పుట:Yogasanamulu.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనాలు

అష్టాంగయోగము షడ్దర్శనములలో ఒకటి. సాంఖ్యాశాస్త్రము, యోగశాస్త్రము, అనునవి ఒక జంటయని పండితులు నిర్ణయించిరి. సాంఖ్యాశాస్త్రమున ప్రకృతి సృష్టికి మూలమన్న ప్రవచించినందున అద్దానిని నీరీశ్వర శాస్త్రమని చెప్పగా యోగ శాస్త్రము ప్రకృతి నిక్కడ భగవంతుడే సృష్టి చేసెనని తెలియజేయును. సాంఖ్యశాస్త్రమునకు కపిల మహర్షి మూలము. పాతంజలి మహర్షీ యోగశాస్త్రమును సూత్రీకరించుచు ఈ శాస్త్రము ప్రాచీన మయినది అని చెప్పుటచేతను వేదముల యందును, చాల ఉపనిషత్తుల యందును వివరింపబడి యుండుట చేతను, అతి సనాతనమయినదనుట నిర్వివాదము. దీని ఆవిర్భావకాలమును నిర్ణయించుట అతి సాహసము మాత్రమే.

జీవులు శరీరములను పొంది సత్వరజస్తమో గుణ ప్రభావములచేత కర్మములనుచేయుచు కర్మలబ్ది ప్రతిఫలమును దాని శేషమును అనుభవించుటకు జన్మలను తిరిగి తిరిగి పొందుచుండును. జీవుడు యాతనా యుతమైన జన్మలను దుఃఖములను పొందుటకన్నా తను విడివడి వచ్చిన పరమాత్మను చేరుటయే పరమలక్ష్యము. ప్రపంచమున ఉన్న జీవులన్నిటిలోను మానవులు ఉత్కృష్ట జీవులు. మిగిలిన అన్ని జీవులకన్న వికసించిన జ్ఞానము కలవాడు మానవుడు. అట్టి జ్ఞానమును సద్వినియోగము చేసికొనగలుగుటయే మానవ జన్మకు పరమావధి మరియు తనకన్న ఉత్తమ మయిన స్థితిని పొందుటకు