పుట:Yogasanamulu.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40


యోగాభ్యాస సాధన చేయువారు మత్తు పదార్థములను సేవించ రాదు. ప్రాతః కాలమునను సాయంకాలమునను ఆసనములు అభ్యసించుటకు అనుకూలము. గాలిలో తేమె తక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట కూడ ఆసనములు వేయ వచ్చును. ఆసనములు వేయుటకు ముందు కడుపు నిండుగా ఉండరాదు. కాని ఆకలితో ఉండ రాదు. వేసవి యందు రెండు మూడు గ్రుక్కలు నీరు త్రాగి ప్రారంభించ వలయును. ఆసనములు వేయు చున్నంత సేపు మనస్సును ఆసనములపై లగ్నము చేసి వాట వలన కల్గు ఉపయోగములను దృష్టిలో ఉంచుకొని మననము చేయ వలయును. పురుషులు శరీరముపై కౌపీనము, లంగోటి, డ్రాయరు వంటి చిన్న వస్త్రములను ధారింప వలయును. స్త్రీలు మాత్రము దేశ కాలములకు అనుకూలముగా, సభ్యతకు భంగము లేని విధముగా వీలయినంత తక్కువ వస్త్రములను ధరించ వలయును. ఆసనములను వేయు నప్పుడు చమటను గుడ్డతో తుడిచి వేయక చేతితో చర్మముపై రుద్ద వలయును. చమటలో శరీరమందు ఉత్పత్తి అయినట్టే బాహ్య వాతావరణములో ఉన్న ఉష్ణమును సరిపెట్టుట మాత్రమే కాక బయట చర్మము పై ఆశ్రయించు సూక్ష్మ జీవులను నాశనము చేయునట్టి పదార్థమును కూడ తయారు చేయును. మరియు చర్మ సౌందర్యమును పోషించ గల్గు పదార్థమును కూడ అందు ఉండును.