పుట:Yogasanamulu.djvu/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

లంక సూర్యనారయణ


దీని వలన శ్వాస కోశములు బలమగును. భుజములకు పైగా వున్న అవయవములు అనగా మెడ, చెవులు, కండ్లు, మస్తిష్కము, స్థూల నాడీ మండలము బలమును పుంజు కొనును.

ఈ షట్కర్మల చేత శరీరమును శుభ్రపరచు కొనుచూ సాధన చేసిన యోగము సులభముగా సాధించ వచ్చును.

ప్రాణాయామము అభ్యసించు నపుడు అవసరమగు త్రి బంధములను గూర్చితెలిసి కొందము. త్రి బంధములనగా మూల బంధము, ఉడ్వాన బంధము జాలంధర బందము అనునవి. ఈ త్రి బంధములను ప్రాణమును శరీరములో కుంభించు నపుడు అది వెలికి పోకుండా అపాయము లేకుండగను సుఖముగను నిరోధించుటకు ఉపయోగ మైనవి. ఈ మూడు బంధములతో వాయువును కుంభించి అప్పుడు ప్రాణము అపానముతో సంయోగము పొంది సుషుమ్న యందు ప్రవేశించుటకు ఉపయోగ పడును.

జలంధర బంధము

గడ్డమును ఉరము యొక్క (రొమ్ము) ఉపరి భాగమున చేర్చి, గట్టిగా అదిమి పట్టుటను జలంధర బంధమని చెప్పబడినది. ప్రాణాయామము సాధనచేయు నపుడు శరీర మందున్న ప్రాణ వాయువును అధో భాగమునకు తిరోగమింప చేయును. మరియు కుంభక సమయమున కంఠమునకు పైనున్న శిరో భాగములకు అనగా మెదడు నందలి నాడీ జాలమునకు ఎంత మాత్రము ఒత్తిడి కలుగ కుండ నిరోధించును. దీని వలన ప్రాణాయామము చాల సుఖముగా సాగును.