పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞడనా ! ప్రోత్సాహము చేసి వీపుదట్టిన అధికార్లవారికా కవిత్వ కళారహస్యాలు తెలియజెప్పిన మా బసవరాజు అప్పరాయనికా ? మువ్వరకును, ఇంకను సహృదయు లెందరో చాల కాలంనుంచీ నన్ను హెచ్చరిస్తున్నారు. ఆందులో యెంకి పాటలు పదిమందికీ వినిపించినవారు దేశోద్ధారక శ్రీయుత కాశీనాదుని నాగేశ్వరరావు పంతులుగారు, ఆంధ్రపత్రికలో నేమి, భారతిలోనేమి ఆ పాటలకు తగిన తావొసంగి, యీ పుస్తకం అచ్చులో యొంతో అభిమానంచూపి, రెండు మాసములు యూ పుస్తకమును తమ మూడు పత్రికలలోనూ ఉచితముగా ఆడ్వర్టైజ్ చేయునట్లు ఆర్డరు దయచేసినారు. వారికెంతో కృతజ్ఞడను. "సాహితి’ మా పత్రికే అననూయ, జనరంజని, జ్యోతి, సుజనరంజనీ పత్రికాధిపతులును నాకెంతో గౌరవ మొసంగినారు, శారదయు ఆట్లే వారు తెలుగుతల్లియొక్క నిజస్వరూపం చూడాలెనని ఉవ్విళ్లూరుచున్నవారే తెలుగు పస, తెలుగసనుడి, తెలుగునాదం, తెలుగురిచీ తెలిసికొని మనజాతి సాంప్రదాయాలలోగల సొగసు, జీవమూ, పదిమందికిన్నీ మనసుకెక్కించాలె నని కంకణము కట్టుకుని కృషిచేస్తున్నవారే, వారందిరికీ నా నమస్కృతులు. ప్రభువులలో మా ప్రభువులును, కవులూ, రసికులూఅయిన శ్రీశ్రీశ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహద్దయగారు యీ పాటలు విని ఆనందించే వారు. ఆ మహారాజు నాకెన్నోవిధాల మేలుచేసినారు. వారివంశ మాచంద్రా ర్కమా నిలుచుగాక యని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను, పాటలలో సగం పైగా నూజవీటిలో శ్రీవారి సన్నిధినే వ్రాశాను. మా అభినవాంధ్రకవిమిత్రమండలి వారందరు నా ప్రాణమిత్రులు. మాప్రెసి డెంటుగారగు శ్రీయుత కోలవెన్ను రామకోటేశ్వరరావుగారి ద్వారా వారిద్వారా వారి దయకు బదులు నా వందనము లర్పిస్తున్నాను. ఇందులో చిత్రపటములు మా అడవి బాపిరాజుగారు వ్రాసినవి. ఆయన చిత్రములలోని మహోన్నత భావాలకు నా యెంకి పాటలే కారణమైతే, ధన్యుడను, ధన్యుడను!