పుట:Yogasanamulu.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

173


వంతమగును. అటుల శక్తి వంతమగు మనసు చేత బలహీన మగు మనస్సులను (అనగా కేంద్రీకరింప లేని మనస్సును) జయించి శాసింప వచ్చును. ఒకడు నిద్రలో నున్నపుడు వానికి మెలుకువ రాకుండా నెమ్మదిగా వాని కన్నులు తెరచి ఒక వస్తువును కంటి యందు ఉంచును. వానికి నిద్రలో మనసు విశ్రాంతికి పోయి స్తబ్ధముగా ఉన్నందున ఆ వస్తువును ఆ శరీరము చూడజాలక పోవు చున్నది. అతనికి మెలకువ వచ్చు నట్లు చేసినపుడు అనగా మనస్సును ప్రసరింప చేయు నపుడు అతడు ఆ వస్తువును చూడ గల్గు చున్నాడు. ఇంద్రియములు మనస్సు చేతనే శక్తిని పొందు చున్నది. కేంద్రీకృతము చేసి కొన శక్తిని సంపాదించు కొన్న మనస్సు మరియొక మనస్సును వసీకరణస్ము చేసుకొని తన చెప్పు చేతలలో త్రిప్పుకొనగలడు. సమ్మోహన మనెడి (హిప్నాటిసము) విద్య మనోశక్తి చేత ఎదుట వానికి నిద్ర కలిగించ గల్గు చున్నాడు. అటుల సమ్మోహనము చేత ఎదుట నున్న వస్తువులను గ్రహించ లేకుండునట్లు చేయ వచ్చును. ఇట్లు చేయుటను అదృశ్యకరణి అందురు. ఇది కేంద్రీకరించి శక్ల్తి వంతమయిన తన మనస్సుతో బలహీన మయిన మనస్సును శాసించి భ్రాంతి కల్గించుట యన్నమాట. ఏకాగ్రతతో ఒక వస్తువు నందు మనస్సును లయము చేయుటను సంయమనము చేయుట అందురు. చిత్తమును ఆయా వస్తువులపై ఏకాగ్రతతో లయము చేయుట వలన ఆయా వస్తువుల స్వభావములను పొంద వచ్చును. మానవుని సంకల్ప శక్తికి పరిమితి లేదు. చిత్రైకాగ్రత వలన అట్టి శక్తిని పొంద వచ్చును. తన మనస్సును ఏనుగు యొక్క బలముపై నుండి