పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేవెలుగు

ఎవరైన యెపుడైన యేవాడనైన
యింతుజాలి గనేర యెంకి చిత్రాలు ?
మొయిలు జొరె చంద్రుడని
భయపమిష నా యెంకి
పూసెజ్జ నాపజ్జ
పోగుపడ - ఆరటము! ఎనరైన యెపుడైన ...

మబ్బు వెలువడు చంద
మామ గని, తన చీర
చెరగు మాటిడి నన్ను
జీరు సిగ్గరితనము! ఎవరైన యెపుడైన...

'కళ్ల ములుకలు దించె
కంఠపాశము లేసె
కిరణాలు నువులేని
తరి' యనెడు - ఆకులము! ఎవరై న యెపుడైన...

'దృష్టి' తొలగగ తనను
తిలకముగ నేగొనిన
నెలవంక నా రాజు
తులయె యను - అతిశయము! ఎవరైన యెపుడైన...

రేవెలుగు గీవెలుగు
నా వెనుకె యనుమతము ! ఎవరైన యెపుడైన...

----------------------------

92 యెంకి పాటలు