యోచనగా నేను పవళించి యుండంగ బడతివచ్చి
యొకవంక శయనింప నొగి ముద్దులిడబోవ మనసులోచేరిన మగువ కొరకు
మనివిదలించి మౌర్ఖ్యము వీడకుండిన బదరిన పనిపొందు పడదటంచు
బులుకలుజూచి యిప్పుడె తనంతనె గూడుననుచు నే నూరకుండిన గఱంగి
నేఁడుకొన్నప్పుడునే మోడెలు చేసితి [11]నని యది మది నుపాయంబు వెదకి
కలలోన విద్రచే నులికుల్కిపడి మళ్ళి పెనుదయ్య మొకటి వచ్చెనని యింతి
కలవరించుచువేగ గౌగిట బిగియంగబట్టిన నే జూచి పడతి! నీకు
బట్టిన దయ్యంబు వదలింతుననిబన్కి గరిమ నట్లనగూడి కళ శ్రవించిన

గీ.

చేసి భూతంబువిడిచె చిగురుబోణి? యనిన నది నవ్వి యఱమోడ్పుగనులతోడ
నన్ను మాటికి గనుకొన్న నాఁటిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు జవ్వని యుపరితాండవ మాడ నేనట్లు సరిగ నందిచ్చుచుండ
ముడిగి దాలోమొగ్గ మొనగదల నదిమికొనుచు దా నబ్బబ్బ యనుచు మిగుల
బరవశత్వము జూపుతఱి కుసుంబావన్నె చిలచిల ననిజాఱ సిగ్గుపొడమి
తలవంచుకొన జూచి తరుణి! కానున్నదైనది ఇంకజంకేల? ననుచు నేను
చనవిచ్చి వడిగగూడిన రసాభాసమై లో నొప్పి కల్గ నా లోనమాకు


గీ.

కళలు జాఱంగ నేలేచి కడురయమునస్నాన మొనరించి మరియొక్కశయ్య చేర
ననువిలోకించి నవ్విన నాటిసొంపు మదిఁ దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పనిగ నాశోభనంబునకు పేరంటంబు వచ్చిన వారిలో వనిత యొకతె
వరసలాడుచు మమ్ము పడకింటిలోనికి బంపి తానటుబోక పొంచిచూడ
బొసగ నందర నిద్ర బోనిచ్చి తగ యేమరించి వంచించి నే బొంచి దాని
బట్టి లోనికి దీసి పడవైచి యాపనిజేసి చూపించి యాచిన్నిపడుచు


గీ.

కాశబుట్టించి దాని సాహాయ్యము నను కాంక్షదీఱగ నటు నిషేకంబు చేసి
యిద్దరిని నొద్దనుంచుక ముద్దులాడ “నధికసాహసి" ననుచు వారన్నమాట
మదిఁ దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకమానవతిని నే నొప్పుమీఱ ననేకదినముల నుండి ప్రార్ధింప నొప్ప
కున్న “నాయెడలిలో నూపిరిగలిగుండునంతలో నిన్ను సాధితు" ననిన
నది "చూతమింకబొ" మ్మన నాఁటనుండి నేమదిలోన దరుణంబు వెదకుచుండ
నొకనాఁటి రాత్రి తప్పక దేవుడటు వీథి వేంచేయజూడ నవ్వెలది మగఁడు
లేచిపోయిన నదిచూచి నేకొంత నిదానించి చీకటిఁ తరినిబోయి
కూడిన బతియను కొని యదియుండ నా కోరిక తీర్చుక పేరు జెప్ప


గీ.

"పద్దు సాధించితివి" యని పలికి నన్ను మమతతో ముద్దులాడి “యీమాటనింక
నన్యులకు నీవు చెప్పవ" ద్దన్న మాట మదిఁ దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వనిత యోర్తుకు నాకు వైవులే కిరుగూరి తిరుణాళ్ల గడువుంచి మరియు గొంద
ఱే మునుజని యొక్కయింటిలో నిద్రింప పరగనే లేచి దీపంబు మలిపి

గుఱుతు లేకుం డొకగరితగూడిన దనపతి యని యది యేమి పలుకకున్న
నేనొండు చెలియని యెఱిఁగి కంపించిన నదిగాంచి దొంగని యఱవ నుఱికి
నాప్రక్క జేరి, యంట యేమఱించి యున్నట్లు సంకేతిత యైనదాని
నెఱిఁగి యూపిరి బిగియించి మెల్లన మొనగాళ్ళు నేలానించి గదియబోయి


గీ.

