ప్రవేశించినారము. ఇది తిర్నవిల్లి జిల్లాతో సంబంధించిన షహరు గనుక సబ్ కలెక్టరు వగైరా దొఱలు కొందఱు గలరు. మధుర దాటిన ౨ ష్టేషనుల వరకు, వరిపంట బహు యుక్తముగానే యున్నది. ఈవలగోయుచు నావల వెదజల్లుచుండిరి. తర్వాత తిర్నవిల్లివఱకు, ప్రత్తి పంటకన్న రెండవపంట కనబడదు. ఒక్కొక్క తావున, మిరియపు తోటలు, కందిచేలు ఆముదపు చేలును, గలవు. కాబట్టి ఈ తూతుకూరులో ప్రత్తివర్తకులు పెక్కుండ్రు గలరు. యంత్రములతో దూది యేకుదురు. ప్రత్తివిత్తులు, మిక్కిలి చవకగా గరిసెలకొలంది దొఱకును. గనుక, పశువులు బహు పుష్టిగానే యున్నవి. ఈ యూరిలో గొప్పయంగల్లు గలవు. ౪౫ షాపులున్నవి. రోడ్డుపక్కలను, గంగరావిచెట్లు సాంద్రముగా పంక్తిగా మొలపించుటవల్ల చల్లగాను, రమ్యముగాను, కనబడును. సుమారు మధురలోవలెనే ఇండ్లున్నవి. పడమర సముద్రమునకిది సన్నిహితప్రదేశము. సముద్రమునకు, తరంగములు లేవు. చెర్వువలె యున్నది గనుక. ౪౫ దేసి వందల గజముల దూరము వరకు ఱాళ్ళుపాతి ౭౮ వంతెనలు కట్టియుంచిరి. దూది వగైరా యెగుమతి దిగుమతి వంతెనలగుండా నడిపి పడవలమీదవైచుచూ దిగియుచుందురు. ఈ బస్తీలో నొకదొఱ యొక్క బంగళా రవునుగాను సమున్నతముగాను, బహుసుందరముగాను- పుష్పవన పరివేష్టితముగాను ప్రసిద్ధికెక్కినది గలదు. పిళ్ళారిగుడి కెదుటనొక ఱాకట్టపు కొలను గలదు. అది బహురమ్యముగానున్నది. దానిలో నీరు కావేరీ జలతుల్యముగా నున్నది. నీరెత్తి పైని స్నానము సేయవలెను. గాని దిగనివ్వరు. జలజంతువుల యొక్క యముకలు చిరకాలము, సముద్రమందున్నందున చిన్న చిన్న రంధ్రములు గలిగి శిలలవలే నతికఠినముగా నుండును. పురజనులు వానిచేతనే గోడలు పెట్టుదురు. (భిత్తి స్త్రీ కుడ్యమేడూకంతదంతర్నయస్తకీకసం) అని యమరమందున్న యేడూక శబ్దమిచ్చటి గోడలకు రూఢిగానే చెల్లును. ఒక సెట్టి కట్టి
పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/74
Appearance