Jump to content

పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 జయభేరి

కళలీను వనమె వెల - తెలలేల నోయిూ ?
వనలక్ష్మీ కనగాచు - కొను దినము లేమో !
* * *

వుండుండి పూలటుల - వులికె నేమోయిూ ?
కడుపులో పాప చ - క్కలిగింత లేమో !
* * *

చిలుక పావురము లటు - చిందు లేలోయిూ ?
ఆప్తమిత్రుని రాక కాత్రమో యేమో !
* * *

వురుములు మెరుపులాయె - దరికి రావోయీ !
జయభేరితో వెలుగె దయసేయు నేమో !
*

86

యెంకి పాటలు