పుట:Yogasanamulu.djvu/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

167


చేతను అరగంట సేపు సాధనము చేయవలయును. దీని వలన కుండలిని సుషుమ్నా మార్గము పొందును. ఏ యోగి చేత కుండలిని శక్తి చక్క సాధనము చేయబడుచున్నదో ఆ యోగికి అణిమాది అష్ట సిద్ధులు కరతలామలకము. బ్రహ్మ చర్యము పాటించి యింద్రియములను వశపరచుకొని పద్యముతో కూడి ఆహారమును భుజించుచు కుండలిని మేల్కొలుపు ప్రయత్నము చేయు సాధకునికి నలుబది దినములలో ప్రాణాయామ సిద్ధి కలుగును. శక్తి చాలనము కొరకు మారియొక పద్ధతి కూడ చెప్పబడినది. సిద్ధాసనమున కూర్చొని మరియొక పద్ధతి కూడా చెప్పబడినది. సిద్ధాసనమున కూర్చొని తన రెండు పాదములను పట్టుకొని పైకెత్తి కంద స్థానమును గట్టిగా తాడించ వలయును. మరియు నాభి స్థానమును ఉద్వానము చేయవలయును అనగా పైకి లాగ వలయును. అందు వలన శక్తి చలించు చున్నది. శక్తి చాలనము చేయుటకు రౌడన క్రియ యని మరియొక విధానమును కూడా చెప్పి యున్నారు. సిద్ధాసనమున కూర్చొని విధి పూర్వకముగా వాయువును పూరించి పూరించిన కాలమునకు నాలుగు రెట్లు సమయము కుంభించి కుంభ కాంతమందు సిద్ధాసనములో పైనున్న కాలి మడమను పట్టుకొని, మడమతో నాభికి క్రిందుగా, లింగ స్స్థానమునకు పైగా నెమ్మదిగా తాడించ వలయును. దీనినే తాడన క్రియ అందురు. తరువాత పూరించు కాలమునకు రెండింతల కాలములో నెమ్మదిగా రేచించ వలయును.

శక్తి చాలనము చేయు నపుడు వరీధానయుక్తి, పరీచాల క్రియ అనునదియు సాధన చేయ వలయును. ఈ సాధనము చేయుట వలన కుండలిని మేల్కొని సుషుమ్నా మార్గమును