పుట:Yogasanamulu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27


ఇది అలోపతి వైద్య శాస్త్రమున "కేవర్నన్ ప్లెక్సన్ " అని పిలువబడు చున్నది.

సహస్త్రార చక్రము

దీనిని బ్రహ్మ రంద్రమనిరి. ఇది మానవుని ప్రాణ స్థానము. పరబ్రహ్మకు నిలయము శరీరమున నవ ద్వారములున్నవి. మరియు ఇది పదియవ ద్వారముగా యోగ శాస్త్రమున గణించిరి మూలాధారాది షట్చక్రముల నుండి పయనించి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులను చేధించుకొని శక్తి స్వరూపిణి యగు కుండలిని పరబ్రహ్మస్థానమగు సహస్త్రామున చేర యోగి అనిర్వసనీయ నందమును మునిగి నిర్వికల్ప సమాధిని పొందును. ఈ చక్రమందు అనేక యోగ నాడులుండుట చే సహస్రారమని చెప్పబడినది. ఈ చక్రమును లెక్కించకయే మిగిలిన ఆరు చక్రములనే షట్చక్రములని పిలిచిరి. ఇది పీనయల్ గ్లాండ్ అను ప్రదేశమున నడి నెత్తి మీద వున్నది. నిర్గుణ బ్రహ్మను ఈ చర్కమున ధ్యానించుటకు అనుకూల మయినది.

బ్రఃహ్మనాడి యందు ఈ ఏడు చక్రములే గాక గ్రంధిత్రయమను పేర మూడు గ్రంధులున్నవి. అవి బ్రహ్మ గ్రంధి మూలాధార చక్రమునందును, విష్ణు గ్రంధి అనాహత చక్రమందును, రుద్ర గ్రంధి అజ్ఞా చక్రమునందును వున్నవి. సహజముగా సుషుమ్న నాడీ మార్గము మూసికొని వుండును. దానితో బాటు అందున వున్న ఈ మూడు గ్రంధులు కఠినముగా వుండును. కంధ స్థానమని చెప్పబడు సూక్ష్మ నాడీ మండల కేంద్రమున మహా శక్తి స్వరూపణియగు "కుండలిని " సర్పాకృతిని చుట్టలుగా చుట్టుకొని ముఖమును సుషుమ్న