సద్దుగాకుండ బ్రక్కలో నిదురించుచున్న మగనికి సడిబడకుండ కూడి
నాతి నేను సుఖించిన నాఁటివింత మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

చెలియ నేనును జోడు వెలిగుఱాల్ గట్టిన సారటులో నెక్కి సమ్మదంబు
జెలఁగ జరీనకాషీ బనారసి పనుల్ జేసి మొఖమల్ గలీబు వేసి
సరిగవాక్షుల తమాషాజూచుచును ముచ్చటాడుచు మర్మంటు లంటుకొనుచు
నందులో నిడుకొని యటు యొడిలోనుండుకొని మోవి మార్పుల మొనతికాటు


గీ.

లందుచును మిర్రు పల్లంబు లందు నడ్డగను నిల్వుగ నూగుచు నొకరికైన
గాసిలేకుండ గ్రీడించి కళలు వీడజేయుచు విహార మట్లు చేసినవిధంబు
మదిఁ దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అలివేణి నవలతా వ్యాల బి సుమమంజకులజూప వెలుదచన్నులను బట్టి
వగలాడి క్రొమ్మావి చిగురాకు గొనుమన్న వలదని కెమ్మోవి పంటనొక్కి
కమలాక్షి పున్నాగ సుమము మార్కొనుమన్న నిద్దంపుచెక్కిలిముద్దులాడి
గరిత కెందమ్మిలో కర్ణిక గనుమన్న బ్రీతితో నిధువనక్రీడ సల్పి


గీ.

లలన భావప్రకాశచెలోక్తులకు దగిన చెయ్వు లొనరించి గఱగించి చెట్టబట్టి
వనవిహారంబు జేసిన వైభవంబు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తరుణి రాక యొకింత తడవు జేసిన నల్గి ప్రక్కన కనుమోడ్చి పవ్వళింప
వచ్చినా ప్రక్కలో మచ్చిక గూర్చుండి వదలక పైవ్రాలి పెదవినొక్కి
కామధ్వజముబట్టి కదలించి ముద్దాడి తప్పుసైపుమటంచు దండమొసగి
పవళించి మోకాళ్ళు పైకెత్తి నను తనపాదములపైనుండి బనిచి దాని
నచ్చోట తేర్చి యుయ్యాలలో యటంచు నూచుచు బుజ్జగించి మఱియు


గీ.

తనిసి తనియించి తనదుహస్తములు సాచి యక్కునను జేర్చి కౌగిటఁ జిక్కబట్టి
"యలుక తీరెనె?" యని బల్కినట్టిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

ఒకనాడు నే సముత్సుకత నానారత్నమండనాల కృతాంగుండ నగుచు
గజరాజుమీఁద సింగారంబు దీపింప వలనొప్ప గూర్చుండి వైభవమున
రాజమార్గమున రారమణియొక్కతె సౌధ మెక్కి చూచి విరాళి నెక్కొనంగ
నీ వభివజ్ఞుఁడవుగా నే డేమిచేసిన నలసటదీరునో తెలియు మనుచు


గీ.

చెప్పి పంపిన యాబోటి చిత్త మెఱిగి ప్రేమ మీరంగ నారాత్రి పిలువనంపి
వచ్చిననుగూడి తనిసిన వనితసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అల మహానవమి లే యద్దాలమేడలోపల పైడితఖ్తుపై కొలువుదీర
నపుడు మంత్రులు బడాఆద్మీలు మొదలుగా చాల సజమ్ముజరాలుజేయ
వరుసగిరీజు సర్వస్సలామని చోపుదార్లు, పరాకంచు తగువిధమున
కటికెముల్ హెచ్చరికల దెల్ప లష్టర్లయందు దీపములు నిండార వెలుఁగ
బల్కచేరీ జేసి బర్ఖాస్తు గావించి ప్రియసతి జేటిచేఁ బిలువనంపి
నగ్నులమై భూషణములూర్చి గద్దెవద్దనె వేడ్కతో నిధువనము సలుప
వెలయ నిర్వంకల నిలువుటద్దములలో నన్యోన్యప్రతిఫలనములచే న
నేకమంచములపై మాకూటముల పరంపరలు జూపట్టిన పరఁగజూసి
యిట్లనేకస్త్రీల కే ననేకాకృతుల్ దాల్చి రాసక్రీడఁ దగ సలిపితి
నింపార మనము నేఁ డిన్నిరూపములుగా నిచ్చోట క్రీడించు టిది విచిత్ర


గీ.

