Jump to content

పుట:Yogasanamulu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

16 మత్స్యాక్షి, మేఘనాధ, పునర్లవ అను ఆకు కూరలను, పెసర పప్పు, గోదుమలు, వరి, శొంటి వంటి పదార్థములను మరియు తీయని పండ్లను తినవచ్చును. ఉప్పు సంపూర్ణముగా వర్జింప లేని యడల అపుడపుడు కొంచెము సైంధవ లవణమును కారమునకు ప్రత్యామ్నాయముగా శొంటిని గాని, మిరియములను గాని వాడవచ్చును. పెసర పప్పునకు బదులు అప్పుడపుడు కంది పప్పును కూడ వాడవచ్చును. ఆహారము కంటికింపైనది గాను, మధురముగాను శరీరమునకు పుష్టి నొసగు నదిగను వుండ వలయును. ఆహారమును నిర్ణయించునపుడు సాత్వికాహారమును ఎన్నుకొన వలయును. ఇది శరీరమున సత్వ గుణమును వృద్ధి చేయునని తెలిసికొన వలయును. ఆహారమున నియమములు పాటింపక మత్స్య మాంసములను అపద్య పదార్థములను తినుట వలన శరీరమున బండతనము, మెదడున మొద్దు తనము ఎక్కువ నిద్ర, విచక్షణా జ్ఞానసూన్యతయు కల్గి రజో గుణ తమో గుణముల ప్రభావము అధికమై సాత్విక గుణము క్షీణించి యోగ నాడీ మార్గము శుద్ధి గాక అభివృద్ది నిరోధకముగా నుండును.

  • యుక్తాహార విహారస్య చేష్టస్య కర్మసు
  • యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా|| భ.గీ. 6వ, అ|| 17 వ శ్లోకము.

నియమిత ఆహార వ్వహవారములు కల్గి నియమితమైన నిద్ర జాగరణ కలిగిన వారికి సంసార దుఃఖము దూరమగునని " గీత యందు ప్రవచింప బడినది.

పైన చెప్పబడిన యమ, నియమములను చక్కగా