పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఈ పాటలు నేను మద్రాసులో క్రైస్తవ కళాశాలలో పట్టపరీక్షకు చదువుకొనే దినాలలో (1911-1918) వ్రాయ మొద లెట్టినాను. అప్పడు నా అదృష్టంవల్ల మ - రా - శ్రీ అధికార్ల సూర్యనారాయణ రావుగారి స్నేహభాగ్యం లభించటం, ఆయనతోకలిసి వాసం చేయటం కలి గింది. నన్నంతకు మునుపే సారస్వతివిషయాల్లో అంతో యింతో తరిఫీదు చేయుచున్న మా బసవరాజు ఆప్పారావు కూడా అక్కడే వుండేవాడు. వారితో ముచ్చట్లకు మ-రా-శ్రీ పాటిబండ అప్పారావుగారును వచ్చుట మూమూలు, వారందరు యెవరి రచనలగురించి వారు సొంపుగా మాట్లాడుకొంటుంపే సేనొకప్రక్క కూర్చుని విస్తుపోయి వినటం రివాజు, ఒకనాడు కాలేజీనుండి ట్రాంబండిలో వస్తుండగా, గొంతులో సన్నని రాగం బయలుదేరింది, దానిని నా లో నేను పాడుకోపో లని సాహిత్యం జ్ఞాపకంచేసుకోపోయాను. ఎప్పడోవిన్న పదంలాగున "గుండెగొంతుకలోన కొట్లాడుతాది" అన్న పల్లవి వచ్చింది. ఆదే మననం చేసుకోగా చేసుకోగా యిల్లు చేరేసరికి నేను వ్రాసిన మొదటిపాట తేలింది. మా "జానకీ" పతికిన్నీ, అప్పారావుకున్నూ ఆ పాట గద్దదికతో విని పించాను. * సెబాస్ వ్రాయ°మన్నాడు జానకీపతి; "నీవు నిత్యం వాడేభాష కాదిది, యీ భావసాయమున సత్యాస్వేనణం చేయలే"వన్నాడు మా బసవ రాజు ఆప్పారావు, ఏ సమయమున వెన్ను చరిచాడో, నూర్యనారాయణ ! ఆప్పటినుండియు "యెంకి"ని కవితారీతిని స్మరించుట నిమసమైన మానలేదు. ఆతడును అంత కంతకు దన అభిప్రాయమును బలపరుచుకొన్నాడు. మా అప్పారావు రానురాను తన అభిప్రాయం మార్చుకొని యిటీవల అతడును వల్లె ఆసుచున్నాడు.