మంచు వెస జెంపలానించి కొంచె మెదురుగాదిరిగి యద్దములలోని గాంచిన ముద్దు
లాడి క్రీడించి తృప్తుల మైనవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

శుకతుండసందష్టసుందరబింబంబు పోలికనున్న కెమ్మోవితోడ
కరరుహపరిలూనకరమర్ధనమ్లానఘనమంజరులు బోలు చనులతోడ
గందేభవిహరణకలుషీకృతిసరోవరాభ్రపుష్పాస్త్రగేహంబుతోడ
భానుమయూఖసంపర్కపరికాంతలలితోపమానగాత్రంబుతోడ
వితతనిశ్వాసమారుతమలినీకృతముకురంబుక్రియ నొప్పు మోముతోడ


గీ.

కాంత సురతాంతశాంతయై కనులు దేలవైచుచు మందసవిన్యస్తబాహుయుగళ
యగుచు దొడలపై బవళించినట్టిహోయలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకవాడు పూవుటిరములోన కెందమ్మి విరులపాన్పున నేను వేడ్క నుండి
కనకాంగి యెల్లలోకములకారు కావించువిధము గాదే నొక్క వింత సేతుఁ

బరికింపు మని శిర ముర్విపై మోపి కాయంబు పైకెత్తి కాళ్ళు ముడిచి
వెనుకకుఁ బడకుండ [12]వెసలేచి పట్టుక రోకటిచే రోట గ్రుమ్మినట్లు


గీ.

మించి శబ్దంబు లొదవ గ్రీడించి యోర్వలేనన సమంబుగా బవ్వళింప జేసి
చెలికి రతిదృప్తి గలుగ జేసిన ఫసందు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఇరువురకును ప్రేమ లెసగ నెన్నాళ్ళకో తఱియైన దన్వి రా తడవు గాల్గ
మరుడేచ నూటికి తెఱపుజూచుచు చీమ చిటుకున్న ఝల్లని చెమ్మరించ
నదెవచ్చె నిదెవచ్చె ననిజూచి యెందు గన్పట్టకుండిన నింటివారివలన
నడరేమి కల్గెనో యని దూతి నంపి యేమియును దోచ కొయ్యన మేను మరచి


గీ.

యుండ నది వచ్చినటమూడ్చి యొడిని చేరి సరిగ నది బట్టుకొనికొన్న స్వప్న మనుచు
నులికిపడ నవ్వి కూడినయువతిహొయలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వ్రేపల్లె కీ వేగి శ్రోతల రాధిక నిళను సందర్శించి యింపుమీఱ
దుష్టరాజుల నెల్ల దునుమాడి శీఘ్రంబె వచ్చెద నందాక వగలు దగ్గి
యతిధైర్యమున నుండు డనుచు నామాటగా జెప్పి యూరడింప చేసి వేగ
రమ్మన, నుద్ధవుం డమ్మెయి వ్రజమున కరిగి గోపాలసుందరుల గాంచి


గీ.

పరగ నేకాంతమున హరి బల్కినట్టి పలుకులన్నియు వినిపింప వారు మరల
నతనితో నన్నమాటల చతురతయును మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పిన్నవాడని చంక బెట్టుక ముద్దాడ వెస కుచంబులు దట్టి పెదవి యానె
చిరుతకూకటినాఁడు చెలరేగి మాయిండ్ల బశ్యతో హరవృత్తి బాలుద్రాగి
మగవారు లేనిచో దగ బొందుకొనువచ్చి మగపోడుములు చేసి మరులుకొల్పె
భూరిగోవర్ధనోద్ధారణాదులచేత యాపదలణచి మమ్మరసి బ్రోచె
కాత్యాయనీపూజ గావించుతఱి మొలచీరలు ముచ్చిలి సిగ్గుకొనియె
విపినమధ్యంబున వేణుగానము చేసి కామవేదన మాకు గలుగచేసె
ఫైక్కండ్రుసతులకు పెక్కురూపంబులు లీల గైకొని రాసకేళి సలిపె
యమునాతరంగణీహ్రదములో మముగూడి వేడుకతో జలక్రీడలాడె


గీ.

