పుట:Yogasanamulu.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22


నున్న ఎడమ రంధ్రమును ఇడానాడి యనియు కుడి రంధ్రమును పింగళా నాడి యనియు అందురు. మరియు కిఉడి నాడిని యమున అనియు ఎడమ నాడిని గంగ యని కూడ అందురు. ఈ ఇడా, పింగళుల మధ్య వెన్నెముక లో నున్న మజ్జ యందలి సన్నని రంధ్రమున సుషుమ్న యను నాడి యున్నది. దీనిని బ్రహ్మ నాడి యనియు సరస్వతి యని కూడ అందురు. వెన్నును బ్రహ్మ దండి అందురు. భారత దేశమున అతి పవిత్రముగా నెంచ బడు గంగా, యమునా, సరస్వతి నదులు మన దేహమున ఉన్న ఇడ (గంగ) పింగళా (యమున) సుషుమ్న (సరస్వతి) నదులకు ప్రతీకలు. సరస్వతీ నది సుషుమ్న నాడి వలెనే పైకి కనబడక అంతర్వాహిని యని చెప్పబడుచున్నది. సృష్టిలో బ్రహ్మాండము ఏ సిద్ధాంతముపై నిర్మించబడెనో అట్టి సిద్ధాంతము పైననే పిండాండము (మానవ శరీరము) కూడ నిర్మించ బడెనని బుధులు చెప్పుదురు. బ్రహ్మాండములోని చంద్ర స్థానము నుండి అమృతము వర్షిచు రీతి పిండాండము చంద్ర స్థానమైన శిరో భాగము నుండి అమృతము వర్షిచునని యోగ సిద్దాంతము. చంద్రుని నుండి కురిసిన అమృతము జీవులకు సస్యములను పోషించు రీతి శరీరము లోని చంద్ర స్థానము నుండి వచ్చిన అమృతము శరీరమున యింద్రియములను పోషించు చున్నది. అటులనే బ్రహ్మాండమున సూర్యుడు అగ్ని స్థానమై సృష్టికి ఉష్ణమును ప్రసాదించు నట్లు శరీరమున నూరవ స్థానమైన మణి పూరైక చక్రము (నాభి) నుండి జఠరాగ్నిని సృష్ఠించి ఆహారమును పచనము చేసి జీర్ణము చేయుట, రక్త ప్రసరణ, వాయు సంచారము వంటి ఉష్టము