పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


                   యాత్రాచరిత్ర

వు హరిహరుల మందిరంబులు రెండున్నవి. యిందులో నొక మందిరమందున్న విష్ణు ప్రతిక పూర్ఫమందు సంద్రములోనే యుండి తన మీదుగా బోవుచున్న విశాఖపట్టనపు కోమటి యోడను పోకుండనిల్పి తన్ను బ్రాధిన్ంపుచున్న యా కోమటికి స్వప్నగోచర మయ్యెనట- అటపైనిక్కో,మటికి యీ యనకాపల్లిలో నీ గుడి గట్టించి ప్రతిష్ఠించి భోగరాగంబులంరాగంబున ననుకూలంబుగా జేయింపుచున్నాట్టు స్థలజ్ఞలనిరి.

ఈ రాత్రి యిచ్చట నివసించి మరునాడు 29.వ తేది శుక్రవారము మె 15. దూరమందున్న యలమంచిలి బంగళాలో దిగితిమి. ఇది కొండ చేర్పున నిడువుగా నున్నది. మునసబు ఖచేరీ- కొన్ని బంగాళాలు బ్రాహ్మణ గృహములు సత్రము - దేవాలయములు గలవు. మార్గస్థులకు గొంత సదుపాయము గానే యున్నది.

30వ తేది శని|| నాడు 10 గంటలకు బయలుదేరి యిక్కడికి 13. మైళ్లలోనున్న నక్కపల్లి జేరితిమి. ఇచ్చ్జట మాగలాస్థులని సదుపాయంబుగా మూడు భవంతులు గల యొక సత్రంబున్నది. బ్రాఃహ్మణులకు భోజనంబు దొరుకును- రంగులుగల లక్క పూతపూరించి తగిన వెలకు విక్రయించుచున్న పనివాండ్రిచ్చట గలరు యంగళ్లున్నవి.

ఈ యూరికి దక్షిణము గానున్న చెరువు గట్టుగుండా 1 మైలు దూరముపోగా సుప్రసిద్ధమైన యుపమాక మనెడు క్షేత్రంబున్నది. పూర్వమందు వేటమార్గంబుగా వచ్చిన శ్రీవేంకటేశ్వరులకు పాలు సమర్పింపుచు యదువనెడు గొల్లవాడు ప్రార్ధింపగా స్వామివారు.

    (శ్లో) ఏకేనశంఖమిత రేణక రేణచక్ర: మన్యేన ఖడ్గమసరేణ ధను