మఱియు మధువైరి నను గూడి మమతతోడ చేసిన వైఖరుల్ జెప్పవశమె
మహాత్మునిలీలావిహారమహిమ లెద దలంప బ్రహ్మానంద మదియకాదె.

సీ.

అకలంకమైన మా యౌవనంబంతయు సుందరాకారుడై చూఱగొనియె
పతిసుతాదుల వీడి భావంబు తనయందె సమ్మదంబున చేర్చి నమ్మియున్న
మము విడనాడి తా మధురాపురికి బోయె నింత నిర్దయు డుర్వి నెందుగలడు
దానింక రాకున్న దడువుగా నిచ్చోట నొడల బ్రాణము దాల్చి యుండలేము


గీ.

స్త్రీహననపాతకం బది చెందకుండ శీఘ్రమున వచ్చి మమ్ము రక్షింపుమనుచు
హరికి జెప్పుమటంచు వా రన్నమాట మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

అని యిట్లు పల్లవాంగనలు బల్కిన నిష్టురోక్తు లాకర్ణించి యుద్ధవుండు
గ్రమ్మఱ మధురాపురమ్మున కటుబోయి శ్రీహరి కెఱిగింప జిత్తగించి
ద్వారకాపురి కేగి వరుస రుక్మిణాదిసతుల వివాహమై సంభ్రమమున
జైత్యప్రముఖదుష్టసంహార మొనరించి భూభార మణగించి బొలుపుమించి
గణపతి పూజన కాలమునందు గ్రమ్మర రాధికను గోపభామినులను
గలసి వ్రేపల్లెకు గడువేడ్క జనుదెంచి వారలగూడి దుర్వారభంగి


గీ.

పావనంబున రమ్యబృందావనమున నింపుమీర గ్రీడించి సుఖింపుచుండె
నట్టి కృష్ణుని లీలావిహారమహిమ లెద దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

రతిరహస్యానంగరంగకొక్కోకాది సముదగ్రసత్కళాశాస్త్రములను
జెప్పినట్టి విదగ్ధు లప్పటిజాతులవిధమును సత్వాదిభేదములను
గాంచి స్థానస్పర్శఘనమణిమంత్రౌషధులచే నరులకు దరుణులకును
గలరహస్యంబులు దెలిపిరి యనియొ నిక్కాలంబునకు సరి గాక యున్న
బరగ నిప్పటి కిల బహుజనానుభవసిద్ధామేయవివిధోచితాంశములను


గీ.

నీశతకమందు మరుగుగా నింపు మెరయ దెలియజెప్పితి నీజాడ తెలిసి చతురు
లంచికముగ క్రీడాసౌఖ్య మగుభవింపు డార్యులార బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పదియారుకళలును బహురహస్యము లిందు పొసగఁ గూఢంబుగా పొందుపరచి
నరలేనిచోటుల జిరకాల మభ్యాస మొనరింప నొకకొన్ని యుత్సుకమున
యున్నవి చక్కగ నుపలబ్ధి గలవారు యోచించి వేసట నొంద కెలమి
గనవచ్చు త్వరలోన ననుభవంబున కట్లు రాకున్న వినమాత్రమున భావ
బోధంబు గౌతున్న బొసఁగ విదగ్ధుండు గాకున్న నిజములు గా వటంచు

గీ.

దెగడవలవదు సరస లీ తెఱగులన్ని దెలసి సుఖియించి తనిసియవ్వలరమేళు
సత్కృపనచింత్యమగు బ్రహ్మసౌఖ్య మొందు డార్యులార? బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సజ్జనులార! యీశతకంబు గేవలశృంగార మని నిరసింపవలదు
శ్రీకృష్ణు డింపార బృందావనంబులో చతురత గోపికాసతులఁ గూడి
జేసిన శృంగారచేష్టలన్నియు చాల మోక్షప్రదములని మున్ను మౌని
వరుఁడు వ్యాసుఁడు శ్రీభాగవతంబులో శిష్టసమ్మతముగ జెప్పలేదె.


