పుట:Yogasanamulu.djvu/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

లంక సూర్యనారయణ


ఆసీనుడైన పిదప

సమం కాయ శిరోగ్రీవ ధారయన్న చలంస్థిరః
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వందిశశ్చానవ లోకయన్
ప్రశాంతతామ విగత భీర్బ్రహ్మచారి వ్రతేస్థితంః
మనః స్ంయమ్య మచ్చిత్తోయుక్త ఆసీత మత్చరః

అర్థము:

శుచియైన స్థానమున మనస్సుతో మిక్కిలి ఎత్తు, మిక్కిలి పల్లము లేకుండు నట్లుగా చేసుకొని ధర్భ, చర్మము వస్త్రములను పరచుకొని మనస్సుని ఏకాగ్ర పరచుకొని అందాసీనుడై వెన్ను, కంఠము శిరస్సు తిన్నగా వుంచి నాసిగాగ్రమున దృష్టి నిల్పి దిక్కులు చూడక భయము లేని ప్రశాంతత మనస్కుడై వుండవలయును.

నాడీ శోధనము కొరకు ప్రాణయామము చేయు పద్ధతి:....

పద్మాసనమున స్థిరముగా కూర్చొని ఎడమ నాసికా రంధ్రముతో అనగా ఇడా నాడితో వాయువును పూర్తిగా పూరించి మూల బంధ, జలధర బంఢ, ఉడ్వాన బంధములను వేసి పూరించిన కాలమునకు నాల్గు రెట్ల కాలము కుంభించి పూరించిన కాలమునకు రెండింతల కాలముతో నెమ్మది నెమ్మదిగా కుడి నాడీ చేత రేచించ వలయును. తిరిగి రేచించిన నాడి చేతనే వాయువును పూరించి పైవిధముగా 1: 4: 2 నిష్పత్తులతో చంద్ర నాడీ చేత రేచించ వలయును. ఇట్లు పలు మారులు మూడు మాసములపైన చేయుట వలన శరీరమున సూక్ష్మ, స్థూల నాడులన్నియు శుద్ది పొంది మలరహితమగును.