పుట:Yogasanamulu.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమర్పణ

ఒంగోలు పట్టణ వాస్తవ్యులు...... బ్రహ్మశ్రీ లక్కరాజు సాంబశివరావు పంతుల గారి ప్రియశిష్యులు.... మద్గురువరేణ్యులు..... మల్లకేసరి...... వ్యాయామ విద్యా విభూషణ యోగ విద్యా మార్తాండ ..... బ్రహ్ శ్రీ మోచర్ల శ్రీహరిరావు గారు....... తాము బహుశ్రమలకోర్చి నేర్చిన విద్యను కరుణ తోడను ఆర్థ్రత తోడను నాకొకింత ప్రసాదింప దానిని జిజ్ఞాసువుల కుపకరించునట్లు ఈ గ్రంధమును రచించి, సూర్యుని చేత ప్రసాదించబడిన జలము చేతనే సూర్యునికి అర్ఘ్యమిచ్చినట్లు ఈ గ్రంధ కుసుమమును గురుదేవుల పాదముల కడ పూజా పుష్పముగ సమర్పించు చున్నాను. ,...........గ్రంథ కర్త.