గీ.

కృష్ణలీలావిహారంబు లెవ్వ రెన్ని గతులు గొనియాడినను దప్పుగలదె సాధు
జను లుపాదేయమని విని సంతసింపు డంచితిముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఈశతకంబున నేపద్యమునను మా కేవిలాసము చెప్ప నిచ్చగలిగె
నావిలాసంబున కనుగుణసంగతులన్నియు స్పష్టంబు లగుట కిట్లు
క్రమ మొప్ప నాల్గుపాదములను విధిమాని వలసినపాదముల్ వరుసగూర్చి
సీసపద్యంబులు చెప్పితి చరణంబు లెక్కువ యని కవు లెంచవలదు


గీ.

పదము లధికంబులైనట్టి పద్యములను మాలికలుగా గ్రహించి సమముగను
సర్వభావార్ధము లెఱింగి చతురు లెల్ల ముదము గనుడు బ్రహ్మానంద మదియగాదె


సీ.

అఖిలలోకేశ్వరుండైన శ్రీకృష్ణుని శృంగారచర్యలు రంగుమీఱ
యీశతకంబున నింపుగా గలుగుటజేసి దీని రచింపజేసినట్టి
పృథివీశునకు జదివినవారలకు విన్నవారికి నల్విభు భూరికరుణ
యవనిలో దీర్ఘాయురారోగ్యములు బుత్రపౌత్రాభివృద్ధి సంపత్సమృద్ధి


గీ.

ధైర్యగాంభీర్యసద్గుణౌదార్యవినయవిజయసౌశీల్యసౌజన్యవిత్తలాభ
సారధర్మార్ధకామమోక్షములు గలుగు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.

(మేరువ పద్యము)

సీ.

ప్రమదాకళాశీఘ్రపతనవారణమును
             వరకళాపరిపూర్ణనస్వతంత్ర
తయు, బాహ్యరతమున దరుణి కళాస్రావ
             ణము, యోనిసంకోచనంబు, యోని

శబ్దాపనము, రజస్సందర్శనము కన్ను
             మున్న శ్రమాంతరభోగక్రియయు
నారీకళోత్సర్జనస్వతంత్రతయు
             స్థలనాతరమున బునఃకరణమునకు
తక్షణంబున వృద్ధిఁ దగ జేసుకొనుటయు
             ముందుగ జరిగిన ముచ్చు సంగ
మం బెరుగుటయును మఱి భవిష్యద్రజో
             జ్ఞానంబు, జలనాడిఘర్షణంబు
నలవేణియోనిగా గాధాగాధములను వ్య
             త్యస్తంబు గావిందునదియు బ్రథమ
మాసంబునందె భామాగర్భవిజ్ఞాన
             మాంతరభోగ నంధ్యావ్యనిర్ణ
యంబును, మదనగేహాంతరస్థితలింగ
             మున మకరధ్వజమ్మును నెలంత
యవలఁ ద్రోయుటయు రతితోఁ గ్రీడించు
             నపుడు భగాంతర్గతామయముల


గీ.

నాత్మ యెఱుగుఁట యివి పదియారుకళలు
మఱియు కొన్నిరహస్యంబులు లరిసి తెలిసి
యతనునిధువనసౌఖ్యంబు లనుభవింపుఁ
డనఘులార! బ్రహ్మానంద మదియ కాదె.

సంపూర్ణము

  1. భావతతులు
  2. శతకంబుగాఁ జేయు
  3. కౌతుకా, హ్లాదవేగంబున
  4. సరసార్ధ
  5. మదిని సంతసము పొంగ సకల
  6. అని సేయనొల్లక నతిదుఃఖమందు నర్జునుని దా హేతుభూతునిగఁ జేసి
  7. జేచుట కేను నాని పై
  8. ముందుకళాభావ
  9. పిగిలిపిట్టలరీతి వెసలాగ లేచి
  10. మాకు సామ్య
  11. నని యుపాయము మది నరసి రేయి
  12. వెసనూచి