పుట:Yogasanamulu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30


కలుగు చున్నవి. దేవ దత్త వాయువు వలన ఆవులింతలు కలుగు చున్నవి. ధనుంజయ వాయువు వలన మారణానంతరము శరీరము విపంచీకృత మగుచున్నది. ఈ విషయము లన్నియు మన స్థూల నేత్రములకు కనబడవు. ఇవి సూక్ష్మ శరీరమునకు సంబంధించిన సూక్ష్మ కార్యములు. వీనిని తెలిసి కొనుటకు యోగచక్షువు అవసరము. మున్ను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ సూక్ష్మ శరీరమున జరుగు కార్యములను శిష్యుడగు సిద్ధయ్యకు వివారించు చుండగా కక్కయ్య అను నతడు విని వీనిని ప్రత్యక్షముగా చూడ నెంచి రాత్రి యింటికి పోయి గాడ నిద్రావస్థలో నున్న భార్యను చూచి ఆమె శరీరమున ఈ విషయములను చూడ దలచి ఆమె గర్బ కోశమును కత్తితో గోసెను. అంత ఆమె విలవిల తన్నుకొని ప్రాణమూలను వదలెను. కాని అతనికి శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన విషయము లేవియు కాన రాలేదు. అంతట మహా కుపితుడై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిని చేరి పరుష వాక్కులతో నిందించెను. జరిగిన విషయమును సవిస్తరముగా ఎరిగిన వాడై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కక్కయ్యతో అతని యింటికి వెళ్ళి రక్తపు మడుగులో విగత జీవి యైన అతని భార్యను చూచెను. నీవు తొందర బడితివి. నేను చెప్పిన జ్ఞానము సూక్ష్మ శరీరమునకు సంబంధించినది. దానిని స్థూల నేత్రములతో చూడ ప్రయత్నము చేయుటకు సాద్యపడదు. వానిని యోగ చక్షువుతో మాత్రమే చూడ వీలు పడును. అని చెప్పి తన యోగ శక్తిరో మరణించిన ఆమెను పునర్జీవిగా చేసెనని ఒక ఇతి హాసము బహుళ ప్రచారములో నున్నది.