పుట:Yogasanamulu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూత్రములను రచించెను. మరియు మత్యేంద్ర నాధుడు, గోరక్ష నాధుడు, స్వాత్మారామ యోగి, వీర బ్రహ్మేంద్ర స్వామి, వంటి యోగి పుంగము లెందరో ఈ యోగ విద్యను ప్రచారము లోనికి తీసుకొని వచ్చిరి.

విదేశ నాగరికతా వ్యామోహము చేత, దేశీయ శాస్త్రములు విద్యలయందు నిర్లక్ష్య భావము చేత మాటున పడి పోయెను. ఆధునిక కాలములో ఈ యోగ విద్య వలన మనసునకు శాంతితుష్టి, పుష్టి కలుగునని విదేశీయులు ఎగ ప్రాకుటవలన మన దేశములో మరల లూపిరి పోసినొని తెప్పరిల్లనది. ఇప్పటి కైనను మత్తును వీడి దేశీయ విద్యల ల్యందు శాస్త్రముల యందలి ఘనతను పర దేశీయులు పొగడకముందే సనాతన ఋషులు మనకు అందించిన జ్ఞానమును గ్రహించి ఇహ, పర లాభములను పొందగలరని ఆశించుతూ దార్శనిక గ్రంధ రచనకు పూనుకొని యుంటిని. పాఠక మహాశయులు సనాతన మహర్షుల చేత అందించబడి, ఈ గ్రంధమందు పొందు పరచ బడిన మంచినీ అనుభవించెదరనియు ఎచటనైనా పొరపాట్లు దొర్లిన అవి నా దగుట చేత దయతో తెలియ చేయగలరని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.