152
లంక సూర్యనారయణ
- భస్తి కర్మ.
ఆరు అంగుళముల పొడవు ముప్పాతిక అంఘుళము లావు రంధ్రము గల గొట్టమును తీసుకొన వలయును. ఈ గొట్టము బొప్పాయి గొట్టము గాని ప్లాస్టికు గొట్తము గాని అల్యూమినియం గొట్టము గాని వాడుట మంచిది. అ గొట్టమునకు ఒక కొనను ఆముదమును గాని గ్లిసరీను గాని పూయ వలయును. బొడ్డు లోతు ప్రవహిస్తున్న నీటి యందు ప్రవేశించ వలయును. లేదా స్నానపు తొట్టిలో వెచ్చటి నీటి యందు ప్రవేశించ వలయును. ఆ నాళమును 4 అంగుళములు గుద ద్వారము గుండ లోనికి ప్రవేశ పెట్టవలయును. ఉత్కటాసనమున వుండి నీటిని పైకి లాగవలయును. జలము మలాశయమున ప్రవేశించును. తరువాత నళమును వెలికి తీసి మౌళి కర్మ చేసి ఆ జలమును విసర్జించ వలయును. జలమును ఆకర్షించుటకు ఉడ్డియానమును నాళము లేసిన, వెనుక మూల బంధమును చేసిన సులువుగా వుండును. (ఉడ్డియాన, మూల బంధములను ముందు చెప్ప బోవు చున్నాను.
భస్తి కర్మ వలన మలాశయము శుద్ధియగును. మరియు వాత, పిత్త దోషములు, ప్లీహ గుల్మ వ్యాధులు నిరారించ బడును.
- నేతి కర్మ
- ...
మూరెడు పొడవు కొంచెము లావైన నూలు దారమును తీసుకొని వేడి నీటియందు శుబ్రపరచి ఒక ముక్కు రంధ్రమును మూసి మరియొక ముక్కు రంధ్రములో దారమును ప్రవేశ పెట్టి పైకి శ్వాసను గట్టిగా పీల్చ వలయును. ఇట్లు 4 సారులు చేయ