యోగాసనములు
153
ఇట్లు నాసిగాగ్రమున చేయుట వలన మానసిక శక్తులు వృద్ధి యగును. కూర్మ వాయువు జయింప బడును. తంద్రిత్ నిద్రమత్తు) తొలగి పోవును. నేత్ర వ్యాధులు తొలగి దృష్టి బాగుగా వుండును. దృష్టిని నాసికాగ్రముననే గాక శరీరము నందలి చక్రములలో ఎదో ఒక దానిపై కేంద్రీకరించ వచ్చును. ఇది ప్రతీ దినము చేయవచ్చును.
- నౌళి కర్మ.
నిలబడి ముందుకు వంగి ఉడ్డి యానము అనగా ఉదరమూ లోనికి లాగి చేతులను తొడలమీద ఆనించి కడుపును ముందుకు జొనిపిన గొట్టము వలే ఏర్పడూ. అపుడు కడుపును కుడి ఎడమలకు త్రిప్ప వలయును. ఇది కొంచెము కష్టమయినను అభ్యాసము చేత బాగుగా చేయ వచ్చును.
నౌళి కర్మ వలన జఠరాగ్ని ప్రజ్వరిల్లి జీర్ణ క్రియను క్రమముగా వుండు నట్లు చేయును. మలబద్దమును నివారించును వాత, పిద్ద, శ్లేష్మ రోగములు నశించును. నౌశికర్మను పద్మాసనమున గాని, సిద్ధ, వజ్రాసనములలో ఎదో ఒక ఆసనమున కూర్చుండి చేయ వచ్చును.
- కపాల భాతి.
స్థిరముగా ఒక ఆసనమున కూర్చొని బలముగాను, పొడవుగాను ముక్కు రెండు రంధ్రముల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుటయే కపాల భాతి. శక్తి వున్నంత వరకు పొడవుగాను బలము గాను ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయ వలయును.