పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ందిన విశాలసత్రమొకటిగలదు. మేము వచ్చిన మరునాడు-పార్ధివ సం#ఫాల్గుణ బ ౩౦ ఆదివారమైనందున శంఖములు పుట్టునట్టి శంఖముఖ్హమనెడు దీవునకుసమీపమందు సముద్రస్నానము చేసితిమి. అడుగునచతురాది బహుకోణములుగాను- క్రమోన్నత విశాలముఖములుగాను తాటియాకు బుట్టలును చాపలును- సుందరముగా తయారుచేసి చవకగానేయమ్ముదురు. సముద్రపురోడ్లు తప్ప- తక్కినరోడ్లు చూడదగియుండవు.ఏప్రిల్ ౪వ తేది సో# రెండుజాములకు బయలుదేరి రయల్మీదుగా తిరచనాపల్లికి వచ్చి తెల్లవారినపైని వ్యయ సం# చైత్ర శు ౧ నాడు తిరుచునాపల్లి నాల్గువీధులూచూచి ౮ఘంటలలోగా శ్రీరంగములో ౭ ప్రాకారంబులో చిత్రవీధిలో ప్రవేసించి తీర్థప్రయుక్తపవనపురస్వరముగా శ్రీకావేరీస్నానంబు చేసి ౪ ఘంటలప్పుడు ప్రాకార ప్రదక్షినంబుగా గుడికిబోయి వత్సరాద్యుత్సవము- గనుక యెదటి మండపంబులో పంచాంగ శ్రవణా---- వేంచేసియున్న యుత్సవులను సేవించి తరువాత మూలవిరాట్టయి సప్తప్రాకారమధ్యేయను శ్లోకములోచెప్పబడిన చందముగా వేంచేసియున్న శ్రీరంగనాయకులవారి దర్సనము సావధానంబుగాచేసి సేవించుకుని బసకేగి భోజనశయనదులొనరించి మరునాడు. దక్షిణ కావేరీ స్నానపుర్వకంబుగా యధావిధిగా గరుడాది పరివార సహితంబుగా శ్రీరంగనాయకులను ౫వ ప్రాకారంబులో నొక మందిరంబునందే వేంచేసియున్న శ్రీదేవీ, భూదేవీ,రంగనాయకీ దేవీ త్రయంబును సేవించినారము.ఆ రెండవపూట తిరుచనాపల్లి మరలజూచి మరునాడు కావేరీ స్నానపూర్వకముగా శ్రీరంగమున కాగ్నేయముగా సుమారు ౧# మైలుదూరమందున్న జంబుకేశ్వరక్షేత్రమునకు బోయి (అబ్లింగమైన) శ్రీజంబుకేస్వరస్వామివారిని శ్రీమదఖిలాండేస్వరీ దేవీదర్సనపూర్వకముగా సేవించినారము. ఆ రెండవపూట సాయంకాలమందు తిరుచినాపల్లి (త్రిశిరహ్ పుర)