పుట:Yogasanamulu.djvu/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

187


మును శరీరమునకు కావలసిన విధముగా సరిపెట్టి వుంచును. మధ్యమ ప్రాణాయామమున శరీరము కంపమును పొందును. ఉత్తమ ప్రాణాయామమున శరీరము ఎగురుట (ఎత్తుట) జరుగును. ఇటుల ఎత్తుటను మండూకావస్థ యందురు. ఇది అప్రయత్నముగానే ఎగురుట జరుగును. కొంత మంది ప్రయత్న పూరకముగా కప్పవలె ఎగురుటకు ప్రయత్నము చేయుదురు. కాని వాయువు శ్వాస కోశములందు నింపబడి కుంభించిన పిదప కొంత సేపటికి బహిర్గత మగుటకు ప్ర్యత్నించి మూల బంధము చేత ద్వారమున అవరోధము కల్గుట వలన ఉద్వాసము చేత ఎత్తబడుట వలనను వాయువు మాటి మాటికి ఎగురు చుండును. అది ఉత్తమ ప్రాణాయామము. అట్లు ఎగిరి ఎగిరి అలవాటు పడి ప్రాణము శాంతించి లొంగి పోవును. అనగా వేగము అడగి పోవును. శ్వాస వేగము అణగుట వలన మనోవేగము అణగును.

ప్రాణాయామము అభ్యసించు విధమున సంక్షిప్తముగా చెప్పబడు చున్నది:

సాధకుడు యమ నియమములను అందు ఆహార నియమములను పాటించు నట్టి వాడై ప్రాతః కాలముననే నిద్రనుండి మేల్కాంచి తన యిష్ట దేవతను ప్రార్థించి కొంతసేపు ద్యానించి తదుపరి కాల కృత్యములను తీర్చుకొని చేతనైన వారు కొంచెము అలసట వచ్చు పర్యంతము శరీర వ్యాయామును చేసి (ఇచట కొంచెము అలసట వచ్చునట్లు అని చెప్పబడినది ఎందుకనగా శక్తికి మించిన వ్యాయామము పనికి రాదు అని) అనంతరము ఆససములను అభ్యసించి శరీరముపై