పుట:Yogasanamulu.djvu/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

లంక సూర్యనారయణ


ఆ రేచించిన నాడి చేతనే వేగముగా పూరక రేచకములను చేసి కుడి నాసికా రంధ్రము చేత (పింగళా నాడి చేత) నే నిండుగా పూరించి పూరించిన కాలమునకు నాలుగు రెట్ల కాలము పాటు కుంభించి ఇడా నాడి చేత (ఎడమ నాడి) పూరించిన కాలమునకు రెండు రెట్ల కాలపు సేపు రేచించ వలయును. తరువాత ఇదే విధముగా ఎడమ నాడి చేత పూరించి ఘర్షణ చేసి అనగా త్వ్ర త్వ్రగా పూరక రేచకములను చేసి యధావిధి కుంభించి రేచించ వలయును. పూరకము చేసిన తర్వాత జలాధార బంధమును, మూల బంధస్మును చేసి కుంభ కాంతమందు రేచకమునకు ముందు ఉడ్వాణ బంధమును చేసి కుంభ కాంత మందు రేచకమునకు ముందు ఉడ్వాణ బంధమును వేసి కొంత సేపు ఉడ్వాన బంధము వుంచిన తరువాత నియమము ప్రకారము రేచింప నగును.

దీనినే మరియొక పద్ధతిన చేయవచ్చును. రెండు నాసికల చేతను ఒకే సారి పీల్చుచు, విడుచుచు కొన్ని పర్యాయములు అట్లు ఘర్షణ చేసిన తరువాత, ముక్కు రెండు రంధ్రముల చేతను పూరించి, పూరించిన కాలమునకు నాలుగు రెట్ల కాలము కుంభించి, పూరకము తరువాత జాలంధర బంధము మూల బంధములను చేసి కుంభ కాంతమున రేచకమునకు ముందుగాను ఉడ్వాన బంధమును చేసి ముక్కు రెండు రంధ్రముల చేతను నెమ్మది నెమ్మదిగా విధి యుక్తముగా రేచించ వలయును. దీని వలన శరీరమునకు ఎక్కువ శ్రమ కల్ల్గును. మరియొక సారి చేయుటకు ముందుగా కొన్ని సామాన్యమగు శ్వాస నిస్వాసములు చేసి తరువాత మరియొక పర్యాయము చేయ వలయును.