Jump to content

పుట:Yogasanamulu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34


లేదు. ఎక్కువ శ్వాసను ఖర్చు చేయ పని లేదు. ఆసనముల వలన అంతరేంద్రియములగు గ్రంధులు సంధిబంధములు, స్నాయువులు, కదలిక పొందును. అందువలన గ్రంధులు క్రమ బద్దముగా త్రమ వ్యాపారమును చేయుచు హర్మోనులను రసములను ఉత్పత్తి చేసి శరీరమున రోగ వినాశ మొనర్చి పోషక కార్యమును నిర్వహించ గల్గును. కీళ్ళు పని చేసి అందుచేరిన వాయువును ప్రసరింప ఏసి బాగుగా పని చేయుటకు స్థిర పరచును. నరములను నాడులను, హృదయమును క్రమ స్థితిలో నుంచును. ఇట్టి ఘన కార్యములు చేసి ఆధునిక వైద్యుడు చేయ లేని విధముగా రోగ నిర్మూలనము చేయ గల్గు చున్నది. ఆసనములు అభ్యసించుటకు విశాలమగు స్థలము అవసరము లేదు. పనిముట్లు, సాధనములు అవసరము లేదు. స్వల్ప కాలములో తక్కువ్ శ్రమతో ఎక్కువ ఫలితములను ప్రసాదింప గల్గు శక్తిని కలిగి యున్న సాధనము ఇంతకన్ననూ మరియొ9కటి లేదనుట అతిశయోక్తి కానేరదు. ఆసనములను అభ్యసించు వారు వారి వారి నివాస స్థలముల నుండి ఎక్కడో నున్న వ్యాయామ శాలలకు పోనక్కర లేదు. బాలురు, వృద్ధులు, స్త్రీలు అను భేదము అసలే లేదు. జాతి, మత భేదములు లేనిది. యోగాసన సిక్షకుని వద్ద ల్బాగుగా ఆసనములు వేయుట తెలిసికొని తన యింటి వద్దనే అభ్యసింప వచ్చును. ఆసనములు అభ్యసించుట కూడ అతి తేలిక. ప్రతి దినము కొంత సేపు (సుమారు అరగంటకు తక్కువ కాకుండా) వినియోగించిన వైద్యుని అవసరము వుండదు. రోగులు కూడ యోగాసనములు చేయ వచ్చును.