Jump to content

పుట:Yogasanamulu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

53

గాని బొటనవ్రేలినిగాని పట్టుకొనవలయును. వెన్ను కొంచము ముందునకు వంచి ఉంచవలసి వచ్చును. మొదటలో శ్వాసను స్వేచ్చగా పీల్చుకొనుచు రాను, రాను శ్వాసను కుంభించి సాధన చేయవలయును.

ఉపయోగములు

ఈ ఆసనము వలన ఊరః పంజరము బాగుగా వృద్ధి పొంది అందులోని అవయవలులను అనగా శ్వాస కోశములు, కాలేయము, హృదయము బలముగాను ఆరోగ్యముగాను ఉండును. జీర్ణశక్తిని వృద్ధి పరచును. మలబద్ధకమును నివారించును. ఆసనము నందలి, భగందము వంటి వ్వాధులు నశించును. కాని వయసు మీరి క్రొత్తగా నేర్చుకొను వారికి చాల కష్టముమీదగాని ఈ ఆసనము రాదు.