పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రు ౨౦౦౦ కలిపి రు ౨౫౦౦౦ సాలు ౧కి రాబడిగలదట, యింతయు వినియోగపడునట, లక్షవరకు గుడిలో నిలవగా నున్నదట, ఆణి నెలలో (మిథునమాసములో) స్వామివారికిని తులామాసములో అమ్మవారికిని బ్రహ్మోత్సవములు, దివ్యంబుగా జరుగునట. స్వామిగుడికి పడమరగా పూర్వమందు స్వామియావిర్భవించిన చోటికి బహు సన్నిహితమైన వెదురుపొద యున్నతావున్నది. ఇప్పుడు పొద లేదుగాని వర్షాకాలములో మొలకలెత్తుచుండునట. యీస్వామి మహిమ పాండ్య ప్రభుకాలములో నొకగొల్లవాడు రాజునకు రోజును పాలుతెచ్చి యిచ్చుచున్న కాలములలో వొక వెదురుపొద యెదుటికి వచ్చువరకు కాలికి డక్కా తగిలి పాలొలికి పోవుచుండుట మూడుదినములు చూచి నాల్గవనాడు పదిలంబుగా వచ్చిన నట్లనే పాలొలికి పోవుటయేగాక కాలి బొటనవ్రేలికి దెబ్బతగిలి రక్తము వచ్చినందున శఠించి వాడాతావున నేమున్నదోయని త్రవ్వుచుండగా రక్తమూరుచు లింగాకారముగా స్వామి యావిర్భవించినదినంగాంచి వెరగంది యీసంగతి పాండ్యరాజుతో విన్నవింపగా నతండు మిగుల నాశ్చర్యబడి భక్తుడు గనుక యీ గోపుర ప్రాకార మంటపారామ పుష్కరిణీ సంపన్నములుగా నీమందిరములు కట్టించి వేణువనేశ్వరుడను పేర దానొక లింగమును, కాంతిమతీదేవిని, పరివారదేవతలను, భక్తులను ప్రతిష్ఠించి మంచిదైన యొకదేశము శ్రీస్వామివారికి, నమ్మవారికిని సమర్పించెనని స్థలపురానమందున్నట్టు క్షేత్రవాసులనిరి.5-6 తేరులున్నవి. అందొకతేరు బహుచిత్రముగాను, బహున్నతంబుగాను, కనబడినది. మరొకటి కొంచెము తక్కువైనను తత్తుల్యంబుగానే యున్నది. అమ్మవారి గుడిలో వేదత్రయపాఠము బహు శిష్యులకు జెప్పుచున్న యుపాద్యాయులు పెక్కుండ్రుగలరు.

ఏప్రిల్ 3వ తేదీ ఆదికి సముద్రతీరమందున్న తూతుకూరులో