యోగాసనములు
163
ములలో పది అంగుళములు పొడవున ప్రవేశ పెట్ట వలయును. ఆ నాళము ముఖమున గ్లిసరిన్ గాని నేతిని గాని లేదా నూనెలను గాని పూసినట్లయితే సులభముగా నాళము లింగమున ప్రవేశించును. మొరటుగా ప్రయత్నము చేయ రాదు. మొరటుగా ప్రయత్నించుట వలన రక్తము వచ్చుటకు అవకాశము కలదు. నాళము 10 అంగుళముల పొడవున ప్రవేశించిన తరువాత శరీర మందలి వాయువును పూర్తిగా రేచించ (బయటకు విడువ) వలయును. రబ్బరు గొట్టము రెండవ చివరను ఒక గళ్ళాను అమర్చ వలయును. ఆ గళ్ళాలో నీరు పోసి నోటితో ఊదిన యెడల నీరు మూత్రాశయమున ప్రవేశించును. మూత్ర కోశము నిండు వరకు ఈ విధముగ నీరు పోసి ఊదుము. ఈ నీరు శుభ్రముగా మరిగించి గోరు వెచ్చగా చల్లార్చినదై ఉండవలయును. తరువాత పొత్తి కడుపును సంకోచించిన యెడల ఆ నీరంతయు బయటకు వచ్చును. నెమ్మదిగా గాక చాల వేగముతో గళ్ళామీద ఒక అంగుళము పైన వచ్చు నట్లు వత్తిడి చేసి పొత్తి కడుపు నందలి కండరములని బిగియ పెట్టవలయును. దీని వలన మూత్ర నాళము దానిని ఆవరించిన కండరములు బలమగును. ఇట్లు ఇరువది దినములు చేసిన తరువాత వరుసగా గాలిని,నీటీ, నూనెను, ద్రవ స్థితిలోనున్ననేతిని తేనెను, తరువాత పాదరసమును మూత్రాశాములోనికి లాగుట చేయ వలయును. మూత్రాశయమున ద్రవమును ప్రవేశ పెట్టిన తరువాత లింగమునందు జొనిపిన నాళమును ఈవలకు తీసి వేయుము. ఆతర్వాత కొంచెము సేపు ద్రవమును మూత్రాశయము నందుంచి బయటకు విడువ