పుట:Yogasanamulu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35


కొందరు వ్యాయామ వేత్తలు. వ్యాపార సరళిలో ఈర్ష్యతో యోగాసనములపై దుష్ప్రచారము చేయు చుండుట కద్దు. శీర్షాసనము వలన శరీరమున వున్న రక్త మంతయు శిరస్సులోని మెదడునకు స్రవించి అచటి రక్త నాళములను త్రెంచు నని వారి కువాదము. మనము నిలబడి నపుడు శరీరములోని రక్త మంతయు పాదముల పైపడునా? ఆ మాత్రము జ్ఞానము లేని వారు ఈ రోజులలో కూడ వున్నారా? శీర్షాసనమనగా శిరస్సును స్థానముగా చేసికొని పాదములను పైకెత్తి వుంచుట. దీని వలన శిరనందు వెన్నెముక ప్రారంభములో దాని పైన వున్న పీనియల్ అను గ్రంధికి వత్తిడి జరుగును. ఆ వత్తిడి చేత బలపడి ఆ గ్రంధి శక్తి వంతముగా పని చేయును. దాని నుండి స్రవించిన రసములోని ఇతర గ్రంధులు చక్కగా పని చేయు నట్లు చేయును. అందు చేత యోగ శాస్త్రమున శీర్షాసనము ప్రశస్తమయినదిగా చెప్పబడినది. శరీరమున వున్న రక్త వాహికలు కవాటములతో కూడు యున్నవి. అందు చేత ఎంతెంత రక్తము కావలసి వుండునో అంతే రక్తమును విడుదల చేయును కాని రక్తమునంతటిని గొట్టములో పోసినట్లు విడిచి పెట్టదు. కాని ఒత్తిడిలలో మార్పు వుండును. ఊర్ద్వ పీడన అధో పీడనగను, అధోపీడన ఊర్ద్వ పీడనగను మారుట వలన దీనికి కొంచెము అలవాటు పడవలసి వుండును. క్రొత్తలొ ఊపిరి బిగించి ఈ ఆసనము చేయరాదు. ఈ విషయము గుర్తుంచుకొని శీర్షాసనము చేయుట నిరపాయకరము. ఆసనములను వారి వారి శరీరములకు, రోగములను దృష్టిలో వుంచుకొని ఎన్నుకొన వలసి యుండును. శీర్షాసనము వలనే